కవ్వాల్ అడవుల్లో పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటూ, ప్రభావం మొదలైంది. కవ్వాల్ అడవుల గుండా ఉన్న రహదారి మీదుగా భారీ వాహనాలు రా వొద్దంటూ రోడ్లపై అధికారులు హెచ్చరిక బోర్డుల ను ఏర్పాటు చేశారు. కోర్ ఏరియాను ఆనుకొని ఉండే పది కిలో మీటర్ల బఫర్ ఏరియాలో రహదారిపై ప్రతి కిలో మీటరుకు ఒక బోర్డును ఏర్పా టు చేశారు. బోర్డులపై ఒక వైపు పులి బొమ్మ, మరో వైపు భారీ వాహనాలు కవ్వాల్ అడవుల్లోకి రా కూడదని, రాత్రి 9 గం. తరువాత ఎటువంటి వా హనాలు రాకూడదని హెచ్చరికలు చేశారు.
పులుల సంరక్షణ కేంద్రం పూర్తి స్థాయిలో ఏ ర్పాటు కాకుండానే బఫర్ ఏరియాలో ఇటువంటి నిబంధనలు పెడుతున్న అధికారులు.. ఇక కోర్ ఏరియాలో నివసిస్తున్న ఆదివాసులపై ఎటువంటి నిర్భందాన్ని ప్రయోగిస్తారో అనే అనుమానాలు కలుగుతున్నాయి. గ్రామాల నుంచి బలవంతంగా ఖాళీ చేయించం, ఎవరిపై ఆంక్షలు విధించబోమ ని చెబుతున్న అధికారులు గుట్టు చప్పుడు కాకుం డా నిశ్శబ్ద హెచ్చరికలు చేస్తున్నారు. కోర్ ఏరియా ను ఆనుకొని ఉండే బఫర్ ఏరియా ఉట్నూర్ మం డలంలోని శ్యాంపూర్ గ్రామం వరకు వస్తుంది. ఈప్రాంతం వరకు హెచ్చరికల బోర్డులను ఏర్పా టు చేశారు. పొమ్మన లేక పొగబెట్టిన చందానా అధికారులు హెచ్చరిస్తున్నా రు. రాబోవు రోజుల్లో పాదచారులు కూడా అడవుల్లోకి వెళ్లకుండా నిర్భందాన్ని విధించే అవకాశాలు లేక పోలేదు.
టైగర్ జోన్‌పై సమరానికి సమయాత్తం
ఆదివాసీల మనుగడకు ముప్పు తెచ్చే పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుపై ఆదివాసీలు యుద్దానికి సిద్ధమవుతున్నారు. ఆదివాసీ, ప్రజా సంఘా లు ఒక్కొక్కటిగా ఉద్యమంలోకి వస్తున్నాయి. ఆదివాసీల అస్థిత్వం కోసం జిల్లాలో మరో ఇంద్ర పోరాటం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నాలు గు గ్రామాలతో ప్రారంభించి, విడతల వారిగా 40 గ్రామాలను ఖాళీ చేయించాలనే అధికారుల విధానాలను ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
సీపీఐఎంఎల్ న్యూడెమోక్షికసీ అనుబంధ సంస్థ అఖిల భారత రైతు కూలీ సంఘం, ఆదివాసీ సం క్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఇప్పటికే కవ్వాల్ అడవుల్లోని ఆదివాసీ గ్రామాలు సమరానికి సిద్ధమవుతుంటే, గిరిజన సంఘం ఆధ్వర్యంలో గ్రామాల్లో ఉద్యమకమిటీలను వేస్తున్నారు. ఈ నెల 24న జ న్నారం డివిజినల్ అటవీ కార్యాలయం (డీఎఫ్‌ఓ) ఎదుట ధర్నానిర్వహించనున్నట్లు ఆ సంఘం జి ల్లా ప్రధాన కార్యదర్శి తొడసం ప్రభాకర్ తెలిపా రు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గ్రా మాల్లో సభలు నిర్వహిస్తూ టైగర్ జోన్‌నిలిపి వేయాలంటూ గ్రామాల్లో తీర్మానించారు. మండలంలోని పాతహీరాపూర్ గ్రామంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సున్నం ఉపాధ్యక్షులు కాకి మధు, జిల్లా అద్యక్షుడు కనక యాదవ్‌రావు ఆధ్వర్యంలో గ్రా మ సభ నిర్వహించి టైగర్ జోన్‌కు వ్యతిరేకంగా తీర్మానించారు. గ్రామాల్లో ఆదివాసీ జెండాను ఎ గురవేస్తూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కోర్ ఏరియాలో వస్తున్న 40 గ్రామాల్లో తీర్మాణాలు చేపట్టి వీటి ద్వారా హైకోర్టుకు వెళ్లనున్నట్లు ఆ సంఘం నాయకులు పేర్కొన్నారు.
ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు
టైగర్ జోన్ ఏ ర్పాటుకు ప్రభుత్వం జారిచేసిన జీవో 27 జీవో 27 రద్దు చేయాలని కోరుతూ జా తీయ ఎస్టీ కమిషన్‌ను ఆదివాసీ అడ్వకేట్ ఫోరం ఆశ్రయించింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెందూర్ ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి ఆరెం పా పారావు ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యురాలు కమలకుమారిని కలిశారు. టైగర్ జోన్‌ను వెంటనే నిలుపు దల చేయాలని కోరారు. వీరి వెంట సెం ట్రల్ సోషల్ డెవలప్‌మెంట్ సొసైటీ డైరెక్టర్ కల్పన కన్నాభిరాం, సిడాం మురళీ తదితరులు ఉన్నారు.
27న రౌండ్‌టేబుల్ సమావేశం
జన్నారం : టైగర్ జోన్ ఏ ర్పా టుకు ప్రభుత్వం జారిచేసిన జీవో 27పైన చ ర్చించేందుకు మండల కేంద్రంలోని సాయిబా బా ఆలయం సమీపంలో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఎంసీపీఐయూ జిల్లా నాయకులు గవ్వల శ్రీకాంత్ తెలిపారు. ఈ సమా వేశానికి ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయ కులు, విద్యావంతులు, గిరిజన సంఘాల నేతలు, మేధావులు, తదితరులు పాల్గొని విజయవంతం చేయాలని గవ్వల శ్రీకాంత్ కోరారు.
No comments:
Post a Comment