Saturday 29 September 2012

సాగర హారం నెక్లెస్ రోడ్‌లో..దుమ్మురేపే మార్చ్


దిగివచ్చిన ప్రభుత్వం
తెలంగాణ ప్రజల విజయం
తెలంగాణ మార్చ్‌కు అనుమతి
నెక్లెస్ రోడ్డుపై నిర్వహణకు అవకాశం
ఫలించిన టీ మంత్రుల దౌత్యం
ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించిన జానారెడ్డి
తెలంగాణ ప్రజల అద్భుత విజయమన్న కోదండరాం
కేసుల ఎత్తివేతకు జేఏసీ నేతల డిమాండ్
సమయం : మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య 
స్థలం : హుస్సేన్‌సాగర్ వద్ద నెక్లెస్‌రోడ్

నెక్లెస్ రోడ్డుకు దారులెన్ని..?
1. సచివాలయం ముందు నుంచి.. ప్రధాన రహదారి
2. మింట్ కాంపౌండ్- ప్రసాద్ ఐ మ్యాక్స్- నెక్లెస్ రోడ్డు
3. ఖైరతాబాద్ పెద్ద వినాయకుడు - నెక్లెస్ రోడ్డు
4. ఖైరతాబాద్ జంక్షన్ ఫ్లైఓవర్ - నెక్లెస్ రోడ్డు
5. రాజ్‌భవన్ ఎదురుగా ఉన్న ఎంఎస్ మక్తా- నెక్లెస్ రోడ్డు
6. బేగంపేట- రసూల్‌పురా- నెక్లెస్ రోడ్డు
7. ప్యారడైజ్- రసూల్‌పురా- నెక్లెస్ రోడ్డు
8. బైబిల్ హౌజ్- రాణిగంజ్- ఎంజీ రోడ్డు-నెక్లెస్ రోడ్డు
9. కవాడిగూడ - ట్యాంక్‌బండ్- నెక్లెస్ రోడ్డు

            అడ్డంకులు తొలగిపోయాయి! ఆటంకాలు కొట్టుకుపోయాయి! ఇక దుమ్ము రేగడమే తరువాయి! దశాబ్దాల ఆకాంక్షను మరోసారి చాటేందుకు తెలంగాణ ఉద్యమం సాగరహారాన్ని ధరించబోతున్నది! అణచివేసిన కొద్దీ ఉవ్వెత్తున ఎగసిపడి.. విజయతీరాలు చేరుకోవడమే తమ మార్గమని రుజువు చేయబోతున్నది! అందులో తొలి విజయం తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం నుంచి సాధించిన అనుమతి! ఉద్యమక్షిశేణుల అకుంఠిత దీక్ష ముందు సర్కారు తాళలేక పోయింది. నచ్చజెప్పి బుజ్జగిద్దామని చూసిన తెలంగాణ మంత్రులకు.. మార్చ్ కోసం అనుమతి తీసుకురావటంతప్ప మరోదారి లేకపోయింది! వెరసి.. తెలంగాణవాదులకు అద్భుత విజయం సిద్ధించింది! తెలంగాణమార్చ్‌ను విఫలం చేసేందుకు నానా రకాలుగా మోకాలడ్డుతూ వచ్చిన రాష్ట్ర సర్కారు.. ఎట్టకేలకు తలొంచింది. ఆదివారం టీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సాగరహారానికి అడ్డు తొలిగింది. అనుకున్న విధంగా తెలంగాణ మార్చ్‌ను నిర్వహించుకోవచ్చని ప్రకటించింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగిన వరుస చర్చలు, మంతనాలు, భేటీలు చివరికి ప్రభుత్వం కొమ్ములు వంచాయి.  అయితే ఈ కార్యకమం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య జరగాలని ప్రభుత్వం షరతు విధించింది. హుస్సేన్ సాగర్ పక్కన ఉన్న నెక్లెస్ రోడ్డుకే పరిమితం కావాలని సూచించింది. ఈ ప్రదర్శన శాంతియుతంగా సాగాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినా రాకున్నా సాగరహారాన్ని నిర్మించి తీరుతామని ప్రతిజ్ఞ చేసిన తెలంగాణవాదులు ప్రభుత్వం కూడా ఒప్పుకోవడంతో రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణమార్చ్‌కు సిద్ధమయ్యారు. దుమ్మురేపే మార్చ్‌కు ఇంటికో మనిషి.. చేతిలో జెండాతో కదిలి రానున్నారు.. కదం తొక్కనున్నారు!తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయాన్ని రాష్ట్ర మంత్రి కే జానాడ్డి శుక్రవారం రాత్రి సచివాలయంలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ప్రభుత్వంతో చర్చల సారాంశాన్ని జానాడ్డి, టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వివరించారు. వినాయక నిమజ్జన కార్యక్షికమం ముగిసిన తర్వాత మధ్యాహనం 3 గంటల నుంచి, రాత్రి ఏడు గంటల మధ్య నెక్లెస్ రోడ్డుపై తెలంగాణ మార్చ్ నిర్వహించుకునేందుకు సీఎం అంగీకరించారని జానాడ్డి తెలిపారు. ఈ ప్రదర్శన శాంతియుతంగా, సహనంతో సాగాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణమార్చ్‌కు చీమలబారు వలే కదిలి రావాలని కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఉద్యమ చైతన్యానికి తలొగ్గిన ప్రభుత్వం అనివార్య పరిస్థితులలోనే తెలంగాణ మార్చ్‌ను అనుమతిని ఇచ్చిందని టీజేఏసీ నాయకులు పేర్కొన్నారు. 
                 ప్రభుత్వ నిర్ణయం వెలువడటానికి ముందు ఉదయం నుంచి పెద్ద ఎత్తున కసరత్తు కొనసాగింది. ముగింపు క్రమంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకూ సచివాలయంలో వాడివేడి చర్చలు జరిగాయి. సీఎంతో, టీజేఏసీ నాయకులతో తెలంగాణ ప్రాంత మంత్రులు దఫదఫాలుగా చర్చలు సాగించారు. చివరకు షరతులతో కూడిన అనుమతి వచ్చింది. ఈ చర్చల్లో తెలంగాణ మంత్రులు కే జానాడ్డి, సబితా ఇంద్రాడ్డి, ఉత్తమ్‌కుమార్‌డ్డి, బస్వరాజు సారయ్య, ప్రసాద్‌కుమార్, ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, టీఆర్‌ఎస్ ఎల్పీ నేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, ఏనుగు రవీందర్‌డ్డి, పోచారం శ్రీనివాస్‌డ్డి, కొప్పుల ఈశ్వర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, తెలంగాణ నగారా సమితి శాసనసభ్యులు నాగం జనార్దన్‌డ్డి, కొప్పుల హరీశ్వర్‌డ్డి, సీహెచ్ మాధవడ్డి, సీనియర్ సిటిజన్, ఎమ్మెల్సీ చుక్కారామయ్య ప్రొఫెసర్ హరగోపాల్, సీపీఐ ఎమ్మెల్యే యాదగిరిరావు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటడ్డి, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ జీ దేవీవూపసాద్, సెక్రటరీ జనరల్ వీ శ్రీనివాస్‌గౌడ్, కో-చైర్మన్ సీ విఠల్, తెలంగాణ జేఏసీ కన్వీనర్ కే స్వామిగౌడ్, తెలంగాణ ఎన్జీవో ప్రధానకార్యదర్శి కారం రవీందర్‌డ్డి, అడ్వకేట్ జేఏసీ చైర్మన్ రాజేందర్‌డ్డి, రసమయి బాలకిషన్ తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. వివిధ సంఘాల నాయకులు తెలంగాణ మంత్రులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అనుమతిని ఇవ్వకున్నా లక్షలమందితో టాంక్‌బండ్‌పైన తెలంగాణ కవాతు జరిపి తీరుతామని హెచ్చరించారు. వాడిగా వేడిగా, సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య జరిగిన చర్చల్లో ఉద్యమకారులకు సర్ది చెప్పేందుకు తెలంగాణ మంత్రులు విఫలయత్నం చేశారు. 
                          ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యవాది అని చెప్పుకొచ్చారు. ఈ పరిణామాల మధ్యే తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ మార్చ్‌కు అనుమతి తీసుకురావాల్సిన బాధ్యత తెలంగాణ ప్రాంత మంత్రులదేనని తేల్చి చెప్పారు. మంత్రులు లిఫ్ట్‌లో కిందికి మీదికి తిరుగుతూ ముఖ్యమంవూతికి చర్చల సారాంశాన్ని విశదపరిచారు. ఒక దశలో తెలంగాణ మార్చ్‌కు అనుమతిని ఇవ్వని పక్షంలో తెలంగాణ ప్రజలు అక్టోబర్ 1 నుంచి జరిగే జీవ వైవిధ్య సదస్సుకు అనుమతి ఇవ్వరని తెలంగాణవాదులందరూ హెచ్చరించారు. టీజేఏసీ కో-కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య, మాలమహానాడు జేఏసీ నాయకులు అద్దంకి దయాకర్ చర్చలు ఒక ఫార్సుగా అభివర్ణిస్తూ తెలంగాణ మార్చ్‌కు ప్రజలను కదిలించకుండా ఇక్కడ నాయకులందరినీ కమ్మేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల వేదిక నుండి వెలుపలికి రావాలని ప్రయత్నించారు. పరిస్థితిని అదుపు చేసే వాతావరణం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో మళ్లీ సీఎం వద్దకు వెళ్లిన తెలంగాణ మంత్రులు.. ఆయనతో మాట్లాడి ఎట్టకేలకు అనుమతి సంపాదించుకుని వచ్చారు. 
                        అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో జానాడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా, సహనంతో మార్చ్ నిర్వహించుకునేందుకు సీఎం షరతులతో కూడిన అనుమతిని ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం మార్చ్‌కు అనుమతి ఇచ్చిన విషయాన్ని టీజేఏసీ చైర్మన్ కోదండరాం సైతం వెల్లడించారు. ఇది తెలంగాణ ప్రజల తొలి అద్భుత విజయమని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వంపైన ముప్పేట దాడి చేసి తెలంగాణ ప్రజలు ఒక అసాధారణమైన, అపూర్వమైన, చారివూతాత్మక ఘన విజయాన్ని సాధించారని చెప్పారు. అయితే ఈ విజయంతోనే సంబరపడటానికి అవకాశం లేదని అన్నారు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యంపైన విశ్వాసంతోనే తెలంగాణ మార్చ్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారన్న సత్యాన్ని ప్రపంచ ప్రజలకు తెలియచేయాలని ఆయన పిలుపునిచ్చారు. గాంధేయమార్గంలో, శాంతియుతంగా, క్రమశిక్షణతో, ప్రజాస్వామ్యయుతంగా నెక్లెస్‌రోడ్డు మీదికి చేరుకోవాలని, ప్రజాస్వామిక ఆకాంక్షను ఘనంగా ప్రకటించాలని కోరారు. తెలంగాణ ప్రజల సంఘటిత ప్రజాస్వామిక చైతన్యాన్ని, శాంతి, సహనాల విలక్షణతలను గమనించి ఢిల్లీ పాలకులు విస్తుపోవాలని అన్నారు. ఢిల్లీ పాలకులు కళ్లు తెరవాలని, తెలంగాణ శాంతిని అపహాస్యం చేస్తున్న ఇన్‌చార్జి డీజీపీ దినేశ్‌డ్డి వంటి వ్యక్తులు మరోసారి మాట్లాడకుండా మహోన్నత శాంతియుత ప్రజాస్వామిక చైతన్యాన్ని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఇన్‌చార్జి డీజీపీ తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా మాట్లాడారని అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు హైదరాబాద్‌కు చేరుకోకుండా సరిహద్దులలో నిర్మించిన బారికేడ్లు తీసేయాలని, తెలంగాణ ఉద్యోగులపై బనాయించిన బైండోవర్ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఉద్యమంలో పాల్గొనాలని, చీమల బారులవలె రోడ్లమీదనుండి సద్దిమూటలతో ఒక చేతిలో తెలంగాణ జెండాను పట్టుకొని నినాదాలతో నెక్లెస్‌రోడ్డుమీదికి చేరుకోవాలని కోరారు. 
                          తెలంగాణ మంత్రులు కుందూరు జానాడ్డి, సబితా ఇంద్రాడ్డి, బస్వరాజు సారయ్య, ప్రసాద్, ఉత్తమ్‌కుమార్‌డ్డి, ఎంపీ పొన్నం ప్రభాకర్‌లతో పాటు టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, తెలంగాణ నగారా సమితి ఎమ్మెల్యేలు అనుమతి తీసుకురావటంలో విశేష కృషి చేశారంటూ తెలంగాణ ప్రజల పక్షాన అభినందనలు తెలియజేశారు. ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ జీ దేవీప్రసాద్ మాట్లాడుతూ, వివిధ జిల్లాల్లో ఉద్యోగులపై బనాయించిన 2వేలకు పైగా బైండోవర్ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. టీజేఏసీ కన్వీనర్ కే స్వామిగౌడ్ మాట్లాడుతూ నెక్లెస్‌రోడ్‌పైన తెలంగాణ ఆత్మగౌరవ పోరాట సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పుదామన్నారు. ఆకాంక్షల వ్యక్తీకరణగా తెలంగాణ మార్చ్‌ను నిర్వహించాలని, ఉద్యోగులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని సెక్రటరీ జనరల్ వీ శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఉద్యోగులు కుటుంబాలతో తెలంగాణ మార్చ్‌కు రావాలని కో-చైర్మన్ సీ విఠల్ కోరారు.

Friday 28 September 2012


Tuesday 25 September 2012

Basara : Gnana Saraswathi Temple

History :
           Located on the banks of river Godavari, the Gnana Saraswathi Temple at Basara situated about 40 kms from Nizambad district head quarters and 70 Kms from Nirmal town of Adilabad district. Situated at a distance of 205 kms (approx) from Hyderabad. 
       The Saraswati temple at Basara is one of the two famous Saraswati temples in India, the other being in Jammu & Kashmir. Legend has it that Sage Vyasa during his stay here used to bring daily three handfuls of sand after a bath in Godavari and kept it at a place, which transformed as the images of Saraswati, Lakshmi and Kali. How ever, according to Brahmandapuranam, Adikavi Valmiki installed Saraswati and wrote Ramayana here. 
        There is a marble image of Valmiki and his samadhi near the temple. It is believed that this temple is one of the three temples constructed near the confluence of Manjira and Godavari rivers by Ashtrakutas. According to another school of thought ‘Bijialudu’ a Karnataka king, who ruled the province of Nandagiri with Nanded as his capital in the sixth century, constructed the temple at Basara.
 The image of Lakshmi stands besides Goddess Saraswati in the sanctum sanctorum. Due to the presence of Saraswati, Lakshmi and Kali, Basara is considered as the abode of the divine trinity on the Bank of the River Godavari which is 40kms from Nizamabad on Adilabad district border.
          Now a days there is heavy rush of pilgrims coming to Basara to perform “Akshara abhyasam” for the children. According to the legend Maharishi vyasa and his disciples and sage Suka decided to settle down in a cool and serene atmosphere after the kurukshetra war. 
            In the quest for the peaceful abode, he came to Dandaka forest and pleased with serenity of the region selected this place. After his ablutions in the river Godavari Maharishi Vyasa used to bring three fistful of sand and place it in three small heaps and made images Sarada, Laxmi, Gowri with his mystic power and later conducted prayers. This idol made of sand has its face smeared with turmeric. Eating a little bit of this turmeric paste, it is believed, will enhance one’s wisdom and knowledge. Many people, in fact, take their kids to Basara for “Akshara abhyasam” before commencing formal school education.
       Special poojas and celebrations are held at the temple during Maha Sivarathri, beginning 15 days before (Vasantha Panchami) and continuing 3 days after the festival. Devi Navarathrulu is celebrated for ten days during Dasara. Since Maharishi Vyasa spent considerable time in prayers, the place was then called “Vasara” and turned into Basara due to the influence of the Marathi language in the region.

Friday 21 September 2012

కొండా లక్ష్మణ్‌బాపూజీ కన్నుమూత

      స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ(97) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో సెప్టెంబర్ 21 ఉదయం   తుదిశ్వాస విడిచారు. సెప్టెంబర్‌ 27, 1915లో ఆదిలాబాద్‌ జిల్లా వాంకిడిలో లక్ష్మణ్‌బాపూజీ జన్మించారు. 1942  క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1952లో నాన్‌ముల్కీ, 1969లో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.  1969లో తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన బాపూజీ.. శాసనసభ ఉప సభాపతిగా కూడా పని చేశారు.తెలంగాణ సాధన సమితి సభ్యునిగా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.  తెలంగాణ ఉద్యమం కారణంగా మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. అనంతరం నవ తెలంగాణ ప్రజాపార్టీని స్థాపించారు. హైదరాబాద్‌లో అఖిలభారత పద్మశాలి సంఘాన్ని ఏర్పాటు చేసి సేవలు అందించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.      
            కొండా లక్ష్మణ్‌ బాపూజీ మృతికి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాపూజీ మరణం తెలంగాణ ఉద్యమానికి తీరని లోటు అని  కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చూసి చనిపోవాలని బాపూజీ కలలు కన్నారని ఆయన తెలిపారు. మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, డీకే అరుణ, గీతారెడ్డి, సునీతాలక్ష్మా రెడ్డి, ఉత్తమ్‌కుమార్, ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, గాయని విమలక్క , ప్రజాగాయకుడు గద్దర్ బాపూజీ మృతికి సంతాపం తెలిపారు. తెలంగాణ కోసం బాపూజీ నిరంతరం కృషి చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర కోసం ఆయన ముందుండి పోరాటం చేశారని గద్దర్ తెలిపారు. 

Monday 17 September 2012

సెప్టెంబర్ 17 తెలంగాణం  
                                    
                                  1947 - స్వేచ్ఛా భారతం 
                   1947 ఆగస్టు 15... తెల్లదొరల దాస్యశృంఖలాలు తెంచుకొని యావత్ భారతం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది..! జనవాహిని సంబరాల్లో మునిగితేలింది..! మేధావులు.. భావి భారతానికి పునాదులు వేసే పనిలోపడ్డారు..! కానీ, ఒక్క తెలంగాణ తప్ప.. తెలంగాణ జనవాహిని తప్ప..! ఆ స్వేచ్ఛావాయులకు దూరంగా ఉండిపోయింది. సంబరాలు సరిహద్దు మూలల్లో దోబూచులాడాయి..! బానిస సంకెళ్లు రతనాల వీణపై ముప్పేట దాడిచేశాయి. నిజాం నియంతృత్వపోకడలకు, రజాకార్ల దాష్టీక చర్యలకు తెలంగాణ అవని కొంగు కప్పుకొని గుక్కపట్టి ఏడ్చింది..! తన పిల్లల హాహాకారాలు చూడలేక తల్లడిల్లిపోయింది..! దేశానికి స్వాతంత్య్ర వచ్చిన 13 నెలల తర్వాత.. అంటే 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ జనని భారత మాతకు జై కొట్టింది..! అంతకుముందు జై కొట్టిన వారు జైళ్లపాలయ్యారు..! వందేమాతరం ఆలపించినవారు కర్కష కోరల కాటుకు బలయ్యారు..!
                                       ప్రసంగిస్తున్న నెహ్రూ                  
                        దేశానికి స్వాతంత్య్ర వచ్చిన 13నెలలకు తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది.. కానీ, ఆ వాయువులు ఎన్నాళ్లూ ఉండలేదు..! బలవంతపు కలుపుగోలు కుట్రకు సమైక్య ఉచ్చులో నేటికీ తెలంగాణ విలవిలలాడుతూనే ఉంది. వివక్షల నడుమ తన ఆకాంక్షను చాటేందుకు ఉద్యమ జెండా ఎత్తుతూనే ఉంది..! ప్రత్యేక రాష్ట్రం కోసం నినదిస్తూనే ఉంది..! అయినా.. పాలకుల గుండెలు కరగడం లేదు. ఆకాంక్షను అణచివేయడమే పనిగా ముందుకు కదులుతున్నారు. నాడు నిజాం నుంచి విముక్తి పొందిన తెలంగాణ తల్లి.. నేడు సమైక్య దాడి నుంచి బయటపడేందుకు ఎదురుచూస్తోంది. నిజాం నియంతృత్వం నుంచి బయటపడ్డ ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వాలే ఉత్సవాలు జరుపుతుండగా నాలుగున్నర కోట్ల ప్రజలున్న తెలంగాణలో మాత్రం ‘సమైక్య’ సర్కారు ఆ ఊసెత్తడం లేదు..! అదీ కాక, ఉత్సవాలు జరపాలన్నందుకు ఉక్కుపాదం మోపుతోంది..! నిజాం నుంచి విముక్తి పొంది భారతావనిలో తెలంగాణ కలిసిపోయిన రోజు(సెప్టెంబర్ 17) అనేది ఇప్పటికీ తేలని చర్చే.. విమోచన దినమా, విలీన దినమా, విద్రోహ దినమా..
ఇదీ చరిత్ర...                     పటేల్ తో  నిజాం 
బ్రిటిష్ పాలకుల నుంచి దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ ప్రాంతాన్ని ఇండియన్ యూనియన్‌లో కలిపేందుకు నిజాం ససేమిరా అంగీకరించలేదు. అదీకాక రజాకార్లు రెచ్చిపోయారు. భారత మాతను కీర్తించినందుకు, మువ్వన్నెల జెండా చేతపట్టినందుకు అణచివేతలకు దిగారు. అకృత్యాలకు పాల్పడ్డారు. దీంతో తెలంగాణలో పౌర యుద్ధం జ్వాజ్వల్యమానంగా ఎగిసిపడింది. 1940 నుంచి 1948 వరకు తెలంగాణలో చెలరేగిన ఉద్యమాలలో భారత కమ్యూనిస్టు పార్టీ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఆర్‌ఎస్‌ఎస్, ఆర్యసమాజం వంటి ఉద్యమశక్తులన్నీ, శ్రేణులన్నీ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటాలను నిర్వహించాయి. రావినారాయణడ్డి, బద్దం ఎల్లాడ్డి, మఖ్దూం వంటి యోధులు నిజాంను తరిమికొట్టాలంటే సాయుధపోరాటం చేయాల్సిందేనని నినదించారు. 
                                               రజాకార్లు 
ఈ పిలుపు మేరకు తెలంగాణలో మొట్టమొదట కమ్యూనిస్టు పార్టీ తరఫున సాయుధపోరాటానికి రగలింది. సాయుధ పోరాట పిలుపు ప్రకటనపై ఈ ముగ్గురు యోధులు సంతకాలు చేశారు. ఈ పిలుపు నేపథ్యంలోనే ఆంధ్రమహాసభ, ఉద్యమాలు, గుతప సంఘాలు వచ్చాయి. రామానందతీర్థ నాయకత్వంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కూడా ఉద్యమ దళాలను ఏర్పరిచింది. సూర్యాపేట సమీపంలోని రేపాలలో కాంగ్రెస్ వాలంటీర్లకు యుద్ధ నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ సారథ్యంలో 28వేల గ్రామాల్లో గుతప సంఘాలు ఏర్పడ్డాయి. దొడ్డి కొమరయ్య, బందగీ, సోయబ్-ఉల్లా-ఖాన్ వంటి తెలంగాణ వీరులు అమరులయ్యారు.
                                            ఉద్యమ దళo 
                 గుతప సంఘాలు, రైతుకూలీ సంఘాల సారథ్యంలో 10 లక్షల ఎకరాల భూమిని పేదలు పంచుకున్నారు. ప్రజల నుంచి యుద్ధం ఎదురవుతున్నా విలీనానికి నిజాం ఒప్పుకోలేదు. దీంతో 1948 సెప్టెంబర్ 14న అనాటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్‌పటేల్ హైదరాబాద్‌ను వశపరుచుకోవాల్సిందిగా నాలుగు వైపుల నుంచి మిలటరీ సైన్యాలను పురమాయించారు. మిలటరీ సైన్యాలు, కాశీం రజ్వీ సైన్యాలు హోరాహోరీగా పోరాడాయి. మిలటరీ సైన్యాలతో గొట్టిముక్కల గోపాలడ్డి వంటి కమ్యూనిస్టు యోధులు తుదిశ్వాసవరకు యుద్ధంచేశారు. నాలుగు వైపుల నుంచి పంపిన మిలటరీ సైన్యాలలో ఏ జనరల్ సారథ్యంలోనైతే సైన్యం ముందుగా హైదరాబాద్‌ను వశపరుచుకుంటుందో, ఆ జనరల్‌కు ఏడాదిపాటు హైదరాబాద్‌ను పరిపాలించే అవకాశం కల్పిస్తానని సర్దార్‌ప ఆశచూపించారు. 

                                       జనరల్ జైన్ మిలటరీ                                  
        ఆ క్రమంలో జనరల్ జైన్ మిలటరీ ఆధ్వర్యంలో తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రారంభమైంది. 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు నిజాం లొంగిపోయారు. తెలంగాణను ఇండియన్ యూనియన్‌లో కలిపారు. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు జనరల్ చౌదరి సారథ్యంలో తెలంగాణలో మిలటరీ పాలన కొనసాగింది. 1950 జూన్ 12న బూర్గుల రామకృష్ణారావు సారథ్యంలో తాత్కాలిక పౌర ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వాన్ని ఆనాటి రాజవూపముఖ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ (ఏడవ నిజాం) పదవీ ప్రమాణం చేయించారు.
                                          ఏడవ నిజాం
         ఆ తర్వాత 1952లో జరిగిన సాధారణ ఎన్నికలలో నెహ్రూకు కూడా రానంత మెజార్టీని ఇచ్చి రావినారాయణడ్డిని తెలంగాణ ప్రజలు పార్లమెంటుకు పంపించారు. తెలంగాణ జిల్లాలన్నింటిలో 50 శాతం వరకు కమ్యూనిస్టులు నెగ్గారు. బూర్గుల రామకృష్ణారావు నాయకత్వంలో హైదరాబాద్‌లో 1952లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది.
          ‘సమైక్య’ కుట్ర..:  నిజాం నుంచి విముక్తి పొందిన తెలంగాణకు ఎన్నాళ్లూ ఆ స్వేచ్ఛావాయువులు మిగలలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు పేరిట తెలంగాణను సీమాంధ్రలో కలిపేశారు. దాన్ని అడ్డుకున్నందుకు ‘సమైక్య’ కుట్ర పగబట్టింది. ఇప్పటికి వివక్ష పేరిట తెలంగాణను అణచివేస్తూనే ఉంది.
-(టీ మీడియా):

Friday 14 September 2012

తెలంగాణ ఉక్కు
       
                           

Wednesday 12 September 2012

“తెలంగాణ మార్చ్” భారీ స్థాయిలో సన్నాహాలు
 తెలంగాణ ఉద్యమం ఢిల్లీ పీఠాన్ని కదిలించడానికి ఈ నెల 30న తలపెట్టిన ‘తెలంగాణ మార్చ్’ కోసం ఈ ప్రాంత ప్రజానీకం మొత్తం సమాయత్తమవుతోంది. “ఇంటికో మనిషి, చేతిలో జెండా” నినాదంతో రాష్ట్రాన్ని సాధించుకోవడానికి కనీవినీ ఎరుగని పోరాటానికి తెలంగాణ ప్రాంత ప్రజలు సన్నద్ధం అవుతున్నారు.    
        ఇదివరకు నిర్వహించిన అన్ని ఉద్యమాలను తలదన్నే విధంగా ఈ మార్చ్‌ను నిర్వహించేందుకు తెలంగాణ జేఏసీ ప్లాన్ చేస్తోంది. దీనికొరకు జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్వయంగా అన్ని జిల్లాల్లో పర్యటనలు జరుపుతున్నారు. తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపునందుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, లాయర్లు, డాక్టర్లు, ప్రైవేట్ ఉద్యోగులు, కవులు, కళాకారులు, కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, మైనారిటీలు తమతమ పరిధిలో సన్నాహక కార్యక్రమాలతో సంఘటితమవుతున్నాయి. జేఏసీలో భాగస్వామ్య రాజకీయ పార్టీలు టీఆర్‌ఎస్, బీజేపీ, న్యూడెమొక్రసీలు తెలంగాణ మార్చ్ కోసం కేడర్‌ను సిద్ధం చేస్తున్నాయి.  ఈ మార్చ్ కు ఇప్పటికే సీపీఐ, తెలంగాణ నగారా పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి.
       ఇక గద్దర్, ఆకుల భూమయ్య, వేదకుమార్, చిక్కుడు ప్రభాకర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రజా ఫ్రంట్, కపిలవాయి దిలీప్‌కుమార్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ విమలక్క తదితర ఉద్యమకారుల మద్దతు కూడగట్టెందుకు తెలంగాణ జేఏసీ ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. సెప్టెంబర్ 16వ తేదీన కరీంనగర్ టౌనులో కవాతును నిర్వహించడం ద్వారా జిల్లాల్లో ప్రజలను కూడా మార్చ్ కు సన్నద్ధం చేయనున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఐదు వేల మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని జేఏసీ జిల్లా కమిటీలకు సూచించింది. మొత్తమ్మీద 30 సెప్టెంబర్ మార్చ్ కు పది లక్షల మందిని తరలించేందుకు ప్రణాళిక సాగుతోంది. పోలీసుల నిషేదాజ్ఞలు ఉన్నా వీరంతా దశల వారీగా హైదరాబాద్‌కు చేరుకునేలా జేఏసీ కార్యాచరణను రూపొందించింది.                                                         
       తెలంగాణ ఉద్యమ ప్రధాన ఘట్టాలపై వీడియో డాక్యుమెంటరీని, తెలంగాణ మార్చ్‌పై  ప్రత్యేకంగా  రూపొందించిన పాటల సీడీలను అన్ని ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఇప్పటికే పోస్టర్లు, స్టిక్కర్లు  ముద్రించి జిల్లాలకు పంపించారు.ఇక మార్చ్ కు ప్రజలను ఆహ్వానిస్తూ తెలంగాణ జాయింట్ ఆక్షన్ కమిటీ రూపొందించిన గీతం ఇప్పటికే అన్నిచోట్లా మార్మోగుతోంది.మొత్తానికి సెప్టెంబర్ 30 నాడు తెలంగాణను వ్యతిరేకించే వారి వెన్నులో వణుకుపుట్టేలా, ఢిల్లీ నేతలు దిగివచ్చేలా మార్ ఉండబోతోందని తెలుస్తున్నది.   
తెలంగాణపై కాలకూట విషం..

       పటాన్‌చెరు దాటగానే మీ వాహనాలను అడ్డుకునే ఆటంకం ఒకటి ఉంటుంది. అద్దాల గదులతో నిర్మితమై కాలడ్డం పెట్టినట్టు కట్టె అడ్డంపెట్టే ఆ టోల్‌గేట్ మీ మీ తోలు వలిచి పైసలు వసూలు చేసి మీకు దారి ఇస్తుంది. మీ ఊర్లో మీరు, మీ ప్రాంతంలో మీరు స్వేచ్ఛగా తిరగలేమా? అనుకునే సహజన్యాయాన్యాయాల ప్రశ్న అక్కడ తలెత్తితే మీమీద చెయ్యెత్తే మనుషులు కూడా ఉంటారు. కనుక బుద్ధిగా తోలు సారీ టోల్ వలిపించుకు ని మీ ప్రాంతాల్లో మీరు తిరిగేసెయ్యొచ్చు. ఈ టోల్‌గేట్ కావూరి సాంబశివరావుది. ఇప్పుడాయన రోడ్డుకు కాదు ఏకంగా తెలంగాణకే అడ్డంపడ్తున్న పారిశ్రామిక వేత్త. రోడ్లూ ప్రైవేట్ పరం చేసి బీవోటీ పద్ధతిలో వేసిన కాణ్నుం చి ఇదే నమూనా. ఇది సరళీకరణ విధానాల తర్వాత అభివృద్ధి నమూనా. ప్రైవేట్ పెట్టుబడులు పెంచి మౌలిక సదుపాయాలు కల్పించే నమూనా. ఇటు విమానాక్షిశయానికి వెళ్లేందుకు వేసుకున్న పదమూడు కిలోమీటర్ల వంతెన కావొచ్చు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు మల్లెపూల తోటలను మింగి ఇచ్చిన భూమి కావొచ్చు. అటు విజయవాడకు వెళ్లే నాలుగులేన్లుగా వెడల్పౌతున్న రహదారిలో భవిష్యత్‌లో మొలిచేవి కావొచ్చు, వరంగల్ రహదారిలో వెలుస్తున్న వసూల్ రాజాల అడ్డాలు కావొచ్చు. అన్నింటి సారమొక్కటే. నిర్మించు.. వసూలు చేసుకో.. ఈ వసూలు చేసుకునే విధానాన్ని నిశ్శబ్దంగా అంగీకరించినాం, అంగీకరిస్తున్నాం కాబట్టి, ఇక్కడి కాంట్రాక్టర్ల, పెట్టుబడిదారుల, కార్పొరేట్ల రూట్లు దేశవ్యాప్తం, విశ్వవ్యాప్తం అయివున్నవి కాబట్టే ఇవ్వాళ్ల కావూరి సాంబశివరావు ప్రధాని వద్ద తెలంగాణకు అడ్డంగా, ఒక ఆటంకం గా, అడ్డం పొడుగూ అబద్ధాలాడుతూ ‘కావూరి విషం’ కక్కగలుగుతున్నాడు. బహుశా అర్థం చేసుకోగలిగితే తెలంగాణను విధ్వంసం చేసింది, దోచుకుంటున్నది, తెలంగాణ ప్రజలను కూలీలను, బానిసలను, బిచ్చగాళ్లను చేసి, ఎదిగిన కార్పొరేట్ మహాసావూమాజ్యాలు నిర్మించుకోగలిగిన పాలకపక్షాన్ని నిర్మాణం చేసుకోగలిగిన సీమాంవూధలోని గుప్పెడుమంది గుత్త పెట్టుబడిదారులే. అందుకే ప్రధాని కూడా, వాషింగ్టన్ పోస్టు చెప్పిన మౌనాన్ని కాస్తవీడి, విషాదంగా ‘అవును నాకు అన్నీ తెలుసు’ అంటాడు. సారాంశంలో తెలంగాణను ఇప్పుడు అడ్డుకుంటున్నది దోచుకుంటున్నది గుప్పెడు మంది పెట్టుబడిదారులే. వీళ్లే అడ్డగోలు వాదనలు, అన్యాయపు ఆరోపణలు, తప్పులతడకల లెక్కలు, విశ్లేషణలు చెప్పి తెలంగాణ ఆకాంక్ష మీద కాలకూట విషం కక్కుతున్న శక్తులు.
      ఎంపీలంటే కొంత విచక్షణా జ్ఞానం ఉంటుందని అనుకుంటాం. తెలంగాణ ఎందుకు ఇవ్వకూడదో? చెప్పడంలో వారికి బలమైన వాదనలేవో ఉన్నాయనుకుంటాం. కనీసం ఆశిస్తాం. సమైక్యంగా ఉంటే తెలుగువాళ్లంతా ఒక్కటిగా ఉంటే బాగుంటుందని వాదనలేవో చేస్తారని ఊహిస్తాం. కానీ తెలంగా ణ పట్ల గుడ్డిద్వేషం, తెలంగాణ ప్రజల పట్ల చిన్నచూపు, వాస్తవాలను పూర్తి గా అబద్ధాలుగా చెలామణి చెయ్యడం మొన్న ప్రధానిని కలిసిన ఎంపీల పత్రం సారాంశం. దీని సూత్రధారులు ఎవరైతే రోడ్ల మీద దర్జాగా టోల్‌గేట్ లు పెట్టి చట్టబద్ధంగా దాదాగిరీ చెయ్యగల స్థితిలో ఉంటారో? వారే తెలంగాణ రాకుండా టోల్‌గేట్లు పెట్టగలిగిన పెట్టుబడిదారులు.అయిదు పేజీల ఎంపీల పత్రం పచ్చి అబద్ధాల పుట్ట. ఒక్కొక్కటి చూద్దాం. సమైక్య రాష్ట్ర ప్రకటన తర్వాత చిన్నపాటి ఆందోళనలు ఉండొచ్చు. తర్వాత అవి కనుమరుగైపోతాయి. ఆరు నెలల్లో పూర్తిగా కనుమరుగైపోతాయి. బహు శా ఇంతకన్నా అన్యాయమైన, దుర్మార్గమైన తప్పుడు అంచనా మరొకటి ఉండబోదు. పైగా రాష్ట్రంలో అనిశ్చితి కొనసాగవద్దు. కొనసాగితే పార్టీకి నష్టం అని చెప్పే ఈ పత్రంలో తెలంగాణ ఉద్యమం పట్ల ఉన్న అహంకారపూరితమైన చిన్నచూపు ఉంది. సూట్‌కేసులు, ధనరాసులు ప్రభుత్వాల్ని, ప్రపంచబ్యాంకు విధానాలను ప్రభావితం చెయ్యగలవేమో కానీ, ప్రజల ఆందోళనలను అదుపు చెయ్యలేవనే విషయం తెలియని దుర్బేధ్యమైన అజ్ఞానం కలిగిన ఆ ఎంపీల ప్రతిభా పాటవాలను ఎట్లా అర్థం చేసుకోవాలి. నిజంగానే తెలంగాణ ఉద్యమం ఆగుతుందా? అది సెప్టెంబర్ 30ని కలవరిస్తూ ఉన్నది. పలవరిస్తూ ఉన్నది. కలగంటూ ఉన్నది. అయినా కాంగ్రెస్‌పార్టీకి తెలంగాణ ఇప్పటికే శూన్యాలను చూయించింది. బహుశా ఆరునెలల్లో ఆగడం కాదు. తెలంగాణ వచ్చేదాకా పోరాటం సాగడం తప్ప తెలంగాణ ముందు మరో దారి లేదు. నిలువు నిలువునా ఒక ఆకాంక్ష కోసం కాలిపోయిన వీరులగన్న నేల ఇది.
      ప్రాంతీయ అసమానతలు ఉంటే ప్రత్యేక ప్యాకేజీలు ప్రత్యేక మండళ్లు ఉంటే సరిపోతుందని మరో సూచన. తెలంగాణ ఉద్యమం స్వభావానికి, డిసెంబర్ 9 ప్రకటనకి, ప్రత్యేక ప్యాకేజీలకు ఏదన్నా లంకె ఉందా? కనీసం బోడిగుండుకు మోకాలుకున్నట్టయినా. అన్నింటికన్నా తెలంగాణను చిన్నబుచ్చే తీవ్ర ఆరోపణలు చేశారు కావూరి ప్లస్ బృందం. రాష్ట్ర విభజన తీవ్రవాదం మతఛాందసవాదానికి ప్రోత్సాహమిస్తుందన్నదే ఆ అభాండం. తెలంగాణలోనే కాదు అది వామపక్షవిప్లవాలైనా, మత ఛాందసవాదమైనా ఇవ్వాళ్ల దేశవ్యాప్త వెల్లడులు. కానీ తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్‌కు గంగా జమునా తెహజీబ్ అనే పేరుంది. భిన్న మతాలవారు, భిన్న ప్రాంతాల వారు, భిన్న జాతులు సమైక్యంగా జీవనం సాగించిన చరిత్ర ఉంది. ఇతరులను ఆదరించి అన్నంపెట్టి అక్కున చేర్చుకుని, ఆలింగనం చేసుకునే నేల ఇది. హైదరాబాద్ అల్లర్ల మూలాలు మళ్లీ ఇదే పెట్టుబడి పంకిలంలో, ప్రయోజనాల్లో ఉంటుంది. కానీ సహజీవనాన్ని ఆచరించి చూపిన ఒక హైదరాబాద్ గుండెకాయ గల తెలంగాణను అనే దురహంకారానికి మూలం ఎక్కుడుం ది? ఎవరు వారు? సమైక్యంగా ఉండాలని కోరుకునే వాడికి ఉండాల్సిన బుద్ధీ జ్ఞానం ఇదేనా?ఇంకా ఎంత దుర్మార్గమంటే విభజన అయితే తెలంగాణ అసోం తరహా మారే అవకాశం ఉంది. ఈ కావూరి విషానికి వెనుక ఇంతటి అహంకారం వెనుక, అది చెల్లుబాటు కావడం, చెలామణి కావడం వెనుక ఒక బలుపు ఉన్నది. కానీ చరివూతలో ప్రతిపెట్టుబడిదారీ బలుపు వాపుగా నిరూపణ అయింది. ఎవరిచ్చారీ అహంకారపు మాటలని మాట్లాడే హక్కన్నదే ఇప్పటి ప్రశ్న. విద్యుత్తు వినియోగంలో తెలంగాణ, ఆంధ్ర రాయలసీమల కంటే ఎంతో ముందున్నది. మిగతా ప్రాంతాల కన్నా పారిక్షిశామికంగా అభివృద్ధి చెందిందని చెప్పడానికి ఇదే నిదర్శనం అన్నది మరో పచ్చి అబద్ధం. ప్రాంతీ య అసమానతలు అనడం ఈ వాదనకు తద్వి రుద్ధం. తెలంగాణలో కరెంటు బావుల ఆధారిత వ్యవసాయం గురించి, హైదరాబాద్ గురించి తెలిసిన వాళ్లెవరూ ఈ పచ్చి అబద్ధం ఆడరు. వ్యవసాయ వినియోగ కరెంటు, హైదరాబాద్ కేంద్రంగా పరిశ్రమలకు వినియోగించే కరెంటు తీసేస్తే తెలంగాణ వినియోగం సులభంగానే తెలుస్తుంది. ఎంపీలకు ఈ మాత్రం జ్ఞానం ఉండదనుకోలేదు. కానీ పచ్చి అబద్ధాలు అయినా ఆటంకం పెట్టడం వాళ్ల లక్ష్యం. కొంతమంది రాజకీయ నిరుద్యోగుల ఉద్యమంగా మరో దుష్ప్రచారం. ఇది తెలంగాణ బలవంత విలీనమంత పురాతన అబద్ధం. ఎనిమిది వందల పైచిలుకు బలిదానాలు జరిగిన ఒక ఉద్యమం గురించి మాట్లాడే మాటలివి. రాజకీయ ఉద్యోగులో, నిరుద్యోగులో గీపెడితే రేగే ఉద్యమాల్లో స్వచ్ఛంద మరణాలుండవు. బలిదానాలు ఉండవు. ఆత్మలు మేల్కొని అనుసంధానం అయిన ఈ ఉద్యమంపై ఇంత చిన్న చూపు ప్రదర్శించిన వారి వక్రబుద్ధిని ఏమనాలి?
          ఎన్నికల గురించీ అంతే. తెలంగాణ ఉద్యమం ఊరూరికి, వాడవాడకూ విస్తరించి, తెలంగాణ కోసం ఒక రాజకీయ పార్టీ ఏర్పడిన తర్వాత ఉప ఎన్నికలూ ఒక్కొక్కసారి వాదాన్ని బలంగా నిలబెట్టడానికి ఉపయోగపడ్డాయి. నాలుగేళ్లకే తీసుకున్న కాంగ్రెస్ పార్టీ శాతాలను చూసినా , తెలుగుదేశం పార్టీ ఓట్ల శాతాలను చూసినా అవి ఎట్లా దిగజారుతున్నాయో సులభంగానే అర్థమవుతుంది. ఒక్క ఈ ఎంపీలకు తప్ప. ఒక్క పరకాల ఎన్నికలో 33 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి కనుక, మిగతా పార్టీలకు 67 శాతం వెళ్లాయి కనుక తెలంగాణ వాదం లేదనడం బధిరాంధత్వం కాక మరేమవుతుంది. పరకాల ఎన్నికల్లో తెలంగాణ అనని పార్టీ ఏదన్నా ఉందా? ఇప్పటికైనా తెలంగాణ అంశం లేకుండా ఎన్నికల్లో నిలబడే మొనగాడెవడైనా ఉన్నాడా? సిగ్గులేని ఈ ఎంపీల పార్టీకి అందరికన్నా తక్కువ ఓట్లెందుకు వచ్చాయి. అన్ని ఉప ఎన్నికల్లోనూ, అధికారంలో ఉండికూడా బొక్కబోర్లా పడ్డా కూడా ఇలాంటి విశ్లేషణలు, అబద్ధాలు అధిష్టానానికి ఇచ్చేవాళ్ల మెదళ్లలోనన్నా తేడా ఉండాలి లేదా వాటిని స్వీకరించే వారి మెదళ్లన్నా మరోరకంగా ఉండాలి. పైగా తెలంగాణకు వలసలు పెరిగాయని, అవి ఒక  శాతమని మరో అబద్ధం. కాకిలెక్కలు. తెలంగాణ అసోం అయితది అనేవాడివి, తెలంగాణకు ఇంతమంది ‘ఏం... బీక వచ్చినట్టు’అని ‘పొమ్మంటె పోవేందిరా పోరా ఓ వలసదొరా’ అని అడగడం ఇవ్వాళ్టి అవసరం ఇంకా పెరిగింది.తెలుగువారిని విభజిస్తే ఒక్క రాష్ట్రంలో ఆగదు. గ్రేటర్ హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రా, ఉత్తరాంధ్ర, గ్రేటర్ రాయలసీమ డిమాండ్లు వస్తాయని మరో ఊహ పరికల్పన. వచ్చినా అది తెలంగాణకు, డిమాండ్‌కు ఏం సంబంధమో అర్థం కానిదేమీ కాదు.సరే. ఇట్లాంటి అపసవ్యపు విశ్లేషణలు, వక్రీకరణలలో కూడిన ఈ పత్రం వెనుక దాగిఉన్న అంతర్గత వలసాధిపత్య పెత్త నం ఒక్కటే కారణం కావొచ్చు. ఈ అహంకార మూలాలు టోల్‌గేట్లలో ఉన్నా యి. ఇవ్వాల్టి వలసవాది మూలం అంతర్జాతీయ విపణిలో ఉంది. బహిరంగ మార్కెట్‌లు ఖులాయించడంలో ఉంది. సరళీకరణ తర్వాత అడ్డపంచె కట్టుకున్న వలసవాది, సూటూబూటు వేసుకున్న వలసవాది కార్పొరేటై, సూట్‌కేసులు అందించి ‘మేనేజ్’ చేసే ప్రభుత్వాల్లో ఉంది. అందుకే తెలంగాణ సమ స్య పైకి కనబడేంత సుల భ సమస్య కాదేమో. అది పెట్టుబడి విస్తరణ పాతుకుపోయిన సమస్య కూడా అనే అవగాహన ఇప్పటి అవసరం.అవునూ మీ వద్ద ఉద్యమాలు లేవు కదా! అని వాయలార్ రవి ఇదే ఎంపీలతో అన్నారు. తెలంగాణ ఇస్తే వస్తాయని ఎంపీల జవాబు. దేన్నైనా తయా రు చేయగల ఈ దురహంకార ఆధిపత్యవాదులు రేపు మేనేజ్డ్ ఉద్యమాలూ తయారు చేస్తారన్నమాట. అందుకే ఇలాంటి పెట్టుబడిదారుల ఆర్థిక మూలా లు ధ్వంసం చేయకుండా తెలంగాణ రాదనే వాళ్ల మాటలకు బహుశా విలువ పెరిగిందేమో. బహుశా రాకపోతే భవిష్యత్తులో అది తప్ప మరే దారీ లేదేమో.
స్వదేశీ కవిత్వ ఉద్యమ సారథి

   

          పాల్కురికి సోమనాథుడు 
            రెండు వేర్వేరు సిద్ధాంతాలకు అంకితమై, ఎన్నో కొత్త ఒరవడులకు కారకులైన ఇద్దరు గొప్ప కవులలో నన్నయపైన జరిగినంత అధ్యయనం పాల్కురికి సోమనాథుని విషయంలో జరగక పోవటానికి కారణాలు అనూహ్యం కాదు. సోమనాథుడు మొదలు పెట్టిన సమాజ సంస్కరణోద్యమం గురించీ, అంటరానితనం, కుల వ్యవస్థల నిర్మూలన గురించీ చర్చించడానికి విశ్వవిద్యాలయాలు గానీ పరిశోధకులు గానీ అంతగా ఆసక్తి కనపరచకపోయినా, అభ్యుదయవాదులు కూడా సోమన విషయంలో పెద్దగా స్పందన కనబరచకపోవటమే చరిత్ర పట్ల మనకున్న చిన్నచూపును పెద్దది చేస్తోంది. సోమన స్వదేశీ కవిత్యోద్యమాన్ని గాంధీగారి స్వదేశీ మంత్రంతో మాత్రమే పోల్చగలం. గాంధీ, సోమనలిద్దరూ దాస్యభావజాలం నుంచి జన విముక్తిని సాధించటానికి ఉద్యమాలు నడపటమే ఈ పోలికకు కారణం. 
           మును మార్గ కవిత లోకం/బున వెలయ(గ దేశి కవిత(బుట్టించి తెనుం/గును నిలిపిరంధ్ర విషయం/బున (జన జాళుక్య రాజు మొదలగు పలువురు... లోకం అంతా మార్గ కవిత వెలుగుతోంటే, చాళుక్య రాజులు ఇంకా మరికొందరు దేశికవితను తెలుగులో నిలిపారంటూ క్రీ. శ 1128లో నన్నెచోడుడు మొదటిసారిగా దేశికవిత గురించి ప్రస్తావించాడు. జాయప సేనాని నృత్త రత్నావళి నకీ.శ. 1250?) కాకతీయ యుగంనాటిదే! ఆ రోజుల్లోనే సాంస్కృతికపరమై న స్వదేశీ ఉద్యమానికి మంచి ప్రారంభం జరిగింది. వీరి తరువాతి తరం వాడయిన పాల్కురికి సోమనాథుడు ఈ దేశీయ భావానికి ఒక ఉద్యమ రూపాన్నిచ్చి నాయకత్వం వహించాడు.
          మార్గ, దేశి అనేవి మౌలికంగా సంగీత నాట్యరీతులకు సంబంధించిన పదాలు. నన్నెచోడు డు ఈ మార్గ, దేశి పదాలను తొలిసారిగా తెలుగు కవిత్వానికి ఆపాదించి, ఈ రెండు కవితారీతులకు గల తేడాలను విశ్లేషించాడు. ఆయన వాదాన్ని అందిపుచ్చుకొని, దేశికవితను ఉద్యమించి రాయాల్సిన అవసరం ఉందని భావించినవాడు పాల్కురికి సోమనాథుడు.
         తమిళులు సంగ సాహిత్య సంపదనంతా తమ దేశి సంపదగానే చెప్పుకొంటారు. ఏ భాషలోనయినా మొదట దేశి మాత్రమే ఉంటుంది. పండితుల కారణంగా దేశి అడుగంటి మార్గ వ్యాపిస్తుంది. ఊళ్ళ పేర్లను, మనుషుల పేర్లను సంస్కృతీకరించటం, చెన్నమల్లు అనే ద్రావిడ నామాన్నిశ్రీగిరీశ్వరుడుగా మార్చటం లాంటివెన్నో తెలుగునేల మీద జరిగాయి. తెలుగు శబ్దాలు పూర్తిగా కనుమరుగై పోయి, సంస్కృతమయం అయ్యే ప్రమాదం ఏర్పడింది. మాకు తెలుగు రాదనటం ఇవ్వాళ ఎలా ఘనమైన విషయమో అలానే వెయ్యేళ్ళ క్రితం కూడా మన పూర్వులు చెప్పుకొన్న పరిస్థితి. సంస్కృతం మధ్యతరగతి తెలుగు ప్రజలను అంతగా ప్రభావితం చేసింది. అప్పుడే సంస్కరణ వాదులకు దేశి భావన కలిగి ఉండాలి.
సోమన కాలానికి బహుశా జైన బౌద్ధాల పతనంతో వైదిక ధర్మాల వ్యాప్తి, సంస్కృత ప్రాబ ల్యం కారణంగా నన్నయాదుల చంపూ రీతి బహుళ వ్యాప్తిలో ఉండి ఉంటుంది. తెలుగు ద్వితీ య స్థానానికి దిగిపోవడంతో దేశీయ భాషేతివృత్త ఛందో రీతుల్నీ ద్విపద కావ్య మార్గాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం పాల్కురికి సోమనాథుడు చేయవలసి వచ్చింది. శాస్త్రాలనూ, శాస్త్రార్థాల నూ వివరించటానికి తెలుగు ఛందో రీతులు చాలవనే అభివూపాయాన్ని ఖండించటానికే ద్విపదలో బసవపురాణం, పండితారాధ్యుల చరివూతలను సోమన వెలువరించాడు.
            పాల్కురికి సోమనాథుడు 1160-1230 కాలంవాడు కావచ్చును. వరంగల్లు సమీపంలోని పాల్కురికి గ్రామంలో శ్రీయా దేవి, విష్ణురామ దేవుడు అనే దంపతులకు జన్మించాడు. జన్మతహా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందినవాడైనా, వీరశైవ దీక్ష తీసుకుని వీర మహేశ్వర వ్రతుడిగా మారాడు. తల్లిదంవూడులు జన్మనిచ్చిన కులాన్ని వదలి శివపార్వతుల్నే తల్లిదండ్రులుగా భావించటం వీర మహేశ్వర వ్రతం. వీళ్ళని జంగమ దేవరలంటారు. కులగోవూతాల పటింపు ఉండదు. ఈ కారణంగానే అంటరానితనాన్ని పాటించే అగ్ర కులాలను కులం పేరుపెట్టి తిట్టగలిగాడు. కులజుండు నతడే యకులజుండు నతడె/ కులము లేకయు నన్ని కులములు నతడేఅన గట్టిగా నమ్మినవాడు సోమనాథుడు. ప్రజలకోసమే అతడు పుట్టాడు-వూపజలే అతడిని అమర కవిని చేశారు అంటారు సమక్షిగాంధ్ర సాహిత్యంలో ఆరుద్ర! అసమాక్షు కొలవని అగ్రజుండైనా వసుధ మాలల మాలవాడు కాకెట్టు? అని ప్రశ్నించాడు. శివుని కొలవడం అంటే కులమతాలు పాటించకపోవటం, వర్ణవైషమ్యాలు వదిలేసుకోవటం, వైదిక క్రతువులను అంగీకరించకపోవటంగా ఆయన ప్రచారం చేశాడు. వేద భరాక్షికంతులనగబడిన బ్రాహ్మణ గార్ధబంబులతోడ ప్రతిసేసి యాడిన పాపంబు వచ్చునంటాడు. అంటరానితనాన్ని పాటించే బ్రాహ్మణులను మెడలో త్రాడు ఉన్న మాలలు-తాటిమాలలు-అని నిరసించాడు.

బలుపోడతోలు సీరమును బాపసరుల్ గిలుపారు కన్ను వె
న్నెలతల సేదుకుత్తుకయు నిండిన వేలుపు వల్గుపూ
సల గల రేని లెంకనని జానుదెనుంగున విన్నవించెదన్
వలపు మదిం దలిప్ప బసవా బసవా బసవా వృషాధిపా
 
అంటూ, వృషాధిపశతకంలో సోమనాథుడు స్వదేశీ జానుతెనుగు స్వరూపం ఎలా ఉంటుందో రుచి చూపించాడు. సోమనది రస ప్రధాన కవిత. వ్యక్తిగా, పాలకుడిగా కన్నడ ప్రాంతాలలో బసవన్న సాధించిన విజయాలను, తెలుగు నేలమీద సోమన తన సాహిత్యం ద్వారా సాధించాడు. పాడుకునేందుకు తెలుగువారికి ద్విపద, ఛందస్సును కానుకగా ఇచ్చాడు. పాల్కురికి సోమనాధుడు శివుని ప్రమథగణాలలో భృంగి అవతారమని వీరశైవులు నమ్ముతారు. ఇతర బ్రాహ్మణ శివకవులకు భిన్నం గా పాల్కురికి సోమనాథుడు బ్రాహ్మణుల ఆచార వ్యవహారాలను నిశితంగా విమర్శించాడు. నన్నయ వైదిక మతోద్ధరణ తన గురుతర బాధ్యతగా భావిస్తే,. సోమన వైదిక ధర్మాలను తుదముట్టించి కుల వర్ణ భేదాలు లేని సమ సమాజ నిర్మాణాన్ని తలపెట్టాడు.
             సోమన కాలానికి సాంస్కృతికంగా బౌద్ధం, జైనం బలహీనపడిన స్థితిలో ఉన్నాయి. జైన బౌద్ధ చార్వాక దుష్పథ సమయములు/ మూడును నిర్మూలము జేయుదనుక/మూడు రాలను వైతు ముప్పొద్దు నిన్ను అనీ, వసుధలో జినులను వారి నందరను/ నేలపాలుగజేసి అనీ సోమనాథుడు బసవపురాణంలో ముప్పేట దాడులు ఎలా చేయవలసి వచ్చిందో చెప్పుకున్నాడు. జైనులు, బౌద్ధులు రంగం నుంచి దిగజారి పోయిన తర్వాత మతోన్మాద గదాయుద్ధానికి వీరశైవ, వీరవైష్ణవులే మిగిలిరి. వీరు పరస్పరము తిట్టుకున్న తిట్లే ఒక చేట భారతమగును అని సురవరం ప్రతాపడ్డిగారు సోమన కాలంనాటి పరిస్థితులను వివరించారు. కర్మ చండాలురు, వ్రతవూభష్టులు, దుర్జాతులు, పశుకర్ములు, బాపన కూళలు,...ఇవన్నీ వైష్ణవులను తిట్టిన తిట్లే! కాకతీయ ప్రభువుల మద్దతు శైవులపక్షాన ఉంది. రాజాదరణతో గోలకీ మఠాలను సాధించుకున్నారు శివదీక్షను స్వీకరించిన బ్రాహ్మణులు గురుస్థానాలను పొందారు. కానీ, అప్పటిదాకా శివాలయాలలో పూజారులుగా ఉన్న తంబళ్లను తొలగింపచేసి, వారి స్థానంలో ఈ బ్రాహ్మణ గురువులు పూజారులయ్యారని సురవరం వారు పేర్కొన్నారు.
   అల్పాక్షరముల ననల్పార్థరచన కల్పించుటయు కాదె కవి వివేకంబు...? అంటూ, కవిత్వం లో సంక్షిప్తతను ఉద్యమస్థాయిలో సాధించాలని సోమనాథుడు ప్రయత్నించాడు, సంక్షిప్తత వలన సూటిదనం వస్తుంది. అది జన సామాన్యం హృదయాన్ని తాకుతుందని ప్రబోధించా డు. తెలుగుదనాన్ని తేట తెల్లంచేస్తూ, జాతులు రీతులు నేతులుట్టంగ దేశిభాషను తీర్చి దిద్దా డు. పొట్టయిన రత్నంబు చుట్టును పసిడి కట్టిన భావనగా ద్విపదకు కావ్య గౌరవాన్ని సాధిం చాడు. అప్రమాణమనీ, అనాద్యమనీ ద్విపదను ఎవంత ఈసడించినా ఆ దేశిఛందస్సులోనే మహా కావ్యాలు నిర్మించాడు. సంస్కృత భావజాలంలోచి బయ ట పడగలిగితేనే దేశి భాష బాగు పడుతుందని ప్రబోధించాడు. పెళ్ళీ, పేరంటాలకూ; పుట్టుక, చావులకూ దేనికీ తెలుగుని పనికిరాకుండా చేయటాన్ని ఖండించాడు. దేవుణ్ణి స్వంత భాషలో స్వంత పద్ధతిలో ఆరాధించుకోవాలని సూచించాడు. అందుకు అడ్డుపడే బ్రాహ్మణవర్గం పట్ల తన వ్యతిరేకతను స్పష్టంగానే ప్రకటించాడు. తన భావాలను వెల్లడించటానికీ, పరమత ఖండనానికి, స్వమత స్థాపనకూ జనభాషలో సాహిత్య సృష్టిచేయటం ఒక సాధనంగా చేసుకున్నాడు. తెలుగే దేవ భాషగా ఆయన నినదించాడు దెలుగు మాటలనగ వలదు,వేదముల కొలదియు కాజూడుడిల నెట్టులనిన అంటూ, తెలుగు మాటలు వేదముల తో సమానం అన్నాడు. జనవశీకరణకు అమ్మభాషే శరణ్యం అన్నాడు. అసలైన ప్రసన్న కథా కలితార్ధయుక్తి కలగలసిన రీతి లో కథ చెప్పే విధానాన్ని అవలంబించాడు. దేశి భావ జాలాన్ని, దేశి జీవన విధానాన్ని, దేశిభాషను ప్రతిబింబింపచేస్తూ, ప్రజా సాహిత్య ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. వస్తువులో కొత్తదనం తెచ్చాడు. పాల్కురికి తెలుగు నుడికారాన్ని, తెలుగు ఛందస్సును, తెలుగు శబ్దజాలాన్ని కలిగి ఉండటం మాత్రమే కాదు, అందులో సామాన్యుడు వస్తువుగా ఉన్నప్పుడే అది దేశి కవిత అవుతుందన్నాడు. సామాన్యుల్లో అసామాన్యులైన శివభక్తుల జీవితాలను భక్తి సూత్రాలతో బంధించి చిత్రించే ప్రయత్నం చేశాడు. దుర్గవ్వ, కిన్నెర బ్రహ్మయ్య, బెజవాడ కుమ్మరి గుండయ్య, మడివాలు మాచిదేవయ్య, కన్నప్పగా ప్రసిద్ధుడయిన తిన్నడు, మౌళిగ మారయ్య, ముసిడి చెన్నయ్య, మాల శివనాగుమయ్య, మేదర క్షేత్ర య్య, చెన్న మల్లన్న లాంటి సామాన్యుపూందరినో ప్రధాన పాత్రలుగా చిత్రించి వారి చరివూతలు వెలుగులోకి తేవటానికి ఈ స్వదేశీ భావనని ఉపయోగించుకొన్నాడు.
            'ఒక తెలుగు కవి తొలిసారిగా నిర్మించిన స్వతంత్ర పురాణం బసవపురాణం. ప్రప్రథమ ఆంధ్ర ద్విపద భారతి ఈ కృతి’ అని ఆచార్య జి వి సుబ్రహ్మణ్యం అన్నారు. బసవ పురాణ ము, పండితారాధ్యుల చరిత్ర రచనలతో బాటు సోమనాథుడు వ్రాసిన అనుభవసారము, వృషాధిప శతకము, చతుర్వేద సారము, సోమనాథ భాష్యము, చెన్నమల్లు సీసములు పరిష్కృతమైనవి చాలావరకూ దొరుకుతున్నాయి. ఇంకా, కొన్ని ఉదాహరణ కవితలు, రగడలు, అష్టకాలు,నామావళులు, పంచరత్నాల లాంటి రచించాడు. వీరశైవులు కంఠోపా వల్లించే శివస్తవం సోమనాథకృతమే!
ఎన్నో తెలుగు పదాలను సోమనాథుడు అవలీలగా ప్రయోగించాడు:
    టగ్ ఆఫ్ వార్ అనే తాడాటను రాగుంజుపోగుంజు లాట (పండితా .46) అన్నాడు. కొన్ని పదబంధాల ను స్వయంగా రూపొందించాడేమోననిపిస్తుంది. బసవని చూడటానికి జనసందోహం కదిలి వస్తుంటే, పందిళ్ళు వేసి, వాటి గుంజలకు గాలి ధారాళంగా వచ్చేలా వ్యాసహస్తాలు అమర్చారంటాడు. సీలింగుఫ్యానుకు ఈ వ్యాసహస్తం అనే పేరు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. కుంభవృష్టికురిసిందనటానికి అచ్చతెనుగులో కుండకూలిన యట్టు అంటాడు. రాతిని శిల్పంగా మలచటాన్ని గండరించు అంటాడు. పండిత లోచనాబ్జంబుల యందు గండరించినయట్టి అని ప్రయోగిస్తాడు. 
గ్రూపులు కట్టడాన్ని గుంపిడటం అని ఎత్తిపొడుస్తాడు. 
తక్కువగా గౌరవించటాన్ని సోల అన్నాడు.
చాలా కొద్ది సమయాన్ని గోరంతపొద్దు అంటాడు,
అసాధ్యం అనడానికి కుంచాలతో మంచుకొలవటం అనే చక్కని జాతీయాన్ని ప్రయోగిస్తాడు.
భరించటం అనే అర్థంలో తను శిరమై అంటాడు,
విత్తనాలు నాటడాన్నివిత్తులలుకు అనడంలోని పదలాలిత్యం అసాధారణమైనది
మేలము అంటే పరిహాసము (చెన్నమల్లు -5)
దుద్దెక్కుఅంటే పెద్దదగు, లావెక్కు: భక్తి దుద్దెక్కితనలోన దొట్రుకొనంగ (బసవ 1-217)
బుడిబుళులు అంటే గుసగుసలు: నరుల్ బుడిబుడుల్వోవ, బుడిబుళ్ళు వోవుచు భూసురుపూల్ల పుడమీశు కొలవుకు పోయి బసవ7-180)
బిలిబిలి కృతులు: వేగంగా రాసేసిన పనికి మాలిన రచనలు.
బిలిబిలి కాయకంబులు: కొద్దికష్టంతో చేసే పనులు(బసవ5-131)
                  నేలటూరి వెంకటరమణయ్య సోమన భాష అచ్చతెనుగు భాష అనే వాదంతో ఏకీభవించలేదు. సోమనాథుని వాక్యములు జానుదెనుగున నచ్చతెనుగను భ్రమను గలుగ జేయుచున్నను వాస్తవము విచారించగా జానుదెనుగునకు సరియైన యర్ధమది కాదని తోచుచున్నది. ఏలన, సోమనాథుని రచన లచ్చతెనుగు కబ్బములు కావు. ఇతరాంధ్ర కవులను బోలె ఇతడును సంస్కృతాంధ్ర మిశ్రభాషనే వాడియున్నాడు.
లోకమ్ము వీడి రసమ్ము లేదు వ్యాసంలో ఆచార్య కోవెల సుప్రసన్నులు మౌఖికమైనంత మాత్రాన సూత్ర భాష్యాదుల పాండిత్యం లేకుండా అన్నమయ సంకీర్తనలను అర్ధం చేసుకోగలమా...? అని ప్రశ్నించారు. కఠినమైన శాస్త్ర విషయాల ను సామాన్యుడి ముంగిటకు చేర్చగలగటం ఒక శైలి. అది రచయిత ప్రతిభకు తార్కాణం. పామర జన మోదాన్ని కలిగిస్తూనే ఎన్నో రహస్యాలు పండితులు వెదుక్కోగలిగేలా ఏర్పడి చెప్పగలగటం ఒక అన్నమయ్యకు తెలుసు, ఒక సోమనాథుడికి తెలుసు. స్వదేశీయత విషయంలో ఈ ఇద్దరితో పోల్చటానికి మరొక కవి లేరు .
               సోమనాథుని కవితలో పదలాలిత్యం, సంక్షిప్తతలతో పాటు, వైరి సమాసాలను కూడా స్వేచ్ఛగా ప్రయోగించటం అనే లక్షణాన్ని కూడా గమనించవచ్చు. పుష్పవిల్లు, భూమి తీరు, వేడి పయోధార లాంటి ప్రయోగాలు అలవోకగా చేసిన కనిపిస్తాయి. తిరుగుబాటు చేయటమే ఊపిరిగా పనిచేసే ఉద్యమకారుడు రూల్సు పాటిస్తాడా...!. బసవడి పట్ల, శివుడి పట్ల, సమాజంలోని అంటరానివారుగా అణగదొక్కబడిన వారి పట్ల, ఆయన తనది అతిలౌల్యం... అని చెప్పుకొన్నాడు. వర్ణవ్యవస్థ, సంస్కృత భావజాల వ్యతిరేకత పట్లకూడా ఆయన అతిలౌల్యాన్నే ప్రదర్శించాడు. తన ద్విపద కావ్యాన్ని వేదముల కొలదియు కొలువుడు అని చెప్పుకోవటానికి ఒక కవికి ఎన్నెదలు కావాలీ...?
                                                                     -డాక్టర్ జి. వి. పూర్ణచందు

Tuesday 11 September 2012

బిల్వ వృక్షం

         బిల్వ వృక్షాన్ని తెలుగులో మారేడు చెట్టు అంటారు. పరమశివుడికి ప్రీతికరమైనది మారేడు దళం. ఈశ్వరుడికి ఎన్నో రకాల పూలు, పండ్లు, నైవేద్యాలు సమర్పించినా, వాటిలో మారేడు దళం లేకపోతే ఆ పూజ పరిపూర్ణం కానట్లే! ఎందుకంటే వెయ్యి యజ్ఞాలు చేసిన ఫలం, కోటిమంది కన్యలను దానం చేసిన ఫలం, నోరు గోవులను దానం చేసిన ఫలం కన్నా.. ఒక్క బిల్వదళం సమర్పించడం వల్ల వచ్చే ఫలం చాలా ఎక్కువ. చెంబెడు నీటిని నెత్తిన పోసి, ఒక్క మారేడు దళాన్ని భక్తితో సమర్పిస్తే చాలు, ఆ పరమ శివుడు ఆనందంతో తబ్బిబ్బై ఇంటిముంగిట కల్పవృక్షాన్ని పాతి, కామధేనువును పెరట్లో కట్టేసి వెళతాడట. బిల్వ వృక్షం సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి హృదయం నుంచి ఉద్భవించినదని పురాణాలు చెబుతున్నాయి. బిల్వదళాలు త్రిశూలాకారంలో ఉండి, ఆ త్రినేవూతుని మూడు కన్నుల్లా, ఓంకారానికి ప్రతీకగా భాసిస్తాయి. శివపార్వతులను బిల్వ పత్రాలతో పూజించినవారికి సకల సిద్ధులు కలుగుతాయని పురాణోక్తి. బిల్వ వృక్షాన్ని చూసినా, తాకినా, గాలిపీల్చినా మనస్సు, శరీరం పవివూతమవుతాయి. పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన బిల్వవృక్షం కింద శివలింగాన్ని ఉంచి పూజిస్తే సకలపాపాలూ పటాపంచలవుతాయని ప్రతీతి. దీర్ఘరోగాలతోనూ, దుష్టక్షిగహాలతోనూ పీడించబడుతున్నవారు, అపమృత్యుదోషం ఉన్నవారు మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ బిల్వదళాలతో ఈశ్వరుడిని అర్చిస్తే అన్ని అరిష్టాలూ తొలగిపోతాయని పురాణాలు పేర్కొంటున్నాయి.
ఏకశిలపై దేవుళ్లు...
                                                                                        temple
                       ప్రపంచంలోనే   అతి పురాతన దేవాలయం... 300 కోట్ల సంవత్సరాల చరిత్ర... విజయనగర రాజుల అలనాటి సైనిక శిబిరం... పల్లవరాజుల శిల్పకళానైపుణ్యానికి నిలు నిదర్శనం. ఇలా చెప్పుకుంటూపోతే ప్రపంచంలో మరే దేవాలయానికి లేని ప్రత్యేకతలను తనలో ఇముడ్చుకున్న అరుదైన దేవాలయ సముదాయం రాక్‌ఫోర్ట్. ఒకే శిలపై మూడు దేవాలయాలు ఉన్న ఈ అరుదైన ప్రదేశం ప్రపంచంలో మరెక్కడా లేదనే చెప్పాలి. వినాయకుడు, శివుడు ఒకే చోట వెలసిన... తిరుచ్చిలోని రాక్‌ఫోర్ట్ విశేషాలు... 
                 పేరుకు తగ్గట్టు రాక్‌ఫోర్ట్ టెంపుల్... పర్వతంపై 83 మీటర్ల ఎత్తున శిలలతో అత్యద్భుతంగా మలచబడింది. ఈ కొండపై మొత్తం మూడు దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయ సముదాయాల నిర్మాణం పల్లవుల హయాంలో ప్రారంభమైనప్పటికీ... ఆ తరువాత విజయనగర రాజుల ఆధ్వర్యంలో మధురై నాయకులు వీటి నిర్మాణాన్ని పూర్తి చేశారు. వీరికాలంలో దేవాలయం ఎంతగానో అభివృద్ధి చెందింది. ఏకశిలను తొలిచి నిర్మించిన రాక్‌ఫోర్ట్ పర్వత శిఖరానికి... ఎంతో కఠినతరమైన 437 ఎగుడు మెట్లు ఎక్కితే గాని చేరుకోలేం.
                 పర్వత పాదాల వద్ద మనిక వినాయకర్ దేవాలయం ఉండగా... పర్వత శిఖరం వద్ద ఉచ్చి పిల్లయార్ కోయిల్ దేవస్థానం ఉంది. ఇక్కడ... ప్రసిద్ధిగాంచిన శివాలయం తాయుమనస్వామి దేవాలయం ఉన్నది. శిలను చెక్కి అపురూపంగా మలిచిన ఈ శివస్థలం పర్యాటకులను కనుప్పవేయనీయదు. ఇక్కడ ఉన్న దేవాలయ సముదాయంలో... లలితాంకుర పల్లవేశ్వరం అనే పల్లవులు నిర్మించిన దేవాలయం కూడా ఎంతో ప్రఖ్యాతి పొందినది. ఇక్కడ ఎన్నో అరుదైన శాసనాలు పల్లవ రాజు మహేంద్ర పల్లవన్ గురించి అనేక విశేషాలను తెలియజేస్తాయి. చోళులు, విజయనగర రాజులు, మధురై నాయకులు ఈ దేవాలయాన్ని విశేషంగా అభివృద్ధి చేశారు. అంతేకాకుండా, కొండపై ఉన్న రెండంతస్థుల తాయుమనస్వామి దేవాయలం ఇక్కడి నిర్మాణాల్లోనే తురుపుముక్క అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్భుత కళానైపుణ్యం ఈ దేవాలయం సొంతం. 
                  ప్రతిరోజు ఇక్కడ ఆరు రకాల పూజలు జరుగుతాయి. చితిరైలో ప్రతియేటా ఒకసారి బ్రహ్మోత్సవం కూడా జరుగుతుది. ఆదిపూరం, ఫ్లోట్ ఫెస్టివల్ జరిగే పంగుని ప్రదేశం కూడా ఇక్కడ ఎంతో ప్రఖ్యాతి పొందిన ప్రదేశం. మధురై నాయకులు నిర్మించిన ఈ రెండు దేవాలయాల్లో ఒకటి శివాలయం కాగా, మరొకటి గణేష్ దేవస్థానం. అద్భుత శిల్పకళారీతులకు ఆలవాలంగా ఉన్న... 7వ శతాబ్దానికి చెందిన దేవాలయాలు ఇవి. ప్రఖ్యాతిగాంచిన ఎన్నో శిల్పరీతులకు పెట్టింది పేరు. పర్వత పాదాల వద్ద ఉన్న వినాయకుడి దేవస్థానం, అలాగే పర్వత శిఖరం వద్ద ఉన్న అతిపెద్ద శ్రీ తాయుమన స్వామి దేవాలయాల్లోకి హిందూయేతరులను అనుమతించరు. పర్యాటకుల సందర్శనార్థం ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆలయాలను తెరచి ఉంచుతారు.
వినాయక దేవస్థానం... 
                 లంకాధీశుడైన రావణుడి అనుంగు సోదరుడైన విభీషణడు... అపహరణకు గురైన సీతాదేవి ని రక్షించేందుకు రాముడి పక్షాన చేరి తన సహాయ సహకారాలను అందిస్తాడు. తరువాత యుద్ధంలో రావణుడి ఓడించిన రాముడు తన ధర్మపత్ని సీతను కాపాడుకుంటాడు. ఈ నేపథ్యంలో తనకు సహాయాన్ని అందించిన విభీషణుడికి ఏదైనా బహుమతి ఇవ్వాలనే ఉద్దేశంతో రాముడు... విష్ణుమూర్తి అవతారమైన రంగనాథస్వామి విగ్రహాన్ని ఇస్తాడు. అయితే ఇది గమనించిన దేవతలు... ఒక అసురుడు విష్ణుమూర్తి అవతారమైన రంగనాథస్వామి విగ్రహాన్ని తన రాజ్యానికి తీసుకెళ్ళడాన్ని సహించలేక పోతారు. దాంతో, దేవతలు ఎలాగైనా విభీషణుడు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళకుండా ఆపాలని నిశ్చయించుకొని విఘ్ననాయకుడైన వినాయకుడి సహాయం కోరుతారు. అప్పుడు వినాయకుడు వారి కోరికను మన్నిస్తాడు.
           రాముడు ప్రసాదించిన విగ్రహాన్ని తీసుకొని లంకకు బయలుదేరిన విభీషణుడు కావేరీ నది మీదుగా వెళ్తూ... ఆ నదిలో స్నానం చేయాలని భావిస్తాడు. ఆ సమయంలో ఆ విగ్రహాన్ని ఎవరికైనా ఇవ్వాలనుకుంటాడు. ఎందుకంటే, ఒకసారి ఆ విగ్రహాన్ని నేలపైన పెడితే మళ్లీ తీయడం అసంభవం. దాంతో ఏం చేయాలి? అని మథనపడుతున్న సమయంలో అక్కడే పశువులను కాస్తున్న బాలుడిలా మారువేషంలో ఉన్న వినాయకుడి చేతికి ఆ విగ్రహాన్ని అందించి... విభీషణుడు స్నానానికి ఉపక్షికమిస్తాడు. విభీషణుడు నదిలో మునగగానే మారువేషంలో ఉన్న వినాయకుడు ఆ విగ్రహాన్ని కావేరీ నది తీరంలో ఉన్న ఇసుకపై పెడతాడు (ఆ విగ్రహం పెట్టిన చోటే... నేడు ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయంగా విరాజిల్లుతున్న రంగనాథస్వామి దేవాలయం). ఇది గమనించిన విభీషణుడు పశువులకాపరిని తరుముతూ వెంబడిస్తాడు. దీంతో ఆ బాలుడు పక్కనే ఉన్న కొండపైకి చచకా ఎక్కేస్తాడు. విభీషణుడు కూడా ఆ కొండపైకి ఎక్కి ఆ బాలుడి నుదిటిపై ముష్టిఘాతం కురిపిస్తాడు. అప్పుడు మారువేషంలో ఉన్న ఆ బాలుడు వినాయకుడిగా మారిపోతాడు. అప్పుడు తన తప్పును తెలుసుకొని వినాయకుడిని క్షమాపణ వేడుకుంటాడు విభీషణుడు. ప్రసన్నుడైన విఘ్నరాజు విభీషణుడి దీవించి లంకకు పంపిస్తాడు. వినాయకుడి ఎక్కిన ఆ కొండనే ఈ రాక్‌ఫోర్ట్ టెంపుల్. అక్కడ వెలసిన వినాయకుడి దేవస్థానమే ఉచ్చి పిల్లయార్ దేవాలయం.
తాయుమనస్వామి చరిత్ర...
              వినాయకుడి దేవస్థానానికి ఉన్నట్టే, ఈ గుడికి కూడా పురాతన గాథ ప్రచారంలో ఉంది. ఒకనాడు శివభక్తురాలైన రత్నవతి అనే ఆవిడ పురిటినొప్పులతో బాధపడుతూ తన తల్లి రాకకోసం ఎదురుచూస్తుంది. ఎంతసేపటికీ తన తల్లి రాకపోవడంతో... నన్ను ఎలాగైనా రక్షించు స్వామీ అని శివుడిని వేడుకుంటుంది. అప్పుడు శివుడే స్వయంగా రత్నవతి తల్లి రూపంలో వచ్చి పురుడు పోస్తాడు. అప్పటినుండి ఆయనకు తాయుమనస్వామి అనే పేరు స్థిరపడిపోయింది (తాయుం - అన - స్వామి అంటే... తల్లి రూపంలో వచ్చిన భగవంతుడు అని అర్థం). అప్పటినుండి ఈ దేవాలయానికి తాయుమనస్వామి దేవాలయం అనే పేరు సార్థకమైంది.  పర్వతపాద ప్రాంతం నుంచి సుమారు రెండు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. దేవాలయం పైకప్పుపై ఉన్న పెయింటింగ్స్ సందర్శకులను మైమరపిస్తాయి. ఈ ఆలయ నిర్మాణం ఆనాటి పల్లవుల శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడతాయి. ఇక్కడ శివపార్వతులతో పాటు మహాలక్ష్మి విగ్రహం కూడా ఉండడం విశేషం. ఇక్కడ ఉన్న శివాలయంలో శివుడు అతిపెద్ద లింగాకారంలో ఉంటాడు. అలాగే... పార్వతి దేవి కి ప్రత్యేక గర్భగుడి ఉంది.
చేరుకునేదిలా...
               రాక్‌ఫోర్ట్ టెంపుల్‌కి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో తిరుచ్చి ఎయిర్‌పోర్టు ఉంది. చెన్నై మీదుగా దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి విమాన సౌకర్యం ఉంది. రైలు మార్గం ద్వారా వచ్చే ప్రయాణీకులు తిరుచ్చి రైల్వేస్టేషన్ చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా రాక్‌ఫోర్ట్ట్ టెంపుల్ చేరుకోవచ్చు. దక్షిణ రైల్వే పరిధిలో అతిపెద్ద జంక్షన్ తిరుచ్చి. ఇక్కడి నుండి చెన్నై, తంజావూర్, మధురై, తిరుపతి, ట్యుటికోరిన్, రామేశ్వరం తదితర ప్రాంతాలకు మీటర్ గేజీ లైను ఉంది. అలాగే బెంగళూరు, కోయంబత్తూర్, మైసూర్, కొచ్చి, కన్యాకుమారి, మంగళూరు లను కలుపుతూ బ్రాడ్‌గేజ్ లైన్ ఉంది. ప్రతిరోజు పదుల సంఖ్యలో ఈ జంక్షన్ నుంచి వివిధ రైళ్ళు అందుబాటులో ఉంటాయి. దాదాపు దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఇక్కడికి రోడ్డు మార్గం ఉంది. ప్రతిరోజూ ఆ నగరాల నుంచి ఇక్కడికి బస్సులు కూడా నడుస్తాయి. ఇక లోకల్‌గా తిరగడానికి సిటీ బస్సులు, టూరిస్ట్ ట్యాక్సీ, ఆటో రిక్షా, సైకిల్ రిక్షా వంటివి అందుబాటులో ఉంటాయి.

Monday 10 September 2012

ఓయూ పరిధిలో రేపటి పరీక్షలు వాయిదా
హైదరాబాద్: ఓయూ పరిధిలో రేపు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు వర్సిటీ రిజిష్ట్రార్ ప్రకటించారు. రేపు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

Friday 7 September 2012

     
http://www.telanganadosti.com    

*
     
 http://dhoomdhaam.com
              
*    
     
  http://missiontelangana.com

*  
      
    www.telangana.com

*     
         
    http://koodali.org

*
        

*
      
 http://www.sankalini.org 
   
*
       
      http://maalika.org/
     
*
      
      http://www.haaram.com/?ln=te
    

Wednesday 5 September 2012

Laknavaram Lake 

 
               The green hills of this agency mandal lie side by side to form a massive bowl like structure which holds the spacious, beautiful and pristine lake popular known as ‘Laknavaram Cheruvu’.which is just in 2 hours drive from Warangal city. 
                                                   
                  Lakhnavaram Lake is famous for a scenic beauty. It was formed by closing three narrow valleys each with a short bund, with hills being its natural barrier. Constructed by the Kakatiyas in 13th Century A.D, the lake offers irrigation facility of about ayacut of 4500 hectres and is worth of visit. As one drives to the right after crossing Mulug, eight km into the thick forest, there lies this marvellous lake and picturesque hills around it with thick carpet like green cover.
Suspension bridge:
                                                    
                        The Department of Tourism constructed a suspension bridge across the lake joining the island which is an added attraction for tourists visiting this beautiful lake. The district administration had embarked on massive plans to convert it into a tourism spot and one could see personnel busy trimming the hills to lay roads around the lake. “This suspension bridge is first of its kind in State. In the next phase, it will be extended to join other islands in the lake. This is good spot which should be popularised,” Joint Collector K. Srinivasa Raju said.
                                                    
                 The lake was the discovery of ancient Kakatiya rulers. They spotted this excellent place amidst trees and green hills lined up around to hold the rainwater.
                                                   
 The Kakatiya rulers only built a small sluice gate turning the place into a spacious lake which now feeds thousands of acres of agricultural land every year. Of late, the district administration decided to convert it into a tourist spot but lack of coordination between the agencies hindered the progress of work. There is no approach road once after taking a turn from Mulugu and Govindaraopet road.
                                                    
         “There is boat which is seen in Kerala and Kashmir. This is the biggest lake in the warangal dist Andhra pradesh India. constructed by kakatiyas. It gives the water about 50,000 acers of paddy crop.
                                                
People who are planning to go to Ramappa can also plan to visit this place as it is very nearby. From Warangal city, it is good plan to visit Laknavaram lake first and then visit Ramappa in your return journey.