* ప్రారంభించిన నమస్తే తెలంగాణ సీఎండీ రాజం
* తొలి విడతలో విజయవాడ మీదుగా రాజమండ్రికి
* రాష్ట్ర విభజనతో సీమాంధ్రకు సిరులపంటే
* ప్రజలకు వివరించనున్న నమస్తే రథం
రాష్ట్ర విభజనపై హస్తినలో తీవ్ర స్థాయిలో కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో.. రెండు ప్రాంతాల్లోని ప్రజల మధ్య సోదరభావం, స్నేహ వాతావరణం కోసం ‘నమస్తే తెలంగాణ’ నడుంకట్టింది. విడిపోవడం వల్ల సీమాంధ్రకు ఒనగూరే అదనపు లాభాలను వివరించడం కోసం నమస్తే తెలంగాణ ఆత్మీయ రథం సీమాంధ్ర జిల్లాలకు బయల్దేరింది. ఆత్మీయ రథాన్ని సీఎండి లక్ష్మీరాజం జెండా ఊపి ప్రారంభిస్తున్నప్పటి చిత్రం ఇది. సంపాదకులు అల్లం నారాయణ, సీఈఓ కట్టా శేఖర్‌రెడ్డి కూడా ఉన్నారు.
హైదరాబాద్ (టీ మీడియా): మీడియా చరిత్రలోనే కొత్త ఒరవడికి నమస్తే తెలంగాణ శ్రీకారం చుట్టింది. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకునే బృహత్తర కర్తవ్యాన్ని భుజాన వేసుకుని, దాన్ని విజయవంతం చేయడం ద్వారా ప్రశంసలు పొందిన నమస్తే తెలంగాణ.. రాష్ట్ర విభజనపై హస్తినలో తీవ్ర స్థాయిలో కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో.. ఉభయ ప్రాంతాల్లో రాజకీయ నాయకత్వాలు భారీ సభలకు సిద్ధమవుతున్న తరుణంలో రెండు ప్రాంతాల్లోని తెలుగు ప్రజల మధ్య సోదరభావం, స్నేహ వాతావరణం కోసం నడుంకట్టింది. విడిపోవడం వల్ల ఉభయ ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు ఉన్న అవకాశాలు, ప్రత్యేకించి సీమాంధ్రకు ఒనగూరే అదనపు లాభాలను వివరించడం కోసం నమస్తే తెలంగాణ ఆత్మీయ రథం జూన్ 21న సాయంత్రం సీమాంధ్ర జిల్లాలకు బయల్దేరింది. విభజన వికాసానికేనని ఈ యాత్ర సందర్భంగాసీమాంధ్రులకు వివరించనుంది.
పత్రిక సీఎండీ సీఎల్ రాజం పచ్చ జెండా ఊపి.. ఆత్మీయ యాత్ర రథాన్ని ప్రారంభించారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంతం సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని కూలంకషంగా వివరించే ప్రత్యేక సంచికను కూడా సీఎండీ ఆవిష్కరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లనున్న ఈ ఆత్మీయ రథం.. అక్కడి ప్రజలను కలిసి.. వారితో సంభాషిస్తుంది. విభజనతో సీమాంధ్రకు కలిగే లాభాలను వివరించనుంది.‘విడిపోయి కలిసుందాం.. ప్రగతికి పోటీ పడదాం’ అనే నినాదాన్ని రాష్ట్ర నలుమూలలా చాటిచెప్పనుంది. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన పాటలను ప్రజలకు వినిపిస్తారు. నీళ్లు, ఇతర వనరుల పంపకాలపై అక్కడి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుంది. ఈ యాత్ర సూర్యాపేట, కోదాడ మీదుగా ఆంధ్రా ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. రెండు రోజులపాటుసాగే ఈ ఆత్మీయ యాత్ర.. తొలి విడత పర్యటనలో జగ్గయ్యపేట, నందిగామ, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, విజయవాడ, గన్నవరం, హనుమాన్ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, రావులపాలెం, రాజమండ్రి ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించనుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల సీమాంధ్ర ప్రాంత ప్రజలు నష్టపోతారనే అపోహలను తొలగించేందుకు ఈ యాత్రను ప్రారంభిస్తున్నట్లు పత్రిక ఎడిటర్ అల్లం నారాయణ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమయిన ఆత్మీయ యాత్రకు తార్నాక, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో అపూర్వ స్వాగతం లభించింది. విభజనపై సీమాంధ్రులతో మాట్లాడేందుకు ఆత్మీయ యాత్ర వెళ్లటం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నగరంలోని సీమాంధ్ర వాసులు అభిప్రాయపడ్డారు. ఈ యాత్రను సాదరంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఆత్మీయ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో పత్రిక సంపాదకులు అల్లం నారాయణ, సీఈవో కట్టా శేఖర్‌రెడ్డి, సహాయ సంపాదకులు కే కృష్ణమూర్తి, వేణుగోపాలస్వామి, బ్యూరో చీఫ్ కే రంగయ్య, నెట్‌వర్క్ ఇన్‌చార్జి డీ మార్కండేయ, వైస్ ప్రెసిడెంట్లు తులసీదాస్, విశ్వనాథం, జనరల్ మేనేజర్లు నాగన్న (ఫైనాన్స్), కే వెంక (అడ్వర్‌టైజ్‌మెంట్స్), గోపాలస్వామి (సర్క్యులేషన్), సీహెచ్ శ్రీనివాస్ (ఆపరేషన్స్)తోపాటు.. పత్రిక వివిధ విభాగాల సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం ఆత్మీయ రథం సికింవూదాబాద్, నాగోల్, ఎల్‌బీ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ మీదుగా నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌కు చేరుకుంది. అక్కడి స్థానికులు ఆత్మీయ రథానికి స్వాగతం పలికి తమ తోడ్పాటు అందించారు.
ఆత్మీయ యాత్రకు అడుగడుగునా నీరాజనం
-విజయవంతం కావాలని నగరవాసుల ఆకాంక్ష
-ఉప్పల్, తార్నాక, హబ్సిగూడలలో ఘన స్వాగతం
-నినాదాలతో హోరెత్తించిన తెలంగాణవాదులు
(టీ మీడియా - నెట్‌వర్క్): నమస్తే తెలంగాణ దినపత్రిక ఆధ్వర్యంలో సీమాంధ్ర జిల్లాలకు బయల్దేరిన ఆత్మీయ యాత్రకు నగరంలో అడుగడుగునా తెలంగాణవాదులు, నగరంలో స్థిరపడిన పలువురు సీమాంధ్ర ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతూ.. యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఎల్బీనగర్ శ్రీకాంతాచారి చౌరస్తాకు ఆత్మీయ రథం చేరుకోగానే.. అక్కడ చేరి ఉన్న తెలంగాణవాదులు జై తెలంగాణ అంటూ నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. గుప్పెడు మంది సృష్టించిన సమైక్యాంధ్ర నినాదంలో ఉన్న డొల్లతనాన్ని తేటతెల్లం చేసే దిశగా ఆత్మీయ యాత్ర విజయవంతం కావాలని యాత్రకు వివిధ ప్రాంతాల్లో స్వాగతం పలికిన నాయకులు ఆకాంక్షించారు.
జలాల పంపిణీపై సీమాంధ్ర ప్రజలలో ఉన్న అపోహలను తొలగించేందుకు కృషి చేయాలని కోరారు. శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని నమస్తే తెలంగాణ ప్రధాన కార్యాలయం నుంచి బయల్దేరిన ఆత్మీయ రథం.. తార్నాక చౌరస్తాకు చేరుకున్నప్పుడు టీఆర్‌ఎస్, ఓయూ జేఏసీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతె శోభన్‌డ్డి, తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో రథయావూతకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్షికమంలో నాయకులు శ్రీకాంత్ యాదవ్, క్రిష్ణకాంత్, నిఖిల్‌రాజ్ యాదవ్, సతీష్‌కుమార్, షరీఫ్, మనోహర్, ట్రేడ్ యూనియన్ నాయకులు హన్మంత్ రెడ్డి, ఓయూ రిసెర్చ్ స్కాలర్లు అంజిబాబు, కృష్ణ, బిసగోని శ్రీనివాస్‌గౌడ్, మద్దెల సంతోష్‌ముదిరాజ్, టీ రమేష్‌గౌడ్, కందుల మధు తదితరులు పాల్గొన్నారు.
హబ్సిగూడలో..
ఆత్మీయ రథానికి హబ్సిగూడ చౌరస్తాలో ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్షికమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి నెర్థం బాస్కర్‌గౌడ్, రాష్ట్ర నాయకులు నందికొండ శ్రీనివాస్‌డ్డి, టీఆర్‌ఎస్ నాయకులు సుధాకర్, సుధాకర్‌డ్డి, పురుషోత్తం రెడ్డి, శ్రీశైలం, గ్యార ఉపేందర్, టీఆర్‌ఎస్వీ నాయకులు సుద్దాల నాని, శ్రీనివాస్‌గౌడ్, వికాస్ వర్మ, నరేష్, గణేష్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్ రింగ్ రోడ్‌లో..
నమస్తే తెలంగాణ ఆత్మీయ యాత్రకు తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కోమురయ్య ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్‌రోడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్షికమంలో తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రతినిధులు రవి, యాదగిరి, రామనర్సయ్య, బాబు, కిషోర్, శ్రీనివాస్, బేతాల్, యాకన్న, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
హయత్‌నగర్‌లో..
హయత్‌నగర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పలు పార్టీల నాయకులు నమస్తే రథానికి ఘనంగా స్వాగతం పలికారు. ఆత్మీయ రథం వస్తున్నదని తెలిసి.. టీఆర్‌ఎస్, సీపీఐ, జేఏసీ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపైకి భారీగా తరలి వచ్చారు. రథం రాగానే రహదారిపై జైతెలంగాణ నినాదాలు మార్మోగాయి. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి జనిగె విష్ణువర్ధన్, జిల్లా కార్యదర్శి కాటెపాక స్కైలాబ్, హయత్‌నగర్ టీఆర్‌ఎస్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు తన్నీరు కళాపూర్ణ, యువజన విభాగం డివిజన్ అధ్యక్షుడు బలరాం కుర్మ, రమాకాంత్‌డ్డి, వై రాజు, ప్రేంచంద్‌డ్డి, వై కృష్ణ, జే సాయికుమార్, కే దిలీప్, శివవూపసాద్, సీపీఐ మండల సహాయకార్యదర్శి ముత్యాల యాదిడ్డి, నాయకులు శేఖర్‌డ్డి, వేణుగోపాలచారి, శేఖర్, రాజు, జేఏసీ మండల కో కన్వీనర్ జోర్తా రాము ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్ మెట్‌లో..
నమస్తే తెలంగాణ రథానికి హయత్‌నగర్ మండలం అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్షికమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇన్‌చార్జి వంగేటి లకా్ష్మడ్డి, బీజేపీ నియోజకవర్గం ఇన్‌చార్జి బొడిగె అశోక్ గౌడ్, బీజేపీ, టీఆర్‌ఎస్ హయత్‌నగర్ మండల అధ్యక్షులు కొత్త రాంరెడ్డి, కందాల బలదేవడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బొడిగె గోవర్థన్‌గౌడ్, నాయకులు వడ్డెపల్లి పాపయ్యగౌడ్, ముసరిగారి రాజుగౌడ్, నల్ల సత్తిడ్డి, పల్లపు అంజయ్య, పసుల పవన్‌కుమార్, నంజుటి కృష్ణగౌడ్, కే శివాడ్డి, మల్లేష్, శేఖర్, శంకర్, నరేష్, బొడిగె రాజు, ఆనంద్‌గౌడ్, నవాబు శ్రీశైలం, భిక్షపతి, వెంక తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్‌లో
ఆత్మీయయాత్ర శుక్రవారం రాత్రి నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌కు చేరింది. ఈ సందర్భంగా యాత్ర ప్రతినిధి బృందం విభజన జరిగితే ఇరు ప్రాంతాలకు జరిగే లాభాలను వివరించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రచురితమైన నమస్తే తెలంగాణ ప్రతులను పంపిణీ చేశారు. కార్యక్షికమంలో అశోక్, పుల్లారావు, విద్యార్థి జేఏసీ మండల ప్రధాన కార్యదర్శి చల్ల శంకర్, ముత్యాల హనుమంతడ్డి, విజయ్‌కుమార్, వనం ధనుంజయ, నరేందర్‌రావు, నకిరేకంటి మల్లమ్మ, ఎలకరాజు సతీష్, సత్యనారాయణ, శేఖర్, మాధవడ్డి, బయ్యసాయి, సాయితేజ తదితరులు పాల్గొన్నారు.
జై తెలంగాణ నినాదాలతో హోరెత్తిన శ్రీకాంతాచారి చౌరస్తా
నమస్తే రథానికి ఎల్బీనగర్ శ్రీకాంతాచారి చౌరస్తా వద్ద ఘనస్వాగతం లభించింది. నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్, బీజేపీ, టీ జేఏసీ నాయకులతోపాటు నమస్తే తెలంగాణ విలేకరులు, సర్క్యులేషన్ సిబ్బంది, తెలంగాణవాదులు తరలివచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్షికమంలో టీఆర్‌ఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్‌చార్జి కాచం సత్యనారాయణ, యువజన విభాగం జిల్లా ఇన్‌చార్జి మాధవరం నర్సింహారావు, టీ జేఏసీ చైర్మన్ కేవీ రంగాడ్డి, ఏలే పురేందర్‌నేత, బీజేపీ నాయకులు వెదిరె యోగీశ్వర్‌డ్డి, పోచంపల్లి గిరిధర్, చిట్టివూపోలు రవికుమార్, టీఆర్‌ఎస్ నాయకులు శ్రీకాంత్‌డ్డి, శ్రీకాంత్, ఘంటా సుదర్శన్, ఎన్ శ్రీనివాస్‌డ్డి, శ్రవణ్‌కుమార్, పొట్టబత్తిని శ్యాంనేత, పగడాల శ్రీరాం, సుధాకర్, సూర్యనారాయణ, భరత్‌గౌడ్, సత్తిడ్డి, నాగార్జునగౌడ్, శ్రీకాంత్‌డ్డి, నమస్తే తెలంగాణ జోన్ ఇన్‌చార్జి మేకల సత్యనారాయణ, రిపోర్టర్లు చందర్, శ్రీనివాస్‌గౌడ్, పూల నాగరాజు, తిరుమలేష్, కృష్ణమాచారి, గణేష్, జంగయ్య, దామోదర్, జంగయ్య, యాదయ్య, కంది సన్నీ, సర్క్యులేషన్ ఇన్‌చార్జి సంతోష్, సిబ్బంది చంద్రశేఖర్, ప్రవీణ్‌కుమార్, కిరణ్, పర్వతడ్డి, జయరాం తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment