Saturday, 17 November 2012

రామసక్కని ప్రకృతి వరం సీతాఫలం


పండు ప్రకృతి ప్రసాదించే ఒక వరం. అందులో మహాసాధ్వీమణి, సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపమైన సీతమ్మ వారి పేరున పుట్టిన ఫలం గురించి చెప్పవలసిందేముంటుంది! 
- చెట్టుమీదే మక్కిన సీతాలప్పండు, అందులో రామసీతాలప్పండ్ల కమ్మదనం మధురాతి మధురం. మత్తెక్కించే ఆ తియ్యదనాన్ని కృత్రిమంగా సృష్టించడం మానవుల తరం కాదు. చెట్టుమీదే మక్కిన పండ్లు! ఈ ఫలాలను రామచిలుకలు వంటి పక్షులు కొరికి తింటాయి. చెట్టుమీది కాయనుకుని భ్రమ పడి తెంపుతుం కొన్ని చేతిలోనే పిసికి పోవచ్చు. కృత్రిమంగా మక్క కాయల కంటే ఇలా ప్రాకృతికంగా పండిన పళ్లు తినడానికి దొరికితే అదృష్టమే మరి. 
- ఒక్క సీతాఫలాలే కాదు, జామ, మామిడి, అరటి వంటి దాదాపు అన్ని రకాల పండ్లనూ చెట్లమీదే మక్కనిచ్చి తింటే వాటి రుచి, పోషకాల విలువ అత్యధికం. కానీ, పెద్ద మొత్తంలో అమ్ముకోవాలనుకున్నప్పుడు మాత్రం వాటిని చెట్లమీద కాయలుగా ఉన్నప్పుడే తెంపక తప్పదు. చాలావరకు శిత్పల కాయలను చెట్లమీంచి తెంపుకొచ్చి మక్క అమ్మడమే జరుగుతోంది. మూన్నాలుగు రోజులలోనే అవి చక్కగా పండుతాయి. ఊళ్లు, పట్నాలు, నగరాల బజార్లలో అమ్మే గంపల కొద్దీ సీతాఫలాలు దాదాపు ఇలాంటివే. కాయలను సేకరించి, వాటిని ఆకులలో కమ్మేసి, కొద్ది రోజుల్లో వాటిని మాగేలా (మక్క పెట్టడం) చేయడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. శిత్పల కాయల్ని కాల్చి అందులోని గుజ్జును తినడాన్నీ కొందరు ఇష్టపడతారు.
- సీతాఫలాల (కస్టర్డ్ యాపిల్)ను ‘పేదవారి సేప్పండు’ అనీ అంటారు. ‘చక్కెర యాపిల్’ లేదా ‘స్వీట్ సోప్’ అనీ దీనిని పిలుస్తారు. బాగా పెద్దగా పెరిగిన, ఒక రకమైన మధురమైన పండ్లని ‘రామసీతాఫలాలని’ మనం అంటాం.
- శాస్త్రీయంగా సీతాఫలచెట్టు ‘అనోనాసియా’ అనే కుటుంబానికి చెందింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 2000కు పైగా రకాలున్నాయి. ప్రధానంగా రెండు రకాలను చెప్తారు. 
అవి: పింక్స్ మమ్మూత్ (హిల్లరీ వైట్), ఆఫ్రికన్ ప్రైడ్స్.
 ఇవి రెండూ తియ్యగానే కాక మంచి గుజ్జురసంతో సుమధురమైన రుచినే కలిగి ఉంటాయి. పింక్స్ మమ్మూత్ సీతాఫలాలైతే మరీ పెద్దగా ఉంటాయి. ఈ రకాల ఒక్కో చెట్టు ఒకో విడత కనీసం 3 కేజీల పళ్లను ఉత్పత్తి చేస్తుంది. ఆఫ్రికన్ ప్రైడ్స్ మధ్యస్త పరిమాణంలో ఉంటే, ఒక్కో పండు సుమారు 500-00 గ్రా. బరువు తూగుతుంది.
- సీతాపండు చర్మం సన్నగా ఉన్నా గట్టిదనం ఎక్కువే. చెట్టుకు పూచే పూలన్నీ కాయలై, అవి ఎదిగి, పక్వమవడానికి సాధారణంగా 20-25 వారాల సమయం పడుతుంది. కాయ పండయ్యాక లోన తెల్లని గుజ్జు ఏర్పడి, ఒక్కో గింజ చుట్టూ విడివిడిగా అదంతా అతుక్కుని పోతుంది. ఇందులోని నల్లని గింజల సంఖ్యను బట్టి దాని చర్మంపైన గుండ్రని భాగాలు ఉంటాయి. ఒక్కో గుండ్రని భాగంలో సాధారణంగా ఒక్కో గింజ తెల్లగుజ్జు మధ్య కప్పబడి ఉంటుంది. కొన్నిటిలో అసలు గింజలు లేకుండా కేవలం గుజ్జు మాత్రమే ఉంటుంది. ఇక, సగటున ఒక్కో పండులో సుమారు 55 నుంచి 60 లేదా 75 దాకా గింజలు ఉంటాయి.
- సీతాఫలం స్వస్థలం వెస్ట్ ఇండీస్. కానీ, ప్రాచీన కాలంలోనే మధ్య అమెరికా గుండా దక్షిణాది మెక్సికోకు తేబడింది. పెరూ, బ్రెజిల్‌లలో సుదీర్ఘకాలంగా ఈ చెట్లు పెంచుతున్నారు. 
                            బహమాస్ దీవులలో సీతాఫల చెట్లు సర్వసాధారణం. బెర్ముడా, దక్షిణాది ఫ్లోరిడాలలో సమయానుసారం పెరుగుతాయి. ఆఫ్రికాకు 17వ శతాబ్దపు ఆరంభంలో వచ్చింది. భారతదేశంలో మొదట్లో కోల్‌కతలోనే వీటిని ప్రత్యేకించి పండించారు. తర్వాత అనేక వన్య ప్రాంతాలకు ఇది విస్తరించింది. మలయా తూర్పుతీరంలో సీతాఫలాలు విస్తారంగా లభ్యమవుతున్నాయి. అమెరికాకు చెందిన గువామ్ దీవిలోకి గత ఏళ్ల క్రితమే ఇవి వచ్చాయి. ఇక, హవాయి ప్రజలకైతే సీతాఫలాలు అంటే ఏమిటో పూర్తిగా తెలియదు.
- సీతాఫలంలో పోషకాలు పుష్కలం. మనిషి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థకు బాగా ఉపయోగపడే ‘విటమిన్-సి’ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ (ఆక్సీకరణ నిరోధకాలు) వీటిలో ఉంటాయి. గుండె, హృద్రోగ వ్యాధుల నుండి మనల్ని రక్షించే పొటాషియం, మెగ్నీషియంలూ ఈ పళ్లలో అధిక పాళ్లలో లభిస్తాయి. మెగ్నీషియం మన దేహంలోని నీటి సమతుల్యతను కాపాడటమే కాక కీళ్లలోని అవాంఛనీయ రసాయనాలను తొలగిస్తుంది. ఫలితంగా కీళ్లవ్యాధి (రుమాటిజం), కీళ్లవాతం (ఆర్థిరిటిస్) లక్షణాలు తగ్గుముఖం పడతాయి.
- సగటున ఒక 100 గ్రాముల సీతాఫలం గుజ్జులో కొవ్వు పదార్థాలు 0.5-0.6 గ్రా. కార్బోహైడ్రేట్స్ 20-25.2 గ్రా. క్య్రూడ్ ఫైబర్ 0.9-6.6 గ్రా. కేలోరీలు 0-101 వరకు, తేమ 6.3-0.1 గ్రా. ప్రొటీన్లు 1.17-2.47 గ్రా. ఉంటాయి. కాల్షియం 17.6-27 మి.గ్రా. ఫాస్పరస్ 14.7-32.1 మి.గ్రా. ్వల్ప పాళ్లలో ఐరన్, క్యారోటిన్, థియామైన్, రైబోఫ్లేవిన్, నియాసిన్, అబ్జార్బిక్ యాసిడ్, నికోటినిక్ యాసిడ్ ఉంటాయి.
- సీతాఫలాలు మన ఆరోగ్యానికి మేలు చేసేవే కాక దీని చెట్టు ఆకుల నుండి బెరడు దాకా అన్నీ వివిధ రకాల వ్యాధులు, అనారోగ్యాల చికిత్సకు చక్కగా ఉపయోగపడతాయి. ఈ చెట్టు ఆకు డికాషన్‌ను జీర్ణాశయంలోకి తీసుకుంటారు. ఆకులను నూరి లేదా గుజ్జు పేస్టును కురుపులు, పొక్కులు, వ్రణాలు, అల్సర్ పుండ్ల చికిత్సకు ఉపయోగిస్తారు. దీని పక్వం కాని కాయ గుజ్జును అతిసార వంటి వ్యాధుల చికిత్సలోనూ వాడతారు. బాగున్నాయి కదాని అదే పనిగా, అతిగా సీతాఫలాలను ఆరగించరాదనీ నిపుణులు సలహా ఇస్తున్నారు. 
- సీతాఫల గింజలు చాలా గట్టిగా ఉంటాయి. వీటిని పండు గుజ్జుతోపాటు పొరపాటున మింగేసినా పెద్ద ప్రమాదమేమీ జరగదు. అవి మలవిసర్జనలోంచి తేలిగ్గానే బయటకు వచ్చేస్తాయి. నిజానికి ఈ గింజలు చాలా విషతుల్యమనీ నిపుణులు అంటారు. సీతాఫల గింజలేకాదు, ఆకులు, కాయలు అన్నీ మంచి క్రిమి సంహారకాలుగానూ ఉపయోగపడతాయి. చిత్రంగా దీని ఆకుల నుంచి తీసిన రసం తలలోని పేలును చంపేస్తుందంటున్నారు. 
ఆరోగ్యానికి ఎంతో మంచివి:
                            ప్రతి ఏడాది వచ్చే సీతాఫలాల కోసం చాలామంది ముఖ్యంగా పిల్లలు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. కారణం వీటి మధురమైన రుచి. ఆ కమ్మదనం మరే పండులోనూ దొరకదు. సీజన్ పొడుగునా శ్రుతి మించకుండా వీటిని తింటూ పోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు అంటారు. పొద్దంతా బాగా అలసిపోయి ఇంటికి వచ్చిన వారు తమ భోజన పదార్థాలలో ఈ పండ్లు చేర్చడం మంచిది. ఇందులోని పొటాషియం కండర బలహీనతను పోగొడుతుంది. మనలోని రక్తపోటును ఈ పండ్లు చక్కగా నియంవూతిస్తాయి. వీటిలోని ‘విటమిన్-ఎ’ చర్మం, తల ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. ఈ పండ్లు తినడం వల్ల కళ్లకూ ఎంతో మేలు చేకూరుతుంది. అజీర్ణ సమస్య తొలగుతుంది. మలబద్దకం నివారణవుతుంది. ఇక, అతిసార (డయేరియా), రక్త లేదా జిగట విరేచనాలు (డైసెంటరీ)ల చికిత్సకూ సీతాఫలాలు చక్కగా ఉపయోగపడతాయని నిపుణులు అంటారు. అంతేకాదు, రక్తహీనత (అనేమియా)తో బాధపడే వారికైతే ఈ ఫలాలు ఎంతో మంచివి. ఎందుకంటే, ఇందులోని కేలరీల శాతమూ తక్కువేమీ కాదు.
                                                                       - దోర్బల బాలశేఖరశర్మ

Thursday, 15 November 2012

జల వివక్ష యజ్ఞం..-సీమ ప్రాజెక్టులకు ఒక న్యాయం.. తెలంగాణ ప్రాజెక్టుకు మరో న్యాయం
-సోమశిలకు అడ్డురాని నిధుల కొరత..యుద్ధవూపాతిపదికన హంద్రీనీవా 
-పంప్‌హౌజ్‌లు తయారైనా ప్రారంభంకాని భీమా-2
-అప్రోచ్ చానల్ లేక ముందుకు సాగని భీమా-1 లిఫ్ట్
-కల్వకుర్తి ఫేజ్-2లో తట్ట సిమెంట్ పనీ మొదలుకాలేదు
-నీటి లభ్యత సాకుతో పాలమూరు-రంగాడ్డి లిఫ్టుకు కొర్రి 
                  సీమాంధ్ర ప్రాజెక్టులంటే.. ఎంత కొరత ఉన్నా.. నిధులు పెల్లుబికి వస్తాయి. అదే తెలంగాణ ప్రాజెక్టులంటే పైసా కూడా రాలదు! సీమాంధ్ర ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసుకుంటుంటే.. తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులు మాత్రం.. ఎక్కడేసిన గొంగళి అక్కడేనన్నట్టు మూలుగుతుంటాయి! ఒకే తరహా అన్యాయం.. పదే పదే! నెల్లూరు జిల్లాలో రూ.800 కోట్లతో చేపట్టనున్న సోమశిల ఎత్తిపోతల పథకానికి నిధుల కొరతను తోసిరాజని ప్రభుత్వం ఇటీవలే రూ.150 కోట్లు మంజూరు చేసింది. మరోవైపు అనంతపురం జిల్లాలో అసంపూర్తిగా ఉన్న హంద్రీనీవా ప్రాజెక్టు పనులను రాత్రింబవళ్లు యుద్ధవూపాతిపదికన పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. మహబూబ్‌నగర్ జిల్లాలో పంప్‌హౌజ్ నిర్మాణం పూర్తయి ఏడాదిదాటినా భీమా-2 ఎత్తిపోతల పథకంలో లిఫ్ట్-1కు లింక్ చానల్ పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. దీంతో ఈ పథకం నిరుపయోగంగా మారింది.
                 అలాగే ప్రధాన రిజర్వాయర్ నుంచి పంపింగ్ స్టేషన్ వరకు అప్రోచ్ చానల్ పనులు పూర్తికాకపోవడంతో మిగిలిన పనులన్నీ అయిపోయినా భీమా-1 ఎత్తిపోతలకు మోక్షం కలగడం లేదు. కల్వకుర్తిలో కేవలం మొదటి దశ పనులు మాత్రమే పూర్తి కాగా 2.23 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన కల్వకుర్తి ఎత్తిపోతల ఫేజ్-2, ఫేజ్-3 గురించి పట్టించకున్న నాథుడే లేడంటే తెలంగాణ ప్రాజెక్టులపై పాలకులకు ఉన్న ప్రాధాన్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. భీమా-2 ఎత్తిపోతల పథకంలో లిఫ్ట్-1 పనులన్నీ పూర్తయ్యాయి. అయితే జూరాల నుంచి రామనపాడు వరకు 17 కిలోమీటర్ల లింక్ చానల్ నిర్మాణంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాగే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మొదటి దశ పూర్తయి, 13 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. అయితే ఈ పథకం ఎక్కువ శాతం ఉపయోగపడేది ఫేజ్-2, ఫేజ్-3లోనే. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫేజ్-2లో ఇంత వరకు తట్ట సిమెంట్ పని కూడా జరగలేదు. ఇక్కడ రెండో దశ పనులు పూర్తయితే తప్ప మొత్తం 3.40 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు. 
సాగర్‌ను పక్కనపెట్టి...
శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నీళ్లు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న సీమ సర్కార్, సీమాంధ్ర ప్రాజెక్టు విషయంలో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోంది. హంద్రీనీవా ప్రాజెక్టు వాస్తవంగా కర్నూలు జిల్లాలో హంద్రి నది, చిత్తూరు జిల్లాలోని నీవా నది ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టు. అయితే పేరులో కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఉన్న నదుల పేరు పెట్టుకుని నీళ్లు మాత్రం శ్రీశైలం నుంచి తీసుకెళ్లనున్నారు. అలాగే కర్నూ లు జిల్లాలో గాలేరు, చిత్తూరు జిల్లాలోని నగరి నదుల పేరుతో ప్రాజెక్టు నిర్మించుకుంటూ పోతిడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణా నీళ్లు తరలించుకుపోయేందుకు సీమ సర్కార్ వ్యూహరచన చేసింది. ఈ రెండు ప్రాజెక్టులు వరద నీటిని ఉపయోగించుకోవడం ద్వారా డిజైన్ చేసినవి. అయితే సర్కార్ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీశైలం కింద ఉన్న సాగర్ ఆయకట్టును గాలికి వదిలేసి, వరద నీటితో సంబంధం లేకుండా సీమలోని ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చేందుకు తెర కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు. శ్రీశైలంలోని నికర జలాలపై ఆధారపడిన ప్రాజెక్టులకు పట్టించుకోకుండా, వరద నీటితో డిజైన్ చేసిన ప్రాజెక్టులకు నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. 
తెలంగాణపై ప్రాజెక్టులపై వివక్ష...
కరువు జిల్లా మహబూబ్‌నగర్‌లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూపొందించిన ‘పాలమూరు-రంగాడ్డి’ ఎత్తిపోతల పథకానికి సంబంధించి సర్కార్ రకరకాల కొర్రీలతో కాలయాపన చేస్తున్నది. ప్రాజెక్టు నిర్మాణం సంగతి పక్కనపెడితే కనీసం సర్వేకు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. పాలమూరు-రంగాడ్డి ఎత్తిపోతల పథకంపై మంత్రి డీకే అరుణ నేతృత్వంలో ఆగస్టు నెలలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా సమావేశమై ముఖ్యమంవూతిని కలిశారు. 
ఈ ప్రాజెక్టును చేప ఆయన కచ్చితమైన హామీ ఇచ్చారని మీడియాకు వెల్లడించారు. అయితే మూడు నెలలు పూర్తికావస్తున్నా ఈ ప్రాజెక్టు అతీగతీ లేకుండాపోయింది. పైగా దీనిని తొక్కిపె సీమాంధ్ర పాలకులు తీవ్రస్థాయిలో కుట్రలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న ప్రాజెక్టులే పూర్తికాకపోతే, మరొ కొత్త ప్రాజెక్టు ఎందుకు అని ఒకసారి, అసలు ఈ ప్రాజెక్టుకు నీటి లభ్యత ఎక్కడిదని మరొకసారి అభ్యంతరాలు చెబుతూ ప్రాజెక్టు ఫైలుని అటకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలంగాణ రైతులు ఆరోపిస్తున్నారు. పెన్నా నదిలో నీటి లభ్యత అంతంత మాత్రగానే ఉన్నప్పటికీ అక్కడ రూ.800 కోట్లతో నిర్మించనున్న సోమశిల ప్రాజెక్టుకు ప్రభుత్వం అంగీకరించడమే కాకుండా తొలి విడత కోసం రూ.150 కోట్లు సైతం విడుదల చేసింది. అదే తెలంగాణలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్న పాలమూరు-రంగాడ్డి గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. 
         పాలమూరు-రంగాడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి లభ్యత ఎక్కడిది? అనేది నీటిపారుదల శాఖ వర్గాల ప్రశ్న. పాలమూరు-రంగాడ్డి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసిన తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ ఫోరం నీటి లభ్యత గురించి చాలా స్పష్టంగా నివేదికలో పేర్కొంది. కృష్ణా జలాలకు సంబంధించి గత ఇరవై ఏళ్ల గణాంకాలను పరిశీలించడమే కాకుండా పోతిడ్డిపాడుకు అదనపు జలాలు కేటాయించేందుకు కమిటీ చేసిన సిఫారసులను కూడా అందులో పొందుపర్చారు. పోతిడ్డిపాడు నుంచి సీమ ప్రాంతానికి వాస్తవానికి 11,500 క్యూసెక్కులు మాత్రమే ఇవ్వాలి. కానీ వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రత్యేక కమిటీని నియమించారు. వాళ్లు కృష్ణా నదిలో లభ్యత ఉన్న నికర జలాలు, వరదల సమయంలో వచ్చే నీటిని అంచనా వేసి పోతిడ్డిపాడు విస్తరించుకోవచ్చని సూచించారు. ఏటా వరదల సమయంలో సుమారు 400 టీఎంసీలు వృథాగా సమువూదంలో కలిసిపోతున్నాయని అందులో పేర్కొన్నారు.
          ఆ కమిటీ నివేదిక మేరకు అప్పటి వరకు 11,500 క్యూసెక్కులుగా ఉన్న పోతిడ్డిపాడు హెడ్‌గ్యులేటర్ సామర్ధ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచారు. ఇదే విషయాన్ని అసరాగా చేసుకుని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్లు సమువూదంలో కలిసిపోతున్న వరద నీటిని నిల్వ చేయగలిగితే, లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చని భావించారు. కరువు విలయతాండవం చేస్తున్న మహబూబ్‌నగర్ జిల్లాతో పా టు కొంత మేర రంగాడ్డి జిల్లాలోని భూములకు సాగునీరు ఇచ్చే విధం గా పాలమూరు-రంగాడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. జూరాల వద్ద వరదల సమయంలో 35 వరద రోజులకు 2 టీఎంసీల చొప్పున మొత్తం 70 టీఎంసీల నీటిని నాలుగు స్టేజీల్లో లిఫ్ట్ చేసే విధంగా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దీని వల్ల మహబూబ్‌నగర్ జిల్లలో 7 లక్షలు, రంగాడ్డి జిల్లాలో 2.70 లక్షలు, నల్లగొండ జిల్లాలో 30 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చని ప్రణాళికలు రూపొందించారు. ఆరుతడి పంటలను దృష్టిలో పెట్టుకుని ఈ ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేశారు.
అప్పుడెలా కుదిరింది?...
      పాలమూరు-రంగాడ్డి ఎత్తిపోతల పథకానికి సీమాంధ్ర ప్రజావూపతినిధులు, అధికారులు మొకాలడ్డుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2009లోనే అప్పటి సీఎం వైఎస్ సర్వేకు ఆదేశిస్తే, ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకున్న నాథుడు లేడు. సర్వే కోసం రూ.5 కోట్ల అవసరమని అప్పటి చీఫ్ ఇంజినీర్ ప్రభుత్వానికి రాసిన లేఖ ఇంత వరకు వెలుగు చూడలేదు. మరోవైపు మూడు నెలల కిందట మంత్రి డీకే అరుణ, మరో మంత్రి ప్రసాదకుమార్ ఈ ప్రాజెక్టును తీసుకొచ్చి తీరుతామని వాగ్దానాలు చేశారు. సీఎంను కలిశారు, ఆయన హామీ ఇచ్చారని, త్వరలోనే ప్రాజెక్టు సర్వే మొదలవుతుందని స్పష్టం చేశారు.
అయితే తాజాగా సర్వే కోసం రూ.5 కోట్ల కేటాయించాలని చీఫ్ ఇంజినీర్ లేఖ రాయగా, అసలు ప్రాజెక్టుకు నీటి లభ్యత ఎక్కడిదని నీటిపారుదల శాఖ ముఖ్యఅధికారి ఒకరు అభ్యంతరం చెప్పినట్లు తెలిసింది. ప్రతి సంవత్సరం సమువూదంలో కలుస్తున్న 400 టీఎంసీలను ఆధారం చేసుకుని ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని, ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని పోతిడ్డిపాడు సామర్ధ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచిన అధికారులకు, పాలమూరు-రంగాడ్డి ఎత్తిపోతల విషయం వచ్చే సరికి వరద నీరు ఎందుకు కనిపించడం లేదని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్లు ప్రశ్నిస్తున్నారు. కృష్ణా బేసిన్‌లో లేని సీమ ప్రాంతానికి పోతిడ్డిపాడు నుంచి నీళ్లు ఇస్తున్నాప్పుడు, కృష్ణా బేసిన్‌లోనే ఉన్న మహబూబ్‌నగర్, రంగాడ్డి జిల్లాలకు వరద నీరు తీసుకునే హక్కు కూడా లేదా? అన్నారు. పెన్నాలో నీళ్లు ఎక్కడున్నాయని సోమశిల ప్రాజెక్టుకు నిధులు కేటాయించారు? సీమాంధ్ర ప్రాజెక్టులకైతే ఒక తీరు, తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మరో రకంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజమని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. ప్రజావూపతినిధుల ఒత్తిడి లేకపోవడం వల్లే ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని, తెలంగాణ ప్రజావూపతినిధులకు చిత్తశుద్ధి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Monday, 12 November 2012

సమర గులాబీలు..!

* విలీనం కాదు విమోచనకు సిద్ధం కండి..
* అధినేత పిలుపుతో శ్రేణుల్లో సమరోత్సాహం 
* నేతలకు మేధోమథన రీచార్జ్

                ఇన్నాళ్ల అనుమానాలు పటాపంచలయ్యాయి. ఇక తమ పార్టీ ఏ పార్టీలోనూ విలీనం కాదని నిర్ణయించుకుంది. విలీనం కాదు తెలంగాణ విమోచనమే తమ లక్ష్యం అంటూ కరీంనగర్ మేధోమథనంలో టీఆర్‌ఎస్ విస్పష్టం చేసింది. అంతేకాదు భవిష్యత్‌లో తామెవరితోనూ పొత్తులు పెట్టుకోమని ప్రకటించింది. ఈ నిర్ణయం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నిన్నామొన్నటిదాకా టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని జరిగిన ప్రచారంతో ఎక్కడికక్కడ గులాబీ శ్రేణులు నిత్తేజంగా ఉండిపోయాయి. తమ పార్టీ లేకుండాపోతోందని ప్రచారం జరుగుతుంటే తమ భవిష్యత్ ఏమిటీ? ఎంత చేసినా ఏమున్నది అని నిరుత్సాహంలో ఉన్న పార్టీ శ్రేణులకు మేధోమథనం ధైర్యాన్ని ఇచ్చింది. 
             పూర్తిస్థాయిలో పార్టీని, ఉద్యమాన్ని తద్వారా ప్రజల సమస్యలపై పోరాటం చేయాలనే పిలుపుతోపాటు భవిష్యత్‌లో ఏ పార్టీతో పొత్తుపెట్టుకోం అని స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించడంతో కేడర్‌లో ఉన్న అనుమానాలు దాదాపుగా నివృత్తి అయిన అభిప్రాయం వ్యక్తం అవుతోంది. స్వరాష్ట్ర సాధన కోసం మడమ తిప్పని పోరాటాలు చేస్తామని అందుకు శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని టీఆర్‌ఎస్ తమ శ్రేణులను సమాయత్తపరిచేందుకు సరికొత్త ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. ప్రజల్లో, ఉద్యమసంఘాల్లో ఏర్పడ్డ భయానుమానాలను తొలగించడం, తెలంగాణ విషయంలో పార్టీలు చేస్తున్న మోసాల్ని ఎండగట్టడం, ఆయా పార్టీల నమ్మిక నాటకాల్ని బట్టబయలు చేయడం కోసమే టీఆర్‌ఎస్ తాజాగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించిందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని హామీ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ నమ్మకద్రోహం చేసిందని స్వయాన పార్టీ అధినేత కేసీఆరే స్వయంగా చెప్పారని జరిగిన ప్రచారం ఉత్తదేనని స్పష్టమైంది. 
           ఒకదశలో నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని నిర్ణయించుకున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ మరోసారి నమ్మకద్రోహం చేసింది. ‘మన లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన..అందుకోసం ఎవ్వరినీ ఉపేక్షించేది లేదు. నమ్మిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా ఉద్యమించాలి. అదే సమయంలో తాము తెలంగాణకు అనుకూలంగా ఉన్నాం. వాళ్లిస్తే మేం వద్దనం. అఖిలపక్ష సమావేశాన్ని పెట్టండి’ అంటూ తెలంగాణ విషయంలో ఎటూ చెప్పని టీడీపీ మోసపూరిత వైఖరిని ప్రజల ముందుపెట్టి ఆ పార్టీ బండారం బయటపెట్టాలనీ లక్షంగా చేసుకుంది. శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఎదిగాం. దాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని కరీంనగర్ మేధోమథనం స్పష్టం చేసింది. 
చేరికలపై దృష్టి.. 
పార్టీని పటిష్టం చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అన్ని నియోజకవర్గాలలో చేరికలపై దృష్టి సారించాలని మేధోమథనంలో స్పష్టం చేశారు. ‘మండల, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి. తెలంగాణపై టీడీపీ వైఖరిలో తేడా ఉంది. స్పష్టమైన నిర్ణయం చెప్పకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్‌లో అస్పష్టత ఉంది’ వీటిని ప్రజలకు వివరిస్తూ చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు అన్ని స్థాయిలో జరిగే విధంగా పార్టీ శ్రేణులు చొరువ తీసుకోవాలని తీర్మానించారు.
సమన్వయంపై సమీక్ష.. 
                        జిల్లా, నియోజకవర్గాల నేతల్లో సమన్వయం చేయడంపై పార్టీ దృష్టి సారించింది. నవంబర్30 నుంచి జనవరి10 వరకు నలుభై రోజులపాటు చేపట్టే పల్లెబాట కార్యక్షికమానికి ముందుగానే నేతల్లో సమన్వయం చేయాలని నిర్ణయించారు. కేసీఆర్ స్వయంగా రోజుకు రెండు జిల్లాలకు చెందిన రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గస్థాయి నేతలతో సమీక్ష చేయనున్నారు. జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలో సమీక్షలు చేపట్టి నాయకత్వ పనితీరుపై సమీక్షంచుకోవాలని మేధోమథన సదస్సు తీర్మానించింది. నియోజకవర్గాల ఇన్‌చార్జీలు స్థానికంగా క్యాడర్‌కు అందుబాటులోఉంటూ వారి సమస్యల పరిష్కారానికి సహకారం చేయాలని సూచించారు. నియోజకవర్గాలను విడిచి కార్యకర్తలకు దూరంగా ఉంటున్న ఇన్‌చార్జిల సమీక్షల అనంతరం కూడా వారి పని విధానంలో మార్పు రాకపోతే అవసరమైతే వారిని మార్చుతామనే హెచ్చరిక సంకేతాలు వెలువడ్డాయి. 
సెంటిమెంటే కాదు.. 
              ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌తో గెలుస్తామనే భ్రమలను వదిలి గ్రామాలకు తరలి నాయకత్వానికి సూచించారు. ప్రజాసమస్యలపై దృష్టిసారించి వాటి పరిష్కారానికి ఉద్యమాలు చేపట్టాలని తీర్మానించారు. ముఖ్యంగా కార్యకర్తలకు దూరంగా ఉంటూ సెంటుమెంటునే నమ్ముకోకుండా ప్రజలతో మమేకం కావాలని బలమైన ఉద్యమాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ‘ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై మిలిటెంటు పోరాటాలకు ప్రజలను సన్నద్ధం చేయాలి. అన్ని వర్గాల ప్రజలను ఉద్యమంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ బలోపేతం చేయాలి’ అని మేధోమథన సదస్సు క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపింది. అదేవిధంగా పనిచేయకుండా పార్టీనే అంటిపెట్టుకొని ఉంటామనే వారికి స్థానం లేదని హెచ్చరిక సంకేతాలను అందించింది. సెంటిమెంటు కాదు ఇక ఉద్యమమే అనే స్ఫూర్తితో కదనరంగంలోకి వెళ్లాలని పార్టీ శ్రేణులను సమయాత్తం చేసింది.                                                              (టీమీడియా ప్రతినిధి-వరంగల్)

Friday, 9 November 2012

శాంతి ముగిసింది..ఇక యుద్ధమేనాలో ఉగ్ర నరసింహుడిని చూస్తారు
ఇక డెడ్‌లైన్‌లు లేవు.. కాంగ్రెస్‌కు డెత్‌లైనే
- కన్నీళ్లు లేని తెలంగాణ కాంక్షించాం
- కాంగ్రెస్‌లో విలీనానికీ సిద్ధమయ్యాం
- కానీ.. కాంగ్రెస్ మోసం చేస్తున్నది
- ఉద్యమాలు.. రాజకీయాలు..
  టీఆర్‌ఎస్‌కు రెండు పార్శాలు
- యువకుల్లారా.. అశ్రువులై రాలకండి.. 
  అస్త్రాలై శత్రువును చీల్చండి
- బంగారు తెలంగాణ సాధిద్దాం
- టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపు
- ముందస్తు ఎన్నికలు రావొచ్చని వ్యాఖ్య
- ఎన్నికల ప్రస్థానం కరీంనగర్ నుంచే..
- ముగిసిన టీఆర్‌ఎస్ మేధోమథనం
- ఉద్యమ షెడ్యూలు ఖరారు
- డిసెంబర్ 9న నల్ల జెండాలతో నిరసనలు
            ఆరంభించరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై..అంటూ సాగే పద్యాన్ని కేసీఆర్ చదివి వినిపించారు. నిర్దేశించుకున్న లక్ష్యానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ఎన్ని అవరోధాలు ఎదురైనా.. ఎంతమంది విద్రోహులు అడ్డుతగిలినా.. గమ్యాన్ని ముద్దాడేవరకు ధీరులు పోరాటం చేసి తీరుతారన్నది ఇందులోని అర్థం.
          తెలంగాణ కోసం సాగిన ఉద్యమంలో శాంతి ముగిసిందని, ఇక జరిగేది యుద్ధమేనని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఎంపీ కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇకపై తెలంగాణ కోసం డెడ్‌లైన్‌లు ఉండవని, ఇక కాంగ్రెస్‌కు డెత్‌లైనేనని తేల్చి చెప్పారు. తెలంగాణ అంశాన్ని నాన్చుతూ, మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు నువ్వులు, నీళ్లు వదిలేశామని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌తో సంధి సంబంధాలుండవని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని ప్రకటించారు. సమావేశం నిర్ణయాలను అనంతరం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్ చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఇవ్వాలంటే టీఆర్‌ఎస్‌ను విలీనం చేయాలని కాంగ్రెస్ షరతు పెట్టిందని తెలిపారు. ‘కాంగ్రెస్  పెట్టిన షరతులపై మేధావులతో చర్చించి, కన్నీళ్లు లేని తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధపడ్డాం. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాన్ని సాధించేందుకు పార్టీని విలీనం చేసే నిర్ణయాన్ని తీసుకొని త్యాగనిరతిని చాటాం. అయినా కాంగ్రెస్ మోసపూరిత వైఖరినే అవలంబిస్తోంది’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
 ప్రబల రాజకీయ శక్తిగా ఎదుగుతాం:
             ఉద్యమాలు, రాజకీయాలు అన్న రెండు పార్శాలతో ముందుకు సాగనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఉద్యమాలను మహోధృతంగా నిర్వహించి, రాజకీయంగా ప్రబలశక్తిగా ఎదుగుతామని చెప్పారు. ‘‘వ్యూహాత్మకంగానే మౌనాన్ని పాటించాను. ఆ మౌనాన్ని బద్దలు చేశా. ఇక అందరికీ అందుబాటులో ఉంటా. కేసీఆర్‌లో నరసింహ ఉగ్రరూపాన్ని చూస్తారు’’ అని కేసీఆర్ అన్నారు. ‘తెలంగాణకు కాంగ్రెస్ మోసం చేసింది. టీడీపీ దగా చేసింది’ అని చెప్పారు. ‘బాబూ! జై తెలంగాణ అంటే నోటి ముత్యాలు రాలిపోతాయా? కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణపై లేఖ ఇవ్వడానికి అఖిలపక్ష సమావేశానికి సంబంధమేమిటి?’ అని ఆయన నిలదీశారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీలు తెలంగాణ ద్రోహ పార్టీలేనని ఆయన దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని, వంద అసెంబ్లీ, 16 ఎంపీ స్థానాలే లక్ష్యంగా బరిలో దిగుతామని ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలేనని కేసీఆర్ విమర్శించారు. ప్రస్తుతం సంకీర్ణ యుగమే నడుస్తోందని, ఏ పార్టీ కూడా సొంతంగా వంద సీట్లు సాధించే స్థితిలో లేదని పేర్కొన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ. ఆ పార్టీతో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు. 
శాశించి తెలంగాణ సాధిస్తాం:       
                 యాచించి కాదు, శాసించి తెలంగాణను సాధిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు ఆత్మవంచనతో కుమిలిపోవడం కన్నా పార్టీని వీడిబయటకు రావాలని సూచించారు. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు పదుల సంఖ్యలో ఎంపీ, ఎమ్మెల్యేలు క్యూ కట్టారని, వారి వివరాలను వెల్లడించడం మంచిది కాదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. పార్టీలోకి అందరినీ ఆహ్వానించలేమన్నారు. పార్టీపరంగా గతంలో చేసిన తప్పులు పునరావృతం కానీయబోమని తెలిపారు. రాజకీయంగా ఎంతో పరిపక్వత సాధించామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అంటూ కాంగ్రెస్ చచ్చేదాక సొల్లు పురాణం చెబుతుందా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చేదాకా పోరాటాలు చేస్తామని, దీనికి ఇంత కాలమంటూ ఏమీ లేదన్నారు. 18మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలున్న తాము అసెంబ్లీ, పార్లమెంట్‌లను స్తంభింపజేశామని ఆయన గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. 
టీజేఏసీతో కఠిన భేదాభిప్రాయాలు కావు..:
           ‘టీజేఏసీతో విభేదాలు ఉన్న మాట వాస్తవం. అయితే మళ్లీ కలుసుకోలేనంత కఠిన భేదాభివూపాయాలు కావు. మహబూబ్‌నగర్ ఉప ఎన్నిక సందర్భంగా మా అభ్యర్థి విజయానికి టీజేఏసీ సహకరించకుండా ద్రోహం చేసింది. ఇది నన్ను కలచి వేసింది. చాలా బాధపడ్డా. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలనూ కలుపుకెళ్లాన్నదే మా లక్ష్యం. మహబూబ్‌నగర్ ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థిని నిలబెడితే ఓడించారు. ముస్లింలను రజాకార్లతో పోల్చుతూ బీజేపీ ప్రచారాన్ని నిర్వహించింది. ఇది ప్రజాస్వామ్య పద్ధతా? అయినా హైదరాబాద్ వెళ్లగానే టీజేఏసీ నాయకులను పిలిచి మాట్లాడుతా. అంతా కలిసి ఏకోన్ముఖులుగా ఉద్యమిస్తాం. ఈ విషయంలో దుష్ప్రచారం చేయవద్దు’ అని కేసీఆర్ అన్నారు. గమ్యాన్ని ముద్దాడే వరకు ఎత్తిన జెండాను దించేది లేదని పునరుద్ఘాటించారు. 
అస్త్రాలై శత్రువును చీల్చండి:             
              తెలంగాణ రాష్ట్ర సాధనలో జరుగుతున్న జాప్యంతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతుండటంపై కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘యువకుల్లారా! ఆత్మహత్యలకు పాల్పడకండి. చావులు మంచిది కాదు. అశ్రువులై రాలకండి.. అస్త్రాలై శతృవును చీల్చండి. చెతుపూత్తి దండం పెడుతున్నా. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు. చావులతో కృంగదీయకండి. మనసులో బాధ ఉంటే నేరుగా నా వద్దకు రండి’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. 
బలాన్నిచ్చిన కరీంనగర్:
                  తెలంగాణ ఉద్యమంలో కరీనగర్ జిల్లా మహోన్నత పాత్ర పోషిస్తున్నదని కేసీఆర్ చెప్పారు. ‘తెలంగాణ ఉద్యమ బావుటాను ద్విగుణీకృతం చేసి కరీంనగర్ జిల్లా ప్రజలు ఉద్యమాన్ని హిమాలయమంత ఎత్తుకు తీసుకెళ్లారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో వేయి ఎనుగుల బలాన్నిచ్చారు. 2001లో మొదట సింహగర్జన ద్వారా ఉద్యమ జ్వాలను రగిలించారు’ అన్నారు. కరీంనగర్ జిల్లావాసులు, పార్టీ కేడర్ రెండు రోజులపాటు మేథోమధనానికి చక్కటి ఆతిథ్యాన్నిచ్చారంటూ కేసీఆర్ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల ప్రస్థానం కూడా కరీంనగర్ నుంచే ప్రారంభమవుతుందని కేసీఆర్ ప్రకటించారు. 
తెలంగాణ కోసమే విలీనానికి సిద్ధపడ్డాం: 
           ‘పన్నెండేళ్లుగా హోరాహోరీగా సాగుతున్న తెలంగాణ ఉద్యమంలో అనేక మలుపులు, ద్రోహాలు, జయాలు, అపజయాలు ఎదుర్కొన్నాం. పుష్కరకాలంగా ఉద్యమాన్ని సజీవంగా, పట్టుసడలకుండా కాపాడుకున్నాం. సకల జనుల సమ్మెద్వారా ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాం. 55మంది టీజేఏసీ, ఉద్యోగ సంఘాల నాయకులతో ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిశాం. ఉద్యమ స్వరూపాన్ని వివరించాం. ముందు ఉద్యమ వేడిని తగ్గించాలని, మెడమీద కత్తిపెడితే కష్టమని ప్రధాని కోరడంతో తెలంగాణపై నిర్ణయం తీసుకునేందుకు మొండి వైఖరి వద్దనుకుని ప్రధానికి వెసులుబాటు కల్పించాం. ఆ తరువాత కొంతకాలానికి ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం చర్చలకు నన్ను ఆహ్వానించింది. ఢిల్లీ వెళ్లాలా? వద్దా? అని పార్టీలో, మేధావులతో చర్చించా.ఢిల్లీ వెళ్లాలన్న మేధావుల సలహాతో కాంగ్రెస్ నేతలు పలువురితో చర్చలు జరిపా. టీఆర్‌ఎస్‌ను విలీనం చేయమంటూ కాంగ్రెస్ కండిషన్ పెట్టింది. కన్నీళ్లు లేని తెలంగాణ కోసం పార్టీని కూడా విలీనం చేసేందుకు సిద్ధపడ్డా. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ కావాలన్నాం. అయినా కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని వీడలేదు. తెలంగాణపై నాన్చుడు ధోరణిని అవలంబిస్తూ దగా చేస్తోంది’ అని చెప్పారు. ‘బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో టీఆర్‌ఎస్ ఉండాల్సిందే. త్యాగానికి సిద్ధపడినా కాంగ్రెస్ మోసపూరిత నైజాన్ని వీడటం లేదు’ అన్నారు.
స్వీయ అస్థిత్వం సాధిస్తాం:
                ‘ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, ప్రజలు నన్ను బిడ్డగా ఆదరిస్తున్నారు. వారి కోసం టీఆర్‌ఎస్ కరదీపికగా నిలుస్తుంది. ఉద్యమం, రాజకీయం అన్న పార్శాలతో పోరాడుతాం. ప్రజల రాజకీయ శక్తిగా ఎదుగుతాం. దోపిడి నుంచి బయటపడాలి. స్వీయ రాజకీయ అస్థిత్వాన్ని సాధిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. ముస్లింలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. ముస్లింల కోసం ప్రత్యేక ఎజెండాను రూపొందించనున్నట్లు తెలిపారు. 
డిసెంబర్ 9న నల్లజెండాలతో ప్రదర్శనలు:                     
               టీఆర్‌ఎస్ ఉద్యమ షెడ్యూల్‌ను కేసీఆర్ ప్రకటించారు. డిసెంబర్ 9న తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులంతా నల్లజెండాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేసి, నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నందున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేయాలని కోరారు. ఈనెల 15న పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌డ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్న సందర్భంగా లక్షలాది మందితో సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. 23న నల్లగొండ జిల్లా సూర్యాపేటలో లక్షలాది మందితో సమరభేరి నిర్వహిస్తామన్నారు. 29న దీక్షా దివస్‌ను నిర్వహించాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వేయి, రెండు వేల మందితో, మొత్తంగా రెండు లక్షల మందితో సామూహిక దీక్షలను చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈనెల 30 నుంచి జనవరి 10వ తేది వరకు 40రోజులపాటు పల్లెబాటను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఢిల్లీ సర్కార్ మోసాలను ప్రతి గుండెకు తట్టే విధంగా ప్రజలను జాగృతం చేయాలన్నారు. బూత్ కమిటీ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకునేందుకు కేడర్ కృషి చేయాలన్నారు. స్థానిక సమస్యలపై మరిన్ని ఉద్యమాలను నిర్వహించాలన్నారు. కాంగ్రెస్ దుర్మార్గాలను ఎండగట్టాలని ఆయన కోరారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని డిసెంబర్ 7న అఖిల పక్ష సమావేశంలో తెలంగాణను అంగీకరించి.. టీడీపీ చేసిన మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. జగన్ పార్లమెంట్‌లో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకున్నారని గుర్తు చేశారు. 
             కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ తెలంగాణ ద్రోహ పార్టీలేనన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు స్కాలర్‌షిప్‌లను రూ. 535 నుంచి రూ.1500లకు పెంచాలని, సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్లను ఆరు బదులుగా 12 సిలిండర్లు సరఫరా చేయాలని, తుఫానుకు దెబ్బతిన్న పంట, ఆస్తి నష్టానికి యుద్ధ ప్రాతిపదికన పరిహారం మంజూరు చేయాలని, ఏడు గంటలపాటు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కాకతీయ ఉత్సవాల కోసం రూ.150కోట్లు విడుదల చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ దేవరాయ ఉత్సవాలకు రూ.100కోట్లు, చిత్తూరు జిల్లా ఉత్సవాలకు రూ.140కోట్లు విడుదల చేసిన ప్రభుత్వాలు కాకతీయ ఉత్సవాలకు రూ.25లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నాయని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పద్యాలతో అకట్టుకున్న కేసీఆర్
                   విలేకరుల సమావేశంలో కేసీఆర్ పలు పద్యాలు పాడుతూ, వాటి అర్థాలు వివరిస్తూ.. వాటిని తాజా రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమానికి, కాంగ్రెస్‌తో చర్చలకు అనుసంధానించడంతో సమావేశం ఆసక్తికరంగా సాగింది. 
‘‘ఆరంభించరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై
ఆరంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధృత్యున్నతో త్సాహులై
ప్రారద్దార్థం బుజ్జగింపరు సుమీ! ప్రజానిధుల్ గావునన్’’
అర్థం: మానవులలో అధములు, మధ్యములు ఆలంకాలకు బెదరి కార్యములు చేపట్టబోరు. ధీరులైన వారు విఘ్నములను అధిగమిస్తూ దూసుకెళ్లారు. ప్రజ్ఞానిధులు ఖర్మ, తలరాత అనే మాటలకు తావివ్వకుండా లక్ష్యాన్ని సాధిస్తారు.
పద్యం ఆంతర్యం: నిర్దేశించుకున్న లక్ష్యానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ఎన్ని అవరోధాలు, విద్రోహులు ఎదురైనా గమ్యాన్ని ముద్దాడే వరకు పోరాటం చేసి తీరుతారన్నది ఇందులోని అర్థం. పుష్కరకాలంగా తెలంగాణ సాధనకోసం చేస్తున్న ఉద్యమాల్లో ఎన్నో ఒడిదుడుకులు, ఎదురైనా, చివరకు తాము అనుకున్న లక్షాన్ని సాధిస్తామని తేల్చిచెప్పారు. ఇటీవలి కాంగ్రెస్‌తో చర్చల విషయాన్ని ప్రస్తావిస్తూ, తిరుపతి వెంకట కవుల పాండవోద్యోగ విజయాలు, కరుణ శ్రీ రచించిన విజయశ్రీ నుంచి కొన్ని పద్యపాదాలు చదివి వినిపించారు.
‘‘ఐనను పోయి రావలయు హస్తినకచ్చటి సంధిమాట యొట్లైనను/ శత్రు రాజుల బలాబల సంపద చూడవచ్చు నీ’’
మరో పద్యం: ‘‘అయినవి సంధి సంబరం వాయుధముల్ ధరియింపుడయ్య/ దాపైనది వీర భారత మహారణ రంగం’’
కాంగ్రెస్ పార్టీ కపట బుద్ది తెలిసినా.. ఆవిర్భావనం నుంచి నేటివరకు తెలంగాణకు చేసిన ద్రోహం తెలిసినా.. పోయిరాక తప్పలేదు. దీని ద్వారా మరోసారి కాంగ్రెస్ కపట బుద్ధిబట్టబయలైంది. మన త్యాగశీలత బయట పడింది. ఇక చర్చలు, సంప్రతింపులు పూర్తయ్యాయి. లక్ష్యసిద్ధి కోసం మహారణ రంగమే చేయాల్సి ఉందంటూ ఆకట్టుకున్నారు.
                                   -(కరీంనగర్ నుంచి టీ మీడియా ప్రత్యేక ప్రతినిధి)

Wednesday, 7 November 2012

గన్ రాక్:
sirf1
          సికింద్రాబాద్ క్లబ్‌కు సమీపంలోని తిరుమలగిరి ప్రాంతంలో ఎత్తైన కొండపై ఉన్న మంచినీటి రిజర్వాయరే గన్‌రాక్. తిరుమలగిరి బొల్లారం, బోయిన్‌పల్లి ప్రాంతాలలో బ్రిటీషు మిలిటరీ దళాలు 1836లో స్థిరపడినాక స్థానికులకు మంచినీటి సౌకర్యం కోసం రిజర్వాయర్ అవసరమైంది. ఇందుకోసం తిరుమలగిరికి దగ్గరలో ఉన్న ఎత్తైన చిన్న కొండ ప్రాంతపై మంచినీటి రిజర్వాయర్ నిర్మించారు. ఇది ఆనాటి బ్రిటీష్ ఇంజనీర్ల సాంకేతిక పరిజ్ఞానానికి ఒక మచ్చుతునక. దీన్ని ఆకర్షణీయమైన కోట మాదిరిగా నిర్మించడం విశేషం.
విజయ మేరీ చర్చి:

sirf2

           హైదరాబాద్ చింతల్ బస్తీలోని మహావీర్ ఆసుపత్రి కి దగ్గరలో ‘విజయమేరీ చర్చి’ ఉంది. దీన్ని ‘ఆరోగ్యమాత చర్చి’ అనీ స్థానికులు పిలుస్తరు. 1905లో ఇది నిర్మితమైంది. తరువాత నూతన ప్రార్థన మందిరానికి ఆనాటి ఏడవ నిజాం ప్రభువు శంకుస్థాపన చేశారు. కొత్త భవనం 1959లో పూర్తయింది. దీన్ని ఎనిమిది భుజాలతో నిర్మించారు. చర్చి లోపల మధ్య భాగంలో ఏర్పాటు చేసిన ప్రధాన ఆరాధనా విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉంటది.

మహబూబ్ మాన్షన్:

sirf3
             ఆరవ నిజాం ప్రభువు నవాబ్ మీర్ మహబూబ్ ఆలీఖాన్ (1869-1911) కొంతకాలం పాటు నివాసం ఉన్న ప్యాలెస్‌నే ‘మహబూబ్ మాన్షన్’ అంటున్నరు. ఎత్తైన ప్రవారీ గోడల మధ్య ఈ ప్యాలెస్ సుమారు 42 ఎకరాల విస్తీర్ణంలో, విశాలమైన గదులతో అత్యద్భుతంగా నిర్మితమైంది. ప్రస్తుతం మహబూబ్ మాన్షన్ చుట్టూ అనేక కాలనీలు వెలిశాయి. ఇండో- యూరోపియన్ శైలిలో నిర్మితమైన ఈ మాన్షన్ సందర్శకులకు కనువిందు చేస్తోంది.
మలానీ రెసిడెన్సీ:
sirf4
           గొప్ప సంఘసేవకులు, దానకర్ణుడిగా ప్రఖ్యాతి పొందిన సేఠ్ దీవాన్ బహదూర్ రాంగోపాల్‌కు చెందిన నివాస భవనమే మలానీ రెసిడెన్సీ. హైదరాబాద్ బేగంపేటలో 1936 ప్రాంతంలో రాంగోపాల్ తన కోసం నిర్మించుకున్న ఈ భవనం నేటికీ చెక్కు చెదరక ఆనాటి నిర్మాణ శైలిని సందర్శకుల కళ్ళెదుట నిలుపుతోంది. రెండు అంతస్తుల్లో నిర్మించిన ఈ ప్యాలెస్ నాటి నిర్మాణ కళా వైభవానికి మచ్చుతునక. ఇది జర్మనీ దేశీయ నిర్మాణ శైలిలో ఆకట్టుకుంటోంది.
మహబూబ్ మజీద్:
sirf5
                లాడ్ బజార్‌కు సమీపంలో ఆరవ నిజాం రాజు మహబూబ్ ఆలీ పాషా నిర్మించిన మజీద్‌కు ఆయన పేరే స్థిరపడింది. ఇది క్రీ.శ. 1817లో నిర్మితమైంది. పురాతన పద్ధతిలో నిర్మించిన ఈ కట్టడం పై భాగంలో మసీదును నిర్వహిస్తుండగా, కింది భాగంలో కొన్ని దుకాణాలను నిర్వహిస్తున్నరు. ఈ వాణిజ్య సముదాయాల నుండి వచ్చే ఆదాయాన్ని మసీదు కమిటీకి చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని ప్రార్థనా మందిరం అభివృద్ధికి వెచ్చిస్తున్నారు. ప్రతి రంజాన్, ఈద్ ఉల్ పీతర్ సమయంలో వేలాది మంది మస్లిం భక్తులు ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేస్తరు.

Tuesday, 6 November 2012

కాకతీయ ఉత్సవాలపై ప్రభుత్వం వివక్షత..

* టీఆర్‌ఎస్ ఎల్‌పీ ఉపనేత హరీష్‌రావు  

             కాకతీయ ఉత్సవాలపై ప్రభుత్వం వివక్ష చూపుతుందని టీఆర్‌ఎస్ శాసన సభ పక్ష ఉపనేత తన్నీరు హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 900సంవత్సరాల చరిత్ర కలిగిన కాకతీయ ఉత్సవాలను మూడు సంవత్సరాలు చేస్తామని చెప్పిన సీమాంధ్ర ప్రభుత్వం మూడు రోజుల్లో ముగించేందుకు సిద్ధం అయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ పండుగల విషయంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో కృష్ణదేవరాయాల పాలన 500సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేపట్టిన పంచ శతాబ్ది ఉత్సవాలకు వంద కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం కాకతీయ ఉత్సవాలకు 25లక్షల రూపాయలు కేటాయించడంపై హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకతీయ ఉత్సవాలకు రూ.25లక్షలు కేటాయించగానే కాంగ్రెస్ మంత్రులు టపాసులు పేల్చుకుంటున్నారని, ఇది చాలా సిగ్గు చేటన్నారు.
       పంచశతాబ్ధి ఉత్సవాలకు సంబంధించి రెండు నలల నుంచి ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం కాకతీయ ఉత్సవాల నిర్వహణపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయకపోవడంపై మండిపడ్డారు. కాకతీయ కట్టడాల విషయంలో యునెస్కో గుర్తించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, సీమాంధ్ర ప్రభుత్వం మాత్రం కట్టడాలను సంరక్షించుటలో విఫలమయిందన్నారు. ఇప్పటికే రామప్ప, వేయిస్తంభాల దేవాలయం, వరంగల్ కోట, ఐనవోలు దేవస్థానం లాంటి ప్రదేశాల్లో కట్టడాలు కూలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దీంతో యునెస్కో గుర్తించే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు ముఖ్యమైన బతుకమ్మ పండుగను లక్షలు కేటాయిస్తానన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వక పోవడం శోచనీయమన్నారు. చిత్తూరు జిల్లాకు వంద సంవత్సరాలు నిండిన సందర్భంగా చేపట్టిన శతాబ్ధి ఉత్సవాలకు 1197జీవో ద్వారా 140కోట్లు ఖర్చు చేసిందన్నారు. జిల్లాలోని ఒక్కొక్క నియోజకవర్గానికి రూ.10కోట్లతో రోడ్లు వేయించారన్నారు. 
             చివరకు చంద్రబాబు నియోజకవర్గానికి కూడా రూ.10కోట్లు ఖర్చు చేసిందన్నారు. శతాబ్ధి ఉత్సవాల సందర్బంగా జరిగిన కార్యక్రమాలు జిల్లా మంచి నీటి వసతుల కోసం రూ.4500కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారని హరీష్‌రావు అన్నారు.తెలంగాణ మంత్రులతో పాటు జిల్లా మంత్రులైన పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్యకు సిగ్గు, శరం ఉంటే తెలంగాణ సంప్రదాయాన్ని మంట కలుపుతున్న సీమాంధ్ర పాలకులకు తగిన బుద్ధి చెప్పాలని, లేని పక్షంలో తెలంగాణ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హరీష్‌రావు హెచ్చరించారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ ఎల్‌పీ నేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు డాక్టర్ టి.రాజయ్య,దాస్యం వినయభాస్కర్, మొలుగూరి బిక్షపతి, టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Monday, 5 November 2012

గిరిదుర్గం.. ఖిల్లా ఘణపురం

          కాకతీ గణపతి స్వయంగా పాలించినందువల్ల ఆయన పేరుతోనే ‘ఘనపురం’ ఏర్పడిందని, తర్వాత అది ‘ఘణపురం’గా మారిందని చరిత్ర కారులు తమ రచనల్లో పేర్కొన్నారు. అయితే, ఇది పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మితమైన గిరిదుర్గమనీ మనం మరవరాదు.
keela
             మహబూబ్‌నగర్ జిల్లా చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే అనేక రాజవంశాల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లాలోని అనేక ప్రాంతాలలో లభించిన శాసనాలు, చరివూతకు సాక్ష్యంగా నిలిచిన గిరి, వన, జలదుర్గాలు, రాజ భవనాలే ఇందుకు నిదర్శనం. హిందూ, మహమ్మదీయ రాజుల ఏలుబడిలో సంస్థానాలు ఒక వెలుగు వెలిగాయి. కొన్ని ప్రాంతాలను రాజరిక దర్పం కోసం, పరిపాలనా సౌలభ్యం కోసం ఉపయోగించుకోగా, మరి కొన్నింటిని యుద్ధ స్థావరాలుగా, ధన, ధాన్య కోశాగారాలుగా వినియోగించుకున్నారు. పాన్‌గల్, చంద్రఘడ్, కోయిలకొండ, ఘణపురం ప్రాంతాలను నాటి రాజులు గిరిదుర్గాలుగా మలచుకొని యుద్ధ వ్యూహాలను అమలు చేసినట్లు చారివూతక ఆధారాల వల్ల స్పష్టమవుతోంది.క్రీ.శ. 1040 నుండి 1687 వరకు హిందూ, మహమ్మదీయ రాజులు ఆయా ప్రాంతాలపై ఆధిపత్యం కోసం యుద్ధాలు చేశారనడానికి తెలంగాణలోని పలు జిల్లాలలో నాటి రాచరికపు జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో లభించిన శాసనాలు, కట్టడాలను పరిశీలిస్తే కందూరి చోడులు, విజయనగర రాజులు, రేచర్ల పద్మనాయకులు, మునుసూరి ప్రభువులు, బహమనీ సుల్తానులు, గోలకొండ ప్రభువులు ఈ ప్రాంతాలలో పరిపాలన సాగించినట్లుగా స్పష్టమవుతోంది. 
         కాకతీ గణపతి కాలంలో అరివీర భయంకరులుగా పేరు గడించిన రేచర్ల పద్మనాయకులు సేనాధిపతులుగా, సామంత రాజులుగా ప్రధాన భూమికను నిర్వహించారు. వీరి కాలంలోనే గజ, అశ్వ, పదాతి తివిధ) దళాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు ప్రాచీన యుద్ధ పద్ధతులకు స్వస్తి పలికి ఫిరంగులను ఉపయోగించినట్లు చరిత్ర అధ్యయనం ద్వారా స్పష్టమవుతోంది. 
kondalu
          రేచర్ల పద్మనాయకులు స్వతంత్ర రాజులుగా ఎదిగి తమ ప్రభువుపై భక్తితో ఘణపురం కోటను నిర్మించి దానికి తమ ప్రభువు పేరునే పెట్టుకొన్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాకతీ గణపతి స్వయంగా ఈ ప్రాంతాలన్ని పాలించినందువల్ల ఆయన పేరుతోనే ‘ఘనపురం’ ఏర్పడిందని, తర్వాత అది ‘ఘణపురం’గా మారిందని మరి కొందరు చరిత్రకారులు తమ రచనల్లో పేర్కొన్నారు. కాకతీ గణపతి పాలన క్రీ.శ. 1198-1262 వరకు, రేచర్ల పద్మ నాయకుల పాలన క్రీ.శ.1326 నుండి 1482 వరకు, 1518 నుండి 1687 వరకు 8 మంది కుతుబ్షాహీ వంశీయుల వరకు పరిపాలన జరిగినట్లు చరిత్ర చెబుతోంది. యుద్ధ వ్యూహాలకు అనువుగా ఖిల్లా ఘణపురం కోట నిర్మాణాన్ని చేపట్టినట్లు దాని నిర్మాణ శైలి, స్థల ఎంపికను పరిశీలించిన వారికి అర్థమవుతుంది. మెట్లదారి నుండి పైకి వెళ్ళిన తర్వాత ముందుగా దర్శనమిచ్చేది ఆంజనేయుని గుడి. ఇక్కడి నుండి మరికొంత దూరం వెళ్తే మొదటి ద్వారాన్ని చేరుకోవచ్చు. ఈ ద్వారం గుండా ముందుకెళ్తే రెండుగా చీలిన రెండవ ద్వారం వస్తుంది. దీనిని కూడా దాటి ముందుకు సాగితే మూడవ ద్వారం వస్తుంది. ఈ ద్వారం పైకి వెళ్ళేందుకు చిన్న మెట్లదారి ఉంది. ద్వారం పైకప్పు, పక్క గోడలలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడంతో పెచ్చులూడి పోయాయి. దీనికి దగ్గరలోనే గచ్చుబావి ఒకటి ఉంది. దీనిని ‘స్నాన వాటిక’గా ఉపయోగించుకునే వారని, పక్కనే ఉన్న గుండం ఏనుగులు, గుర్రాల కోసం తవ్వించారని, అందుకే, దీనిని ‘ఏనుగుల గుండం’గా పిలుస్తారనీ స్థానికులు తెలిపారు.
                      కోట పైభాగంలో మరో రెండు జలాశయాలు ఉన్నాయి. ఫిరంగి ఏర్పాటు చేసిన అరుగుకు కొద్ది దూరంలో నేతిగుండం, పాలగుండం పేరుతో నీటిని నిల్వ చేసుకొనే నిర్మాణాలున్నాయి. వీటిలో ఇప్పటికీ స్వచ్ఛమైన నీరు లభించడం విశేషం. ఇక్కడికి దగ్గరలోనే ‘తాటి గుండం’ పేరుతో మరో కొలను ఉంది. పక్కనే నివాస భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. ఈ కోటలో చీకటి గది నిర్మాణాన్ని మరో విశేషంగా చెప్పుకోవచ్చు. కోటపైకి వెళ్ళేందుకు రెండు దారులుండగా ఒకటి రహస్య రహదారిగా నిర్మించుకొని వినియోగించుకున్నారని, అందుకే దీనిని ‘దొంగలదారి’గా స్థానికులు పిలుస్తారనీ తెలుస్తోంది. అయితే, స్థానికుల సహకారం లేకుండా కోటపైకి వెళ్ళడం పర్యాటకులకు కష్టం.

Friday, 2 November 2012

TALKS ON ‘T’ CONTINUING, SAYS SHINDE


Deliberations on separate Telangana are continuing and “I can not say when will they end,” Union Home Minister Sushil Kumar Shinde said today.
              The Union Home Minister was in Hyderabad today to attend the passing out parade of the probationary IPS officers at the National Police Academy.Talking to the media on the sidelines of the programme, Shinde said talks with the stake holders on separate Telangana are still on and that there is no deadline set for the conclusion of the deliberations. “We welcome any suggestions or advises for the amicable settlement of the tangle,” he stated.
            Shinde made it clear that he did not have any specific information on the decision whether or not separate Telangana state will be formed. “I can not say it at this stage,” is his curt reply for repeated queries from mediapersons. He is of the opinion that time will solve the problem.
           The Union Home Minister was also not aware of the letter sent by TDP president n Chandrababu Naidu seeking an all-party meet to discuss the issue. “I am not aware of Naidu’s letter,” he added.