విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ కు మరో అరుదైన గుర్తింపు దక్కింది. మెరుగైన జీవనం విషయంలో ఇండియాలోనే హైదరాబాద్ ది బెస్ట్ సిటీగా నిలిచింది. గ్లోబల్ మొబిలిటీ సంస్థ విడుదల చేసిన క్వాలిటీ ఆఫ్ లివింగ్ రిపోర్టులో భాగ్యనగరం అగ్రస్థానం పొందింది. ఆ తర్వాత స్థానం పుణెకు దక్కింది. కాలుష్య నివారణపై వరల్డ్ హెల్త్ ఆర్గనైషన్ తాజాగా ప్రచురించిన జాబితాలో ఇండియాలో హైదరాబాద్ నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. నీటి పరిశుభ్రత, గాలి కాలుష్యం, ట్రాఫిక్ లాంటి అంశాలపై దేశంలోని మొత్తం 20 టాప్ సిటీస్ ను పరిగణలోకి తీసుకున్న డబ్ల్యూ. హెచ్.వో… హైదరాబాద్ కే అగ్ర తాంబూలం ఇచ్చింది. పుణెకు రెండో స్థానమిచ్చింది. ముంబై, ఢిల్లీ 3, 4 స్థానాల్లో నిలిచాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించే ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంగ్లీష్ బోధించే అత్యుత్తమ పాఠాశాలలు, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కారణంగా.. హైదరాబాద్ కు ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్ దక్కినట్టు సర్వే తేల్చింది. పెరిగిన జనాభా, వాతావరణ కాలుష్యం కారణంగా ఢిల్లీ, ముంబై మెరుగైన జీవనం జాబితాలో వెనకబడ్డాయి.
మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సర్వేలోనూ హైదరాబాద్ టాప్ ప్లేస్ లో నిలిచింది. రాజకీయ సుస్థిరత, క్రైమ్, మీడియా స్పాన్సర్ షిప్, మెడికల్ సర్వీసెస్, నాణ్యమైన విద్య, ప్రజా రవాణా వ్యవస్థ లాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న సంస్థ.. భాగ్యనగరానికే జై కొట్టింది. ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై లాంటి మెట్రో సిటీస్ ను సైతం వెనక్కి తోసి.. ది బెస్ట్ లివింగ్ ప్లేస్ లో హైదరాబాద్ ఛాన్స్ కొట్టేసింది.
మొన్నటికి మొన్న హైదరాబాద్ కు అరుదైన ఘనత దక్కింది. 2015లో ప్రపంచ పర్యాటకులు తప్పనిసరి చూడాల్సిన ప్రదేశాల్లో నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెల్ మాగజైన్ హైదరాబాద్ కు చోటిచ్చింది. భారతదేశం నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమే. ఇక బ్రిటన్ కు చెందిన డైలీ మెయిల్ పత్రిక కూడా హైదరాబాద్ ఘనతను విశ్వవ్యాప్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఏడు నగరాలను ఫేవరేట్లుగా ఎంపిక చేయగా… అందులో హైదరాబాద్ కు చోటు దక్కింది.
No comments:
Post a Comment