Thursday 12 April 2012

పాలమూరు వెనుకబాటు పాలకుల కుట్రే!.





* కృష్ణా నదిలోని 10 శాతం నీటిని ఇచ్చినా పాలమూరు సస్యశ్యామలం   అవుతుంది. జూరాల నీటి నిలువ సామర్థ్యం పెంచే అవకాశం ఉందా?
* జలవనరులను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకుని సీడబ్ల్యూసి ద్వారా ప్రాజెక్టులు, డ్యాంలు, రిజర్వాయర్లు, నదుల అనుసంధానం చేపడితే రాష్ట్రాల మధ్య నీటి సమస్యలు ఏర్పడవు కదా?
                                            -టీ. నారాయణడ్డి, వనపర్తి, పాలమూరు జిల్లా
* అంతర్జాతీయ న్యాయసూవూతాలు, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం పాలమూరు జిల్లాకు దక్కాల్సిన నీరు ఎన్ని టీఎంసీలు? ఆ నీరు ఎక్కడికి పోతున్నది? 
                                  -ఇ. మొగిలన్న, కొన్గూరు, కొత్తకోట, మహబూబ్‌నగర్

ఎ) తుంగభద్ర, భీమా, కృష్ణానదులు ప్రవహిస్తున్నా పాలమూరు జిల్లాకు నీరందక అలమటిస్తూ ఉన్నది. ఈనాటి పాలమూరు జిల్లా దౌర్భాగ్యానికి అసలు సిసలు కారణం నాటి హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రవూపదేశ్‌లో విలీనమడం. దాతో శని పట్టింది తెలంగాణకు. మరీ ముఖ్యంగా ఈ జిల్లాకు. బచావత్ ట్రిబ్యునల్ తమ నివేదికలో ఈ విషయం ఎంత స్పష్టంగా తెలియజేసిందో గమనించండి.

...Had there been no division of that state (Hyderabad State) there were better chances for the residents of this area to get irrigation facilities in Mahbubnagar District
(హైదరాబాద్ రాష్ట్రం ముక్కచెక్కలవ్వకుండాపోతే మహబూబ్‌నగర్ జిల్లాకు నీటిపారుదల సౌకర్యం మెరుగ్గా ఉండుండేది)
                             నాటి హైదరాబాద్ ప్రభుత్వం మహబూబ్‌నగర్ జిల్లాకు
ఉపయుక్తంగా ఉండే మూడు పథకాలను రూపొందించింది. 1) తుంగభద్ర కాలువ పొడిగింపు 2) అప్పర్ కృష్ణా ప్రాజెక్టు కుడి కాలువ పొడిగింపు 3) భీమా ప్రాజెక్టు. 19.2 శతకోటి ఘనపు అడుగుల (టీఎంసీ) తుంగభద్ర జలాల వినియోగం తో 1,20,000 ఎకరాలు (గద్వాల- ఆలంపూర్ తాలూకాలో) సాగుచేసేందుకు హైదరాబాద్ ప్రభుత్వం తలపెట్టింది. ఇదే మాదిరిగా 54.4 టీఎంసీల కృష్ణా జలాల వినియోగంతో 1,50,000 ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్టును కూడా తలపెట్టింది. తుంగభద్ర అప్పర్ కృష్ణా (ఆల్మటి), ఈ రెండు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నవే. భీమా ప్రాజెక్టు కొత్తది. దీన్ని నిర్మించి 100.70 టీఎంసీల వినియోగంతో 3,0,000 ఎకరాలకు సాగునీటి వసతి కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆంధ్రవూపదేశ్ ఏర్పడడంతో కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర ఎడమకాలువను, అప్పర్ కృష్ణ కుడి కాలువను తమ ప్రాంతం వరకే కట్టడిచేసి ఆంధ్రవూపదేశ్‌లోకి ప్రవేశించకుండా జాగ్రత్త పడింది.

         భీమా ప్రాజెక్టును రద్దు చేసింది. దీంతో మహబూబ్‌నగర్ జిల్లాకు ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా వాలు మార్గంగా నగావిటీ పద్ధతిలో) అందవలసిన 174.30 టీఎంసీల కృష్ణాజలాలు కృష్ణార్పణమయ్యాయి. ఆ నీళ్లే మహబూబ్‌నగర్ జిల్లాకు అందుంటే, నేడు కృష్ణా, గోదావరి జిల్లా మాదిరిగా కళకళలాడుతూ ఉండేది. ఈ దైన్య పరిస్థితిని గమనించిన ట్రిబ్యునల్ ‘తాము నిబంధనలకు లోబడి ఆ మూడు ప్రాజెక్టుల ద్వారా సంక్రమించే నీటిని జిల్లాకు హక్కుభుక్తంగా ఇవ్వలేని తమ ఆశక్తిని పేర్కొం టూ, ప్రత్యామ్నాయంగా, కొంత మేరకు జిల్లాకు జరిగిన అన్యాయానికి పరిహారంగా 17.4 టిఎంసిల వినియోగాన్ని అనుమతిస్తూ ‘జూరాల ప్రాజెక్టును’ మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుకు నీటిని కేటాయించిన ట్రిబ్యునల్ ‘తాము కేటాయించిన నీటిని ఆ ప్రాజెక్టులోనే వాడుకోవాలని, కాకపోతే జిల్లాలో అదీ సాధ్యపడకపోతే తెలంగాణలో మరోచోట వాడుకోవలన్న షరతు పెట్టిం ది’.

          అంటే ట్రిబ్యునల్ మాటల అంతరార్థం ఏమిటి? బలవంతులైన సీమాంధ్ర పాలకులు తాము Compassionate grounds తో కేటాయించిన నీటిని నిర్దయగా మళ్లించగలరన్న అనుమానం గాక మరేమిటి? వాళ్ల అనుమానం నిజమే అయింది. జూరాల నీటిని 30 వేల ఎకరాలకు సరిపడా రాజోలిబండ కాలువకు మళ్లిస్తున్నది. రాజోలిబండ నీటిని కేసీ కాలువకు మళ్లిస్తున్నది. కర్నూలుకు తాగునీటి కోసం పైపుల ద్వారా జూరాల నీటిని తుంగభద్ర నదిని దాటించిన విషయం గతంలో జరిగిందే. జూరాల ద్వారా 17.4 టీఎంసీల వినియోగం జరగాలని ట్రిబ్యున ల్ ఆదేశించింది. మరో 20 టీఎంసీల వినియోగం భీమా ప్రాజెక్టు కోసం జూరాల నుంచే ప్రభుత్వం అనుమతించింది. 37.4 టీఎంసీల నికరజలాల వినియోగానికి అదనంగా మరో ఇరవై ండు టీఎంసీల మిగులు జలాలను జూరాల నుంచే నెట్టంపాడు కోసం అనుమతించింది.

        ప్రస్తుతం అనుమతి పొందిన పథకం, పాలమూరు-పాకాల గ్రావిటీ పథకం మున్ముందు అవతరిస్తే అవి కూడా జూరాల నుంచే జలాలను స్వీకరించడం జరుగుతుంది. వీటన్నిటిని సరఫరా చేసే సామర్థ్యం ప్రస్తుతం అమల్లో ఉన్న జూరాల జలశాయానికి ఉన్నదా అన్న విషయం సిమ్యులేషన్ స్టడీస్ చేస్తే తప్ప తెలియదు. జూరాల జలాశయం సామర్థ్యం పెంచడం అంత ఆషామాషీ కాదు. ‘నీటి కేటాయింపులు’ ఉండాలి. కేంద్రజలసంఘం అనుమతి ఉండాలి. సామర్థ్యం పెంపు మూలంగా గురయ్యే ముంపు ప్రాంతం కర్ణాటకలో ఉంటుంది. కాబట్టి ఆ ప్రభుత్వం అనుమతి కావాలి. ముంపు ప్రాంతం లో అడవి ఉంటే కేంద్ర అటవీ శాఖా అనుమతి తప్పనిసరి అవుతుంది. ముందు జూరాల సామర్థ్యం పెంచే విషయంలో మన ప్రభుత్వం చిత్తశుద్ధితో అంగీకరిస్తుందా అన్నది కూడా అనుమానమే. జూరాల ఎత్తుపెంచడం కంటే ‘ఆల్మట్టి ద్వారా అదనపు జలాలు పొందడం మేలు. ఆలమట్టి పూర్తి జలాశయ స్థాయి 524.256 మీటర్లు కాగా జూరాల పూర్తి జలాశయ స్థాయి 31.516 మీటర్లు. అయితే ఆల్మట్టి పేరెత్తితేనే కంపరమెత్తే మన ప్రభుత్వం అలాంటి ప్రయత్నం చేయదుగాక చేయదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే ఇది సాధ్యపడే అవకాశముంది. జూరాలకు అదనంగా ఆర్డీఎస్ తప్ప మహబూబ్‌నగర్ జిల్లాకు లబ్ధి చేకూర్చే పెద్ద పథకమేదీ లేదు. భీమా, కోయిల్‌సాగర్, నెట్టంపాడు, కల్వకుర్తి పూర్తయి ఆశించిన స్థాయిలో నీటి సరఫరా జరిగిననాడు ఈ జిల్లా కష్టాలు కొంతమేరకు తీరుతాయి.

బి) నిజమే మీరన్నట్టు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నదుల అనుసంధానం, రిజర్వాయర్ల నిర్మాణం గనుక జరిగితే రాష్ట్రాల, ప్రాంతాల మధ్య సమస్యలుండవు. కాని ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం ‘నీటి పంపకం’ పైన కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి విశేషాధికారాలు లేవు. రాజ్యాంగంలోని 246 అధికరణంలో ఏడవ షెడ్యూల్‌లో మూడు జాబితాలున్నాయి. 

కేంద్ర జాబితా: ఇందులో జతపరిచిన విషయాలకు సంబంధించిన చట్టాలను చేసే అధికారం పార్లమెంటుకే ఉంటుంది.
రాష్ట్ర జాబితా: ఇందులో పొందుపరిచిన విషయాలపై చట్టాలను రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభలకే ఉంటుంది. 
ఉమ్మడి జాబితా: ఇందులో ఉటంకించిన విషయాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు, శాసన సభలకు ఉభయులకూ ఉంటుంది.

రాష్ట్ర జాబితాలోని Entry17లో ‘నీరు-నీటి సరఫరా
’ సాగునీరు, కాలువలు, మురుగునీరు, అడ్డుకట్టలు. నీటి నిలువ విద్యుచ్ఛక్తి ఉన్నాయి. ఇక కేంద్ర జాబితాలోని Entry 56 ప్రకారం ‘అంతరాష్ట్ర నదులు, నదీలోయల అభివృద్ధి, క్రమబద్ధీకరణ’ ఉన్నాయి. అయితే ఏ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి ఈహక్కుని సంక్రమింపచేయాలి అన్న విషయంపై ప్రజావూపయోజనాలను దృష్టి ఉంచుకుని పార్లమెంటు చట్టం రూపొందించవలసి ఉంటుంది.

తేలిగ్గా చెప్పాలంటే తమ సరిహద్దుల్లో పుట్టి ప్రవహించే నదులపైనే ఆయా రాష్ట్రాలకు సంపూర్ణ అధికారం ఉంటుంది. ఉదాహరణకు గుండ్లకమ్మపై ఆంధ్రవూపదేశ్‌కు పూర్తి హక్కులున్నాయి. అంతర్ రాష్ట్ర నదుల విషయంలో తమకు కేటాయించిన నీటి వినియోగంపైన మాత్రమే ఆయా రాష్ట్రాలకు సంపూర్ణ అధికారం ఉంటుంది. అదే ఇతర బేసిన్ రాష్ట్రాలకు ఇబ్బంది కలిగించనంత మేరకే. ఉదాహరణకు పోలవరం కట్టేందుకు నీటి కేటాయింపులున్నా ముంపు విషయంలో కేంద్రం, ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అనుమతులు తప్పనిసరి. నీటిని పూర్తిగా కేంద్రం జాబితాలోకి తీసుకురావాలనే వాదన చాలాకాలంగా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు అంగీకరించడం లేదు. నదుల వినియోగంపైన ప్రస్తుతం రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కేంద్రానికి కట్టబెట్టడానికి ఏ రాష్ట్రమూ సిద్ధంగా లేదు.

కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి అధ్యయనం చేసిన ‘సర్కారియా కమిషన్’ నీటిని అటు కేంద్ర జాబితాలోగాని ఇటు ఉమ్మడి జాబితా లో గాని మార్చడానికి ఒప్పుకోలేదు. ఇదే విషయాన్ని సమక్షిగంగా అధ్యయ నం చేసిన‘National Commission for Integrated Develo pment Planకూడా సర్కారియా కమిషన్ సిఫార్సులతో ఏకీభవిస్తూ కేంద్ర రాష్ట్రాల మధ్య సలహా సంప్రదింపులు కొనసాగించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా నీటికి సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారం లభించగలదన్న అభివూపాయం వ్యక్తం చేసింది.

ఇప్పట్లో నీరు కేంద్రం పరిధిలోకి వచ్చే అవకాశం సుదూరంలో కనిపించడం లేదు. అంటే ఇప్పటికన్నా ఉధృతంగా, మునుముందు నీటికోసం కొట్టుకు చచ్చే పరిస్థితి దాపురిస్తుంది. ‘అంతర్జాతీయ న్యాయసూవూతాలు’ పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఆయా నదుల నీటి వినియోగంపై సంపూర్ణ హక్కులుంటాయని, వారి అవసరాలు తీరాకే, పరీవాహక ప్రాంతం ఆవలి క్షేత్రాలకు తరలించవచ్చని’ చెప్తున్నాయి. ఆ లెక్కన కృష్ణా పరీవాహక క్షేత్రంలోని పాలమూరు జిల్లాకు కృష్ణానదీ జలాలు లభించాలి. ఇది అంతర్జాతీయ న్యాయమే కాదు సహజ న్యాయం కూడా. అయితే ఈ న్యాయ సూత్రాలకు చట్టబద్ధతలేదు. కానీ ప్రపంచమంతా ఈ న్యాయసూవూతాలను పాటిస్తున్నది. కానీ మన ప్రభుత్వం మాత్రం ‘దుడ్డున్నవాడిదే బర్రె’ సూత్రం ఆలంబనగా తీసుకుని పాలమూరు జిల్లా అవసరాలు పక్కనపెట్టి కృష్ణా జలాలను ‘పోతిడ్డిపాడు’ ద్వారా సీమాంధ్ర ప్రాంతాలకు తరలిస్తున్నది. పాలమూరు జిల్లాకు బచావత్ ట్రిబ్యునల్ ద్వారా జూరాలకు 17.4 టీఎంసీలు, ఆర్డీఎస్ 15.90 టీఎంసీలు, కోయిర్‌సాగర్‌కు 3.9 టీఎంసీలు దక్కాయి.

చిన్నతరహా ప్రాజెక్టులు అదనం. బచావత్ ట్రిబ్యునల్ రాష్ట్రం మధ్య నీటి పంపకాలను చేసింది. అయితే ఆ పంపకాలను ఆయా ప్రాజెక్టు అవసరాలను నిర్ధారణ చేశాకే చేసింది. అయితే కొన్ని ప్రాజెక్టులను మినహాయించి, మిగిలిన ప్రాజెక్టుల కేటాయింపులను అటూ ఇటూ సవరించే అధికారాన్ని ట్రిబ్యునల్ ఆయా రాష్ట్రాలకు కట్టబెట్టింది. కనుక రాష్ట్రానికి ఇచ్చిన నీటి కేటాయింపులో ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టుల కేటాయింపులను కత్తిరించి మరికొన్నింటికి పెంచవచ్చు. నిజానికి మన ప్రభుత్వం అలా చేసింది కూడా. కనుక రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే పాలమూరు జిల్లాకు ఇతర ప్రాజెక్టులకు కోతపెట్టి ఎక్కువ నీరు ఇవ్వవచ్చు. ఎక్కువ నీరు ఈ జిల్లాకు ఇవ్వడం దేవుడెరుగు. ఆర్డీఎస్‌లో కోతపెట్టకుండా ట్రిబ్యునల్ మంజూరు చేసిన 15.9 టీఎంసీలు ఇస్తే అదే పదివేలు. కానీ అలా జరగడం లేదు.

జాతీయ జల విధానం 
197లో మొదటిసారి జాతీయ జల విధానం వెలువడింది. నీరు అరుదైన విలువైన జాతీయ వనరు కనుక సమీకృత ప్రాతిపదికన, పర్యావరణ పరిరక్షణ, సంబంధిత రాష్ట్రాల అవసరాల దృష్ట్యా ఈవనరుని అభివృద్ధి పరుచుకోవాలి, కాపాడుకోవాలి. జలవనరుల అభివృద్ధి పథకాలను వీలైనంత మటుకు బహుళార్థ సాధక ప్రాజెక్టులుగా రూపొందించాలి. ఈ ప్రాజెక్టులో తాగునీటి వసతి తప్పక కల్పించాలి. సాగునీటి వ్యవస్థ నిర్వహణలో రైతులను భాగస్వాములను చేయాలి. ప్రాధాన్యతా పరంగా తాగునీరు, సాగునీరు, విద్యుచ్ఛక్తి, జలరవాణా, పారిక్షిశామిక, ఇతర ప్రయోజనాలు ఉండాలి. ఉపరితలజలం, భూగర్భ జలాల నాణ్యతను పరిరక్షించే కార్యక్షికమాలను చేపట్టాలి. ఇలాంటి 19 అంశాలతో కూడిన ప్రప్రథమ జాతీయ జల విధానం నీటి చంద్రిక వలె హితోక్తులను ఉపదేశం చేసింది. అయితే ఏ రాష్ట్రమూ దీన్ని పాటించిన పాపాన పోలేదు. 15 ఏళ్ల తర్వాత 2002లో రెండో జలవిధానం విడుదలయింది.

ఇందులో కొత్తగా జోడైన అంశాలు నదీ బేసిన్ సర్వతోముఖ వికాసం కోసం నదీ బేసిన్ సంస్థల ఏర్పాటు చేయాలి. రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ విషయంలో కొన్ని మార్గదర్శక సూత్రాలను జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రతిపాదించినా వాటిని చాలా రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. దీంతో ఈ జాతీయ జల విధానం కూడా నిర్వీర్యమైన డాక్యుమెంటు గానే మారిపోయింది. తాజాగా నూతన జాతీయ జల విధానపు ముసాయిదాను కేంద్రం వివిధ రాష్ట్రాలకు అభివూపాయాల కోసం ఇటీవలే పంపింది. ఇందులో ‘వాడే నీటికి వెలకట్టడం లాంటి కొన్ని వివాదాస్పదమైన అంశాలను ప్రతిపాదించడం జరిగింది. ఈ అంశం అంత తేలిగ్గా ఆమోదం పొందదని అందరికీ తెలుసు. ఏదేమైనా చట్టబద్ధత లేని ఏ డాక్యుమెంటుకు విలువ ఉండదు. పాత జాతీయ జల విధానాలలాగే ఇది కూడా అలంకారవూపాయంగా మిగుల్తుందా లేక రాష్ట్రాలు దాన్ని ఆమోదించి, ఆదరించి, ఆచరిస్తారా అన్నది వేచి చూడాలి.


-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

No comments:

Post a Comment