Wednesday 5 June 2013

తెలంగాణ కోసం అర్జునుడిలా.. విల్లు ఎక్కుపెట్టాలి


* రాష్ట్ర సాధన లక్ష్యం ఒక్కటే కనిపించాలి
- 14న చలో అసెంబ్లీకి లక్షలాదిగా తరలాలి 
- మిలియన్ మార్చ్, సాగరహారాన్ని మించాలి
- అనుమతించకుంటే ఊరూరా ‘మాక్ అసెంబ్లీముట్టడి’
- 11న రిహార్సల్‌గా ఓరుగల్లులో పోరుయాత్ర ర్యాలీ
- కాంగ్రెస్ దేక్కుంటూ మన దగ్గరికి రావాల్సిందే
- జనగామలో జేఏసీ చైర్మన్ కోదండరాం వ్యాఖ్యలు 
జనగామ, జూన్ 4 (టీ మీడియా):‘తెలంగాణవాదులకు ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యం తప్ప మరొకటి కనిపించవద్దు. రాష్ట్ర సాధన కోసం అర్జునుడిలా విల్లు ఎక్కుపెట్టి గురిచూసి కొట్టాలి. గందరగోళంతో ఆందోళనకు గురికావొద్దు. శత్రువు ఉనికి పసిగట్టి చావుదెబ్బ కొట్టాలి. మిలియన్ మార్చ్, సాగరహారానికి చీమలదండులా కదిలినట్లు వ్యూహాత్మకంగా రాజధాని చేరుకొని 14న లక్షలాదిగా అసెంబ్లీని ముట్టడించాలి’ అని జేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. మంగళవారం వరంగల్ జిల్లా జనగామలో జేఏసీ జిల్లా చైర్మన్ పాపిడ్డి అధ్యక్షతన నిర్వహించిన చలో అసెంబ్లీ సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడా రు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను సాధించుకునేందుకు 14న చేపట్టిన ‘చలో అసెంబ్లీ’తో హైదరాబాద్ దద్దరిల్లేలా లక్షలాదిమంది పాల్గొనాలని కోరా రు. ఉద్యమాన్ని కాపాడుకుం తెలంగాణ ప్రజలకు బతుకుదెరువని, ఘర్షణ ఎంత తీవ్రంగా ఉంటే పోరాటం ఉధృతంగా సాగుతుందన్నారు. పోరాటం తెలంగాణ ప్రజలను ఐక్యం చేసిందని, ఆంధ్రా ఆధిపత్యం పెత్తనం చేయలేని పరిస్థితి తెచ్చిందన్నారు. 

అనుమతివ్వకుంటే ఆంధ్రా పార్టీలను తరిమేద్దాం 
ఆరునూరైనా చలో అసెంబ్లీకి కచ్చితంగా అనుమతి తెస్తామని కోదండరాం చెప్పారు. ఇందిరపార్కు వద్ద సభకు అందరికీ అనుమతించి మాకేందుకు ఇవ్వ రో అడుగుదామన్నారు. అయినా అడ్డుకుంటే ఎక్కడికక్కడే ‘మాక్ అసెంబ్లీ ముట్టడి’గా మారుస్తామని ప్రకటించారు. గ్రామాలు, పట్టణాల్లో పికెటింగ్‌లు, అరెస్టులు జరిగితే ఊరూరా అసెంబ్లీ ముట్టడి తరహాలో ఆందోళనలు చేయాలన్నారు. ఇప్పుడు మనకు అనుమతి ఇవ్వకుంటే జూలైలో పంచాయతీ ఎన్నికల్లో సీమాంవూధపార్టీల నాయకులను గ్రామాల్లో అడుగుపెట్టనివ్వొద్దని సూచించారు. ఇందిరాపార్కు వద్ద సభ, అసెంబ్లీ ముట్టడికి ముందే తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చేలా వరంగల్‌లో జేఏసీ ఆధ్వర్యంలో 11న ఓరుగల్లు పోరుయాత్ర పేరుతో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. 14న జరిపే ముట్టడికి ఇది ‘మాక్ చలో అసెంబ్లీ’గా ఉంటుందన్నారు. ఆలోపు అన్ని డివిజన్ కేం ద్రాల్లో సన్నాహక సభలు నిర్వహిస్తామన్నారు. 

ఖనిజాన్ని తరలిస్తే సమాధానం చెప్పితీరుతాం 
బయ్యారం వంటి ప్రాంతాల నుంచి ఖనిజ సంపదను తరలించుకు పోయేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని, కచ్చితంగా సమాధానం చెప్పితీరుతామని కోదండరాం హెచ్చరించారు. ప్రభుత్వ పెద్దలు అద్దాలమేడలో పైన ఉన్నారని..కిందున్న మనం రాళ్లేస్తే మేడ కుప్పకూలుతుందన్నారు. రోజురోజుకూ కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనపడుతోందని, ఇకపై దేక్కుంటూ మన దగ్గరికి రావాల్సిందేనని వ్యాఖ్యానించారు. యూపీఏ ప్రభు త్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీపై వెనక్కి తగ్గి వారం అంటే వారం కాదు.. నెలంటే 30 రోజులు కాదని వ్యంగ్యవ్యాఖ్యలతో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది తప్ప, ఉద్యమ ప్రభావంపై కాంగ్రెస్‌కు భయం పట్టుకుందన్నారు. తెలంగాణ ప్రజల ఐక్యపోరాటం, ఒత్తిడి ఫలితంగానే 2009 డిసెంబర్ 9న ప్రత్యేక రాష్ట్రంపై ప్రకటన వెలువడిందని గుర్తుచేశారు. సమావేశంలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు ముత్తిడ్డి యాదగిరిడ్డి, చలోఅసెంబ్లీ జిల్లా ఇన్‌చార్జి, జేఏసీ నేత కత్తి వెంకటస్వామి, కోఆర్డినేటర్ పిట్టల రవీందర్, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రవీందర్‌డ్డి, జిల్లా అధ్యక్షుడు రాజేశ్, టీఎమ్మార్పీఎస్ నేత బొట్ల భిక్షపతి, మాజీ ఎమ్మెల్యే రాజాడ్డి, యాకూబ్‌డ్డి, టీవీవీ నేతలు సీతారామారావు, ఎర్రోజు శ్రీనివాస్ జేఏసీల చైర్మన్లు పాల్గొన్నారు.

విజయవంతానికి జేఏసీ భారీ కసరత్తు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకమైన ‘చలో అసెంబ్లీ’ని విజయవంతం చేసేందుకు జేఏసీ ప్రత్యేక కార్యాచరణతో దూసుకెళ్తోంది. తక్కువ సమయం ఉన్నప్పటికీ నిత్యం ప్రజలను ఆలోచింపజేసి, రాజధానికి రప్పించేలా జేఏసీ నేతలు కార్యాచరణ రూపొందించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో 10, 11, 12 తేదీల్లో మినీ చలో అసెంబ్లీలను నిర్వహించాలని నిర్ణయించారు. 12 లేదా 13న హైదరాబాద్‌లో మాక్ అసెంబ్లీ జరపాలని ఆలోచిస్తున్నారు. 11న వరంగల్ అమరవీరుల స్తూపం వద్ద ‘ఓరుగల్లు పోరుయాత్ర’ పేరిట భారీ ర్యాలీ, బహిరంగ సభను చలో అసెంబ్లీకి రిహార్సల్‌గా జరుపాలని జేఏసీ నిర్ణయించింది. చలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో ఒకవేళ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల తేదీలను మార్చినా, ఉద్యమంలో మార్పులు లేకుండా అదే స్ఫూర్తి తో తెలంగాణ ప్యూపిల్స్ అసెంబ్లీ నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. మే 29న చలో అసెంబ్లీ తేదీ ఖరారైనప్పటి నుంచి రాష్ట్ర, జిల్లా జేఏసీ నాయకులు కాలికి బలపం కట్టుకొని ప్రతి పప్లూలో పర్యటిస్తున్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో సన్నాహక సదస్సులు నిర్వహిస్తున్నారు. బైక్‌ర్యాలీ, బస్సుయావూతలతో హోరెత్తించాలని ప్రణాళిక రచించారు. చలో అసెంబ్లీకి ముందుగా మూడు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ అధ్వర్యంలో అన్నీ పార్క్‌ల్లో తెలంగాణ వాక్ నిర్వహించనున్నారు.

No comments:

Post a Comment