హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కచ్చితంగా ధనిక రాష్ట్రమేనని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. దేశంలో గుజరాత్, తెలంగాణ రాష్ర్టాలు ధనిక రాష్ర్టాలుగా 14వ ఆర్థిక సంఘం ప్రకటించిందని తెలిపారు. తెలంగాణ విడిపోతే సర్‌ప్లస్ స్టేట్ అవుతుందని, రిచ్ స్టేట్ అవుతుందని తాను గతంలో చెప్పిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఇవాళ ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ధనిక రాష్ట్రమనే కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని తెలిపారు. అయితే తాను ఈ విషయమై గుజరాత్ సీఎంతో మాట్లాడనని, ఎక్కువ రుణ పరిమితిని కోరుదామని తెలిపానని చెప్పారు. త్వరలో కేంద్రం వద్దకు వెళ్లి రుణ పరిమితిని పెంచాలని విజ్ఞప్తి చేస్తామన్నారు. గతంలో తాను ప్రధానిని కలిసినపుడు కోరానని అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గత బడ్జెట్‌లో పక్కా అంచనాలు లేవని ఈసారి పక్కా అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. మరింత ఆర్థిక సౌష్టవం దిశగా రాష్ట్రం ప్రయాణిస్తుందని తెలిపారు.
No comments:
Post a Comment