-మెంటల్ స్టేటస్ లేకే... హైదరాబాద్ స్టేటస్ అంటున్నడు
-అందుకే పిచ్చి ప్రేలాపనలు
-మేమెవరినీ ఇక్కడి నుండి వెళ్లిపోవాలని అనలేదు
-వారుంటే మాకే ఇంకా వెల్త్ టాక్స్ పెరుగుతుంది
-సీఎం.. ఇక్కడే ఉండి కర్రీపాయింటో, టిఫిన్ సెంటరో పెట్టుకో
-నువ్వు రాష్ట్రానికి సీఎంవా... ఒక ప్రాంతానికా?
- సీఎంపై నిప్పులు చెరిగిన టీఆర్‌ఎస్‌అధినేత కేసీఆర్
హైదరాబాద్ ఆగస్టు 9 (టీ మీడియా) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డికి సీఎంగా కొనసాగే హక్కు లేదు.. నిన్న పెట్టిన ప్రెస్‌మీట్‌లో అసత్యాలు, అసంబద్ధ విషయాలు చెప్పారు..
ఆయనకు మెంటల్ స్టేటస్ సరిగా లేదు.. అని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన చెప్పిన ఏ అంశంలోనూ వాస్తవాలు లేవని, అవన్నీ పిచ్చి ప్రేలాపనలేనని దుయ్యబట్టారు. సీఎం ప్రస్తావించిన హైకోర్టు, విద్యుత్, నదీజలాల పంపిణీ, ఉద్యమాలు, ఉద్యోగాలు, హైదరాబాద్ వివాదం తదితర విమర్శలను ఆయన అంశాల వారీగా సవివరంగా తిప్పికొట్టారు. తెలంగాణ నిర్ణయం జరిగిపోయిందని కేంద్ర హోంశాఖలో కసరత్తు జరుగుతోందని వివరించారు. ఎట్టి పరిస్థితిలోనూ ప్రత్యేక రాష్ట్రం ఆగదని స్పష్టం చేశారు. హైదరాబాద్ విషయంలో సీడబ్ల్యూసీ ఇప్పటికే కుండబద్దలు కొటినట్టు తెలంగాణలోనే ఉంటుందని చెప్పిందని అన్నారు. నదీ జలాల పంపిణీకి అనేక చట్టాలు సూత్రాలు ఉన్నాయని వాటి ప్రకారమే జరుగుతాయన్నారు. ఉద్యోగులు ఉద్యోగాల సంఖ్యపై రాజధానిలో ఏ హెచ్‌ఓడీకి వెళ్లినా నిజాలు తెలుస్తాయన్నారు. ఆంధ్ర ప్రదేశ్ విఫల ప్రయోగమని ఇంకా అనవసర వివాదాలతో విషం నింపవద్దని కోరారు.
ఎవర్నీ వెళ్లమనలేదు..మీరుంటే మాకే టాక్సులొస్తయ్..
హైదరాబాద్ విషయంలో సీఎంవి అసంబద్ద వాదనలని కేసీఆర్ అన్నారు. ‘హైదరాబాద్ స్టేటస్ పరిస్థితేంటంటాడు. ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయనకు మెంటల్ స్టేటస్ లేనట్లుంది. మెం టల్ ఖరాబైనట్లుంది. అందుకే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు’ అని ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణలో భాగమని సీడబ్ల్యూసీ తీర్మానం కుండబద్దలు కొట్టినట్టు చెప్పిందని గుర్తు చేశారు. కొంత కాలం పాటు హైదరాబాద్‌నుండి పాలన సాగించుకోవడానికి పెద్ద మనస్సుతో అంగీకరించాం. మానవతా థృక్పథంతో 10సంవత్సరాల పాటు ఇక్కడ ఉండేందుకు అంగీకరించినం’ అని చెప్పారు. ఇక్కడే పుట్టి ఇక్కడ పెరిగిన వారంతా తెలంగాణ వారేనని ఇప్పటికి లక్షసార్లు చెప్పామన్నారు. అలాగే తాము ఎవరినీ వెళ్లిపోవాలని కోరుకోవడం లేదని చెప్పారు. మీరిక్కడే ఉద్యోగాలు చేసుకుని ఇక్కడే ఉండిపోండి మాకే టాక్సులు వస్తయి అన్నారు. వెల్లగొడతరు అంటూ అనవసర వివాదం చేస్తున్నాడన్నారు.తాము ఎవర్నీ వెల్లమని అనడం లేదని అంటూ సీఎం కూడా విడిపోయిన తర్వాతకూడా ఇక్కడే ఉండొచ్చునని, కర్రీ పాయింటో, టిఫిన్‌సెంటరో కూడా పెట్టుకోవచ్చని చురకలంటించారు.
హైకోర్టు, న్యాయవాదుల సంఖ్యై చర్చకు సిద్ధమా?
హైకోర్టు, హైదరాబాద్ న్యాయవాదుల సంఖ్యపై కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పిన వివరాలు, గణాంకాలను ఆయన తప్పుపట్టారు. హైదరాబాద్‌లో 40-50 వేలమంది న్యాయవాదులున్నారనేది పచ్చి అబద్ధమని అన్నారు. హైకోర్టు రిజిస్టార్‌తో, బార్ కౌన్సిల్ నాయకులతో మాట్లాడానని, హైదరాబాద్‌లో మొత్తం 10-15వేల మంది న్యాయవాదులున్నారని, ఇందులో సీమాంవూధుల సంఖ్య 3-4 వేలుమావూతమేనన్నారు. 23జిల్లాల్లో మొత్తం రిజిస్టర్ అయిన న్యాయవాదులు 75వేల మంది మాత్రమేనని, సీమాంవూధలోని 13 జిల్లాల్లో 40వేల మంది అడ్వకేట్లు ఉంటే హైదరాబాద్‌తో కలిసి తెలంగాణలో 35వేల మంది ఉన్నారని వివరించారు. ఈ విషయమై చర్చకు సిద్ధం.. జూబ్లీ హాల్లో పెడతారా ఇంకెక్కడైనా పెడతారో చెప్పాలని సవాలు విసిరారు. గుంటూరు నుండి హైకోర్టు తెచ్చామన్నారని మరో అబద్ధం చెప్పారని హైదరాబాద్‌లో 1919 నుండేహైకోర్టు ఉందని, ఆంధ్రలో 1954లో ఏర్పడ్డదని చెప్పారు.
నేను మాట్లాడిన వాటిల్లో ఏ తప్పున్నా.... ఏ శిక్షకైనా సిద్ధం
తెలంగాణ ఏర్పడితే ఈ ప్రాంతం మొత్తం అంధకారం అవుతుందని సీఎం చెప్ప డం హస్యాస్పదమన్నారు.‘ నేను మొన్న ఏం చెప్పిన్నంటే తెలంగాణలో ప్రస్తుతం జనరేట్ అవుతున్న విద్యుత్ 4825మెగావాట్లు. ఇందులో 2282మెగావాట్ల యూనిట్లు థర్మల్ ద్వారా, 2543మెగావాట్లు హైడల్ ద్వారా ఉత్పత్తి అవుతోందని చెప్పిన. వర్షాలు ఎలా ఉన్నా తప్పకుండా హైడల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయ్యేది 800మెగావాట్లు. అంటే తప్పకుండా విద్యుత్ తెలంగాణలో జనరేట్ అయ్యేది 3082యూనిట్లు. ఇక తెలంగాణ వచ్చిన తరువాత కేంద్రం రాష్ట్రానికిస్తున్న విద్యుత్‌లో తెలంగాణ వాటా కింద 1260 మెగావాట్లు వస్తుంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దక్కే నికర విద్యుత్ 4342మెగావాట్లు. మరోపక్క 6800మెగావాట్ల విద్యుత్ జనరేటింగ్ స్టేషన్లు త్వరలో రావాల్సి ఉన్నాయి. ఈ సెప్టెంబర్‌లో జూరాల నుండి 240 మెగావాట్లు, సింగరేణి నుండి 1200 మెగావాట్లు వచ్చే ఏడాది జూన్ నుండి వస్తుంది. '
చెన్నూరు, భూపాలపల్లి పవర్‌ప్లాంట్ల నుండి ఏప్రిల్‌లో 600 మెగావాట్లు రాబోతోంది. తెలంగాణలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను, రాష్ట్రం ఏర్పడిన తరువాత వచ్చే విద్యుత్‌ను, త్వరలో అందుబాటులోకి రానున్న విద్యుత్‌ను మొత్తం కులుపుకుంటే లోటు కేవలం 418యూనిట్లు మాత్రమే. కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం విద్యుత్‌ను వినియోగించుకుంటే కేంద్రం పరిధిలో ఉండే 10శాతం విద్యుత్ అంటే 3000యూనిట్లలో 700-800మెగావాట్లు అడిగి తెచ్చుకుంటాం.’ అని కేసీఆర్ సోదారహరణంగా వివరించారు. తాను 10వేల మిలియన్ యూనిట్లు చత్తీస్‌గడ్‌నుంచి తెస్తానన లేదని అంత విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంటామని మాత్రమే చెప్పానని అన్నారు. చత్తీస్‌ఘడ్‌లో మిగులు ఉందని,ఉదయమే చత్తీస్‌గడ్ విద్యుత్ అధికారులతో, మంత్రితో మాట్లాడానని,రిటైర్డ్ ఐఎఎస్ అధికారి గోయల్ కూడా మాట్లాడారని వారు వెయ్యి నుండి 1500 మెగావాట్లు అమ్మడానికి సిద్ధమని చెప్పారని తెలిపారు.‘నాకు గ్రిడ్ల గురించి చెబుతున్నాడు. నేనేం పిలగాన్నా. నార్త్, సౌత్ గ్రిడ్లను కనెక్టు చేయలేదు. మీటింగ్‌లు నడుస్తున్నాయి. పవర్‌కారిడార్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో కొన్ని క్షణాల్లో విద్యుత్ వస్తుంది. తెలంగాణకు కోల్ డిపాజిట్స్ ఉన్నాయి.
రాష్ట్రం వచ్చినంక ఏందీ పరిస్థితి అని మాకు తెలియదా... రాష్ట్రం సాధించుకున్నోళ్లకు ఈ విషయాలు తెలియనివా...?’ అని మండిపడ్డారు. తెలంగాణలోని సింగరేణిలో 51శాతం బొగ్గు నిల్వలు తెలంగాణకే చెందుతాయని, కేంద్రం శ్రీరాంపూర్, రామగుండంలో రెండు గనులను తెలంగాణకు కేటాయించిందని, ఉపయోగించుకుని 1200 మెగావాట్ల విద్యుత్‌ను జనరేట్ చేస్తామని, మహారాష్ట్ర, కర్నాటకకు అమ్ముతున్న బొగ్గును విద్యుత్ ఉత్పత్తికి వాడుకుంటామని చెప్పారు. ‘ జెన్‌కో ద్వారా 6600 మెగావాట్లు, పాల్వంచనుండి 800, భూపాలపల్లి నుండి 800, సత్తుపల్లి నుండి 600, రామగుండం నుండి 1320, నేదునూరు నుండి 2100(గ్యాస్ కేటాయింపులు చేస్తే , శంకర్‌పల్లి నుండి 1000 మెగావాట్లు అందుబాటులోకి వస్తే తెలంగాణ మిగులు కరెంటు ఉన్న రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎన్టీపీసీ నుండి మరో వెయ్యి యూనిట్లు తెచ్చుకుంటామని తెలిపారు. ఆంధ్రలో మిగులు విద్యుత్ మూడువేల మెగావాట్ల వరకుందని తెలిపారు. ‘మాకు అమ్మరా.. మీ దగ్గర కొంటాం. మాతో మీకు అవసరాలు ఉండవా.. తెలుగుజాతి, తెలుగు ప్రజలు, తెలుగు ప్రేమ ఇదేనా. సీఎం మాట్లాడే మాటలేనా.’ అని అన్నారు.
ఉద్యమాలు లేకుంటే మద్రాసులోనే ఉందువు....
కోరికలు, ఉద్యమాలతో రాష్ట్రాలు ఏర్పడవని సీఎం అంటున్నాడని, మరి ఆనాడు పొట్టి శ్రీ రాములు త్యాగం, ఉద్యమం వల్లే ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందన్న విషయాన్ని సీఎం ఎలా మరిచాడని అన్నారు. తమిళులను బొద్దింకలు, రాజాజీని నామాల నల్లకాకితో పోల్చిన విషయం సీఎంకు తెలియదా అని అన్నారు. ఇలా ఉద్యమం చేయబట్టే ఆంధ్రరాష్ట్రం తెచ్చుకున్నారని, లేకుంటే ఇప్పటికీ మద్రాసు రాష్ట్రంలోనే ఉండేవారు కాదా అని ప్రశ్నించారు.
మీ తెలివితక్కువతనం వల్లే నీరు వృధా..
మూడువేల టీఎంసీల నీరు ఈ సంవత్సరం సమువూదంలో కలిసిందని చెప్పిన సీఎం దానికి కారకుపూవరో తెలుసుకోవాలన్నారు. ‘మీ తెలివిలేని తనం వల్లే ప్రాజెక్టులు ప్రారంభం కాలేదు. ఎస్సాస్సీ, ఇచ్చంపల్లి, దేవాదుల, కాంతనపల్లి ప్రాజెక్టులు చేపట్టకపోవడం వల్లే నీరు సమువూదంలోకి వెళ్తోంది. మీకు దూరదృష్టి లేదు. సమువూదంలోకి పోయే నీటిని మా పొలాలకు మళ్లిస్తాం. మా నీరు మేం తెచ్చుకుంటాం. మీరేం ప్రాజెక్టులు చేపట్టారు. ప్రాణహిత-చే ఈ ప్రాజెక్టు కింద 16 లక్షల ఎకరాలకు సాగునీరు. మొత్తం కట్టేవి ఎత్తిపోతల ప్రాజెక్టులు 14, మొత్తం టీఎంసీలు 14. వీటితోనే 16లక్షల ఎకరాల నీరు పారిస్తారా..? తెలంగాణ లిఫ్ట్ ప్రాజెక్టులకు కరెంటు లేదంటున్నారు. ముందు మాకందే నీళ్లను తరలించుకుంటాం.. ఆ తరువాతి నీటినే లిఫ్ట్‌ల ద్వారా తెచ్చుకుంటాం. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై అటానమస్ ట్రిబ్యూనల్స్‌ను పెట్టుకుంటాం. అన్నారు. నైలునదిని 11 దేశాలు పంచుకుంటున్నాయని, దేశంలోని 28రావూష్టాలు నీటి పంపకాల్లో అవలంభిస్తున్న విధానాలనే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు పాటిస్తాయని తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర ఏమన్నా రెండు దేశాలుగా విడిపోతున్నాయా..? అని ప్రశ్నించారు.
వెయ్యేళ్లు బతకం...ఒకరినొకరు చూడలేని స్థితి వద్దు
మనం వెయ్యేళ్లు బతకమని, భవిష్యత్తు తరాల మధ్య విషబీజాలు నాటొద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. విభజన జరిగిపోయిందని, ఆంధ్రవూపదేశ్ అనేది విఫలవూపయోగమని, రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకరిముఖం ఒకరు చూసుకోలేని స్థితిని కల్పించొద్దని సీఎంకు సూచించారు. ఉద్యోగాలపై కిరణ్‌కుమార్‌డ్డి పచ్చి అబద్ధం చెప్పారని అన్నారు. ‘1969లో నాటి సీఎం కాసు బ్రహ్మనందడ్డి జీవో ప్రకారం వెళ్లాల్సిన వారు 24వేల మంది ఉద్యోగులు. ఎన్టీరామారావు 610జీవో ఇచ్చారు. సుందరేషన్ కమిటీ రిపోర్టు ప్రకారం 59వేలు. రిపోర్టులున్నాయి. చదవండి. అవేవీ చూడకండా కేవలం18వేలే. అందులోనూ తెలంగాణవారున్నారంటే ఎలా. రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఎలాంటి పద్ధతులు అవలంభించాలనేదానికి చట్టం, పద్ధతులున్నాయి. ఇప్పటికే మూడు రాష్ట్రాలు దాన్ని పాటించి ఏర్పడ్డాయి. ఎవరూ ఎవర్నీ వెళ్లిపొమ్మనరు వారు ఎక్కడ పనిచేయాలో వారి ప్రభుత్వం నిర్ణయిస్తుంది.’ అని వివరించారు. సీమాంధ్ర ప్రాంత నాయకులు విజ్ఞప్తులు చెప్పుకునేందుకే అంటోనీ కమిటీ వేశారని, రాష్ట్రం విడిపోయే సందర్భంలో మంచిచెడులు చెప్పుకోవడానికే ఈ కమిటీ అని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాసెస్ ప్రారంభమవుతుందని అన్నారు.
హైదరాబాద్‌లోని పోలీసింగ్ గవర్నర్ కంట్రోల్‌లో పెడతామనే వ్యాఖ్యలపై స్పంది స్తూ జీహెచ్‌ఎంసీ పరిధి ఎల్‌బీ నగర్‌వరకే ఉంటుందని, మిగిలిన ప్రాంతాల్లోనూ ఆంధ్రవూపాంతం వారున్నారు కదా అని ప్రశ్నించారు. బొంబాయికి వలసపోయిన వారు మాకు అక్కడ హక్కులుంటాయంటే రాజ్‌ఠాక్రే తెల్లారే సరికి ఖాళీ చేయిస్తాడని అన్నారు. సీమాంధ్ర వారిలాగే తాము వితండవాదానికి పోతే హైదరాబాద్ కంటే స్పీడుగా గ్రోత్ ఉన్న పట్టణాలు వైజాగ్, తిరుపతి అని, వాటిని కేంద్ర పాలితవూపాంతాలు చేయాలని అడిగితే ఎం చేస్తారని ప్రశ్నించారు. మీడియా సంస్థలు విద్వేషాలు కల్గించొద్దని హితవు పలికారు. కేంద్రంలోని అన్ని శాఖలు విభజనపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయని, కేబినెట్ నోట్ ఆలస్యమేమీ కాదని కేసీఆర్ వివరించారు. విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్ కే.కేశవరావు, టీఆర్‌ఎస్‌ఎల్‌పీ నేత ఈటెల రాజేందర్, పోలిట్‌బ్యూరో సభ్యులు కడియం శ్రీహరి, నాయిని నర్సింహ్మడ్డి, జగదీష్‌డ్డి, స్వామిగౌడ్ పాల్గొన్నారు.
బొంబాయి గురించి అంబేద్కర్ అన్నది మరిచారా?
‘రాష్ట్రం సమైక్యం కోసం సంతకం పెట్టానని ఒప్పుకుంటున్నాడు. ఏం హక్కు ఉంది సీఎంగా ఆయన కొనసాగడానికి. సీఎంకు ఒక ప్రాంతంపై పక్షపాతం ఎలా ఉంటుంది. కొందరికి ఈ మధ్య అంబేద్కర్ మీద గౌరవం బాగా పెరిగిపోయింది. ఆయన హైదరాబాద్‌ను రెండో రాజధానిని చేయాలన్నడని అంటున్నరు. మరి అదే అంబేద్కర్ బొంబాయి గురించి ఏమన్నడు? అదికూడా చెప్పండి. ఆనాడు గుజరాతోళ్లు ఇట్లనే మేం అది పెట్టినం ఇది పెట్టినం మేం పోతే కుప్పకూలుతరు అన్నరు. అపుడు అంబేద్కర్ మీరు ఎన్నటికైనా కిరాయిదారులేనన్నాడు. దీన్నెందుకు మరుస్తున్నారు.’ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ తెలంగాణదే..
‘మీ సీడబ్ల్యూసీనే హైదరాబాద్ తెలంగాణదని చెప్పిందని, ఇంకెవరు చెప్పాలి నీకు’ అని కిరణ్‌ను కేసీఆర్ ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులు ఎంత మంది ఉంటే అంత వెల్త్‌టాక్స్ తమకు వస్తుందని, హైదరాబాద్‌లో ఎవరు ఎక్కడైనా ఉండొచ్చునని, ఆంధ్రవూపాంతం వారు బెంగుళూర్, చెన్నైలో ఉన్నారని, పుణె, ముంబై, షోలాపూర్‌లో తెలంగాణవారున్నారని తెలిపారు. హైదరాబాద్ మాదేనన్నట్లుగా మాట్లాడితే మీలాంటివారిని రానిస్తారా? అందుకే అన్నీ అలోచించే సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందని కేసీఆర్ అన్నారు. కర్ణాటక, మహారాష్ట్రతో ఇబ్బందులను ఎలా పరిష్కరించుకోవాలనే అంశాలపై కలిసి చర్చించుకుందామన్నారు. హైదరాబాద్‌లో చిత్ర పరిక్షిశమ స్థిరపడిపోయిందని, అందులో 90శాతం మంది సీమాంవూధ నుంచి ఉంటే 10 శాతమే తెలంగాణ ప్రాంతం వారున్నారని, ఆ పరిక్షిశమను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని అన్నారు. వారిని ఎవరైనా పొమ్మంటే నేనే ముందుండి ఉద్యమిస్తానని కేసీఆర్ అన్నారు.
ఉద్యమాలు
‘‘ఉద్యమాలతో రాష్టాలు రావని అంటున్నవ్. అయిపొయింద? పొట్టి శ్రీరాములునే మరిచినవ? ఉద్యమాలు లేకుంటే.. ఆయన త్యాగం లేకుంటే ఇప్పడు ఏడుందువు.. మద్రాసుల గాదా. జార్ఖండ్, చత్తీస్‌గడ్ ఉద్యమాలతోని రాలేదా.’’
జలపంపిణీ:
‘తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రం. 28 రాష్ట్రాలకు నీటి పంపిణీల ఏ సూత్రాలు ఉంటయో అవే తెలంగాణకు ఉంటయ్. నైలు నదిని 11 దేశాలు పంచుకుంటున్నయ్. ఒకళ్లను ఒకళ్లు చంపుకునే పాకిస్థాన్‌తో ఐదు నదులను పంచుకుంటున్నం. బంగ్లాదేశ్, నాలుగు దేశాలతో బ్రహ్మపువూతను పంచుకుంటున్నం. ఇక్కడ సమస్య ఎందుకు వస్తది. నేషనల్ వాటర్ లాస్ ఉన్నయ్. ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ఉన్నయ్’’
విద్యుత్:
‘నాకు గ్రిడ్ల గురించి చెబుతున్నాడు. నేనేం పిలగాన్నా. నార్త్, సౌత్ గ్రిడ్లను కనెక్టు చేయలేదు. పవర్‌కారిడార్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో కొన్ని క్షణాల్లో విద్యుత్ వస్తుంది. ఇది నా సొంత కవిత్వం కాదు. రేపు విద్యుత్ అవసరం పడితె మాకు అమ్మరా? పక్కరాష్ట్రం కాబట్టి మీ దగ్గర కొంటాం? మాతో మీకు అవసరాలు ఉండవా? ఈ మాత్రం సంస్కారం మీకు లేదా? తెలుగుజాతి, తెలుగు ప్రజలు, తెలుగు ప్రేమ ఇదేనా. సీఎం మాట్లాడే మాటలేనా.’
No comments:
Post a Comment