Monday, 17 September 2012

సెప్టెంబర్ 17 తెలంగాణం  
                                    
                                  1947 - స్వేచ్ఛా భారతం 
                   1947 ఆగస్టు 15... తెల్లదొరల దాస్యశృంఖలాలు తెంచుకొని యావత్ భారతం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది..! జనవాహిని సంబరాల్లో మునిగితేలింది..! మేధావులు.. భావి భారతానికి పునాదులు వేసే పనిలోపడ్డారు..! కానీ, ఒక్క తెలంగాణ తప్ప.. తెలంగాణ జనవాహిని తప్ప..! ఆ స్వేచ్ఛావాయులకు దూరంగా ఉండిపోయింది. సంబరాలు సరిహద్దు మూలల్లో దోబూచులాడాయి..! బానిస సంకెళ్లు రతనాల వీణపై ముప్పేట దాడిచేశాయి. నిజాం నియంతృత్వపోకడలకు, రజాకార్ల దాష్టీక చర్యలకు తెలంగాణ అవని కొంగు కప్పుకొని గుక్కపట్టి ఏడ్చింది..! తన పిల్లల హాహాకారాలు చూడలేక తల్లడిల్లిపోయింది..! దేశానికి స్వాతంత్య్ర వచ్చిన 13 నెలల తర్వాత.. అంటే 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ జనని భారత మాతకు జై కొట్టింది..! అంతకుముందు జై కొట్టిన వారు జైళ్లపాలయ్యారు..! వందేమాతరం ఆలపించినవారు కర్కష కోరల కాటుకు బలయ్యారు..!
                                       ప్రసంగిస్తున్న నెహ్రూ                  
                        దేశానికి స్వాతంత్య్ర వచ్చిన 13నెలలకు తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది.. కానీ, ఆ వాయువులు ఎన్నాళ్లూ ఉండలేదు..! బలవంతపు కలుపుగోలు కుట్రకు సమైక్య ఉచ్చులో నేటికీ తెలంగాణ విలవిలలాడుతూనే ఉంది. వివక్షల నడుమ తన ఆకాంక్షను చాటేందుకు ఉద్యమ జెండా ఎత్తుతూనే ఉంది..! ప్రత్యేక రాష్ట్రం కోసం నినదిస్తూనే ఉంది..! అయినా.. పాలకుల గుండెలు కరగడం లేదు. ఆకాంక్షను అణచివేయడమే పనిగా ముందుకు కదులుతున్నారు. నాడు నిజాం నుంచి విముక్తి పొందిన తెలంగాణ తల్లి.. నేడు సమైక్య దాడి నుంచి బయటపడేందుకు ఎదురుచూస్తోంది. నిజాం నియంతృత్వం నుంచి బయటపడ్డ ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వాలే ఉత్సవాలు జరుపుతుండగా నాలుగున్నర కోట్ల ప్రజలున్న తెలంగాణలో మాత్రం ‘సమైక్య’ సర్కారు ఆ ఊసెత్తడం లేదు..! అదీ కాక, ఉత్సవాలు జరపాలన్నందుకు ఉక్కుపాదం మోపుతోంది..! నిజాం నుంచి విముక్తి పొంది భారతావనిలో తెలంగాణ కలిసిపోయిన రోజు(సెప్టెంబర్ 17) అనేది ఇప్పటికీ తేలని చర్చే.. విమోచన దినమా, విలీన దినమా, విద్రోహ దినమా..
ఇదీ చరిత్ర...                     పటేల్ తో  నిజాం 
బ్రిటిష్ పాలకుల నుంచి దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ ప్రాంతాన్ని ఇండియన్ యూనియన్‌లో కలిపేందుకు నిజాం ససేమిరా అంగీకరించలేదు. అదీకాక రజాకార్లు రెచ్చిపోయారు. భారత మాతను కీర్తించినందుకు, మువ్వన్నెల జెండా చేతపట్టినందుకు అణచివేతలకు దిగారు. అకృత్యాలకు పాల్పడ్డారు. దీంతో తెలంగాణలో పౌర యుద్ధం జ్వాజ్వల్యమానంగా ఎగిసిపడింది. 1940 నుంచి 1948 వరకు తెలంగాణలో చెలరేగిన ఉద్యమాలలో భారత కమ్యూనిస్టు పార్టీ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఆర్‌ఎస్‌ఎస్, ఆర్యసమాజం వంటి ఉద్యమశక్తులన్నీ, శ్రేణులన్నీ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటాలను నిర్వహించాయి. రావినారాయణడ్డి, బద్దం ఎల్లాడ్డి, మఖ్దూం వంటి యోధులు నిజాంను తరిమికొట్టాలంటే సాయుధపోరాటం చేయాల్సిందేనని నినదించారు. 
                                               రజాకార్లు 
ఈ పిలుపు మేరకు తెలంగాణలో మొట్టమొదట కమ్యూనిస్టు పార్టీ తరఫున సాయుధపోరాటానికి రగలింది. సాయుధ పోరాట పిలుపు ప్రకటనపై ఈ ముగ్గురు యోధులు సంతకాలు చేశారు. ఈ పిలుపు నేపథ్యంలోనే ఆంధ్రమహాసభ, ఉద్యమాలు, గుతప సంఘాలు వచ్చాయి. రామానందతీర్థ నాయకత్వంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కూడా ఉద్యమ దళాలను ఏర్పరిచింది. సూర్యాపేట సమీపంలోని రేపాలలో కాంగ్రెస్ వాలంటీర్లకు యుద్ధ నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ సారథ్యంలో 28వేల గ్రామాల్లో గుతప సంఘాలు ఏర్పడ్డాయి. దొడ్డి కొమరయ్య, బందగీ, సోయబ్-ఉల్లా-ఖాన్ వంటి తెలంగాణ వీరులు అమరులయ్యారు.
                                            ఉద్యమ దళo 
                 గుతప సంఘాలు, రైతుకూలీ సంఘాల సారథ్యంలో 10 లక్షల ఎకరాల భూమిని పేదలు పంచుకున్నారు. ప్రజల నుంచి యుద్ధం ఎదురవుతున్నా విలీనానికి నిజాం ఒప్పుకోలేదు. దీంతో 1948 సెప్టెంబర్ 14న అనాటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్‌పటేల్ హైదరాబాద్‌ను వశపరుచుకోవాల్సిందిగా నాలుగు వైపుల నుంచి మిలటరీ సైన్యాలను పురమాయించారు. మిలటరీ సైన్యాలు, కాశీం రజ్వీ సైన్యాలు హోరాహోరీగా పోరాడాయి. మిలటరీ సైన్యాలతో గొట్టిముక్కల గోపాలడ్డి వంటి కమ్యూనిస్టు యోధులు తుదిశ్వాసవరకు యుద్ధంచేశారు. నాలుగు వైపుల నుంచి పంపిన మిలటరీ సైన్యాలలో ఏ జనరల్ సారథ్యంలోనైతే సైన్యం ముందుగా హైదరాబాద్‌ను వశపరుచుకుంటుందో, ఆ జనరల్‌కు ఏడాదిపాటు హైదరాబాద్‌ను పరిపాలించే అవకాశం కల్పిస్తానని సర్దార్‌ప ఆశచూపించారు. 

                                       జనరల్ జైన్ మిలటరీ                                  
        ఆ క్రమంలో జనరల్ జైన్ మిలటరీ ఆధ్వర్యంలో తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రారంభమైంది. 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు నిజాం లొంగిపోయారు. తెలంగాణను ఇండియన్ యూనియన్‌లో కలిపారు. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు జనరల్ చౌదరి సారథ్యంలో తెలంగాణలో మిలటరీ పాలన కొనసాగింది. 1950 జూన్ 12న బూర్గుల రామకృష్ణారావు సారథ్యంలో తాత్కాలిక పౌర ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వాన్ని ఆనాటి రాజవూపముఖ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ (ఏడవ నిజాం) పదవీ ప్రమాణం చేయించారు.
                                          ఏడవ నిజాం
         ఆ తర్వాత 1952లో జరిగిన సాధారణ ఎన్నికలలో నెహ్రూకు కూడా రానంత మెజార్టీని ఇచ్చి రావినారాయణడ్డిని తెలంగాణ ప్రజలు పార్లమెంటుకు పంపించారు. తెలంగాణ జిల్లాలన్నింటిలో 50 శాతం వరకు కమ్యూనిస్టులు నెగ్గారు. బూర్గుల రామకృష్ణారావు నాయకత్వంలో హైదరాబాద్‌లో 1952లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది.
          ‘సమైక్య’ కుట్ర..:  నిజాం నుంచి విముక్తి పొందిన తెలంగాణకు ఎన్నాళ్లూ ఆ స్వేచ్ఛావాయువులు మిగలలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు పేరిట తెలంగాణను సీమాంధ్రలో కలిపేశారు. దాన్ని అడ్డుకున్నందుకు ‘సమైక్య’ కుట్ర పగబట్టింది. ఇప్పటికి వివక్ష పేరిట తెలంగాణను అణచివేస్తూనే ఉంది.
-(టీ మీడియా):

No comments:

Post a Comment