Sunday, 22 April 2012

కవ్వాల్ అడవుల్లో హెచ్చరిక బోర్డులు..!


కవ్వాల్ అడవుల్లో పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటూ, ప్రభావం మొదలైంది. కవ్వాల్ అడవుల గుండా ఉన్న రహదారి మీదుగా భారీ వాహనాలు రా వొద్దంటూ రోడ్లపై అధికారులు హెచ్చరిక బోర్డుల ను ఏర్పాటు చేశారు. కోర్ ఏరియాను ఆనుకొని ఉండే పది కిలో మీటర్ల బఫర్ ఏరియాలో రహదారిపై ప్రతి కిలో మీటరుకు ఒక బోర్డును ఏర్పా టు చేశారు. బోర్డులపై ఒక వైపు పులి బొమ్మ, మరో వైపు భారీ వాహనాలు కవ్వాల్ అడవుల్లోకి రా కూడదని, రాత్రి 9 గం. తరువాత ఎటువంటి వా హనాలు రాకూడదని హెచ్చరికలు చేశారు.
                          పులుల సంరక్షణ కేంద్రం పూర్తి స్థాయిలో ఏ ర్పాటు కాకుండానే బఫర్ ఏరియాలో ఇటువంటి నిబంధనలు పెడుతున్న అధికారులు.. ఇక కోర్ ఏరియాలో నివసిస్తున్న ఆదివాసులపై ఎటువంటి నిర్భందాన్ని ప్రయోగిస్తారో అనే అనుమానాలు కలుగుతున్నాయి. గ్రామాల నుంచి బలవంతంగా ఖాళీ చేయించం, ఎవరిపై ఆంక్షలు విధించబోమ ని చెబుతున్న అధికారులు గుట్టు చప్పుడు కాకుం డా నిశ్శబ్ద హెచ్చరికలు చేస్తున్నారు. కోర్ ఏరియా ను ఆనుకొని ఉండే బఫర్ ఏరియా ఉట్నూర్ మం డలంలోని శ్యాంపూర్ గ్రామం వరకు వస్తుంది. ఈప్రాంతం వరకు హెచ్చరికల బోర్డులను ఏర్పా టు చేశారు. పొమ్మన లేక పొగబెట్టిన చందానా అధికారులు హెచ్చరిస్తున్నా రు. రాబోవు రోజుల్లో పాదచారులు కూడా అడవుల్లోకి వెళ్లకుండా నిర్భందాన్ని విధించే అవకాశాలు లేక పోలేదు. 

టైగర్ జోన్‌పై సమరానికి సమయాత్తం 
   ఆదివాసీల మనుగడకు ముప్పు తెచ్చే పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుపై ఆదివాసీలు యుద్దానికి సిద్ధమవుతున్నారు. ఆదివాసీ, ప్రజా సంఘా లు ఒక్కొక్కటిగా ఉద్యమంలోకి వస్తున్నాయి. ఆదివాసీల అస్థిత్వం కోసం జిల్లాలో మరో ఇంద్ర పోరాటం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నాలు గు గ్రామాలతో ప్రారంభించి, విడతల వారిగా 40 గ్రామాలను ఖాళీ చేయించాలనే అధికారుల విధానాలను ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
            సీపీఐఎంఎల్ న్యూడెమోక్షికసీ అనుబంధ సంస్థ అఖిల భారత రైతు కూలీ సంఘం, ఆదివాసీ సం క్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఇప్పటికే కవ్వాల్ అడవుల్లోని ఆదివాసీ గ్రామాలు సమరానికి సిద్ధమవుతుంటే, గిరిజన సంఘం ఆధ్వర్యంలో గ్రామాల్లో ఉద్యమకమిటీలను వేస్తున్నారు. ఈ నెల 24న జ న్నారం డివిజినల్ అటవీ కార్యాలయం (డీఎఫ్‌ఓ) ఎదుట ధర్నానిర్వహించనున్నట్లు ఆ సంఘం జి ల్లా ప్రధాన కార్యదర్శి తొడసం ప్రభాకర్ తెలిపా రు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గ్రా మాల్లో సభలు నిర్వహిస్తూ టైగర్ జోన్‌నిలిపి వేయాలంటూ గ్రామాల్లో తీర్మానించారు. మండలంలోని పాతహీరాపూర్ గ్రామంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సున్నం ఉపాధ్యక్షులు కాకి మధు, జిల్లా అద్యక్షుడు కనక యాదవ్‌రావు ఆధ్వర్యంలో గ్రా మ సభ నిర్వహించి టైగర్ జోన్‌కు వ్యతిరేకంగా తీర్మానించారు. గ్రామాల్లో ఆదివాసీ జెండాను ఎ గురవేస్తూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కోర్ ఏరియాలో వస్తున్న 40 గ్రామాల్లో తీర్మాణాలు చేపట్టి వీటి ద్వారా హైకోర్టుకు వెళ్లనున్నట్లు ఆ సంఘం నాయకులు పేర్కొన్నారు.

ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు 
టైగర్ జోన్ ఏ ర్పాటుకు ప్రభుత్వం జారిచేసిన జీవో 27 జీవో 27 రద్దు చేయాలని కోరుతూ జా తీయ ఎస్టీ కమిషన్‌ను ఆదివాసీ అడ్వకేట్ ఫోరం ఆశ్రయించింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెందూర్ ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి ఆరెం పా పారావు ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యురాలు కమలకుమారిని కలిశారు. టైగర్ జోన్‌ను వెంటనే నిలుపు దల చేయాలని కోరారు. వీరి వెంట సెం ట్రల్ సోషల్ డెవలప్‌మెంట్ సొసైటీ డైరెక్టర్ కల్పన కన్నాభిరాం, సిడాం మురళీ తదితరులు ఉన్నారు. 

27న రౌండ్‌టేబుల్ సమావేశం 
జన్నారం : టైగర్ జోన్ ఏ ర్పా టుకు ప్రభుత్వం జారిచేసిన జీవో 27పైన చ ర్చించేందుకు మండల కేంద్రంలోని సాయిబా బా ఆలయం సమీపంలో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఎంసీపీఐయూ జిల్లా నాయకులు గవ్వల శ్రీకాంత్ తెలిపారు. ఈ సమా వేశానికి ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయ కులు, విద్యావంతులు, గిరిజన సంఘాల నేతలు, మేధావులు, తదితరులు పాల్గొని విజయవంతం చేయాలని గవ్వల శ్రీకాంత్ కోరారు.

ఇంద్రవెల్లి విప్లవాల పాలవెల్లి ...ఇంద్ర మారణకాండ జరిగి ఈ ఏప్రిల్ 20కి 31 సంవత్సరాలు. అంటే, అప్పటికీ ఇప్పటికీ ఓ తరం మారింది.
ఈ మూడు దశాబ్దాల్లో ఇంద్ర పారిన రక్తం గోదావరి, ప్రాణహిత, శబరి, ఇంద్ర నదులు దాటి అదిలాబాద్ అడవుల నుంచి దండకారణ్యమంతా విస్తరించింది. అప్పటి విప్లవ జ్వాలలు ఇప్పుడు జంగల్ మహల్ దాకా వ్యాపించాయి. అప్పుడు పోలీస్ కాల్పులుగా ఆదివాసీల మీద ప్రారంభమైన ఈ మారణకాండ ఇప్పుడు ‘గ్రీన్‌హంట్ ఆపరేషన్’గా మారింది. రెండవ దశలో సైనిక మోహరింపు ‘మాడ్’ను మూడు వైపులనుంచీ చుట్టు ముట్టింది. సైనిక, అర్థ సైనిక, ఆక్రమణ యుద్ధ వ్యూహంగా వర్తమాన భారతదేశాన్ని ఇప్పుడు చూస్తున్నాం. ‘రైతుకూలీ సంఘం’ ఆదివాసీల కొన్ని డిమాండ్‌ల మేరకు తలపెట్టిన నాటి సభ నుంచి ఇవ్వాళ దండకారణ్యంలో ‘క్రాంతికారి జనతన సర్కార్’ స్థాయికి ఒక ప్రత్యామ్నాయ ప్రజాపాలన స్థితి ఎదిగింది. అదిప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అంతర్గత పెను ప్రమాదంగా కొనసాగుతూనే ఉంది. సాల్వాజుడుంలు-అటువంటి మరెన్నో చట్టవ్యతిరేక అంతర్యుద్ధ కుట్రలు, గ్రీన్‌హంట్ ఆపరేషన్‌ల వరకూ -చేసిన యుద్ధ ప్రయత్నాలన్నీ ఓడిపోయాయే తప్ప విప్లవ సంకల్పాన్ని, ప్రజల పురోగమనాన్ని నిరోధించలేక పోయాయి. మరి ఇంత దావానలానికి ఇంగలమైన ఆ ఇంద్ర ఎక్కడ ఉన్నది? అక్కడ ఏప్రిల్ 20న ఏం జరిగింది? ఇంద్ర అదిలాబాద్ జిల్లా హైదరాబాద్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ పోయే రోడ్డుపై గుడి హత్నూర్ నుంచి ఉట్నూర్, లక్సెట్టిపేట రోడ్డుపై ఉంటుంది. మరొక వైపు నుంచి వస్తే హనుమకొండ నుంచి లక్సెట్టిపేట మీదుగా గుడి హత్నూర్ పోయే రోడ్డుపై కూడా తగులుతుంది. 

1981 ఏప్రిల్ 20న ఇక్కడ అదిలాబాద్ గిరిజన రైతుకూలీ సంఘం ఒక సభ జరుప తలపెట్టింది. ఆ సభ, తదనంతర పరిణామాలను మరోసారి గుర్తు చేయడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం. 

ఒక్క ఇంద్ర మాత్రమే కాదు, ఆదిలాబాద్ ప్రధానంగా గోండు, కోలాం, పరధాన్లు, పరమేశులు మెదలైన ఆదివాసీ ప్రజలు అత్యధిక సంఖ్యలో ఉన్న జిల్లా అది. ఆదిలాబాద్ అటవీ ప్రాంతమంతా ఆదివాసులే. ఇంద్ర ఒకప్పుడు 97% ఆదివాసీలు ఉండేవారు. ఈ జిల్లా మహారాష్ట్ర ప్రాంతానికి కూడా దగ్గర్లో ఉండటం వల్ల ఆ రాష్ట్రం వైపు నుంచి కూడా బంజారాలు, ఇంకా వివిధ ప్రాంతాల నుంచి మార్వాడీలు, నీటి పట్టు ఉన్న చోట్లకు కోస్తా జిల్లాల నుంచి వచ్చిన వారు వచ్చి ఇక్కడి భూములను ఆక్రమించుకున్నారు. వడ్డీ వ్యాపారం చేశారు. అడవిని, కొండలను పోడు చేసుకొనే ఆదివాసీలు క్రమంగా లోతట్టు ప్రాంతాలకు నెట్టబడ్డారు. నిజానికి ఇక్కడివి సారవంతమైన నల్లరేగడి భూములు. ఇక్కడి గోండులు మెట్ట పంటలే కాకుండా పత్తి, జొన్న వంటి వ్యాపార పంటలను కూడా పండిస్తారు. అటవీ సంపద సరేసరి. కానీ, ఇంద్ర ఓ వ్యాపార కేంద్రంగా మారి వస్తు వినిమయంతో తప్పుడు తూకాలతో ఈ ఆదివాసీలను మోసం చేస్తూ వస్తున్నది. 
ఈ ప్రాంతంలో రాంజీ గోండు, కొమురం భీంది.

బ్రిటీష్ సామ్రాజ్యవాదులతో, నిజాం ఫ్యూడల్ నిరంకుశ పాలనతో పోరాడిన వారసత్వం. ‘మా గ్రామాల్లో మా రాజ్యం’ అని ప్రకటించి పన్నెండు గ్రామాల్లో కొమురం భీం ప్రజా అధికారాన్ని స్థాపించి జోడేఘాట్ కేంద్రంగా నిజాంతో పోరాడిందీ. ఒకవైపు ఈ పోరాట వారసత్వం నుండి మరొక వైపు 1967లో నక్సల్బరీ శ్రీకాకుళ రైతాంగ పోరాటం మార్గదర్శకత్వమైంది. సన్నిహితంగా 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుంచి 1978 ‘జగిత్యాల జైత్రయాత్ర’ నిర్వహించిన విప్లవకారుల నాయకత్వం లభించింది. వాళ్ళే ఎమ్జన్సీ కాలంలోనే ఈ అడవుల్లోకి పొరకల సార్లుగా ప్రవేశించారు. జగిత్యాల జైత్రయాత్ర తర్వాత 1980లో పీపుల్స్‌వార్ ఏర్పడగా ఒక వైపు పెద్ది శంకర్, మరొక వైపు మరొక దళం మహారాష్ట్ర, బస్తర్ అడవుల్లో ఆదివాసీల మధ్య పని చేయడానికి కదిలి వెళ్ళాయి. బెల్లంపల్లి బొగ్గుగని కార్మికుని బిడ్డ అయిన పెద్ది శంకర్ ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యాడు.

ఆదిలాబాద్ జిల్లాలో అప్పుడు రఘుగా ప్రసిద్ధమైన నల్లా ఆదిడ్డి నాయకత్వంలో గజ్జెల గంగారాం, సాహులు సహచరులుగా విప్లవోద్యమం విస్తరించిందీ. రఘు, సాహు, గంగారాంలు ఆదివాసీ భాష నేర్చుకొని ‘జననాట్య మండలి’ పాటలను ఆదివాసీ భాషలోకి అనువదించి, వారి మధ్య పనిచేస్తూ ‘గిరిజన రైతుకూలీ సంఘం’ స్థాపించారు. ఆ గిరిజన రైతుకూలీ సంఘానికి కార్యదర్శిగా ఉన్న హనుమంతరావు నాయకత్వంలో తలపెట్టిందీ 1981 ఏప్రిల్ 20 నాటి గిరిజన రైతుకూలీ సభ. ఆ సభ ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్లు ఇవి: v తాము పోడు చేసుకున్న భూములపై పట్టా ఇవ్వాలి. v తాము మార్కెట్‌కు తెస్తున్న పత్తి, పొగాకు వంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. v ఇంద్ర రోడ్డు పొడవునా... సంతలో తాము అమ్ముకుంటున్న అటవీ వస్తువులను సేట్‌లు తప్పుడు తూనికలతో కొలిచి తక్కువ రేట్లతో కొని మోసపుచ్చుతున్నారు. ఈ మోసాన్ని అరికట్టి సరైన పద్ధతిని నియంత్రిoచాలి. 

-ఇటువంటి న్యాయపరమైన ఆర్థిక డిమాండ్‌లతో ఈ సభ తలపెట్టి అడవంతా తుడుం మోతతో ప్రచారం చేశారు. జిల్లా అంతటా విస్తృతంగా పోస్టర్లు వేశారు. అప్పుడు సి.పి.డి.ఆర్. (కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమొక్షికటిక్ రైట్స్) ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ సంఘంలో ప్రముఖుడైన కోబాడ్ గాంధీ, రాడికల్ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడైన లింగమూర్తి, ఎ.పి.సి.ఎల్.సి. రంగనాథం, ‘జననాట్య మండలి’ గద్దర్ ఆ సభకు ప్రధాన ఆహ్వానితులు. సభకు మొదట అనుమతించిన జిల్లా పోలీస్ యంత్రాంగం హైదరాబాద్ నుండి అందిన ఆదేశాలతో అనుమతి రద్దుచేసి ఏప్రిల్ 20న సభ జరిగే రోజు 144వ సెక్షన్ విధించింది. అప్పటికే కొండల మీద నుంచి, లోయల నుంచి, నలువైపుల నుంచి ఆదివాసీలు సభకు తరలి వస్తున్నారు. వాళ్ళకు 144వ సెక్షన్ అంటే ఏంటో తెలియదు.

ముందుగా ఎటువంటి ప్రకటనా లేదు. సభకు నలువైపులా తరలి వచ్చే ఆదివాసీలపై ఇంద్ర అంతా మోహరించిన పోలీసులు చెట్లపై నుంచి కాల్పులు జరిపారు. ఎంతమంది నేల కూలారో, ఎంతమంది గాయపడ్డారో ఇప్పటికీ లెక్కలు లేవు. రాష్ట్రస్థాయిలో, దేశ స్థాయిలో వెళ్ళిన ఎన్నో నిజ నిర్ధారణ కమిటీలు సేకరించిన సమాచారం ప్రకారం కనీసం 60 మందైనా చనిపోయి ఉంటారు. వందలాది మంది గాయపడ్డారు. మరణించిన, గాయపడిన తమ వారిని ఆదివాసీలు లోతట్టు ప్రాంతాలకు తీసుకు వెళ్ళినందున ఆసుపవూతుల్లో ఈ లెక్కలు తెలిసే అవకాశం లేదు. సంఘటన జరుగగానే హైదరాబాద్ నుంచి అప్పటి ఎ.పి.సి.ఎల్.సి. నాయకులు కన్నాభిరాన్, సి.ఆర్ రాజగోపాలన్, బిపదీప్ నాయకత్వంలో ఒక నిజ నిర్ధారణ సంఘం అక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత వరంగల్‌లో రాడికల్ యువజన సంఘం మహాసభల ప్రారంభోపన్యాసానికి వచ్చిన ఢిల్లీ పి.యు.డి.ఆర్. (పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్షికటిక్ రైట్స్) ప్రముఖులు ప్రొ॥ మనోరంజన్ మహంతి నాయకత్వంలో ఒక అఖిల భారత స్థాయి నిజ నిర్ధారణ కమిటీ వెళ్ళింది. ఇందులో ఎ.పి.సి.ఎల్.సి. నుంచి డా॥ ‘విరసం’ నుంచి కె.వి.ఆర్. కూడా ఉన్నారు. వీళ్ళు సమక్షిగమైన నివేదిక తీసుకొచ్చారు. అప్పటి ఎస్పీ ఇంతటి నిర్విచక్షణగా కాల్పులు ఎందుకు జరిపారని అడిగితే ‘బుప్లూట్లకు నియమాలు తెలియవు’ (Bullets know no rules) అన్నారు. ఈ ప్రత్యక్ష నిర్ధారణల ఆధారంగా ఆ తర్వాత కె.వి.ఆర్. ఫ్రాంటియకల్ రాశారు. 

కాగా, ఈ సంఘటన అనంతరం వి.వి.( ఈ వ్యాస రచయిత) కన్వీనర్‌గా ఇంద్ర అమరుల బాధితుల కుటుంబ సహాయ నిధి ఏర్పడింది. ఒక ఏడాది తర్వాత వి.వి. తో పాటు బాలగోపాల్, కె.సీతారామారావు జోడేఘాట్, పిప్పల్‌ధర్, పిట్ట బొంగరం, పాండుపురం మొదలైన ఆదివాసీ గ్రామాలకు వెళ్ళి మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి వచ్చారు. కానీ, వెళ్ళిన వారివద్ద ఉన్న వివరాలు స్వల్పమే. కేవలం 13 మంది మృతుల పేర్లు, ఊర్లు తప్ప ఏమీ లేవు. దాంతో పెద్దగా చేయడానికేమీ లేకుండా పోయింది. 

కానీ, నాటికి నేటికీ ఇంద్ర సంఘటనను ‘జలియన్ వాలా బాగ్’ సంఘటనతో పోల్చడం, అది ప్రపంచ దృష్టికి రావడం ఒక అంశమైతే, నైతిక శక్తి దిగజారకుండా ఓటమిని విజయంగా మలచుకొని కొనసాగే ఒక గొప్ప సంకల్పాన్ని ఇంద్ర సంఘటన విప్లవకారులకు, ఆదివాసీలకు ఇచ్చింది. 

1981-85 వరకు ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఇంద్ర ‘ఇంద్రవెల్లి అమరుల సంస్మరణ సభ’ జరిగింది. ఆంధ్రవూపదేశ్ రైతుకూలీ సంఘం అధ్యక్షుడు గంజి రామారావు ఏడాది పాటు ఇంద్ర ఒక టిన్ షెడ్ వేసుకొని ఉండి పోయి, ఆదివాసీల రక్తం చిందిన చోట భూమిని కొని అమరవీరుల స్థూప నిర్మాణం చేయించాడు. అది దేశంలోనే అమరుల స్థూపాలకు తలమానికంగా ఉండాలని చైనాకు వెళ్ళి అక్కడి ‘చైనా విప్లవం’లో అమరులైన వాళ్ళకోసం ‘తియానాన్మెన్ స్కేర్’లో నిర్మితమైన స్థూపాన్ని చూసి, దాని గురించి అధ్యయనం చేసి 3 అడుగుల ఎత్తున ఇంద్ర స్థూప నిర్మాణం చేయించాడు. 1983 ఏప్రిల్ 20న దాని ఆవిష్కరణ చేయించాడు. ఆ సభలోనే సాహు, అల్లం రాజయ్యల ‘కొమురం భీం’ నవలను బాలగోపాల్ ఆవిష్కరించారు. 

1985లో మనోరంజన్ మహంతి, మురళీ మనోహర్, ఏక్‌నాథ్ సాల్వే, గద్దర్‌లు ఈ సంస్మరణ సభలకు వెళ్ళినప్పుడు పోలీసులు తుపాకులు గురి పెట్టి అరెస్టు చేశారు. 1984లో ఇంద్ర సంస్మరణ సభకు జార్జి ఫెర్నాండెజ్ వచ్చినప్పుడు వందలాది మంది పోలీసులు మోహరించారు. తిరుగు ప్రయాణంలో నిర్మల్ ఘాట్‌రోడ్డు వద్ద ఆయనా, బాలగోపాల్, వి.వి., పంకజ్ దత్‌లు ప్రయాణం చేస్తున్న కారుపై పోలీసులు రాళ్ళు దొర్లించి హత్యా ప్రయత్నం చేశారు.

1985 తర్వాత ఈనాటికి ప్రతి సంవత్సరం ఇంద్ర ఆదివాసులు అమరులైన చోట ఈ ఏప్రిల్ 20న ఆదివాసీలు, ప్రజాసంఘాలు ఎంత నిర్బంధంలోనైనా సంస్మరణ సభలు నిర్వహించుకుంటూనే ఉన్నాయి. పోలీసులు ప్రతి సంవత్సరం 144వ సెక్షన్ విధిస్తూనే ఉన్నారు. గుడి హత్నూర్ నుంచి లక్సెట్టిపేట ఇరువైపుల రోడ్లను బంధిస్తూనే ఉన్నారు.

ఈ ఇంద్ర సభ అప్పటి పరిశోధక విద్యార్థిగా ఉన్న బి.జనార్దన్‌రావును ఆ తర్వాత దేశంలోనే ఒక ప్రముఖ ఆదివాసీ జీవిత పోరాట అధ్యయన శీలిగా మార్చింది. ఈ సభలకు వక్తగా వెళుతున్న కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థి ఆర్.ఎస్.యు. ఉపాధ్యక్షుడు లింగమూర్తితో పాటు జనార్ధన్, సీతారామరావు, ఎన్.వేణుగోపాల్‌లు కూడా ఇంద్ర వెళ్ళారు. ఇంద్ర వీళ్ళు బస్సు దిగగానే పోలీసులు అరెస్టు చేసి బంధించి, ప్రశ్నించి ఈ నలుగురిలోను కొంచెం దృఢకాయునిగా ఉన్న జనార్ధన్‌ను జేబులో చేయి పెట్టుకొని సమాధానాలు ఇస్తున్నాడని తీవ్రంగా కొట్టారు. బక్క పలుచని లింగమూర్తి ఆర్.ఎస్.యు. ఉపాధ్యక్షుడంటే నమ్మలేదు. ఆ తర్వాత అతడు పీపుల్స్‌వార్ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఉన్నప్పుడు, నల్లమలలో కృష్ణా నదిలో (2002లో) పుట్టి మునిగి అమరుడయ్యాడు. ఆయనది కరీంనగర్ జిల్లా అంబాల.
1987లో అదిలాబాద్ జిల్లా ఆలంపల్లిలో సిఆర్‌పిఎఫ్ క్యాంపుపై పీపుల్స్‌వార్ దళం దాడి చేసింది. అందులో 11 మంది సీఆర్‌పిఎఫ్ జవాన్లు చనిపోయారు. రామకృష్ణ అనే దళ సభ్యుడు అమరుడయ్యాడు. 
ప్రతీకారంగా మఫ్టీలో వచ్చిన పోలీసులు ఇంద్ర స్థూపాన్ని డైనమైట్ పెట్టి పేల్చివేశారు. ఎన్.టి.రామారావు ఈ ‘అదిలాబాద్ జిల్లా ఎక్కడ ఉంది? పీపుల్స్ వార్‌లోని వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళతో ఎక్కడ చర్చించాలి?’ అని దూర్త అమాయకత్వాన్ని నటించి అదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పర్చడానికి కోటి రూపాయలు ప్రకటించాడు. ఆదివాసీల ఆగ్రహానికి, గాయానికి మలాం పూయడానికన్నట్లుగా మళ్ళీ స్థూపం నిర్మాణం చేయించారు. ఇప్పుడు మనం చూస్తున్న స్థూపం అదే. అయితే, అది ఇప్పుడు తెలుపు రంగులో ఉంటుంది. గత మహోన్నత శిఖరాయమాన అరుణారుణ స్థూపం కాదది. ‘కొండల్లు ఎరుపు గోగుపూలు ఎరుపు / అడవిలో అమరుల త్యాగాలు ఎరుపు’ అని రాసుకున్న ఆ స్థూపంపై చరణాలు మాత్రం ఆనాటికీ ఈనాటికీ ఆదివాసీల విప్లవకారుల ఆకాంక్షలను ఆ అడవిలో ప్రతిధ్వనింపజేస్తూనే ఉంటాయి.

ఇంద్ర మారణకాండ తర్వాత నుంచి ఇప్పటికీ వస్తున్న సాహిత్యంతో పోల్చదగినంత సాహిత్యం మరే సంఘటనపైనా వచ్చి ఉండదు. అందులో ప్రధానంగా పేర్కొనదగింది సాహు, అల్లం రాజయ్యల రచనలు. సాహు 1980ల వరకే అదిలాబాద్ ఆదివాసీల మధ్య పనిచేస్తూ గోండు భాష నేర్చుకొని ఆ భాషలో పాటలు రాశాడు. ఒగ్గు కథలు రాశాడు. ఆదివాసీల జీవిత పోరాటంపై ‘పటార్’వంటి ఎన్నో కథలు రాశాడు. ఇవన్నీ ‘సృజన’, ‘అరుణతార’ల్లో అచ్చయ్యాయి. అదిలాబాద్ ఆదివాసీల జీవితాన్ని, సంస్కృతినీ 0లలో ఆయన ఎంతో సమక్షిగంగా అధ్యయనం చేశారు. ఆ అధ్యయన క్రమంలో గజ్జెల గంగారాం అమరుడయ్యాడు. అధ్యయనం, కార్యాచరణ కారణంగా వాళ్లిద్దరినీ నల్లా ఆదిడ్డి ఎంతో ప్రోత్సహించాడు. ఒక విధంగా ఇంద్ర సంఘటన కొమురం భీంకు మళ్ళీ ప్రాణం పోసింది. 

కొమురం భీం జీవితం, పోరాటం గురించి ఆయన సమకాలీన పోరాట యోధుల నుంచి సేకరించి, ఎన్నో చరిత్ర గ్రంథాలు, దస్తావేజులు చదివి, పురాతత్వ పరిశోధనలు చదివిన ఆయన అల్లం రాజయ్యతో కలిసి ఒక క్లాసిక్ అనదగిన ‘కొమురం భీం’ నవల రాశాడు. ఆ విధంగా చూసినప్పుడు ఇది తెన్నేటి సూరి రాసిన ‘చంఘీజ్‌ఖాన్’ నవల కన్నా గొప్ప నవల. ఇవ్వాళ తెలంగాణలో మరెవరికీ లేనంతగా కొమురం భీంకు ఇంత గుర్తింపు, ఇంత ఆదరణ లభించడానికి ముఖ్య ప్రేరణల్లో విప్లవోద్యమం- ప్రత్యేక తెలంగాణ ఉద్యమం- ఆదివాసీ పోరాటాలతో పాటు ఈ ‘కొమురం భీం నవల’కు సముచిత స్థానం ఉంటుంది.
ఇంద్ర సంఘటనపై ‘అడవి ఉప్పొంగిన రాత్రి’ అనే దీర్ఘ కవిత ద్వారానే తెలుగు సాహిత్యంలో విమల ఒక ప్రముఖ కవిగా గుర్తింపు పొందింది. 90లో ఆ పేరుతోనే ఆమె మొదటి కవితా సంకలనం వెలువరించింది. ఒక కవి రమేష్‌కి ఇంద్ర ఇంటి పేరైంది. శివసాగర్ సహచరి పార్వతి తనను ఇంద్ర ఖననం చేయాలని కోరింది. ఇంద్ర సంఘటన తర్వాత విస్తృతంగా ఆ ప్రాంతంలో తిరిగిన గద్దర్ ‘రగల్ జెండా బ్యాలె’ రచించాడు. జననాట్యమండలి ఇప్పటికీ ఎన్ని వందల సార్లు దీనిని ప్రదర్శించిందో లెక్కే లేదు. ఇంద్ర సంఘటన జరుగగానే ‘సృజన’ సమక్షిగమైన అధ్యయనంతో ప్రత్యేక సంచిక వెలువరించింది. చికాగో నగరంలో పోలీసుల కాల్పుల్లో మరణించిన కార్మికుల రక్తంతో తడిసిన చొక్కా ఎర్రజెండా అయినట్లుగా ఇంద్ర సంఘటన నిజ నిరూపణకు వెళ్ళిన కె.వి.ఆర్. కనుగొన్న ఆదివాసీ అమరుని వస్త్రమే ‘రగల్ జెండా’గా సృజన ముఖచివూతమైంది. 

మళ్ళీ ఇంద్ర అమరుల సంస్మరణ సందర్భంగా కూడా సృజన ప్రత్యేక సంచిక తెచ్చింది. కొమురం భీం భార్య సోను భాయి జీవితాన్ని ఆధారంగా పులుగు శ్రీనివాస్ ఓ నవల రాశాడు. భూపాల్ ప్రధాన పాత్రలో కొమురం భీంగా అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో ‘కొమురం భీం’ సినిమా వచ్చింది. 92లో నిర్మితమైన ఈ సినిమా విప్లవోద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో, కొమురం భీం ప్రశస్తి విస్తృతంగా ప్రజల హృదయాల్లో గూడుగట్టుకున్న సందర్భంలో విడుదలయింది.

మొదట చెప్పినట్లుగా ఈ ముప్పై ఏండ్లలో ఆదిలాబాద్‌లోను, తెలంగాణలోనూ దేశవ్యాప్తంగానూ నదులు, అడవులు, లోయలు, కొండకోనలు, పల్లెలు, నగరాలలో రాజ్యం వనరుల దోపిడీ కోసం చాలా రక్తాన్ని ప్రవహింపజేసింది. ఒకప్పుడు రాజ్యాంగంలోని 5, 6 అధికరణలు గానీ, 1/70 చట్టాన్ని గానీ ఆదివాసేతరుల ప్రయోజనాల కోసం విచ్చలవిడిగా ఉల్లంఘించిన ప్రభుత్వాలు రెండు దశాబ్దాలుగా ఒక పద్ధతి ప్రకారమే బహుళజాతి కంపెనీల కోసం బడా కంపెనీల కోసం ఒక దళారిగా మారి చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి. ఒకవైపు ‘పేసా’ వంటి చట్టాలు తెస్తున్నాయి. మరొక వైపు ‘ఆక్షికమించు, ఖాళీ చేయి, అభివృద్ధి పరుచు’ అనే విధ్వంస నమూనాను అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం ప్రయోగిస్తున్నది. 

అదిలాబాద్ జిల్లానే తీసుకుంటే వేలాది మంది ఆదివాసీలను నిర్వాసితులను చేసే విధ్వంసక కార్యక్షికమాలు అక్కడ జరుగుతున్నాయి. అక్షరాల ఇప్పుడక్కడ ఆకురాలు కాలాన్ని చూస్తున్నాం. కుంతాల జలపాతాన్ని పవర్ ప్లాంట్‌గా మార్చడానికి, కవ్వాల్ అడవులను పులుల అభయారణ్యంగా మార్చడానికి ప్రభుత్వం పథకాలు వేసింది. జోడేఘాట్ దగ్గర నిర్మితమైన ‘జోడేఘాట్ ప్రాజెక్ట్’ ఏ ఒక్క ఆదివాసీ దాహార్తినీ తీర్చిందీ లేదు. ఒక్క ఆదివాసీ భూమిని తడిపిందీ లేదు. పైగా ఉట్నూర్ ప్రాంతమంతా గోండు, కోలాం మెదలగు ఆదివాసీలకు, లంబాడీలకు మధ్య విద్య, ఉద్యోగ, ఉపాధి విషయాల్లో ఘర్షణ సృష్టిస్తూ ప్రభుత్వం దాన్ని ఆదివాసీల మధ్య సమస్యగా చిత్రించే ప్రయత్నం చేస్తోంది. న్యాయమైన వర్గీకరణ అమలు చేయకుండా ఘర్షణలు రెచ్చగొడుతున్నది. 

Thursday, 12 April 2012

పాలమూరు వెనుకబాటు పాలకుల కుట్రే!.

* కృష్ణా నదిలోని 10 శాతం నీటిని ఇచ్చినా పాలమూరు సస్యశ్యామలం   అవుతుంది. జూరాల నీటి నిలువ సామర్థ్యం పెంచే అవకాశం ఉందా?
* జలవనరులను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకుని సీడబ్ల్యూసి ద్వారా ప్రాజెక్టులు, డ్యాంలు, రిజర్వాయర్లు, నదుల అనుసంధానం చేపడితే రాష్ట్రాల మధ్య నీటి సమస్యలు ఏర్పడవు కదా?
                                            -టీ. నారాయణడ్డి, వనపర్తి, పాలమూరు జిల్లా
* అంతర్జాతీయ న్యాయసూవూతాలు, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం పాలమూరు జిల్లాకు దక్కాల్సిన నీరు ఎన్ని టీఎంసీలు? ఆ నీరు ఎక్కడికి పోతున్నది? 
                                  -ఇ. మొగిలన్న, కొన్గూరు, కొత్తకోట, మహబూబ్‌నగర్

ఎ) తుంగభద్ర, భీమా, కృష్ణానదులు ప్రవహిస్తున్నా పాలమూరు జిల్లాకు నీరందక అలమటిస్తూ ఉన్నది. ఈనాటి పాలమూరు జిల్లా దౌర్భాగ్యానికి అసలు సిసలు కారణం నాటి హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రవూపదేశ్‌లో విలీనమడం. దాతో శని పట్టింది తెలంగాణకు. మరీ ముఖ్యంగా ఈ జిల్లాకు. బచావత్ ట్రిబ్యునల్ తమ నివేదికలో ఈ విషయం ఎంత స్పష్టంగా తెలియజేసిందో గమనించండి.

...Had there been no division of that state (Hyderabad State) there were better chances for the residents of this area to get irrigation facilities in Mahbubnagar District
(హైదరాబాద్ రాష్ట్రం ముక్కచెక్కలవ్వకుండాపోతే మహబూబ్‌నగర్ జిల్లాకు నీటిపారుదల సౌకర్యం మెరుగ్గా ఉండుండేది)
                             నాటి హైదరాబాద్ ప్రభుత్వం మహబూబ్‌నగర్ జిల్లాకు
ఉపయుక్తంగా ఉండే మూడు పథకాలను రూపొందించింది. 1) తుంగభద్ర కాలువ పొడిగింపు 2) అప్పర్ కృష్ణా ప్రాజెక్టు కుడి కాలువ పొడిగింపు 3) భీమా ప్రాజెక్టు. 19.2 శతకోటి ఘనపు అడుగుల (టీఎంసీ) తుంగభద్ర జలాల వినియోగం తో 1,20,000 ఎకరాలు (గద్వాల- ఆలంపూర్ తాలూకాలో) సాగుచేసేందుకు హైదరాబాద్ ప్రభుత్వం తలపెట్టింది. ఇదే మాదిరిగా 54.4 టీఎంసీల కృష్ణా జలాల వినియోగంతో 1,50,000 ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్టును కూడా తలపెట్టింది. తుంగభద్ర అప్పర్ కృష్ణా (ఆల్మటి), ఈ రెండు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నవే. భీమా ప్రాజెక్టు కొత్తది. దీన్ని నిర్మించి 100.70 టీఎంసీల వినియోగంతో 3,0,000 ఎకరాలకు సాగునీటి వసతి కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆంధ్రవూపదేశ్ ఏర్పడడంతో కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర ఎడమకాలువను, అప్పర్ కృష్ణ కుడి కాలువను తమ ప్రాంతం వరకే కట్టడిచేసి ఆంధ్రవూపదేశ్‌లోకి ప్రవేశించకుండా జాగ్రత్త పడింది.

         భీమా ప్రాజెక్టును రద్దు చేసింది. దీంతో మహబూబ్‌నగర్ జిల్లాకు ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా వాలు మార్గంగా నగావిటీ పద్ధతిలో) అందవలసిన 174.30 టీఎంసీల కృష్ణాజలాలు కృష్ణార్పణమయ్యాయి. ఆ నీళ్లే మహబూబ్‌నగర్ జిల్లాకు అందుంటే, నేడు కృష్ణా, గోదావరి జిల్లా మాదిరిగా కళకళలాడుతూ ఉండేది. ఈ దైన్య పరిస్థితిని గమనించిన ట్రిబ్యునల్ ‘తాము నిబంధనలకు లోబడి ఆ మూడు ప్రాజెక్టుల ద్వారా సంక్రమించే నీటిని జిల్లాకు హక్కుభుక్తంగా ఇవ్వలేని తమ ఆశక్తిని పేర్కొం టూ, ప్రత్యామ్నాయంగా, కొంత మేరకు జిల్లాకు జరిగిన అన్యాయానికి పరిహారంగా 17.4 టిఎంసిల వినియోగాన్ని అనుమతిస్తూ ‘జూరాల ప్రాజెక్టును’ మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుకు నీటిని కేటాయించిన ట్రిబ్యునల్ ‘తాము కేటాయించిన నీటిని ఆ ప్రాజెక్టులోనే వాడుకోవాలని, కాకపోతే జిల్లాలో అదీ సాధ్యపడకపోతే తెలంగాణలో మరోచోట వాడుకోవలన్న షరతు పెట్టిం ది’.

          అంటే ట్రిబ్యునల్ మాటల అంతరార్థం ఏమిటి? బలవంతులైన సీమాంధ్ర పాలకులు తాము Compassionate grounds తో కేటాయించిన నీటిని నిర్దయగా మళ్లించగలరన్న అనుమానం గాక మరేమిటి? వాళ్ల అనుమానం నిజమే అయింది. జూరాల నీటిని 30 వేల ఎకరాలకు సరిపడా రాజోలిబండ కాలువకు మళ్లిస్తున్నది. రాజోలిబండ నీటిని కేసీ కాలువకు మళ్లిస్తున్నది. కర్నూలుకు తాగునీటి కోసం పైపుల ద్వారా జూరాల నీటిని తుంగభద్ర నదిని దాటించిన విషయం గతంలో జరిగిందే. జూరాల ద్వారా 17.4 టీఎంసీల వినియోగం జరగాలని ట్రిబ్యున ల్ ఆదేశించింది. మరో 20 టీఎంసీల వినియోగం భీమా ప్రాజెక్టు కోసం జూరాల నుంచే ప్రభుత్వం అనుమతించింది. 37.4 టీఎంసీల నికరజలాల వినియోగానికి అదనంగా మరో ఇరవై ండు టీఎంసీల మిగులు జలాలను జూరాల నుంచే నెట్టంపాడు కోసం అనుమతించింది.

        ప్రస్తుతం అనుమతి పొందిన పథకం, పాలమూరు-పాకాల గ్రావిటీ పథకం మున్ముందు అవతరిస్తే అవి కూడా జూరాల నుంచే జలాలను స్వీకరించడం జరుగుతుంది. వీటన్నిటిని సరఫరా చేసే సామర్థ్యం ప్రస్తుతం అమల్లో ఉన్న జూరాల జలశాయానికి ఉన్నదా అన్న విషయం సిమ్యులేషన్ స్టడీస్ చేస్తే తప్ప తెలియదు. జూరాల జలాశయం సామర్థ్యం పెంచడం అంత ఆషామాషీ కాదు. ‘నీటి కేటాయింపులు’ ఉండాలి. కేంద్రజలసంఘం అనుమతి ఉండాలి. సామర్థ్యం పెంపు మూలంగా గురయ్యే ముంపు ప్రాంతం కర్ణాటకలో ఉంటుంది. కాబట్టి ఆ ప్రభుత్వం అనుమతి కావాలి. ముంపు ప్రాంతం లో అడవి ఉంటే కేంద్ర అటవీ శాఖా అనుమతి తప్పనిసరి అవుతుంది. ముందు జూరాల సామర్థ్యం పెంచే విషయంలో మన ప్రభుత్వం చిత్తశుద్ధితో అంగీకరిస్తుందా అన్నది కూడా అనుమానమే. జూరాల ఎత్తుపెంచడం కంటే ‘ఆల్మట్టి ద్వారా అదనపు జలాలు పొందడం మేలు. ఆలమట్టి పూర్తి జలాశయ స్థాయి 524.256 మీటర్లు కాగా జూరాల పూర్తి జలాశయ స్థాయి 31.516 మీటర్లు. అయితే ఆల్మట్టి పేరెత్తితేనే కంపరమెత్తే మన ప్రభుత్వం అలాంటి ప్రయత్నం చేయదుగాక చేయదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే ఇది సాధ్యపడే అవకాశముంది. జూరాలకు అదనంగా ఆర్డీఎస్ తప్ప మహబూబ్‌నగర్ జిల్లాకు లబ్ధి చేకూర్చే పెద్ద పథకమేదీ లేదు. భీమా, కోయిల్‌సాగర్, నెట్టంపాడు, కల్వకుర్తి పూర్తయి ఆశించిన స్థాయిలో నీటి సరఫరా జరిగిననాడు ఈ జిల్లా కష్టాలు కొంతమేరకు తీరుతాయి.

బి) నిజమే మీరన్నట్టు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నదుల అనుసంధానం, రిజర్వాయర్ల నిర్మాణం గనుక జరిగితే రాష్ట్రాల, ప్రాంతాల మధ్య సమస్యలుండవు. కాని ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం ‘నీటి పంపకం’ పైన కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి విశేషాధికారాలు లేవు. రాజ్యాంగంలోని 246 అధికరణంలో ఏడవ షెడ్యూల్‌లో మూడు జాబితాలున్నాయి. 

కేంద్ర జాబితా: ఇందులో జతపరిచిన విషయాలకు సంబంధించిన చట్టాలను చేసే అధికారం పార్లమెంటుకే ఉంటుంది.
రాష్ట్ర జాబితా: ఇందులో పొందుపరిచిన విషయాలపై చట్టాలను రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభలకే ఉంటుంది. 
ఉమ్మడి జాబితా: ఇందులో ఉటంకించిన విషయాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు, శాసన సభలకు ఉభయులకూ ఉంటుంది.

రాష్ట్ర జాబితాలోని Entry17లో ‘నీరు-నీటి సరఫరా
’ సాగునీరు, కాలువలు, మురుగునీరు, అడ్డుకట్టలు. నీటి నిలువ విద్యుచ్ఛక్తి ఉన్నాయి. ఇక కేంద్ర జాబితాలోని Entry 56 ప్రకారం ‘అంతరాష్ట్ర నదులు, నదీలోయల అభివృద్ధి, క్రమబద్ధీకరణ’ ఉన్నాయి. అయితే ఏ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి ఈహక్కుని సంక్రమింపచేయాలి అన్న విషయంపై ప్రజావూపయోజనాలను దృష్టి ఉంచుకుని పార్లమెంటు చట్టం రూపొందించవలసి ఉంటుంది.

తేలిగ్గా చెప్పాలంటే తమ సరిహద్దుల్లో పుట్టి ప్రవహించే నదులపైనే ఆయా రాష్ట్రాలకు సంపూర్ణ అధికారం ఉంటుంది. ఉదాహరణకు గుండ్లకమ్మపై ఆంధ్రవూపదేశ్‌కు పూర్తి హక్కులున్నాయి. అంతర్ రాష్ట్ర నదుల విషయంలో తమకు కేటాయించిన నీటి వినియోగంపైన మాత్రమే ఆయా రాష్ట్రాలకు సంపూర్ణ అధికారం ఉంటుంది. అదే ఇతర బేసిన్ రాష్ట్రాలకు ఇబ్బంది కలిగించనంత మేరకే. ఉదాహరణకు పోలవరం కట్టేందుకు నీటి కేటాయింపులున్నా ముంపు విషయంలో కేంద్రం, ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అనుమతులు తప్పనిసరి. నీటిని పూర్తిగా కేంద్రం జాబితాలోకి తీసుకురావాలనే వాదన చాలాకాలంగా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు అంగీకరించడం లేదు. నదుల వినియోగంపైన ప్రస్తుతం రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కేంద్రానికి కట్టబెట్టడానికి ఏ రాష్ట్రమూ సిద్ధంగా లేదు.

కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి అధ్యయనం చేసిన ‘సర్కారియా కమిషన్’ నీటిని అటు కేంద్ర జాబితాలోగాని ఇటు ఉమ్మడి జాబితా లో గాని మార్చడానికి ఒప్పుకోలేదు. ఇదే విషయాన్ని సమక్షిగంగా అధ్యయ నం చేసిన‘National Commission for Integrated Develo pment Planకూడా సర్కారియా కమిషన్ సిఫార్సులతో ఏకీభవిస్తూ కేంద్ర రాష్ట్రాల మధ్య సలహా సంప్రదింపులు కొనసాగించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా నీటికి సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారం లభించగలదన్న అభివూపాయం వ్యక్తం చేసింది.

ఇప్పట్లో నీరు కేంద్రం పరిధిలోకి వచ్చే అవకాశం సుదూరంలో కనిపించడం లేదు. అంటే ఇప్పటికన్నా ఉధృతంగా, మునుముందు నీటికోసం కొట్టుకు చచ్చే పరిస్థితి దాపురిస్తుంది. ‘అంతర్జాతీయ న్యాయసూవూతాలు’ పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఆయా నదుల నీటి వినియోగంపై సంపూర్ణ హక్కులుంటాయని, వారి అవసరాలు తీరాకే, పరీవాహక ప్రాంతం ఆవలి క్షేత్రాలకు తరలించవచ్చని’ చెప్తున్నాయి. ఆ లెక్కన కృష్ణా పరీవాహక క్షేత్రంలోని పాలమూరు జిల్లాకు కృష్ణానదీ జలాలు లభించాలి. ఇది అంతర్జాతీయ న్యాయమే కాదు సహజ న్యాయం కూడా. అయితే ఈ న్యాయ సూత్రాలకు చట్టబద్ధతలేదు. కానీ ప్రపంచమంతా ఈ న్యాయసూవూతాలను పాటిస్తున్నది. కానీ మన ప్రభుత్వం మాత్రం ‘దుడ్డున్నవాడిదే బర్రె’ సూత్రం ఆలంబనగా తీసుకుని పాలమూరు జిల్లా అవసరాలు పక్కనపెట్టి కృష్ణా జలాలను ‘పోతిడ్డిపాడు’ ద్వారా సీమాంధ్ర ప్రాంతాలకు తరలిస్తున్నది. పాలమూరు జిల్లాకు బచావత్ ట్రిబ్యునల్ ద్వారా జూరాలకు 17.4 టీఎంసీలు, ఆర్డీఎస్ 15.90 టీఎంసీలు, కోయిర్‌సాగర్‌కు 3.9 టీఎంసీలు దక్కాయి.

చిన్నతరహా ప్రాజెక్టులు అదనం. బచావత్ ట్రిబ్యునల్ రాష్ట్రం మధ్య నీటి పంపకాలను చేసింది. అయితే ఆ పంపకాలను ఆయా ప్రాజెక్టు అవసరాలను నిర్ధారణ చేశాకే చేసింది. అయితే కొన్ని ప్రాజెక్టులను మినహాయించి, మిగిలిన ప్రాజెక్టుల కేటాయింపులను అటూ ఇటూ సవరించే అధికారాన్ని ట్రిబ్యునల్ ఆయా రాష్ట్రాలకు కట్టబెట్టింది. కనుక రాష్ట్రానికి ఇచ్చిన నీటి కేటాయింపులో ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టుల కేటాయింపులను కత్తిరించి మరికొన్నింటికి పెంచవచ్చు. నిజానికి మన ప్రభుత్వం అలా చేసింది కూడా. కనుక రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే పాలమూరు జిల్లాకు ఇతర ప్రాజెక్టులకు కోతపెట్టి ఎక్కువ నీరు ఇవ్వవచ్చు. ఎక్కువ నీరు ఈ జిల్లాకు ఇవ్వడం దేవుడెరుగు. ఆర్డీఎస్‌లో కోతపెట్టకుండా ట్రిబ్యునల్ మంజూరు చేసిన 15.9 టీఎంసీలు ఇస్తే అదే పదివేలు. కానీ అలా జరగడం లేదు.

జాతీయ జల విధానం 
197లో మొదటిసారి జాతీయ జల విధానం వెలువడింది. నీరు అరుదైన విలువైన జాతీయ వనరు కనుక సమీకృత ప్రాతిపదికన, పర్యావరణ పరిరక్షణ, సంబంధిత రాష్ట్రాల అవసరాల దృష్ట్యా ఈవనరుని అభివృద్ధి పరుచుకోవాలి, కాపాడుకోవాలి. జలవనరుల అభివృద్ధి పథకాలను వీలైనంత మటుకు బహుళార్థ సాధక ప్రాజెక్టులుగా రూపొందించాలి. ఈ ప్రాజెక్టులో తాగునీటి వసతి తప్పక కల్పించాలి. సాగునీటి వ్యవస్థ నిర్వహణలో రైతులను భాగస్వాములను చేయాలి. ప్రాధాన్యతా పరంగా తాగునీరు, సాగునీరు, విద్యుచ్ఛక్తి, జలరవాణా, పారిక్షిశామిక, ఇతర ప్రయోజనాలు ఉండాలి. ఉపరితలజలం, భూగర్భ జలాల నాణ్యతను పరిరక్షించే కార్యక్షికమాలను చేపట్టాలి. ఇలాంటి 19 అంశాలతో కూడిన ప్రప్రథమ జాతీయ జల విధానం నీటి చంద్రిక వలె హితోక్తులను ఉపదేశం చేసింది. అయితే ఏ రాష్ట్రమూ దీన్ని పాటించిన పాపాన పోలేదు. 15 ఏళ్ల తర్వాత 2002లో రెండో జలవిధానం విడుదలయింది.

ఇందులో కొత్తగా జోడైన అంశాలు నదీ బేసిన్ సర్వతోముఖ వికాసం కోసం నదీ బేసిన్ సంస్థల ఏర్పాటు చేయాలి. రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ విషయంలో కొన్ని మార్గదర్శక సూత్రాలను జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రతిపాదించినా వాటిని చాలా రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. దీంతో ఈ జాతీయ జల విధానం కూడా నిర్వీర్యమైన డాక్యుమెంటు గానే మారిపోయింది. తాజాగా నూతన జాతీయ జల విధానపు ముసాయిదాను కేంద్రం వివిధ రాష్ట్రాలకు అభివూపాయాల కోసం ఇటీవలే పంపింది. ఇందులో ‘వాడే నీటికి వెలకట్టడం లాంటి కొన్ని వివాదాస్పదమైన అంశాలను ప్రతిపాదించడం జరిగింది. ఈ అంశం అంత తేలిగ్గా ఆమోదం పొందదని అందరికీ తెలుసు. ఏదేమైనా చట్టబద్ధత లేని ఏ డాక్యుమెంటుకు విలువ ఉండదు. పాత జాతీయ జల విధానాలలాగే ఇది కూడా అలంకారవూపాయంగా మిగుల్తుందా లేక రాష్ట్రాలు దాన్ని ఆమోదించి, ఆదరించి, ఆచరిస్తారా అన్నది వేచి చూడాలి.


-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

Monday, 9 April 2012

ఇంతకు కేసీఆర్ ఏం చేశాడు?


సమైక్యవాదులు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు

అనునిత్యం కేసీఆర్‌ను ఆడిపోసుకుంటుంటారు.
టిజి వెంకటేశ్, సాకే శైలజానాథ్‌లూ కేసీఆర్‌నే దుయ్యబడుతుంటారు.
దేవినేని ఉమ, పయ్యావుల కేశవ్‌లూ కేసీఆర్‌నే విమర్శిస్తుంటారు.
తెలంగాణ బిడ్డలు మోత్కుపల్లి, ఎర్రబెల్లి కూడా కేసీఆర్‌పైనే
ఒంటికాలుమీద లేస్తుంటారు.
తెలంగాణకోసం ఉద్యమాలు చేస్తున్నామని చెప్పే కొన్ని సంఘాలవాళ్లూ
కేసీఆర్‌పైనే దాడి చేస్తుంటారు.
తెలంగాణకు హక్కుదారులుగా చెప్పుకునే డికె అరుణ, రేణుకాచౌదరి
వంటి వాళ్లూ కేసీఆర్‌పైనే విసుర్లు ఎక్కుపెడుతుంటారు.

ఎందుకిలా జరుగుతోంది? వేర్వేరు పార్టీలు, వేర్వేరు ప్రాంతాలకు చెందిన అందరి ఉమ్మడి లక్ష్యం కేసీఆర్ ఒక్కరే కావడంలోని అంతరార్థం ఏమిటి? ఇంతమందికి కేసీఆర్ శత్రువు ఎందుకయ్యారు? కేసీఆర్ నిజంగా ఇటువంటి విమర్శలకు పాత్రుడేనా? ఇంతమంది దీవెనలతో కేసీఆర్ బలపడుతున్నారా? బలహీనపడుతున్నారా? తెలంగాణ ఆకాంక్షలకు కేంద్రబిందువు కావడమే ఆయనను విమర్శలకు కేంద్రబిందువును చేసిందా? ఇటీవల జరిగిన ఒక మిత్రగోష్టిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ కేసీఆర్‌పై చేసిన విశ్లేషణ ఈ సందర్భంగా గుర్తు చేయదల్చుకున్నాను. ఆయన రాష్ట్ర రాజకీయాలను గురించి, వివిధ పార్టీల అగ్రనేతలను గురించి వర్ణిస్తూ, ఇంతమంది విమర్శలకు కేసీఆర్ ఎందుకు కేంద్రబిందువు అయ్యాడో వివరించాడు.
                ‘‘కేసీఆర్ ఏం చేశాడని పదే పదే మాట్లాడతారు టీడీపీ వాళ్లు. కేసీఆర్ తెలంగాణకు పది తరాలకు సరిపోను నాయకులను తయారు చేశారు. తెలంగాణ సమాజాన్ని ఒక అస్తిత్వ కేతనంగా తీర్చిదిద్దారు. మా(సీమాంధ్ర) నాయకులూ ఉన్నారు. ఒక్కడు అరగంట కూడా సరిగా మాట్లాడలేడు. చాలా మందికి నోరే పెగలదు. అసలు మా నాయకులు రెండో తరం నాయకులను తయారు చేయరు సరికదా, ఉన్నవారిని ఎదగనీయరు. కానీ కేసీఆర్ ఊరూరా వేలాదిమంది ఉపన్యాసకులను, ఉద్యమకారులను తయారు చేశారు. ఒక సామాన్య గ్రామీణ కార్యకర్త, ఒక మామూలు యూనివర్సిటీ విద్యార్థి, ఒక పణికెర మల్లయ్య కూడా ఇవ్వాళ తెలంగాణపై గణగణా గంటసేపు మాట్లాడగలరు. చంద్రబాబు వంటి వారిని పొలంగట్టుపై నిలదీసి అడగగలరు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, అస్తిత్వకాంక్షల స్పృహను సార్వజనికం చేయడమే కాదు, తెలంగాణ పేరెత్తకుండా ఇవ్వాళ ఏ నాయకుడూ మనలేని పరిస్థితిని తీసుకొచ్చారు. ఒక జాతి నిర్మాణానికి ఇంతకంటే ఏం కావాలి? సమకాలీన రాజకీయ చరిత్రలో ఇంతటి కృషి, ఇంతటి ప్రభావం కలిగించిన నాయకుడిని చూపించండి? ఆయనకొక నినాదం ఉంది. తెలంగాణ నినాదాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా, వరంగల్ నుంచి వాషింగ్టన్ దాకా విస్తరింపజేశారు.
              తెలంగాణ రాష్ట్ర సాధనను ఇంటింటి నినాదంగా మార్చారు. మా నాయకులకు అసలు ఏ నినాదమూ లేదు. ఉన్నదంతా డొల్లతనమే. కేసీఆర్ పదకొండేళ్లు ఏ అధికారం లేకున్నా, ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా పార్టీని, ఉద్యమాన్ని పట్టు సడలకుండానడుపుకుంటూ వస్తున్నారు. ఇటీవల మనం చూడడం లేదా-చంవూదబాబు ఏడేండ్లు అధికారం లేకపోయేసరికి విలవిల్లాడుతున్నారు. విచక్షణ, సోయి మరిచిపోయి మాట్లాడుతున్నాడు. ఏ లక్ష్యం, ఏ విధానమూ లేనప్పుడే ఇటువంటి అసహనం, దురావేశం వస్తాయి. కేసీఆర్‌కు ఒక విధా నం ఉంది. లక్ష్యం ఉంది. ఎవన్ని రకాలుగా ప్రచారం చేసినా, ఎన్ని అబద్ధాలను పత్రికల్లో కుమ్మరించినా తెలంగాణ కోసం మొక్కవోకుండా పోరాడున్నది ఒక్క కేసీఆరేనన్న నమ్మకం తెలంగాణ ప్రజల్లో ఉంది. వరుస ఉప ఎన్నికలన్నీ అదే విషయం రుజువు చేశాయి. అది ఆయన సంపాదించిన విశ్వసనీయత. నాయకులు బలపడినా, బలహీనపడినా విశ్వసనీయతపై ఆధారపడే జరుగుతుంది. చంద్రబాబుకు లేనిది అదే. ఆయన ప్రజల విశ్వసనీయతను పదే పదే కోల్పోతూ వస్తున్నారు. మాటమీద నిలబడనితనం ఆయనను జనం నుంచి దూరం చేస్తున్నది’’ అని ఆయన వివరించారు.
                   ‘‘తెలంగాణ విషయంలో చంద్రబాబు చేసింది పెద్ద తప్పు. ఆయన ఇప్పటికీ సరిదిద్దుకోకపోగా బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. తనకెలాగూ విశ్వసనీయత లేదు కాబట్టి కేసీఆర్‌కు కూడా విశ్వసనీయత లేకుండా చేస్తే పోతుంది కదా అని ఆయన అనుకుంటున్నారు. చిన్న గీత పెద్దది కానప్పుడు, పెద్ద గీతను చెరిపేసి చిన్నదిగా చేయాలన్న కురుచబుద్ధి ఇది. అందుకే కేసీఆర్‌మీద, తెలంగాణ ఉద్యమం మీద మలినం కుమ్మరించడానికి, అబద్ధాలను ప్రచారం చేయడానికి ఒక మూకను అదేపనిగా ప్రయోగిస్తున్నాడు. చంద్రబాబు రాజకీయ విజ్ఞతపై కాకుండా ఇప్పటికీ, ట్రిక్కుల మీద, టక్కుటమార విద్యలమీద ఆధారపడుతున్నాడు. అది చంద్రబాబును ఇంకా డ్యామేజ్ చేస్తున్నది. మొన్నటి ఉప ఎన్నికల్లో నామినేషన్లు పూర్తయ్యే సమయానికి తెలుగుదేశం పరిస్థితి కొంత మెరుగుగా ఉండింది. అన్ని చోట్ల డిపాజిట్లు వస్తాయని సర్వేలు అంచనా వేశాయి. తెలుగుదేశానికి అన్ని నియోజకవర్గాల్లోనూ 1 నుంచి 25 శాతం ఓట్ల దాకా వస్తాయని సర్వేలు సూచించాయి. కానీ పోలింగ్ సమీపించే కొద్దీ చంద్రబాబుతోపాటు మోత్కుపల్లి, ఎర్రబెల్లి మరీ రెచ్చిపోయి మాట్లాడారు. పర్యవసానం ఏమంటే, మూడు చోట్ల డిపాజిట్లు పోయాయి. మిగిలిన మూడు చోట్ల ముందు ఊహించిన దానికంటే తక్కువ ఓట్లు వచ్చాయి. కడియం శ్రీహరికి ఎర్రబెల్లి ప్రచారం మేలుకంటే కీడే ఎక్కువ చేసింది. తెలంగాణలోని ఇతర తెలుగుదేశం నాయకులు కూడా చంద్రబాబు ప్రయోగించిన మూకను చూసి భయపడుతున్నారు. వాళ్లు వాగే కొద్దీ తాము మరింత ఇరుకున పడతామని భావిస్తున్నారు’’ అని ఆయన విశ్లేషించారు.

                         ‘‘ఎవన్ని చెప్పినా, తిట్టినా తెలంగాణవాదానికి ఇప్పటికీ చోదకుడు కేసీఆర్ ఒక్కరే. ఆయన వల్ల కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు. కానీ తెలంగాణవాదాన్ని కేసీఆర్ ఎన్నడూ లెట్ డౌన్ చేయలేదు. మొదట చంద్రబాబు, ఆ తర్వాత రాజశేఖర్‌డ్డి, మళ్లీ చంద్రబాబు వంటివారు ఎన్నిసార్లు ఎన్ని ఎదురుదెబ్బలు, దొంగదెబ్బలు కొట్టినా ఆయన తెలంగాణ జెండాను మాత్రం కింద పడేయలేదు. కేసీఆర్ రాజకీయంగా బలపడేకొద్దీ తెలంగాణవాదం బలపడుతుంది. తెలంగాణవాదాన్ని కొట్టాలంటే కేసీఆర్‌ను కొట్టాలి. కేసీఆర్‌ను రాజకీయంగా బలహీనపర్చితే తెలంగాణవాదం బలహీనపడుతుంది. అందుకే తెలంగాణ వ్యతిరేకులకూ (సమైక్యవాదులకు), తెలంగాణ ద్రోహులకూ, తెలంగాణ రావడం కంటే రాజకీయంగా బతకడం ముఖ్యమని భావించే కొందరు తెలంగాణ మిత్రులకూ(?) ఉమ్మడి లక్ష్యం అయ్యారు కేసీఆర్. కేసీఆర్‌ను రాజకీయంగా ఫినిష్ చేస్తే తెలంగాణ కథ ముగిసిపోతుందని వారి ఆలోచన. కానీ కేసీఆర్ సక్సెస్ అయింది అక్కడే. ఆయన వందలాది మంది కేసీఆర్‌లను తయారు చేసి పల్లెపప్లూకూ వదిలారు. తెలంగాణ వ్యతిరేకులు, ద్రోహుల పాచికలు పారకుండా నిలువరించగలిగారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే చాలాసార్లు ఆ విషయం రుజువు చేశారు. తెలంగాణవాదం ఇవ్వాళ ఈ ప్రాంత ప్రజల జీవనాడుల్లో ఇంకిపోయింది. తెలంగాణ తెచ్చిన వాళ్లను, ఇచ్చిన వాళ్లను మాత్రమే తెలంగాణ సమాజం అంగీకరిస్తుంది. గోడమీది పిల్లులను, ఊసర గబ్బిలాలను ఇక్కడి ప్రజలు ఇంకేమాత్రం భరించే అవకాశం లేదు’ అని ఆయన అన్నారు.
                                      ‘మోత్కుపల్లి నరసింహులు ఆంధ్రా ప్రాంతంలో పెద్ద హీరో అయ్యారు’ అని ఒక రాజకీయ పరిశీలకుడు ఇటీవల ఒక సందర్భంలో చెప్పారు. ఈ మాట స్వయంగా నర్సింహులు కూడా కొంతకాలంగా చెబుతున్నారు. కేసీఆర్‌ను విమర్శించడం మొదలు పెట్టిన తర్వాత తనకు అనూహ్యంగా, అసాధారణంగా అభినందనలు వచ్చాయ ని చెప్పారు. ‘అభినందించేవాళ్లంతా ఎవరు?’ అని అడిగితే స్పష్టంగా సమాధానం చెప్పలేదు. కానీ కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కులో మోత్కుపల్లి రోజూ ఉదయం వాకింగ్‌కు వస్తారు. అక్కడ ఆయనకు ఎదురుపడే వాళ్లంతా ఆయనను అహో! ఒహో! అని కీర్తించడం నాకు కూడా తెలుసు. కానీ వాళ్లంతా ఎవరు? సమైక్యవాదం సుభిక్షంగా ఇలాగే ఉండాలని కోరుకునే ఆంధ్రా ప్రాంతానికి చెందిన పారిశ్రామిక, ఉద్యోగ, మేధావి వర్గాల కు చెందిన మిత్రులు. తెలంగాణ రావద్దని కోరుకుంటున్నవాళ్లు. తెలంగాణకు అడ్డంపడుతున్నవాళ్లు. ‘తెలంగాణ రాకపోయినా ఫర్వాలేదు, కానీ మా రాజకీయ ప్రాబల్యం తగ్గకూడద’నుకునేవాళ్లు. బయటివాళ్లు నిన్ను పొగుడుతున్నారంటే నువ్వు ఇంటివాళ్లకు దూరమవుతున్నావని అర్థం. సమైక్యవాదులకు హీరోవయ్యావంటే తెలంగాణవాదులకు విలన్ వు అవుతున్నావని అర్థం. సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న మోత్కుపల్లి నర్సింహులుకు ఈ లెక్కలన్నీ తెలియవని అనుకోలేం. కానీ ఆయన తెలంగాణవాదం నీడలో తనకు రాజకీయ అస్తిత్వం లేదనుకుంటున్నట్టున్నాడు. అందుకే క్యాలిక్యులేటెడ్ రిస్కుకు సిద్ధపడ్డాడు. ఈ పాత్రను స్వీకరించాడు.
                            చాలా ఏళ్ల కిందటి ముచ్చట. యూనివర్సిటీ లో స్టూడెంట్ యూనియన్ చైర్మన్‌కు పోటీ చేయాలని మా విద్యార్థి సంఘం అప్పట్లో నన్ను ఆదేశించింది. ‘నీకు విద్యార్థుల అందరి పేర్లు కంఠతా వచ్చు. నువ్వయితే గెలుస్తావ్’ అన్నారు. సరే అన్నాను. నాపై పోటీ చేయడానికి ఎవరూ ఉత్సాహం చూపించలేదు. ప్రత్యర్థులంతా చివరకు ఒక మిత్రుడిని ఒప్పించారు. ఆయన నామినేషన్ వేయగానే విద్యార్థినులంతా కట్టగట్టుకుని వచ్చారు. ‘మీరు ఇక ప్రచారం చేయవలసిన అవసరం లేదు. నిశ్చింతగా ఉండండి. ఆయనకు ఎంత గొప్ప పేరు ఉందో మీకు తెలుసు’ అని చెప్పిపోయారు. నిజంగానే ఎక్కువగా కష్టపడకుండానే ఎన్నికల్లో గెలిచాం. మా ప్యానెల్‌కు 1 ఓట్లు వస్తే, ప్రత్యర్థికి 92 ఓట్లు వచ్చాయి. మన సుగుణమే కాదు, ఎదుటివారి దుర్గుణాలూ రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. కేసీఆర్ ఏ సుగుణాల కోసం, ఏ లక్ష్యాల కోసం నిలబడ్డాడు? చంద్రబాబునాయుడు, మోత్కుపల్లి, ఎర్రబెల్లి, లగడపాటి, రాయపాటి… ఏ దుర్గుణాలను, ఏ అప్రతిష్ఠను మోస్తున్నారు? ఏ లక్ష్యంతో పనిచేస్తున్నారు? ఈ సూకా్ష్మన్ని గ్రహిస్తే మంచిది. తెలంగాణ ప్రజలకు ఇవన్నీ ఇప్పటికే బాగా తెలుసు.

Thursday, 5 April 2012

బలిదానాలొద్దు బరిగీసి కొట్లాడు...


                      వద్దు.. ఆత్మహత్యలొద్దు! తెలంగాణ సాధన సమరం వీరోచిత పోరాటం.. ఆత్మహత్య ఈ పోరాటంలో అస్త్ర సన్యాసమే! తెగించి కొసదాక కొట్లాడుదాం.. తెలంగాణ ప్రజలది బతుకు పోరాటం. విజయానికి తీరంలో ఉన్నాం. పొంగిపోయే సమయం ఇది.. కుంగిపోవద్దు! ఆత్మహత్యలు చేసుకొని మా కళ్లలో నీళ్లు లేకుండా చేసి కొట్లాడే ఆత్మస్థైర్యం లేకుండా చేయొద్దు! కాలిపోకు రాలిపోకు.. ఉద్యమమై వికసించు.. వీరుడవై విప్లవించు! తెలంగాణ సాధ్యమే. తెలంగాణ ఖాయమే. కానీ.. ఆత్మహత్యలతో కాదు.. ఇది భంగ పడిన సమాజం. తెగింపు ఉండాలి. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. తెలంగాణ కోసం బరిగీసి కొట్లాడుదాం.. పోరాటాల ద్వారానే తెలంగాణ సాధ్యం.. యువతకు తరతరాలకు సరిపడా స్ఫూర్తినిచ్చిన భగత్‌సింగ్‌కూడా తన బలిదానానికి ఆత్మహత్యను ఎంచుకోలేదు.. శత్రువుపై కొట్లాడాడు! చరివూతలో వీరులంతా పోరుజేసి నోళ్లే.. పోరాటాలను శ్వాశించినవాళ్లే.. చివరకు గెలిచిందీవాళ్లే! వర్తమానమూ అంతే! తెలంగాణలో జరుగుతున్న ప్రతిపోరులోనూ తెలంగాణవాదులే గెలుస్తున్నారు.. ద్రోహులు ఓడిపోతున్న వేళ.. ఆత్మహత్యలతో చులకన కావద్దు! మన కలల తెలంగాణను నిజం చేసుకుందాం.. కండ్లారాచూసుకుందాం.. మన రాజ్యం మనమేలుదాం! యాచక స్థితి నుంచి.. శాసక స్థితికి ఎదుగుదాం!! ఇవీ సమస్త తెలంగాణ ఉద్యమక్షిశేణులు ప్రత్యేక రాష్ట్ర సాధన సమరంలో ఆత్మబలిదానాలకు సాహసిస్తున్న యువతకు చేసిన విన్నపాలు! పోరుబాటలో ప్రజ్వరిల్లాల్సిన శక్తులు.. తమను తాము దహించుకుంటున్న వేళ.. ద్రోహల వాఖ్యలతో కలత చెంది.. కంఠాలకు ఉరిబిగించుకుంటున్న సమయాన.. తెలంగాణ గడ్డ చలించిపోయింది! తల్లుల కండ్లనుంచి ఇక ఒక్క చుక్క కూడా కన్నీరు ఈ గడ్డపై పడకూడదని తీర్మానించుకుంది! ఇప్పటికే ఏడు వందలకు పైగా బలిదానాలు ఉద్యమాన్ని నిత్యజ్వలితం చేసినా.. ఇది కాదు దారి అంటూ పోరుదారి చూపింది! మేమున్నాం అండగా.. రాష్ట్రం సాధించేదాకా జెండా దించేది లేదు.. అంటూ ఉద్యమసారథ్యం ఏకకం నినాదం చేసింది. తెలంగాణ పది జిల్లాల బిడ్డలకు కొండంత బలాన్ని భరోసాను ఇచ్చింది! రాజకీయ జేఏసీ, ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్ సహా ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు, న్యాయవాదులు, విద్యార్థులు, జర్నలిస్టులు, మహిళలు.. సకల శ్రేణులు తమ తమ జేఏసీల ఆధ్వర్యంలో కదం తొక్కగా.. సుందరయ్యపార్క్ నుంచి.. ఇందిరాపార్క్ దాకా సాగిన మహార్యాలీ.. పోరు స్ఫూర్తిని నూరిపోసింది! బతికుండి తెలంగాణ సాధించాలని పిలుపునిచ్చింది!