తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) 439 గ్రూప్-2 ఉద్యోగాలకు డిసెంబరు 30న ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 9 దాకా గ్రూప్-2 దరఖాస్తులు స్వీకరిస్తారు. 2016 ఏప్రిల్ చివరి వారంలో (24, 25 తేదీల్లో) పరీక్ష నిర్వహించాలన్నది ప్రాథమిక ప్రణాళిక. సెప్టెంబరులోనే గ్రూప్-2కు సంబంధించిన పాఠ్యప్రణాళిక విడుదల చేశారు. మొత్తం 439 గ్రూప్-2 పోస్టుల్లో అత్యధికంగా 220 ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులే ఉన్నాయి. యూనిఫాం సర్వీసులైన వీటికి గతంలో 28 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితి ఉండేది. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన మూడేళ్ల సడలింపుతో ఈసారి గరిష్ఠ వయోపరిమితి 31 సంవత్సరాలుగా ఉండబోతోంది. మిగిలిన పోస్టులకు జనరల్ కేటగిరీలో 18-44 ఏళ్లలోపు వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు మరో అయిదేళ్లు సడలించారు.
మొత్తం పోస్టులు: 439
1. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సబ్ సర్వీస్): 19 పోస్టులు
2. అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (కమర్షియల్ టాక్స్ సబ్ సర్వీస్): 110 పోస్టులు
3. సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-II (రిజిస్ట్రేషన్ సబ్ సర్వీస్): 23 పోస్టులు
4. ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ సబ్ సర్వీస్): 67 పోస్టులు
5. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎక్సైజ్ సబ్ సర్వీస్): 220 పోస్టులు
అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు శారీరక కొలతలు అవసరం.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09.02.2016.
రాత పరీక్ష తేదీలు: 24.04.2016 & 25.04.2016.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) 439 గ్రూప్-2 పోస్టులతో పాటు మరో 357 ఇతర పోస్టులకు కలిపి మొత్తం 796 ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసింది. వీటికి కూడా ఫిబ్రవరి 9 దాకా దరఖాస్తులు స్వీకరిస్తారు. వీటిలో అత్యధికంగా 311 వ్యవసాయ విస్తరణాధికారి పోస్టులున్నాయి. ఐటీఐ అర్హతతో కూడా 44 ఉద్యోగాలు ఉండటం విశేషం. వీటికి పరీక్ష తేదీని ఖరారు చేయాల్సి ఉంది. హైదరాబాద్ జలమండలిలో ఉన్నతస్థాయి డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు రెండింటిని కూడా టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇలాంటి పరీక్ష నిర్వహించడం ఇదే తొలిసారని అంటున్నారు. ఈ రెండు పోస్టులూ రోస్టర్ ప్రకారం మహిళలకే (జనరల్ మహిళ, ఎస్సీ మహిళ) రిజర్వ్ అయినట్లు సమాచారం. ఈ 357 పోస్టుల ప్రకటనలతో ఎక్సైజ్ కానిస్టేబుల్, ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ మినహా తమకు అనుమతిచ్చిన అన్ని ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ ప్రకటనలు విడుదల చేసినట్లైంది. ఆయా శాఖల నుంచి కొన్ని సాంకేతిక వివరణలు ఇంకా రానందున ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుళ్ల ఉద్యోగాల ప్రకటన ఆగింది.
* అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ పోస్టులు: 311
అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ సైన్స్ (అగ్రికల్చర్). లేదా బీఎస్సీ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ (ఒకేషనల్). లేదా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ లేదా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ (సీడ్ టెక్నాలజీ/ ప్లాంట్ ప్రొటెక్షన్/ ఆర్గానిక్ ఫార్మింగ్).
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.01.2016.
---------------------------------------------------------------------
* టెక్నీషియన్ గ్రేడ్ - II పోస్టులు: 44
1. టెక్నీషియన్ గ్రేడ్ - II (సివిల్ బ్రాంచి - వాటర్ సప్లై) ఇన్ హెచ్ఎమ్‌డబ్ల్యూఎస్ & ఎస్‌బీ: 10 పోస్టులు
2. టెక్నీషియన్ గ్రేడ్ - II (ఎలక్ట్రికల్ బ్రాంచి - వాటర్ సప్లై) ఇన్ హెచ్ఎమ్‌డబ్ల్యూఎస్ & ఎస్‌బీ: 19 పోస్టులు
3. టెక్నీషియన్ గ్రేడ్ - II (మెకానికల్ బ్రాంచి - వాటర్ సప్లై) ఇన్ హెచ్ఎమ్‌డబ్ల్యూఎస్ & ఎస్‌బీ: 15 పోస్టులు
అర్హతలు: సంబంధిత ట్రేడులోఐటీఐ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28.01.2016.
1) డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) పోస్టులు: 02
2) డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) ఇన్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు: 02 పోస్టులు
అర్హతలు: చార్టర్డ్ అకౌంటెంట్/ఐసీడబ్ల్యూఏతో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ చివరి తేదీ: 22.01.2016.
No comments:
Post a Comment