Saturday, 1 June 2013

కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదు


అందుకే కదన రంగంలోకి..
-  కేసీఆర్‌తో కలిసి నియోజకవర్గాల్లో పర్యటిస్తా.పజలను ఏకం చేస్తా
-  మాట ఇచ్చి కాంగ్రెస్ వెనక్కిపోయింది..ఇంతకంటే ప్రజాద్రోహం లేదు
-  ఆ పార్టీలో కొనసాగితే ప్రజలను మోసగించినట్టే
-  అందుకే రాజీనామా చేశాం: పీసీసీ మాజీ చీఫ్ కే కేశవరావు 
హైదరాబాద్ (టీ మీడియా): తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం తప్పుచేసిందని, ఇచ్చిన మాటపై వెనక్కిపోయిందని ఆ పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కే కేశవరావు విమర్శించారు. ఇంతకంటే పెద్ద ప్రజాదోహం మరొకటి లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వేదికపై నిలబడి, కాంగ్రెస్ వాదిగా, కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందని చెప్పే అర్హత, హక్కు తనకు పోయిందన్నారు. కాంగ్రెస్‌లో తెలంగాణ పట్ల ద్వేషం రోజురోజుకు పెరుగుతోందని, ఆ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా మారుతోందని, ఇక ఆ పార్టీతో తెలంగాణ రాదనే విషయం తేలిపోయిందని స్పష్టంచేశారు. ఇక కాంగ్రెస్‌లో కొనసాగితే తెలంగాణ ప్రజల్ని మోసం చేసినట్టే అవుతుందని గుర్తించి ఆ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు. కేకే శుక్రవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తాము పార్టీని వీడే నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందు తెలంగాణ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్‌కు కొన్ని సూచనలు చేశామని తెలిపారు. ‘‘గత తొమ్మిదేళ్ళుగా తెలంగాణకు సానుకూలమని చెబుతున్నారు. మేమూ నమ్మాం. సీడబ్ల్యూసీలో ఉన్నప్పుడు నా సేవలు వినియోగించుకున్నారు. 

తెలంగాణపై నిర్ణయానికి సమయం అడిగారు. అయినా ఇప్పటికీ నిర్ణయానికి రాకపోతే ఎలా?’’ అని కాంగ్రెస్‌ను నిలదీశారు. ప్రస్తుత సెషన్స్(బడ్జెట్ సమావేశాలు) ముగిసేలోగా తెలంగాణపై తేల్చకపోతే తాము ఏదో ఒక స్టాండ్ తీసుకుంటామని అప్పుడే తాను స్పష్టం చేశానని తెలిపారు. బడ్జెట్ సమావేశాలకు మధ్యలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తమ వద్దకు వచ్చి పార్టీలో చేరాలని కోరగా, ప్రస్తుతానికి అది కుదరదని చెప్పామని వివరించారు. అధిష్ఠానానికి మే 30వ తేదీని డెడ్‌లైన్ విధించామని తెలిపారు. ‘‘వెయ్యిమంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పాను. ఇప్పటికీ కూడా నిర్ణయం తీసుకోకపోవడం ప్రజలను మోసగించడం కాదా? మూడు కోట్లమంది చనిపోయిన తరువాత తెలంగాణ ప్రకటిస్తారా? అంటూ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. ‘‘50 ఏళ్ళ తరువాత తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మాలో ఆశలు రేపింది. సోనియాగాంధీ నాయకత్వంలో సీడబ్ల్యూసీలో, ఎన్నికల ప్రణాళికలో ఈ అంశం చేర్చి తెలంగాణకు సానుకూలమనే సంకేతాలిచ్చాం. వైఎస్ వ్యతిరేకించినా నేను సీడబ్ల్యూసీ భేటీలో రెండుగంటలకుపైగా తెలంగాణపై మాట్లాడాను. సోనియా కూడా అందుకు అంగీకరిస్తూ మేనిఫెస్టోలో ఈ అంశం పెట్టారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడానికి అంగీకరించారు’’ అని ఆయన వివరించారు. 

ఆంధ్రా నాయకుల ఒత్తిడి వల్లే తెలంగాణపై వెనక్కి వెళ్లారన్నారు. టీఆర్‌ఎస్‌తో తెలంగాణ కోసం ప్రజల్లో కదలిక వస్తున్నదని, ఈ మూవ్‌మెంట్‌కు రాజకీయ రూపం ఇస్తేనే మనం తెలంగాణ సాధించగలమని కేకే అభివూపాయపడ్డారు. జూన్ 2న టీఆర్‌ఎస్‌లో చేరిన తరువాత ఆ పార్టీ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నేతలతో కలిసి అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. తన పూర్తి సమయాన్ని తెలంగాణ కోసం జనాన్ని సమీకరించడంలో కేటాయిస్తానని చెప్పారు. తాను ఎన్నికల్లో పోటీ చేసేది లేదని పలుమార్లు స్పష్టం చేసినా సీమాంధ్ర మీడియా పదేపదే తాను సీట్ల కోసం, తన కుమారుడి టికెట్ కోసం టీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నట్లు ప్రచారం చేస్తున్నాదంటూ మండిపడ్డారు. 

తాను చచ్చిపోయిన తరువాత అది జరుగుతుందేమో తప్ప, తాను బతికి ఉన్నంతవరకు తన కుటుంబసభ్యుపూవరూ ఎన్నికల్లో నిలబడరని కేశవరావు స్పష్టం చేశారు. సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స రాజకీయంగా ఫెయిల్ అయ్యారని విమర్శించారు. తెలంగాణ అంటే సీఎంకి అంత వ్యతిరేకత ఎందుకు? అని ప్రశ్నించారు. సీఎం చేసిన వ్యాఖ్యలు యాంటీ లీడర్‌షిప్‌ను నిరూపిస్తున్నాయన్నారు. ముగ్గురు దళిత ఎంపీలు తెలంగాణ కోసం పార్టీని వీడుతుంటే పట్టించుకోవడం లేదని నిలదీశారు. కాంగ్రెస్‌తో తనకు 50 ఏళ్ళ అనుబంధం ఉందని, ఇప్పుడు ఆ పార్టీని వదలాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉందని కేకే ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం తాను కేంద్ర మంత్రి జైపాల్‌డ్డితో కలిసి తమ నిర్ణయం చెప్పానని, అయితే జైపాల్‌డ్డి మాత్రం తాను కాంగ్రెస్‌లోనే ఉంటూ తెలంగాణ కోసం పోరాడుతానని తెలిపారని కేకే చెప్పారు.

No comments:

Post a Comment