తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు నడిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ పటంలో గ్రేటర్ హైదరాబాద్ ఖ్యాతి మరింత పెంచేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు. అమెరికాలోని డల్లాస్ తరహా రవాణా వ్యవస్థ, టర్కీలోని ఇస్తాంబుల్ స్థాయిలో పాతబస్తీ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు.
విశ్వనగర నిర్మాణం వైపు అడుగులేస్తూ ప్రభుత్వ తీసుకున్న కీలక నిర్ణయాలు...
- రూ.20వేల కోట్ల అంచనా వ్యయంతో ఎక్స్‌ప్రెస్‌వేలు, స్కైవేలు, ఫ్లైఓవర్ల నిర్మాణం.
- స్లమ్ ఫ్రీ సిటీ పథకం రూపకల్పన. ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పనులు ప్రారంభం.
- జీవో 58, 59తో క్రమబద్ధీకరణకు వెసులుబాటు.
- చెరువులకు మహర్దశ. ముందుగా 36 చెరువులు, 36 శ్మశానవాటికలు ఆధునీకరణ.
- హరిత నగరం లక్ష్యంగా 10 కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు.
- డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కింద 405 మంది నిరుద్యోగ యువతకు కార్ల పంపిణీ
- రూ.5లకే భోజన పథకం కేంద్రాల విస్తరణకు నిర్ణయం.
- ఇస్తాంబుల్ తరహాలో పాతబస్తీ అభివృద్ధి.
- హుస్సేన్‌సాగర్ శుద్ధి...ఆకాశహర్మ్యాలు నిర్మించాలని నిర్ణయం.
- అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు త్వరలో చర్యలు.
- గ్రేటర్ దాహార్తి తీర్చేందుకు రూ.1670 కోట్ల వ్యయంతో నగరానికి కృష్ణా మూడో దశ జలాలు. గోదావరి జలాల తరలింపునకు రూ.3725 కోట్లతో ప్రణాళిక.
- ఔటర్ పరిధిలో జలమండలి విస్తరణ. రూ.19 వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ మాస్టర్‌ఫ్లాన్.
- కాలుష్యరహిత నగరంగా రూపొందించేందుకు నూతనంగా ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రణాళిక. గ్రేటర్‌లోని కాలుష్యకారక పరిశ్రమలను సత్వరం తరలించేందుకు చర్యలు.
- హైదరాబాద్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మెట్రోరైల్ అలైన్‌మెంట్ మార్పు.
- సీఎం కేసీఆర్ చొరవతో మెట్రో మార్గాల్లో రైల్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి ముందడుగు.
- గ్రేటర్ పరిధిలోని లక్షలాది కుటుంబాల లబ్దికి కొత్త రేషన్ విధానం
- హైదరాబాద్‌లో 1,50,000 కుటుంబాలు లబ్దిపొందడానికి ఆటో డైవర్లకు పన్ను మాఫీ.
- మహిళల రక్షణ కోసం షీ క్యాబ్స్ ఏర్పాటు.
- గ్రేటర్‌లో కొత్తగా 80 బస్సులు.
- వరల్డ్‌క్లాస్ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్, ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో పోలీస్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం.
-హాక్ ఐ మొబైల్ అప్లికేషన్‌తోపాటు ఠాణాలకు వైఫై సౌకర్యం, ఫేస్‌బుక్ ఖాతా. ప్రత్యేక రిసెప్షన్ సెంటర్లు
- గ్రేటర్ పరిధిలో లక్ష కెమెరాల ఏర్పాటుకు సన్నాహాలు.(ప్రభుత్వ, ప్రైవేట్)
- రూ. 340 కోట్లతో కొత్త ఇన్నోవా కార్లు, ద్విచక్ర వాహనాలు
- పోలీసు వాహనాలకు జీపీఎస్ సిస్టం.
- క్రైం మ్యాపింగ్.(నేరాలు జరిగే ప్రదేశాల గుర్తింపు)
- సిబ్బంది పనితీరుపై తెలుసుకునేందుకు ఫీడ్ బ్యాక్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు.
- పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలన సులభతరం చేస్తూ, మొబైల్ అలర్ట్ సిస్టమ్ ప్రారంభం.
- అంతర్జాతీయ ప్రమాణాలతో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు సన్నాహాలు.
- ఈవ్ టీజింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు షీ టీమ్స్.
- పేకాట అడ్డాలైన క్లబ్బులపై ఉక్కుపాదం.
- రౌడీషీటర్లు, చైన్‌స్నాచర్లు, అక్రమ వడ్డీవ్యాపారులు, ల్యాండ్‌గ్రాబర్స్, వ్యభిచార గృహాల నిర్వాహకులపై పీడీ యాక్టు అమలు.
- చోరీ వాహనాలు గుర్తించేందుకు వెహికిల్ స్టోలెన్ ట్రాకింగ్ సిస్టం ప్రారంభం.
- సైబరాబాద్ పరిధిలో నాలుగు నూతన పోలీస్‌స్టేషన్ భవనాలు ప్రారంభం.
- ట్రాఫిక్ విభాగంలో క్యాష్‌లెస్ ట్రాఫిక్ చలాన్ పేమెంట్ సిస్టమ్ అమలు.
- పోలీసు, హోంగార్డుల అలవెన్సులు, జీతాలు పెంపు.
- ఠాణాల నిర్వహణ కోసం రూ.25 నుంచి రూ.75 వేలు చెల్లింపు.
- రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఠాణాలకు నూతన వాహనాలు.
- అంతర్జాతీయ ప్రమాణాలతో సిటిజన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు.
- గ్రేటర్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలు
- మసీదులు, దర్గాలకు గ్రాంట్లు.. వితంతువులకు పింఛన్లు
- సాంస్కృతిక కళాభవన్,కళాభారతి భవన్‌నిర్మాణాలకు ఆమోదం.
- ప్రభుత్వ హస్టళ్లలో సన్న బియ్యం.
- (నమస్తే తెలంగాణ).
No comments:
Post a Comment