Saturday, 22 June 2013

 ఆ చల్లని సముద్ర గర్భం...:
దాశరథి కృష్ణమాచార్యులు రాసిన ఆ చల్లని సముద్ర గర్భం పాట మీ కోసం...

విభజన వికాసానికే నినాదంతో సీమాంధ్రకు ‘నమస్తే’ ఆత్మీయ రథం

* ప్రారంభించిన నమస్తే తెలంగాణ సీఎండీ రాజం
* తొలి విడతలో విజయవాడ మీదుగా రాజమండ్రికి
* రాష్ట్ర విభజనతో సీమాంధ్రకు సిరులపంటే
* ప్రజలకు వివరించనున్న నమస్తే రథం
 
రాష్ట్ర విభజనపై హస్తినలో తీవ్ర స్థాయిలో కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో.. రెండు ప్రాంతాల్లోని ప్రజల మధ్య సోదరభావం, స్నేహ వాతావరణం కోసం ‘నమస్తే తెలంగాణ’ నడుంకట్టింది. విడిపోవడం వల్ల సీమాంధ్రకు ఒనగూరే అదనపు లాభాలను వివరించడం కోసం నమస్తే తెలంగాణ ఆత్మీయ రథం సీమాంధ్ర జిల్లాలకు బయల్దేరింది. ఆత్మీయ రథాన్ని సీఎండి లక్ష్మీరాజం జెండా ఊపి ప్రారంభిస్తున్నప్పటి చిత్రం ఇది. సంపాదకులు అల్లం నారాయణ, సీఈఓ కట్టా శేఖర్‌రెడ్డి కూడా ఉన్నారు.

హైదరాబాద్ (టీ మీడియా): మీడియా చరిత్రలోనే కొత్త ఒరవడికి నమస్తే తెలంగాణ శ్రీకారం చుట్టింది. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకునే బృహత్తర కర్తవ్యాన్ని భుజాన వేసుకుని, దాన్ని విజయవంతం చేయడం ద్వారా ప్రశంసలు పొందిన నమస్తే తెలంగాణ.. రాష్ట్ర విభజనపై హస్తినలో తీవ్ర స్థాయిలో కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో.. ఉభయ ప్రాంతాల్లో రాజకీయ నాయకత్వాలు భారీ సభలకు సిద్ధమవుతున్న తరుణంలో రెండు ప్రాంతాల్లోని తెలుగు ప్రజల మధ్య సోదరభావం, స్నేహ వాతావరణం కోసం నడుంకట్టింది. విడిపోవడం వల్ల ఉభయ ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు ఉన్న అవకాశాలు, ప్రత్యేకించి సీమాంధ్రకు ఒనగూరే అదనపు లాభాలను వివరించడం కోసం నమస్తే తెలంగాణ ఆత్మీయ రథం జూన్ 21న  సాయంత్రం సీమాంధ్ర జిల్లాలకు బయల్దేరింది. విభజన వికాసానికేనని ఈ యాత్ర సందర్భంగాసీమాంధ్రులకు వివరించనుంది.
        పత్రిక సీఎండీ సీఎల్ రాజం పచ్చ జెండా ఊపి.. ఆత్మీయ యాత్ర రథాన్ని ప్రారంభించారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంతం సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని కూలంకషంగా వివరించే ప్రత్యేక సంచికను కూడా సీఎండీ ఆవిష్కరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లనున్న ఈ ఆత్మీయ రథం.. అక్కడి ప్రజలను కలిసి.. వారితో సంభాషిస్తుంది. విభజనతో సీమాంధ్రకు కలిగే లాభాలను వివరించనుంది.‘విడిపోయి కలిసుందాం.. ప్రగతికి పోటీ పడదాం’ అనే నినాదాన్ని రాష్ట్ర నలుమూలలా చాటిచెప్పనుంది. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన పాటలను ప్రజలకు వినిపిస్తారు. నీళ్లు, ఇతర వనరుల పంపకాలపై అక్కడి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుంది. ఈ యాత్ర సూర్యాపేట, కోదాడ మీదుగా ఆంధ్రా ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. రెండు రోజులపాటుసాగే ఈ ఆత్మీయ యాత్ర.. తొలి విడత పర్యటనలో జగ్గయ్యపేట, నందిగామ, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, విజయవాడ, గన్నవరం, హనుమాన్ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, రావులపాలెం, రాజమండ్రి ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించనుంది. 
        తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల సీమాంధ్ర ప్రాంత ప్రజలు నష్టపోతారనే అపోహలను తొలగించేందుకు ఈ యాత్రను ప్రారంభిస్తున్నట్లు పత్రిక ఎడిటర్ అల్లం నారాయణ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమయిన ఆత్మీయ యాత్రకు తార్నాక, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో అపూర్వ స్వాగతం లభించింది. విభజనపై సీమాంధ్రులతో మాట్లాడేందుకు ఆత్మీయ యాత్ర వెళ్లటం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నగరంలోని సీమాంధ్ర వాసులు అభిప్రాయపడ్డారు. ఈ యాత్రను సాదరంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఆత్మీయ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో పత్రిక సంపాదకులు అల్లం నారాయణ, సీఈవో కట్టా శేఖర్‌రెడ్డి, సహాయ సంపాదకులు కే కృష్ణమూర్తి, వేణుగోపాలస్వామి, బ్యూరో చీఫ్ కే రంగయ్య, నెట్‌వర్క్ ఇన్‌చార్జి డీ మార్కండేయ, వైస్ ప్రెసిడెంట్లు తులసీదాస్, విశ్వనాథం, జనరల్ మేనేజర్లు నాగన్న (ఫైనాన్స్), కే వెంక (అడ్వర్‌టైజ్‌మెంట్స్), గోపాలస్వామి (సర్క్యులేషన్), సీహెచ్ శ్రీనివాస్ (ఆపరేషన్స్)తోపాటు.. పత్రిక వివిధ విభాగాల సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం ఆత్మీయ రథం సికింవూదాబాద్, నాగోల్, ఎల్‌బీ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ మీదుగా నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌కు చేరుకుంది. అక్కడి స్థానికులు ఆత్మీయ రథానికి స్వాగతం పలికి తమ తోడ్పాటు అందించారు. 
ఆత్మీయ యాత్రకు అడుగడుగునా నీరాజనం
-విజయవంతం కావాలని నగరవాసుల ఆకాంక్ష
-ఉప్పల్, తార్నాక, హబ్సిగూడలలో ఘన స్వాగతం
-నినాదాలతో హోరెత్తించిన తెలంగాణవాదులు
                                         (టీ మీడియా - నెట్‌వర్క్): నమస్తే తెలంగాణ దినపత్రిక ఆధ్వర్యంలో సీమాంధ్ర జిల్లాలకు బయల్దేరిన ఆత్మీయ యాత్రకు నగరంలో అడుగడుగునా తెలంగాణవాదులు, నగరంలో స్థిరపడిన పలువురు సీమాంధ్ర ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతూ.. యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఎల్బీనగర్ శ్రీకాంతాచారి చౌరస్తాకు ఆత్మీయ రథం చేరుకోగానే.. అక్కడ చేరి ఉన్న తెలంగాణవాదులు జై తెలంగాణ అంటూ నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. గుప్పెడు మంది సృష్టించిన సమైక్యాంధ్ర నినాదంలో ఉన్న డొల్లతనాన్ని తేటతెల్లం చేసే దిశగా ఆత్మీయ యాత్ర విజయవంతం కావాలని యాత్రకు వివిధ ప్రాంతాల్లో స్వాగతం పలికిన నాయకులు ఆకాంక్షించారు.

జలాల పంపిణీపై సీమాంధ్ర ప్రజలలో ఉన్న అపోహలను తొలగించేందుకు కృషి చేయాలని కోరారు. శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని నమస్తే తెలంగాణ ప్రధాన కార్యాలయం నుంచి బయల్దేరిన ఆత్మీయ రథం.. తార్నాక చౌరస్తాకు చేరుకున్నప్పుడు టీఆర్‌ఎస్, ఓయూ జేఏసీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతె శోభన్‌డ్డి, తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో రథయావూతకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్షికమంలో నాయకులు శ్రీకాంత్ యాదవ్, క్రిష్ణకాంత్, నిఖిల్‌రాజ్ యాదవ్, సతీష్‌కుమార్, షరీఫ్, మనోహర్, ట్రేడ్ యూనియన్ నాయకులు హన్మంత్ రెడ్డి, ఓయూ రిసెర్చ్ స్కాలర్లు అంజిబాబు, కృష్ణ, బిసగోని శ్రీనివాస్‌గౌడ్, మద్దెల సంతోష్‌ముదిరాజ్, టీ రమేష్‌గౌడ్, కందుల మధు తదితరులు పాల్గొన్నారు. 
హబ్సిగూడలో..
ఆత్మీయ రథానికి హబ్సిగూడ చౌరస్తాలో ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్షికమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి నెర్థం బాస్కర్‌గౌడ్, రాష్ట్ర నాయకులు నందికొండ శ్రీనివాస్‌డ్డి, టీఆర్‌ఎస్ నాయకులు సుధాకర్, సుధాకర్‌డ్డి, పురుషోత్తం రెడ్డి, శ్రీశైలం, గ్యార ఉపేందర్, టీఆర్‌ఎస్వీ నాయకులు సుద్దాల నాని, శ్రీనివాస్‌గౌడ్, వికాస్ వర్మ, నరేష్, గణేష్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. 
ఉప్పల్ రింగ్ రోడ్‌లో.. 
నమస్తే తెలంగాణ ఆత్మీయ యాత్రకు తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కోమురయ్య ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్‌రోడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్షికమంలో తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రతినిధులు రవి, యాదగిరి, రామనర్సయ్య, బాబు, కిషోర్, శ్రీనివాస్, బేతాల్, యాకన్న, సతీష్ తదితరులు పాల్గొన్నారు. 
హయత్‌నగర్‌లో..
హయత్‌నగర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పలు పార్టీల నాయకులు నమస్తే రథానికి ఘనంగా స్వాగతం పలికారు. ఆత్మీయ రథం వస్తున్నదని తెలిసి.. టీఆర్‌ఎస్, సీపీఐ, జేఏసీ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపైకి భారీగా తరలి వచ్చారు. రథం రాగానే రహదారిపై జైతెలంగాణ నినాదాలు మార్మోగాయి. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి జనిగె విష్ణువర్ధన్, జిల్లా కార్యదర్శి కాటెపాక స్కైలాబ్, హయత్‌నగర్ టీఆర్‌ఎస్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు తన్నీరు కళాపూర్ణ, యువజన విభాగం డివిజన్ అధ్యక్షుడు బలరాం కుర్మ, రమాకాంత్‌డ్డి, వై రాజు, ప్రేంచంద్‌డ్డి, వై కృష్ణ, జే సాయికుమార్, కే దిలీప్, శివవూపసాద్, సీపీఐ మండల సహాయకార్యదర్శి ముత్యాల యాదిడ్డి, నాయకులు శేఖర్‌డ్డి, వేణుగోపాలచారి, శేఖర్, రాజు, జేఏసీ మండల కో కన్వీనర్ జోర్తా రాము ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్ మెట్‌లో..
నమస్తే తెలంగాణ రథానికి హయత్‌నగర్ మండలం అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్షికమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇన్‌చార్జి వంగేటి లకా్ష్మడ్డి, బీజేపీ నియోజకవర్గం ఇన్‌చార్జి బొడిగె అశోక్ గౌడ్, బీజేపీ, టీఆర్‌ఎస్ హయత్‌నగర్ మండల అధ్యక్షులు కొత్త రాంరెడ్డి, కందాల బలదేవడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బొడిగె గోవర్థన్‌గౌడ్, నాయకులు వడ్డెపల్లి పాపయ్యగౌడ్, ముసరిగారి రాజుగౌడ్, నల్ల సత్తిడ్డి, పల్లపు అంజయ్య, పసుల పవన్‌కుమార్, నంజుటి కృష్ణగౌడ్, కే శివాడ్డి, మల్లేష్, శేఖర్, శంకర్, నరేష్, బొడిగె రాజు, ఆనంద్‌గౌడ్, నవాబు శ్రీశైలం, భిక్షపతి, వెంక తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్‌లో
ఆత్మీయయాత్ర శుక్రవారం రాత్రి నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌కు చేరింది. ఈ సందర్భంగా యాత్ర ప్రతినిధి బృందం విభజన జరిగితే ఇరు ప్రాంతాలకు జరిగే లాభాలను వివరించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రచురితమైన నమస్తే తెలంగాణ ప్రతులను పంపిణీ చేశారు. కార్యక్షికమంలో అశోక్, పుల్లారావు, విద్యార్థి జేఏసీ మండల ప్రధాన కార్యదర్శి చల్ల శంకర్, ముత్యాల హనుమంతడ్డి, విజయ్‌కుమార్, వనం ధనుంజయ, నరేందర్‌రావు, నకిరేకంటి మల్లమ్మ, ఎలకరాజు సతీష్, సత్యనారాయణ, శేఖర్, మాధవడ్డి, బయ్యసాయి, సాయితేజ తదితరులు పాల్గొన్నారు.
జై తెలంగాణ నినాదాలతో హోరెత్తిన శ్రీకాంతాచారి చౌరస్తా

 నమస్తే రథానికి ఎల్బీనగర్ శ్రీకాంతాచారి చౌరస్తా వద్ద ఘనస్వాగతం లభించింది. నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్, బీజేపీ, టీ జేఏసీ నాయకులతోపాటు నమస్తే తెలంగాణ విలేకరులు, సర్క్యులేషన్ సిబ్బంది, తెలంగాణవాదులు తరలివచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్షికమంలో టీఆర్‌ఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్‌చార్జి కాచం సత్యనారాయణ, యువజన విభాగం జిల్లా ఇన్‌చార్జి మాధవరం నర్సింహారావు, టీ జేఏసీ చైర్మన్ కేవీ రంగాడ్డి, ఏలే పురేందర్‌నేత, బీజేపీ నాయకులు వెదిరె యోగీశ్వర్‌డ్డి, పోచంపల్లి గిరిధర్, చిట్టివూపోలు రవికుమార్, టీఆర్‌ఎస్ నాయకులు శ్రీకాంత్‌డ్డి, శ్రీకాంత్, ఘంటా సుదర్శన్, ఎన్ శ్రీనివాస్‌డ్డి, శ్రవణ్‌కుమార్, పొట్టబత్తిని శ్యాంనేత, పగడాల శ్రీరాం, సుధాకర్, సూర్యనారాయణ, భరత్‌గౌడ్, సత్తిడ్డి, నాగార్జునగౌడ్, శ్రీకాంత్‌డ్డి, నమస్తే తెలంగాణ జోన్ ఇన్‌చార్జి మేకల సత్యనారాయణ, రిపోర్టర్లు చందర్, శ్రీనివాస్‌గౌడ్, పూల నాగరాజు, తిరుమలేష్, కృష్ణమాచారి, గణేష్, జంగయ్య, దామోదర్, జంగయ్య, యాదయ్య, కంది సన్నీ, సర్క్యులేషన్ ఇన్‌చార్జి సంతోష్, సిబ్బంది చంద్రశేఖర్, ప్రవీణ్‌కుమార్, కిరణ్, పర్వతడ్డి, జయరాం తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 18 June 2013

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్సే అతిపెద్ద పార్టీ: కేసీఆర్


హైదరాబాద్: ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి సరియైన మెజారిటి రాదని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇవాళ టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్‌గా కేకే ప్రమాణస్వీకారం చేసిన అనంతరం విలేకరులతో కేసీఆర్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఏపార్టీకి సరియైన మెజారిటీ రాదని టీఆర్‌ఎస్‌ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో మూడు ముక్కలాటలా రాజకీయలున్నాయని అన్నారు. ఆ ఎన్నికల్లో అటు కాంగ్రెస్, ఇటు వైఎస్సార్సీపీ దేనికి కూడా పది సీట్లు రావని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో పదహారు ఎంపీ సీట్లతో ఏపీ నుంచి టీఆర్‌ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని తెలిపారు. టీఆర్‌ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగబోతోందని వివరించారు. 
తెలంగాణ సాధనే మా ఎజెండా
   తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా టీఆర్‌ఎస్ పనిచేస్తోందని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం రెండో ఎజెండా అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అంతిమంగా తెలంగాణ ప్రజలే విజయం సాధిస్తారని పేర్కొన్నారు. పదవులు ఉన్నా లేకున్నా తామంతా కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. 
* చలో అసెంబ్లీని విజయవంతం చేసినం
   సీమాంధ్ర సర్కారు ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఛలో అసెంబ్లీని విజయవంతం చేశామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్ని లాఠీలు, రబ్బరు తూటాలు పేల్చినా ఉద్యమాన్ని ఆపలేకపోయారని అన్నారు. ప్రభుత్వం ఉద్యమంపట్ల నియంతృత్వంగా వ్యవహరించిందని, మరోసారి అలా చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. 
* ప్యాకేజీ అంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను ప్యాక్ చేస్తరు 
   తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి కదా అని ఒక విలేకరి ప్రశ్నించగా కేసీఆర్ ఆగ్రహంతో సమాధానం చెప్పారు. ప్యాకేజీలకు తెలంగాణ ప్రజలు అంగీకరించరని, కాంగ్రెస్‌కే ప్యాక్ చేసి బంగాళాఖాతంలో విసిరేస్తారని అన్నారు. హైదరాబాద్ నగరంతో కూడిన పది జిల్లాలతో తప్పా వేరే ప్రతిపాదనలకు వేటికి ఎట్టి పరిస్తితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు.

Tuesday, 11 June 2013

ఆంధ్రపీఎస్సీ


- అక్షరాలా లక్ష కొలువులు
- సమైక్యాంధ్రలో ఇదీ.. మనం కోల్పోయింది!సమైక్యాంధ్రలో ఇదీ..మనం కోల్పోయింది!- సీమాంధ్రుల భర్తీకే ఏపీపీఎస్సీ- అమ్మేసుకుని.. నింపేసుకుని..
- సీమాంధ్ర అధికారుల పెత్తనం
- ఓపెన్ స్థానంలో నాన్‌లోకల్ కోటా .. స్టేట్ పోస్టులవుతున్న జోనల్ పోస్టులు- ఇష్టారాజ్యంగా ఏపీపీఎస్సీ నియామకాలు

       ఉద్యోగాల భర్తీలో ప్రతిసారీ 70%-80% ఉద్యోగాలు సీమాంధ్రులకే ఎందుకు దక్కుతాయి? 1991లో 120 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తే.. 90% సీమాంధ్ర అభ్యర్థులే ఎలా ఎంపికయ్యారు? ఒక్క కడప నుంచే 40 మందికి ఉద్యోగాలు రావడం వెనుక మతలబేంటి? గ్రూప్-1లో టాప్ ర్యాంకులు సాధించిన తెలంగాణ అభ్యర్థులకు ఇంటర్వ్యూల్లో పది పదిహేను మార్కులే ఎందుకు పడతాయి? జోనల్ పోస్టులను 60% లోకల్ కేటగిరీ కింద.. 40% ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేయాల్సి ఉండగా.. మధ్యలో నాన్‌లోకల్ కేటగిరీ పుట్టుకురావడం వెనుక మంత్రమేంటి? తెలంగాణలో దండిగా కనిపించే నాన్‌లోకల్స్.. సీమాంధ్ర జోన్లలో మచ్చుకైనా కనిపించందుకు? గ్రూప్-2 పోస్టులు.. స్టేట్‌లెవల్ పోస్టులుగా అవతరించడం వెనుక పాత్ర ఎవరిది? పెన్సిల్‌తో రాసిన సీమాంధ్రుల జవాబు పత్రాల్లో తెరచాటు దిద్దుబాటుకు తెలంగాణ చెల్లించుకున్న మూల్యం ఎంత? సమైక్య రాష్ట్ర ఆవిర్భావం అనంతరం.. తెలంగాణకు చెందాల్సిన లక్ష ఉద్యోగాలు ఈ ప్రాంతానికి ఎందుకు రాకుండా పోయాయి? ఎందుకంటే.. రాష్ట్రం మొత్తానికీ న్యాయం చేయాల్సిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. సీమాంధ్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా రూపాంతరం చెందడం వల్లే! ఇష్టారాజ్యంగా మాస్ కాపీయింగ్‌లు.. పరీక్ష ముగిశాక దొంగచాటు దిద్దుళ్లు.. తెలంగాణవారికి మార్కులు వేసే దగ్గర కరడుగట్టిన వివక్ష.. అడ్డగోలు నియామకాలు! ఏపీపీఎస్సీ పోస్టులను నడిబజార్లో అమ్మకానికి పెట్టి.. బ్రోకర్ ఇంట్లో కాలక్షేపానికి పేకాడుకుంటూ బుక్కయిన ప్రబుద్ధులే సాక్ష్యం! నిదర్శనాలు కావాలా? 

(యార నవీన్‌కుమార్): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా సీమాంధ్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా మారిపోయింది. కొలువులన్నీ సీమాంధ్రకు తరలిపోతున్నాయి. తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని నెత్తి నోరు కొట్టుకున్నా అరణ్యరోదనే అవుతోంది. అరకొర ఉద్యోగాలు మినహా తెలంగాణకు న్యాయమైన వాటా దక్కడం లేదు. సాక్షాత్తూ ప్రధాన కార్యాలయంలోనే తెలంగాణకు న్యాయమైన వాటా రాని పరిస్థితి ఉంది. అన్యాయాలపైన రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోగా, రాష్ట్రపతి ఆదేశాలను సైతం ఇక్కడ తుంగలో తొక్కేశారు. పాలకుల వైఖరీ కమిషన్‌కు వత్తాసు పలికే విధంగానే ఉంటోంది. ‘కడుపు నిండాలి... కడప పండాలి...’ అన్నట్లు ఒక నేత వ్యవహరిస్తే.. ఏపీపీఎస్సీ అక్రమాలపై కమిటీ వేసి నివేదిక వచ్చినా దాన్ని తుంగలో తొక్కిన ఘనత మరో సీమాంధ్ర సీఎంది. తాజాగా మరో సీమాంధ్ర సభ్యుడు ఉద్యోగాలు అమ్మకానికి పెట్టినట్లు ఓ ప్రవేటు టీవీ ఛానల్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపడడంతో నేపథ్యంలో ఏపీపీఎస్సీ బాగోతాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. ఇంత బహిరంగంగా అక్రమాలు బయటపడ్డా ఇంకా మసిపూసి మారేడుకాయ చేసే యత్నాలు చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సభ్యుడు స్టింగ్ ఆపరేషన్ జరిగిన రోజు బోర్డులోనే ఉన్నట్లు బోర్డు చైర్మన్ వత్తాసు పలకడం దీనికి పరాకాష్ట.
ఉద్యోగాల భర్తీలో జరిగిన అన్యాయాల పరంపర 
       1975 నుంచి ఇప్పటి వరకు సుమారు లక్షకు పైగా తెలంగాణ ఉద్యోగాలు సీమాంధ్రులు తన్నుకుపోయినట్టు అంచనా. ఏపీపీఎస్సీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఉన్న చైర్మన్లు, సభ్యులు ఎక్కువ శాతం సీమాంవూధులే కావడంతో పాలకుల అండదండలతో వారు తెలంగాణ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్నది తెలంగాణ యువత ప్రధాన ఆరోపణ. దీనికి తగ్గట్టుగా ఉద్యోగాలు భర్తీ చేసేన ప్రతి సారి 70 నుంచి 80 శాతం ఉద్యోగాలు సీమాంధ్రకే దక్కాయి. ఇందుకు గత కారణాలు పరిశీలిస్తే...
1) పేపర్ ఆవుట్ చేసి సన్నిహితులకు ఇవ్వటం... 
2) ఏపీపీఎస్సీ సిబ్బందితో కుమ్మక్కై మాస్ కాపీయింగ్‌కు పాల్పడటం.. 
3) రాత పరీక్షలో ఎంపికైన సీమాంధ్ర అభ్యర్థులకు ఇంటర్వ్యూలోఎక్కువ మార్కులు వేయటం. 
        ఈ విధానాల వల్ల తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని కోచింగ్ సెంటర్లల్లో వేలకు వేలు కుమ్మరించి గంటలు తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టినా ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొంది. సీమాంధ్ర అధికారులు, సభ్యుల ప్రాంతీయపిచ్చి, కులపిచ్చి కారణంగా ఏపీపీఎస్సీ చైర్మన్‌గా తెలంగాణ ప్రాంతవాసి నియామకమైనా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించిన సమయంలో సీమాంవూధలో మాస్‌కాపీయింగ్‌ను చూడనట్టు వదిలేసి,తెలంగాణలో మాత్రం తనిఖీలపేరిట హడలగొడతారనే వాదన బలంగా ఉంది.

1991లో సుమారు 120 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను ఏపీపీఎస్సీ భర్తీ చేసింది. ఇందులో 90శాతం మంది సీమాంధ్ర అభ్యర్థులే. సీమాంధ్ర పరీక్ష కేంద్రాలు గుంటూరు, తిరుపతి, కడప కేంద్రాల నుంచే 90 మంది ఎంపికయ్యారు. ఒక్క కడప నుంచే 40 మంది ఎంపికయ్యారంటే పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ ఏ స్థాయిలో జరిగిందో తెలుస్తుంది. ఈ అంశంపై పత్రికలు, తెలంగాణ యువకులు గగ్గోలు పెట్టడంతో తప్పనిసరి పరిస్థితిలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే కడప జిల్లాకు చెందిన ఒక ప్రముఖ దివంగత నేత విచారణ అధికారులను బెదిరించటంతో ఆ ఎంక్వైరీ మూలకుపడింది. గ్రూప్-1, గ్రూప్-2 వంటి ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకాలలో ఇంటర్యూ విధానం సీమాంవూధులకు అయాచిత వరంగా మారిందని ఇక్కడి యువత ఆరోపిస్తున్నది.

ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల పేర్లు, జిల్లా వివరాలతో కూడిన లిస్టు బోర్డు సభ్యుల చేతుల్లో ఉండడంతో సీమాంధ్ర అభ్యర్థుల గుర్తింపు సులభమై, సీమాంధ్ర సభ్యులంతా కూడబలుక్కుని వారికి దండిగా మార్కులు వేసి ఎంపిక చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న సమయంలో జరిగిన 2007 గ్రూప్-1 ఉద్యోగాల ఇంటర్వ్యూల్లో తెలంగాణ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేశారు. 90 మార్కుల ఇంటర్వ్యూ నకు సీమాంధ్రులకు 70 నుంచి 80 మార్కులు, తెలంగాణ అభ్యర్థులకు 15 మార్కులు వేశారు. దీంతో ఆంధ్రావారికి భారీగా ఉద్యోగాలు దక్కాయి.

నాన్‌లోకల్ కేటగిరీ సృష్టి
     1975లో రాష్ట్ర పతి ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు ఆ ఉత్తర్వులను ఏపీపీఎస్సీ తుంగలో తొక్కింది. జోనల్ గెజిటెడ్ పోస్టుల నియామకంలో 60 శాతం లోకల్ కేటగిరి, 40 శాతం ఓపెన్ కేటగిరీ ద్వారా భర్తీ చేయాలి. అయితే తెలంగాణ వారి అమాయకత్వం ఆసరా చేసుకుని సీమాంధ్ర అధికారులు నాన్‌లోకల్ కేటగిరీని సృష్టించారు. ఈ 40 శాతం ఓపెన్ కేటగిరీ పోస్టులను నాన్‌లోకల్ కేటగిరీ కింద సీమాంవూదులతో భర్తీ చేశారు. తెలంగాణ జోన్లలో దండిగా కనిపించే నాన్‌లోకల్స్ సీమాంధ్ర జోన్లలో మాత్రం మచ్చుకైనా కనిపించరు. ఒక వేళ ఒకటీ ఆరా నియామకమైనా సీమాంధ్రులు తరిమివేసిన దాఖలాలూ ఉన్నాయి. 

జోనల్ నాన్ గెజిటెడ్ పోస్టుల్లో 70 శాతం లోకల్ , 30 శాతం ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేయాలి. కానీ ఈ 30 శాతం పోస్టులు నాన్‌లోకల్ అభ్యర్థులతో భర్తీ చేశారు. ఇప్పటికీ ఇదే తంతు నడుస్తోంది. జీవో నెంబర్ 124 ప్రకారం గెజిటెడ్ ఉద్యోగాల్లో 40శాతం, నాన్ గెజిటెడ్ పోస్టుల్లో 30 శాతం పోస్టులు ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేయాలి. కానీ రెండూ నాన్‌లోకల్ కోటాగా మార్చి సీమాంధ్రులకు తెలంగాణలో రెడ్‌క్పాట్ పరిచేశారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం పంపే వివిధ శాఖల ఖాళీల జాబితా అందగానే ఏ పోస్టులు స్టేట్, జోనల్, జిల్లా పోస్టుల కేటగిరీలోకి వస్తాయో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఏపీపీఎస్సీ గుర్తించాలి. కానీ ఈ పద్దతి పాటించిన దాఖలాలు లేవు. 

జోనల్ పోస్టులుస్టేట్ వైడ్ పోస్టులుగా మారిన వైనం
     డిగ్రీ లెక్చరర్, ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సివిల్ సర్జన్, అసిస్టెంట్ సర్జన్, ఇవన్ని జోనల్ పోస్టులు. కానీ వీటన్నింటినీ స్టేట్ లెవల్‌పోస్టులుగా మార్చి రిక్రూట్‌మెంట్ చేపట్టారు. దీనితో తెలంగాణ ఉద్యోగులుకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. గ్రూప్-2 పోస్టులు సైతం స్టేట్ లెవల్‌పోస్టులుగా మార్చి భర్తీ చేసిన ఘనత ఏపీపీఎస్సీదే. ఎంపీడీఓ, అసిస్టెంట్ ఎక్సైజ్ అఫీసర్స్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, లేబర్ ఆఫీసర్, లే సెక్రటరీ, అసిస్టెంట్ సివిల్ సర్జన్, స్టేట్ వైడ్ రిక్రూట్‌మెంట్ చేపట్టటం వల్ల లోకల్ అభర్థులకు అన్యాయం జరుగుతోంది. 
ఒక్క పెన్సిల్ బోలెడు ఉద్యోగాలు..
         ఒక పెన్సిల్ గీత తెలంగాణ అభ్యర్థుల ఉద్యోగాలు కొల్లగొడుతోంది. కేవలం రాత పరీక్ష ఆధారంగా భర్తీ చేసే ఉద్యోగాల భర్తీని ఈ పెన్సిల్లే నిర్దారిస్తున్నాయి. రాత పరీక్షలో జవాబు పత్రం(ఓఎమ్మార్‌షీట్ల)లో అభ్యర్థులు పెన్సిల్‌తో జవాబులను గుర్తిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న సీమాంధ్ర పైరవీకారులు ఏపీపీఎస్సీ సిబ్బందితో కుమ్మక్కై జవాబు పత్రాలను దిద్దించుకుని ఎక్కువ మార్కులు వేయించుకుని కొలువులు కొల్లగొడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇంటర్వ్యూలో సైతం మార్కులు వేయడానికి పెన్సిల్ ఉపయోగించే పద్దతి అమలు వల్ల వాటిని దిద్ది తమకు కావలిసిన వారికి తర్వాత మార్కులు కలుపుకునే పద్దతి అమలైందన్న ఆరోపణలున్నాయి. 

రాష్ట్ర స్థాయి మెరిట్‌లిస్ట్టు ఆధారంగా నియామకాలు
         ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలను స్టేట్ మెరిట్ లిస్ట్టు ఆధారంగా ఏపీపీఎస్సీ భర్తీ చేస్తోంది. ఈ లిస్టు అడ్డం పెట్టుకుని తెలంగాణలో డిగ్రీ లెక్చరర్ పోస్టుల్లో సీమాంవూధులను నింపేందుకు కుట్ర చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1017 డిగ్రీ కాలేజీ లెక్చరర్ల పోస్టులకు ఏపీపీఎస్సీ 2009-2010లో విడుదల చేసిన నోటిఫికేషనే దీనికి ఉదాహరణ. ఈ నోటిఫికేషన్ ప్రకారం డిగ్రీ పోస్టుల ఎంపిక స్టేట్ లెవల్ మెరిట్ లిస్టు ఆధారంగా ఉద్యోగాల భర్తీ ఉంటుంది. లోకల్ రిజర్వేషన్ వర్తించదు. పోస్టింగులు మాత్రం జోన్ల వారీగా చేస్తారు. పదోన్నతులు, బదిలీలు జోన్ల వారీగా ఇస్తూ రిక్రూట్‌మెంట్ మాత్రం స్టేట్ మెరిట్ లిస్టు ఆధారంగా చేయటం సీమాంవూధులను ఆక్రమంగా తెలంగాణలో నియమించేందుకేననేది నగ్నసత్యం. గత 45 సంవత్సరాలుగా ఈ ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ వారికి అన్యాయం జరుగుతూనే ఉంది.
    1976 వరకు ఈ పోస్టులు డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ లెక్చరర్ క్యాడర్‌లో జరిగేవి. తర్వాత ప్రభుత్వం డిగ్రీ లెక్చరర్ పోస్టులను గెజిటెడ్ పోస్టులుగా మార్చింది. ఇక్కడ నుండే అసలు మోసం ప్రారంభమైంది. గెజిటెడ్ పోస్టులకు లోకల్ రిజర్వేషన్లు వర్తించవు. గెజిటెడ్‌గా మార్చి స్టేట్ లెవల్ మెరిట్ ఆధారంగా భర్తీ చేయటం సులువైంది. స్టేట్ లెవల్ మెరిట్ ద్వారా ఎంపిక చేసి జోన్ల వారిగా పోస్టింగులు ఇవ్వటం అంటే తెలంగాణ ఉద్యోగాలు కొల్లగొట్టడమే. ఈ అన్యాయాన్ని తెలంగాణ అభ్యర్థులు ప్రతిఘటించినా ఫలితం లేదు. 1983 నుండి ఇప్పటి వరకూ కామర్స్ విభాగంలో నియామకాలు పరిశీలిస్తే హైదరాబాద్ సిటీ క్యాడర్‌లో కేవలం ముగ్గురు తెలంగాణ వారు నియమించబడ్డారు. లోకల్ మెరిట్ ఆధారంగా నియమించి ఉంటే హైదరాబాద్, సికింవూదాబాద్‌లోని ఉద్యోగాలన్నీ తెలంగాణ వారికేదక్కేవి. 

సీమాంధ్రలో రాసుకో రాజా..
         2010 డిగ్రీ లెక్చరర్ పోస్టుల నోటిఫికేషన్ భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో ఆంధ్ర ప్రాంతంలో మాస్ కాపీయింగ్ జరిగినట్టు వార్తలు వచ్చాయి. తెలంగాణలో మాత్రం అధికారులు దాడుల మీద దాడులు జరిపి పర్యవేక్షించారు. మాస్ కాపీ పర్యవసానంగా వరస హాల్‌టికెట్ నెంబర్లు ఉన్న ఆంధ్రప్రాంతం వారు పెద్ద సంఖ్యలో ఇంటర్యూకు ఎంపికయ్యారు. పరీక్షా పత్రం ఎంపిక కమిటీ సభ్యుడైన ఆంధ్రా వర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ దీనిలో చక్రం తిప్పారని ఏపీపీఎస్సీకి ఫిర్యాదులు చేరాయి. డిగ్రీ లెక్చరర్ పోస్టులు స్టేట్ లెవల్ కావటంతో తెలంగాణ వారికి ఈ పోస్టులు దక్కకుండాచేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఆనాటి నియామకాల్లో ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఓపెన్ కేటగిరీలో 14 పోస్టులుండగా తెలంగాణ వారికి ఒకే పోస్టు దక్కడం దీన్నే ధృవపరిచింది. నాటి పరీక్షల్లో గతంలో ఏపిపిఎస్సీ చరిత్రలో ఎన్నడూని విధంగా 500 మార్కులకు 399 గరిష్ట మార్కులు వచ్చాయి. ఇంటర్యూకు విశాఖ పట్నం కేంద్రంలో పరీక్ష రాసిన 28 మంది అభ్యర్థులు ఎంపిక కావటం, వరస హాల్ టికెట్ల నెంబర్లు కావడంతో విషయం బయటపడగా, ఈ అంశంపై విచారణ జరిపినా చివరికి అంతా తూచ్ అని ఏపీపీఎస్సీ అధికారులు తేల్చేశారు. 

సీమాంధ్రుల అక్రమాలు ధృవీకరించిన జె.సత్యనారాయణ నివేదిక
       ఏపీపీఎస్సీ చైర్మన్‌గా వెంకట్‌రామ్‌డ్డి ఉన్న సమయంలో గ్రూప్-1,2 కేటగిరీ ఉద్యోగాలకులకు సంబంధించి అక్రమాలు జరిగాయిని బాధితులు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఈ అంశాలను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతి కార్యాలయం ఆదేశించింది. దానితో ప్రభుత్వం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి జె.సత్యనారాయణను విచారణ అధికారిగా నియమిస్తూ 2010లో 3459 జీవోను జారీ చేసింది. ఆయన సంబందించిన అక్రమాలపై నివేదిక ఇచ్చారు. దాదాపు రెండేళ్లు దాటినా చర్యలు మాత్రం లేవు. 2006 గ్రూప్-1,2 నియామకాలకు సంబంధించి రిక్రూట్ క్యాంపు అధికారులుగా అప్పటి ఏపీపీఎస్సీ అధనపు కార్యదర్శి సఫీఉల్‌హక్ రిక్రూట్‌మెంట్ క్యాంపు అధికారి వ్యవహరించగా, అసిస్టెంట్ క్యాంపు అధికారిగా ఏఎస్‌ఒ పాండురంగారావు ఉన్నారు. సఫీఉల్‌హక్ మాజీ చైర్మన్ వెంకటరామ్‌డ్డి సొంతజిల్లా అనంతపూర్‌కు, పాండురంగారావు కృష్ణా జిల్లాకు చెందినవారు కావడంతో గ్రూప్ - 1,2 నియామకాల్లో తెలంగాణవారికి అన్యాయం జరిగిందని అభ్యర్థులు రాష్ట్రపతికి పంపిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పెద్దసార్లు ఆంద్రోళ్లు... చప్రాసీలు తెలంగాణ వారు
     నియామకాల సంగతి ఇలా ఉంటే అసలు ఏపీపీఎస్సీ కార్యాలయంలో కూడా దీనికి భిన్నమైన పరిస్థితి లేదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహించాల్సిన ఈ కార్యాలయంలో కీలక స్థానాల్లో సీమాంధ్ర సిబ్బంది తిష్ట వేశారు. అటెండర్, వాచ్‌మెన్లు, గేటు కీపర్ల వంటి ఉద్యోగాల్లో తెలంగాణ వారిని నియమించారు. ప్రశ్నిస్తే ఏపీపీఎస్సీ స్వయంప్రతిపత్తి సంస్థ కాబట్టి ఇక్కడ రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జీవో వర్తించదనే జవాబు వస్తోంది. ఏపీపీఎస్సీ బోర్డులో టైపిస్టు నుంచి డిప్యూటీ సెక్రటరీ స్థాయి వరకు మొత్తం పోస్టుల సంఖ్య 380. ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య 207 మంది కాగా 173 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పనిచేసే 207 మందిలో 128 మంది సీమాంధ్రులు, 79 మంది తెలంగాణ ఉద్యోగులున్నారు. ఈ ఉద్యోగాల్లో కూడా ఎక్కువ శాతం టైపిస్టులు, టెలిఫోన్ ఆపరేటర్లు. చైర్మన్ తర్వాత స్థానం కార్యదర్శిది.

ఐఏఎస్ అధికారినే రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్యిగా నియమిస్తుంది. కార్యదర్శి సెలవులో ఉన్న, ఖాళీగా ఉన్న సమయాల్లో ఇంచార్జిగా వ్యవహరించేది అడిషనల్ కార్యదర్శి. ఉన్న ఈ ఒక్క పోస్టులో సీమాంవూధులే ఉన్నారు. ఉప కార్యదర్శి పోస్టులు నాలుగింటిలో మూడింట ఆంధ్రావారే ఉన్నారు. అసిస్టెంట్ సెక్రటరీ పోస్టులు 25 ఉండగా 16 మంది సీమాంధ్రులు,  9 మంది తెలంగాణ వారున్నారు. ఒక అకౌంట్ ఆఫీసర్ పోస్టు ఉంటే అదీ ఆంధ్రా ప్రాంతవాసికే అప్పగించారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు 65 మందిఉండగా 36 మంది ఆంధ్రావారే. ఇక నాలుగవ తరగతి ఉద్యోగాలు 72 కాగా ప్రస్తుతం పనిచేస్తున్న 46 మందీ తెలంగాణ వారే. ఉన్న తెలంగాణ ఉద్యోగుల సంఖ్య తక్కువ కాగా వారికీ సరైన ప్రాధాన్యత లేదు. అడ్మినిస్ట్రేషన్ విభాగం పూర్తిగా ఆంధ్రుల చేతుల్లోనే ఉంది.

Monday, 10 June 2013

బీజేపీలో మోడీ శకం


- ఎన్నికల ప్రచార కమిటీ పగ్గాలు అప్పగింత 
- మోడీ ఎంపికతో అద్వానీకి ఎదురుదెబ్బ.. చివరివరకూ నిరోధించిన
  అగ్రనేత!
- ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుతో మోడీకే బాధ్యతలు
-  మోడీ ఎన్నిక ఏకగ్రీవం ఇది బీజేపీ విజయానికి బాట : రాజ్‌నాథ్
-  జనం విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్
-  దేశం నుంచి ఆ పార్టీని తరిమేయాలి 
-  వాజపేయి ప్రభుత్వ లక్ష్యాలు పూర్తి చేయాలి
-  కొత్త బాధ్యతల స్వీకరణ అనంతరం మోడీ

        
తీవ్ర ఉత్కంఠ.. తర్జనభర్జనలు.. వ్యతిరేకతల నడుమ బీజేపీ జాతీయ ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలు గుజరాత్ సీఎం నరేంవూదమోడీకి దక్కాయి. పార్టీలో వాజపేయి తర్వాత కురువృద్ధ నేతగా ఉన్న అద్వానీ తీవ్రంగా వ్యతిరేకించినా.. ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు, అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ బాసట తోడవడంతో ప్రతికూల పరిస్థితులను మోడీ సునాయాసంగానే అధిగమించగలిగారు.

మోడీని జాతీయ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా నియమించినట్లు రాజ్‌నాథ్‌సింగ్ గోవాలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు అనంతరం విలేకరులకు వెల్లడించారు. మోడీ ఎంపిక.. రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయానికి బాటగా అభివర్ణించారు. ఇది ఏకగ్రీవ ఎన్నికని చెప్పిన రాజ్‌నాథ్.. మరిన్ని వివరాలు వెల్లడించకుండానే వెళ్లిపోయారు. రెండు రోజుల సమావేశానికి అనారోగ్య కారణాలు చూపి అద్వానీ డుమ్మా కొట్టడం ద్వారా మోడీ ఎన్నికను నిరోధించేందుకు ప్రయత్నించినా.. రాజ్‌నాథ్ వర్గీయులే పై చేయి సాధించినట్లు అర్థమవుతోంది. ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలు మోడీకి దక్కడంతో అద్వానీకి బీజేపీలో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు భావిస్తున్నారు. కొత్త బాధ్యతలు స్వీకరించిన అనంతరం 45 నిమిషాల పాటు సుదీర్ఘంగా మాట్లాడిన మోడీ.. రాజ్‌నాథ్‌ది పెద్దమనసని చెప్పారు. తనకు ఇంతటి బాధ్యతను, గౌరవాన్ని ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌పై ప్రధానంగా విమర్శనాస్త్రాలు సంధించిన గుజరాత్ సీఎం.. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ఆ పార్టీని దేశం నుంచి తరిమివేయాలని, కాంగ్రెస్ నుంచి భారత్‌ను విముక్తి చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

వాజపేయి ప్రభుత్వ హయాంలో మిగిలిపోయిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేసేందుకు బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజ్యాంగంలోని 356వ అధికరణాన్ని కాంగ్రెస్ గతంలో అనేకసార్లు దుర్వినియోగం చేసిందని మోడీ ఆరోపించారు. రాజ్‌భవన్‌లు కాంగ్రెస్ భవన్‌లుగా మారాయని విమర్శించారు. ఇప్పుడు ప్రతిపక్షాన్ని అణచివేసేందుకు కాంగ్రెస్‌వారు సీబీఐని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. జాతీయ సలహా మండలిలోనే కాదు.. ప్రణాళికా సంఘంలోనూ నక్సల్స్‌తో ములాఖత్ అయినట్లు ఆరోపణలు ఉన్న వ్యక్తి ఉన్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచార కమిటీకి చైర్మన్‌గా మోడీ పేరును ప్రకటించగానే.. సమావేశంలో దాదాపు ఐదు నిమిషాలు ఆగకుండా మోగిన చప్పట్లు.. ఇక బీజేపీలో మోడీ శకం ప్రారంభమైందనడానికి, అద్వానీ శకం ముగిసిందనడానికి సంకేతాలని విశ్లేషకులు అంటున్నారు.

మోడీతో అధికారం.. అధికారంతో తెలంగాణ
* ప్రత్యేక రాష్ట్రం వచ్చేస్తుందంటున్న బీజేపీ టీ నేతలు
    గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఎన్నుకోవడంపై తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ నేతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మోడీ రాకతో తమ పార్టీ విజయావకాశాలు మెరుగయ్యాయని, ఫలితంగా బీజేపీ అధికారంలోకి వచ్చి, తెలంగాణ ఇవ్వడం ఖాయమైందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మోడీని ఎన్నికల ప్రచార కమిటీకి చైర్మన్‌గా ఎంపిక చేయడం మంచి పరిణామంగా బీజేపీ నేతలు ప్రచారం చేయనున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే 100రోజుల్లో తెలంగాణ ఇస్తామని గతంలో ఆపార్టీ అధినేతగా ఎల్‌కే అద్వానీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఇటీవల ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంలో ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ గుజరాత్ అభివృద్ధి చెందుతున్నదని, ముఖ్యంగా విద్యుత్ సంక్షోభం రాకుండా తీసుకుంటున్న చర్యలు, వ్యవసాయరంగానికి ఇస్తున్న ప్రాధాన్యం వంటి అంశాలు నరేంద్ర మోడీ చేసే ప్రచారానికి ఓట్ల రూపంలో ప్రతిఫలం ఇవ్వనున్నాయని అంటున్నారు. గుజరాత్ అభివృద్ధిపైనే కాకుండా ఆంధ్రవూపదేశ్‌పైనా మోడీ దృష్టి సారించినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తిగా మోడీని ఇక్కడి బీజేపీ నేతలు కొనియాడుతున్నారు. మోడీ బీసీ నేత అయినందున ఈ అంశాన్ని కూడా ప్రచారం అస్త్రంగా వాడుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు సీనియర్లు చెబుతున్నారు.

Saturday, 8 June 2013

రాష్ట్ర సాధనకు ఇదే ఆఖరి పోరాటం


-టీఆర్‌ఎస్‌కు 100 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు రావాలి
- ఢిల్లీ దిగివచ్చి కేసీఆర్ వద్ద మోకరిల్లి తెలంగాణ ఇస్తుంది
- జనగామ టీఆర్‌ఎస్ శిక్షణ శిబిరంలో కేకే, కడియం, హరీశ్
జనగామ, జూన్ 7(టీ మీడియా):‘ఓటు అనే ఆయుధంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 100 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు సాధించి పెడితే, కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఏ పార్టీ అయినా కేసీఆర్ వద్ద మోకరిల్లి తెలంగాణ ఇస్తుంది.రాష్ట్ర సాధనకు ఇదే ఆఖరిపోరాటం’అని టీఆర్‌ఎస్ సీనియర్ నేత కే కేశవరావు చెప్పారు. శుక్రవారం వరంగల్ జిల్లా జనగామలో నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన టీఆర్‌ఎస్ రాజకీయ శిక్షణ తరగతు లు నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ తెలంగాణపై మాటిచ్చి నాలుగున్నర కోట్ల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం వెయ్యిమంది ప్రాణత్యాగాలు చేస్తే మనిషిగా పుట్టినందుకు తాను చలించిపోయి కాంగ్రెస్‌పార్టీని, పదవులను వదలిపెట్టి, రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాతో ముందుకుపోతున్న టీఆర్‌ఎస్‌లో చేరానని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఇప్పుడు తప్ప, ఇంకెప్పుడు తెచ్చుకోలేమని ఉద్వేగంగా అన్నారు. 

టీడీపీ ముఖంలోనే తెలంగాణ వ్యతిరేకత కనిపిస్తుందని, బీజేపీని క్షేత్రస్థాయిలో ప్రజలు నమ్మడంలేదని, అనుకూలమంటున్న సీపీఐకి ప్రజాబలం లేదని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ఎన్నికల్లో 15 ఎంపీ, 100 ఎమ్మెల్యే స్థానాలను గెలిస్తే, కేసీఆర్ కాళ్లు మొక్కి తెలంగాణ ఇస్తారని చెప్పారు. తెలంగాణపై రెండు నాల్కల ధోరణి, రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంబిస్తూ ప్రజలను మభ్యపెడుతున్న టీడీపీని గ్రామాల్లో అడుగుపెట్టనివ్వొద్దని పిలుపునిచ్చారు. టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి, మోత్కుపల్లి, రేవూరి ఇప్పటికైనా ప్రజలను మోసం చేసి ఆత్మవంచన చేసుకోవద్దని కోరారు. జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా చంచల్‌గుడా జైలుకు పోతారని జోస్యం చెప్పారు. తప్పుచేసి ప్రజలకు ముఖం చూపించుకోలేకే కోడలిని గ్రామాల్లో తిప్పుతున్నారని, ఆయనను, కుటుంబాన్ని నిలదీయాలని 
పిలుపునిచ్చారు.

ఓటుతో బుద్ధిచెప్పాలి:హరీశ్‌రావు
వచ్చే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు గెలిస్తే దెబ్బకు ఢిల్లీ దిగివచ్చి కేసీఆర్ కాళ్లముందు మోకరిల్లి తెలంగాణ ఇచ్చి తీరుతుందని టీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు చెప్పారు. స్వీయ రాజకీయశక్తితో ఎదిగేందుకు ఓటుతో సీమాంధ్ర పార్టీలకు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. యాచించి కాకుండా శాసించి తెలంగాణ తెచ్చుకోవాలంటే టీఆర్‌ఎస్ బలమైన రాజకీయశక్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటులో కీలకం కావాలన్నారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీలో తెలంగాణ నేతలు డిప్యూటీ పదవులకే పరిమితమవుతారని, ఎన్నటికీ సీఎం, పార్టీ అధ్యక్షులు, అసెంబ్లీ, శాసనమండలి చైర్మన్లు కాలేరన్నారు. తెలంగాణకు ‘ఒక్క రూపాయి ఇవ్వను.. ఏం చేసుకుంటావో చేస్కో’ అని సీఎం కిరణ్ ఆహంకారాన్ని ప్రదర్శిస్తే సభలో ఉన్న మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావు తనకు మద్దతు ఇవ్వలేదని, అలాంటి వాళ్లకు ఓట్లతో బుద్ధి చెప్పాలన్నారు. 14న చలోఅసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ప్రొఫెసర్ సాంబయ్య తదితరులు 
పాల్గొన్నారు.

Wednesday, 5 June 2013

తెలంగాణ కోసం అర్జునుడిలా.. విల్లు ఎక్కుపెట్టాలి


* రాష్ట్ర సాధన లక్ష్యం ఒక్కటే కనిపించాలి
- 14న చలో అసెంబ్లీకి లక్షలాదిగా తరలాలి 
- మిలియన్ మార్చ్, సాగరహారాన్ని మించాలి
- అనుమతించకుంటే ఊరూరా ‘మాక్ అసెంబ్లీముట్టడి’
- 11న రిహార్సల్‌గా ఓరుగల్లులో పోరుయాత్ర ర్యాలీ
- కాంగ్రెస్ దేక్కుంటూ మన దగ్గరికి రావాల్సిందే
- జనగామలో జేఏసీ చైర్మన్ కోదండరాం వ్యాఖ్యలు 
జనగామ, జూన్ 4 (టీ మీడియా):‘తెలంగాణవాదులకు ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యం తప్ప మరొకటి కనిపించవద్దు. రాష్ట్ర సాధన కోసం అర్జునుడిలా విల్లు ఎక్కుపెట్టి గురిచూసి కొట్టాలి. గందరగోళంతో ఆందోళనకు గురికావొద్దు. శత్రువు ఉనికి పసిగట్టి చావుదెబ్బ కొట్టాలి. మిలియన్ మార్చ్, సాగరహారానికి చీమలదండులా కదిలినట్లు వ్యూహాత్మకంగా రాజధాని చేరుకొని 14న లక్షలాదిగా అసెంబ్లీని ముట్టడించాలి’ అని జేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. మంగళవారం వరంగల్ జిల్లా జనగామలో జేఏసీ జిల్లా చైర్మన్ పాపిడ్డి అధ్యక్షతన నిర్వహించిన చలో అసెంబ్లీ సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడా రు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను సాధించుకునేందుకు 14న చేపట్టిన ‘చలో అసెంబ్లీ’తో హైదరాబాద్ దద్దరిల్లేలా లక్షలాదిమంది పాల్గొనాలని కోరా రు. ఉద్యమాన్ని కాపాడుకుం తెలంగాణ ప్రజలకు బతుకుదెరువని, ఘర్షణ ఎంత తీవ్రంగా ఉంటే పోరాటం ఉధృతంగా సాగుతుందన్నారు. పోరాటం తెలంగాణ ప్రజలను ఐక్యం చేసిందని, ఆంధ్రా ఆధిపత్యం పెత్తనం చేయలేని పరిస్థితి తెచ్చిందన్నారు. 

అనుమతివ్వకుంటే ఆంధ్రా పార్టీలను తరిమేద్దాం 
ఆరునూరైనా చలో అసెంబ్లీకి కచ్చితంగా అనుమతి తెస్తామని కోదండరాం చెప్పారు. ఇందిరపార్కు వద్ద సభకు అందరికీ అనుమతించి మాకేందుకు ఇవ్వ రో అడుగుదామన్నారు. అయినా అడ్డుకుంటే ఎక్కడికక్కడే ‘మాక్ అసెంబ్లీ ముట్టడి’గా మారుస్తామని ప్రకటించారు. గ్రామాలు, పట్టణాల్లో పికెటింగ్‌లు, అరెస్టులు జరిగితే ఊరూరా అసెంబ్లీ ముట్టడి తరహాలో ఆందోళనలు చేయాలన్నారు. ఇప్పుడు మనకు అనుమతి ఇవ్వకుంటే జూలైలో పంచాయతీ ఎన్నికల్లో సీమాంవూధపార్టీల నాయకులను గ్రామాల్లో అడుగుపెట్టనివ్వొద్దని సూచించారు. ఇందిరాపార్కు వద్ద సభ, అసెంబ్లీ ముట్టడికి ముందే తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చేలా వరంగల్‌లో జేఏసీ ఆధ్వర్యంలో 11న ఓరుగల్లు పోరుయాత్ర పేరుతో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. 14న జరిపే ముట్టడికి ఇది ‘మాక్ చలో అసెంబ్లీ’గా ఉంటుందన్నారు. ఆలోపు అన్ని డివిజన్ కేం ద్రాల్లో సన్నాహక సభలు నిర్వహిస్తామన్నారు. 

ఖనిజాన్ని తరలిస్తే సమాధానం చెప్పితీరుతాం 
బయ్యారం వంటి ప్రాంతాల నుంచి ఖనిజ సంపదను తరలించుకు పోయేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని, కచ్చితంగా సమాధానం చెప్పితీరుతామని కోదండరాం హెచ్చరించారు. ప్రభుత్వ పెద్దలు అద్దాలమేడలో పైన ఉన్నారని..కిందున్న మనం రాళ్లేస్తే మేడ కుప్పకూలుతుందన్నారు. రోజురోజుకూ కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనపడుతోందని, ఇకపై దేక్కుంటూ మన దగ్గరికి రావాల్సిందేనని వ్యాఖ్యానించారు. యూపీఏ ప్రభు త్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీపై వెనక్కి తగ్గి వారం అంటే వారం కాదు.. నెలంటే 30 రోజులు కాదని వ్యంగ్యవ్యాఖ్యలతో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది తప్ప, ఉద్యమ ప్రభావంపై కాంగ్రెస్‌కు భయం పట్టుకుందన్నారు. తెలంగాణ ప్రజల ఐక్యపోరాటం, ఒత్తిడి ఫలితంగానే 2009 డిసెంబర్ 9న ప్రత్యేక రాష్ట్రంపై ప్రకటన వెలువడిందని గుర్తుచేశారు. సమావేశంలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు ముత్తిడ్డి యాదగిరిడ్డి, చలోఅసెంబ్లీ జిల్లా ఇన్‌చార్జి, జేఏసీ నేత కత్తి వెంకటస్వామి, కోఆర్డినేటర్ పిట్టల రవీందర్, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రవీందర్‌డ్డి, జిల్లా అధ్యక్షుడు రాజేశ్, టీఎమ్మార్పీఎస్ నేత బొట్ల భిక్షపతి, మాజీ ఎమ్మెల్యే రాజాడ్డి, యాకూబ్‌డ్డి, టీవీవీ నేతలు సీతారామారావు, ఎర్రోజు శ్రీనివాస్ జేఏసీల చైర్మన్లు పాల్గొన్నారు.

విజయవంతానికి జేఏసీ భారీ కసరత్తు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకమైన ‘చలో అసెంబ్లీ’ని విజయవంతం చేసేందుకు జేఏసీ ప్రత్యేక కార్యాచరణతో దూసుకెళ్తోంది. తక్కువ సమయం ఉన్నప్పటికీ నిత్యం ప్రజలను ఆలోచింపజేసి, రాజధానికి రప్పించేలా జేఏసీ నేతలు కార్యాచరణ రూపొందించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో 10, 11, 12 తేదీల్లో మినీ చలో అసెంబ్లీలను నిర్వహించాలని నిర్ణయించారు. 12 లేదా 13న హైదరాబాద్‌లో మాక్ అసెంబ్లీ జరపాలని ఆలోచిస్తున్నారు. 11న వరంగల్ అమరవీరుల స్తూపం వద్ద ‘ఓరుగల్లు పోరుయాత్ర’ పేరిట భారీ ర్యాలీ, బహిరంగ సభను చలో అసెంబ్లీకి రిహార్సల్‌గా జరుపాలని జేఏసీ నిర్ణయించింది. చలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో ఒకవేళ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల తేదీలను మార్చినా, ఉద్యమంలో మార్పులు లేకుండా అదే స్ఫూర్తి తో తెలంగాణ ప్యూపిల్స్ అసెంబ్లీ నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. మే 29న చలో అసెంబ్లీ తేదీ ఖరారైనప్పటి నుంచి రాష్ట్ర, జిల్లా జేఏసీ నాయకులు కాలికి బలపం కట్టుకొని ప్రతి పప్లూలో పర్యటిస్తున్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో సన్నాహక సదస్సులు నిర్వహిస్తున్నారు. బైక్‌ర్యాలీ, బస్సుయావూతలతో హోరెత్తించాలని ప్రణాళిక రచించారు. చలో అసెంబ్లీకి ముందుగా మూడు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ అధ్వర్యంలో అన్నీ పార్క్‌ల్లో తెలంగాణ వాక్ నిర్వహించనున్నారు.

Saturday, 1 June 2013

కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదు


అందుకే కదన రంగంలోకి..
-  కేసీఆర్‌తో కలిసి నియోజకవర్గాల్లో పర్యటిస్తా.పజలను ఏకం చేస్తా
-  మాట ఇచ్చి కాంగ్రెస్ వెనక్కిపోయింది..ఇంతకంటే ప్రజాద్రోహం లేదు
-  ఆ పార్టీలో కొనసాగితే ప్రజలను మోసగించినట్టే
-  అందుకే రాజీనామా చేశాం: పీసీసీ మాజీ చీఫ్ కే కేశవరావు 
హైదరాబాద్ (టీ మీడియా): తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం తప్పుచేసిందని, ఇచ్చిన మాటపై వెనక్కిపోయిందని ఆ పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కే కేశవరావు విమర్శించారు. ఇంతకంటే పెద్ద ప్రజాదోహం మరొకటి లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వేదికపై నిలబడి, కాంగ్రెస్ వాదిగా, కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందని చెప్పే అర్హత, హక్కు తనకు పోయిందన్నారు. కాంగ్రెస్‌లో తెలంగాణ పట్ల ద్వేషం రోజురోజుకు పెరుగుతోందని, ఆ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా మారుతోందని, ఇక ఆ పార్టీతో తెలంగాణ రాదనే విషయం తేలిపోయిందని స్పష్టంచేశారు. ఇక కాంగ్రెస్‌లో కొనసాగితే తెలంగాణ ప్రజల్ని మోసం చేసినట్టే అవుతుందని గుర్తించి ఆ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు. కేకే శుక్రవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తాము పార్టీని వీడే నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందు తెలంగాణ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్‌కు కొన్ని సూచనలు చేశామని తెలిపారు. ‘‘గత తొమ్మిదేళ్ళుగా తెలంగాణకు సానుకూలమని చెబుతున్నారు. మేమూ నమ్మాం. సీడబ్ల్యూసీలో ఉన్నప్పుడు నా సేవలు వినియోగించుకున్నారు. 

తెలంగాణపై నిర్ణయానికి సమయం అడిగారు. అయినా ఇప్పటికీ నిర్ణయానికి రాకపోతే ఎలా?’’ అని కాంగ్రెస్‌ను నిలదీశారు. ప్రస్తుత సెషన్స్(బడ్జెట్ సమావేశాలు) ముగిసేలోగా తెలంగాణపై తేల్చకపోతే తాము ఏదో ఒక స్టాండ్ తీసుకుంటామని అప్పుడే తాను స్పష్టం చేశానని తెలిపారు. బడ్జెట్ సమావేశాలకు మధ్యలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తమ వద్దకు వచ్చి పార్టీలో చేరాలని కోరగా, ప్రస్తుతానికి అది కుదరదని చెప్పామని వివరించారు. అధిష్ఠానానికి మే 30వ తేదీని డెడ్‌లైన్ విధించామని తెలిపారు. ‘‘వెయ్యిమంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పాను. ఇప్పటికీ కూడా నిర్ణయం తీసుకోకపోవడం ప్రజలను మోసగించడం కాదా? మూడు కోట్లమంది చనిపోయిన తరువాత తెలంగాణ ప్రకటిస్తారా? అంటూ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. ‘‘50 ఏళ్ళ తరువాత తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మాలో ఆశలు రేపింది. సోనియాగాంధీ నాయకత్వంలో సీడబ్ల్యూసీలో, ఎన్నికల ప్రణాళికలో ఈ అంశం చేర్చి తెలంగాణకు సానుకూలమనే సంకేతాలిచ్చాం. వైఎస్ వ్యతిరేకించినా నేను సీడబ్ల్యూసీ భేటీలో రెండుగంటలకుపైగా తెలంగాణపై మాట్లాడాను. సోనియా కూడా అందుకు అంగీకరిస్తూ మేనిఫెస్టోలో ఈ అంశం పెట్టారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడానికి అంగీకరించారు’’ అని ఆయన వివరించారు. 

ఆంధ్రా నాయకుల ఒత్తిడి వల్లే తెలంగాణపై వెనక్కి వెళ్లారన్నారు. టీఆర్‌ఎస్‌తో తెలంగాణ కోసం ప్రజల్లో కదలిక వస్తున్నదని, ఈ మూవ్‌మెంట్‌కు రాజకీయ రూపం ఇస్తేనే మనం తెలంగాణ సాధించగలమని కేకే అభివూపాయపడ్డారు. జూన్ 2న టీఆర్‌ఎస్‌లో చేరిన తరువాత ఆ పార్టీ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నేతలతో కలిసి అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. తన పూర్తి సమయాన్ని తెలంగాణ కోసం జనాన్ని సమీకరించడంలో కేటాయిస్తానని చెప్పారు. తాను ఎన్నికల్లో పోటీ చేసేది లేదని పలుమార్లు స్పష్టం చేసినా సీమాంధ్ర మీడియా పదేపదే తాను సీట్ల కోసం, తన కుమారుడి టికెట్ కోసం టీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నట్లు ప్రచారం చేస్తున్నాదంటూ మండిపడ్డారు. 

తాను చచ్చిపోయిన తరువాత అది జరుగుతుందేమో తప్ప, తాను బతికి ఉన్నంతవరకు తన కుటుంబసభ్యుపూవరూ ఎన్నికల్లో నిలబడరని కేశవరావు స్పష్టం చేశారు. సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స రాజకీయంగా ఫెయిల్ అయ్యారని విమర్శించారు. తెలంగాణ అంటే సీఎంకి అంత వ్యతిరేకత ఎందుకు? అని ప్రశ్నించారు. సీఎం చేసిన వ్యాఖ్యలు యాంటీ లీడర్‌షిప్‌ను నిరూపిస్తున్నాయన్నారు. ముగ్గురు దళిత ఎంపీలు తెలంగాణ కోసం పార్టీని వీడుతుంటే పట్టించుకోవడం లేదని నిలదీశారు. కాంగ్రెస్‌తో తనకు 50 ఏళ్ళ అనుబంధం ఉందని, ఇప్పుడు ఆ పార్టీని వదలాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉందని కేకే ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం తాను కేంద్ర మంత్రి జైపాల్‌డ్డితో కలిసి తమ నిర్ణయం చెప్పానని, అయితే జైపాల్‌డ్డి మాత్రం తాను కాంగ్రెస్‌లోనే ఉంటూ తెలంగాణ కోసం పోరాడుతానని తెలిపారని కేకే చెప్పారు.