దిగివచ్చిన ప్రభుత్వం
తెలంగాణ ప్రజల విజయం
తెలంగాణ మార్చ్‌కు అనుమతి
నెక్లెస్ రోడ్డుపై నిర్వహణకు అవకాశం
ఫలించిన టీ మంత్రుల దౌత్యం
ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించిన జానారెడ్డి
తెలంగాణ ప్రజల అద్భుత విజయమన్న కోదండరాం
కేసుల ఎత్తివేతకు జేఏసీ నేతల డిమాండ్
సమయం : మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య
స్థలం : హుస్సేన్‌సాగర్ వద్ద నెక్లెస్‌రోడ్
నెక్లెస్ రోడ్డుకు దారులెన్ని..?
1. సచివాలయం ముందు నుంచి.. ప్రధాన రహదారి
2. మింట్ కాంపౌండ్- ప్రసాద్ ఐ మ్యాక్స్- నెక్లెస్ రోడ్డు
3. ఖైరతాబాద్ పెద్ద వినాయకుడు - నెక్లెస్ రోడ్డు
4. ఖైరతాబాద్ జంక్షన్ ఫ్లైఓవర్ - నెక్లెస్ రోడ్డు
5. రాజ్‌భవన్ ఎదురుగా ఉన్న ఎంఎస్ మక్తా- నెక్లెస్ రోడ్డు
6. బేగంపేట- రసూల్‌పురా- నెక్లెస్ రోడ్డు
7. ప్యారడైజ్- రసూల్‌పురా- నెక్లెస్ రోడ్డు
8. బైబిల్ హౌజ్- రాణిగంజ్- ఎంజీ రోడ్డు-నెక్లెస్ రోడ్డు
9. కవాడిగూడ - ట్యాంక్‌బండ్- నెక్లెస్ రోడ్డు
అడ్డంకులు తొలగిపోయాయి! ఆటంకాలు కొట్టుకుపోయాయి! ఇక దుమ్ము రేగడమే తరువాయి! దశాబ్దాల ఆకాంక్షను మరోసారి చాటేందుకు తెలంగాణ ఉద్యమం సాగరహారాన్ని ధరించబోతున్నది! అణచివేసిన కొద్దీ ఉవ్వెత్తున ఎగసిపడి.. విజయతీరాలు చేరుకోవడమే తమ మార్గమని రుజువు చేయబోతున్నది! అందులో తొలి విజయం తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం నుంచి సాధించిన అనుమతి! ఉద్యమక్షిశేణుల అకుంఠిత దీక్ష ముందు సర్కారు తాళలేక పోయింది. నచ్చజెప్పి బుజ్జగిద్దామని చూసిన తెలంగాణ మంత్రులకు.. మార్చ్ కోసం అనుమతి తీసుకురావటంతప్ప మరోదారి లేకపోయింది! వెరసి.. తెలంగాణవాదులకు అద్భుత విజయం సిద్ధించింది! తెలంగాణమార్చ్‌ను విఫలం చేసేందుకు నానా రకాలుగా మోకాలడ్డుతూ వచ్చిన రాష్ట్ర సర్కారు.. ఎట్టకేలకు తలొంచింది. ఆదివారం టీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సాగరహారానికి అడ్డు తొలిగింది. అనుకున్న విధంగా తెలంగాణ మార్చ్‌ను నిర్వహించుకోవచ్చని ప్రకటించింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగిన వరుస చర్చలు, మంతనాలు, భేటీలు చివరికి ప్రభుత్వం కొమ్ములు వంచాయి. అయితే ఈ కార్యకమం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య జరగాలని ప్రభుత్వం షరతు విధించింది. హుస్సేన్ సాగర్ పక్కన ఉన్న నెక్లెస్ రోడ్డుకే పరిమితం కావాలని సూచించింది. ఈ ప్రదర్శన శాంతియుతంగా సాగాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినా రాకున్నా సాగరహారాన్ని నిర్మించి తీరుతామని ప్రతిజ్ఞ చేసిన తెలంగాణవాదులు ప్రభుత్వం కూడా ఒప్పుకోవడంతో రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణమార్చ్‌కు సిద్ధమయ్యారు. దుమ్మురేపే మార్చ్‌కు ఇంటికో మనిషి.. చేతిలో జెండాతో కదిలి రానున్నారు.. కదం తొక్కనున్నారు!తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయాన్ని రాష్ట్ర మంత్రి కే జానాడ్డి శుక్రవారం రాత్రి సచివాలయంలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ప్రభుత్వంతో చర్చల సారాంశాన్ని జానాడ్డి, టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వివరించారు. వినాయక నిమజ్జన కార్యక్షికమం ముగిసిన తర్వాత మధ్యాహనం 3 గంటల నుంచి, రాత్రి ఏడు గంటల మధ్య నెక్లెస్ రోడ్డుపై తెలంగాణ మార్చ్ నిర్వహించుకునేందుకు సీఎం అంగీకరించారని జానాడ్డి తెలిపారు. ఈ ప్రదర్శన శాంతియుతంగా, సహనంతో సాగాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణమార్చ్‌కు చీమలబారు వలే కదిలి రావాలని కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఉద్యమ చైతన్యానికి తలొగ్గిన ప్రభుత్వం అనివార్య పరిస్థితులలోనే తెలంగాణ మార్చ్‌ను అనుమతిని ఇచ్చిందని టీజేఏసీ నాయకులు పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్ణయం వెలువడటానికి ముందు ఉదయం నుంచి పెద్ద ఎత్తున కసరత్తు కొనసాగింది. ముగింపు క్రమంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకూ సచివాలయంలో వాడివేడి చర్చలు జరిగాయి. సీఎంతో, టీజేఏసీ నాయకులతో తెలంగాణ ప్రాంత మంత్రులు దఫదఫాలుగా చర్చలు సాగించారు. చివరకు షరతులతో కూడిన అనుమతి వచ్చింది. ఈ చర్చల్లో తెలంగాణ మంత్రులు కే జానాడ్డి, సబితా ఇంద్రాడ్డి, ఉత్తమ్‌కుమార్‌డ్డి, బస్వరాజు సారయ్య, ప్రసాద్‌కుమార్, ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, టీఆర్‌ఎస్ ఎల్పీ నేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, ఏనుగు రవీందర్‌డ్డి, పోచారం శ్రీనివాస్‌డ్డి, కొప్పుల ఈశ్వర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, తెలంగాణ నగారా సమితి శాసనసభ్యులు నాగం జనార్దన్‌డ్డి, కొప్పుల హరీశ్వర్‌డ్డి, సీహెచ్ మాధవడ్డి, సీనియర్ సిటిజన్, ఎమ్మెల్సీ చుక్కారామయ్య ప్రొఫెసర్ హరగోపాల్, సీపీఐ ఎమ్మెల్యే యాదగిరిరావు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటడ్డి, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ జీ దేవీవూపసాద్, సెక్రటరీ జనరల్ వీ శ్రీనివాస్‌గౌడ్, కో-చైర్మన్ సీ విఠల్, తెలంగాణ జేఏసీ కన్వీనర్ కే స్వామిగౌడ్, తెలంగాణ ఎన్జీవో ప్రధానకార్యదర్శి కారం రవీందర్‌డ్డి, అడ్వకేట్ జేఏసీ చైర్మన్ రాజేందర్‌డ్డి, రసమయి బాలకిషన్ తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. వివిధ సంఘాల నాయకులు తెలంగాణ మంత్రులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అనుమతిని ఇవ్వకున్నా లక్షలమందితో టాంక్‌బండ్‌పైన తెలంగాణ కవాతు జరిపి తీరుతామని హెచ్చరించారు. వాడిగా వేడిగా, సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య జరిగిన చర్చల్లో ఉద్యమకారులకు సర్ది చెప్పేందుకు తెలంగాణ మంత్రులు విఫలయత్నం చేశారు.
ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యవాది అని చెప్పుకొచ్చారు. ఈ పరిణామాల మధ్యే తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ మార్చ్‌కు అనుమతి తీసుకురావాల్సిన బాధ్యత తెలంగాణ ప్రాంత మంత్రులదేనని తేల్చి చెప్పారు. మంత్రులు లిఫ్ట్‌లో కిందికి మీదికి తిరుగుతూ ముఖ్యమంవూతికి చర్చల సారాంశాన్ని విశదపరిచారు. ఒక దశలో తెలంగాణ మార్చ్‌కు అనుమతిని ఇవ్వని పక్షంలో తెలంగాణ ప్రజలు అక్టోబర్ 1 నుంచి జరిగే జీవ వైవిధ్య సదస్సుకు అనుమతి ఇవ్వరని తెలంగాణవాదులందరూ హెచ్చరించారు. టీజేఏసీ కో-కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య, మాలమహానాడు జేఏసీ నాయకులు అద్దంకి దయాకర్ చర్చలు ఒక ఫార్సుగా అభివర్ణిస్తూ తెలంగాణ మార్చ్‌కు ప్రజలను కదిలించకుండా ఇక్కడ నాయకులందరినీ కమ్మేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల వేదిక నుండి వెలుపలికి రావాలని ప్రయత్నించారు. పరిస్థితిని అదుపు చేసే వాతావరణం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో మళ్లీ సీఎం వద్దకు వెళ్లిన తెలంగాణ మంత్రులు.. ఆయనతో మాట్లాడి ఎట్టకేలకు అనుమతి సంపాదించుకుని వచ్చారు.
అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో జానాడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా, సహనంతో మార్చ్ నిర్వహించుకునేందుకు సీఎం షరతులతో కూడిన అనుమతిని ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం మార్చ్‌కు అనుమతి ఇచ్చిన విషయాన్ని టీజేఏసీ చైర్మన్ కోదండరాం సైతం వెల్లడించారు. ఇది తెలంగాణ ప్రజల తొలి అద్భుత విజయమని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వంపైన ముప్పేట దాడి చేసి తెలంగాణ ప్రజలు ఒక అసాధారణమైన, అపూర్వమైన, చారివూతాత్మక ఘన విజయాన్ని సాధించారని చెప్పారు. అయితే ఈ విజయంతోనే సంబరపడటానికి అవకాశం లేదని అన్నారు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యంపైన విశ్వాసంతోనే తెలంగాణ మార్చ్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారన్న సత్యాన్ని ప్రపంచ ప్రజలకు తెలియచేయాలని ఆయన పిలుపునిచ్చారు. గాంధేయమార్గంలో, శాంతియుతంగా, క్రమశిక్షణతో, ప్రజాస్వామ్యయుతంగా నెక్లెస్‌రోడ్డు మీదికి చేరుకోవాలని, ప్రజాస్వామిక ఆకాంక్షను ఘనంగా ప్రకటించాలని కోరారు. తెలంగాణ ప్రజల సంఘటిత ప్రజాస్వామిక చైతన్యాన్ని, శాంతి, సహనాల విలక్షణతలను గమనించి ఢిల్లీ పాలకులు విస్తుపోవాలని అన్నారు. ఢిల్లీ పాలకులు కళ్లు తెరవాలని, తెలంగాణ శాంతిని అపహాస్యం చేస్తున్న ఇన్‌చార్జి డీజీపీ దినేశ్‌డ్డి వంటి వ్యక్తులు మరోసారి మాట్లాడకుండా మహోన్నత శాంతియుత ప్రజాస్వామిక చైతన్యాన్ని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఇన్‌చార్జి డీజీపీ తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా మాట్లాడారని అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు హైదరాబాద్‌కు చేరుకోకుండా సరిహద్దులలో నిర్మించిన బారికేడ్లు తీసేయాలని, తెలంగాణ ఉద్యోగులపై బనాయించిన బైండోవర్ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఉద్యమంలో పాల్గొనాలని, చీమల బారులవలె రోడ్లమీదనుండి సద్దిమూటలతో ఒక చేతిలో తెలంగాణ జెండాను పట్టుకొని నినాదాలతో నెక్లెస్‌రోడ్డుమీదికి చేరుకోవాలని కోరారు.
తెలంగాణ మంత్రులు కుందూరు జానాడ్డి, సబితా ఇంద్రాడ్డి, బస్వరాజు సారయ్య, ప్రసాద్, ఉత్తమ్‌కుమార్‌డ్డి, ఎంపీ పొన్నం ప్రభాకర్‌లతో పాటు టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, తెలంగాణ నగారా సమితి ఎమ్మెల్యేలు అనుమతి తీసుకురావటంలో విశేష కృషి చేశారంటూ తెలంగాణ ప్రజల పక్షాన అభినందనలు తెలియజేశారు. ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ జీ దేవీప్రసాద్ మాట్లాడుతూ, వివిధ జిల్లాల్లో ఉద్యోగులపై బనాయించిన 2వేలకు పైగా బైండోవర్ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. టీజేఏసీ కన్వీనర్ కే స్వామిగౌడ్ మాట్లాడుతూ నెక్లెస్‌రోడ్‌పైన తెలంగాణ ఆత్మగౌరవ పోరాట సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పుదామన్నారు. ఆకాంక్షల వ్యక్తీకరణగా తెలంగాణ మార్చ్‌ను నిర్వహించాలని, ఉద్యోగులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని సెక్రటరీ జనరల్ వీ శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఉద్యోగులు కుటుంబాలతో తెలంగాణ మార్చ్‌కు రావాలని కో-చైర్మన్ సీ విఠల్ కోరారు.
No comments:
Post a Comment