Thursday, 13 December 2012

అఖిలపక్షం ఓ చిల్లర నాటకం

- పార్టీకి ఇద్దరిని రమ్మంటారా?
- ఎఫ్‌డీఐ ఓట్ల కోసం వాడుకున్నారు
- టీ ఎంపీల్లారా.. మీ భవిష్యత్తేంటి? 
- తెలంగాణకు సంబంధం లేని సన్నాసుల విగ్రహాపూందుకు?
- ‘తెలంగాణ’లో రంగాడ్డి పేర వర్సిటీ
- రంగాడ్డి పుస్తకావిష్కరణలో కేసీఆర్
- టీఆర్‌ఎస్‌లోకి రావాలని కేవీఆర్ మనవడికి ఆహ్వానం
   ‘కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణపై ఈనెల 28న నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశం ఓ చిల్లర నాటకం. పార్టీకి ఇద్దరిని రమ్మంటారా? ఇదేనా కాంగ్రెస్ చిత్తశుద్ధి? మేమేమైనా ఎడ్డోళ్లమా? అంత అర్థం కాదా మాకు?’ అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే.చంద్రశేఖర్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డిసెంబరు  12న   ఇక్కడి గగన్‌మహల్‌లోని ఏవీ కాలేజీలో జరిగిన కార్యక్షికమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, దివంగత కొండా వెంకట రంగాడ్డి (కేవీఆర్) స్వీయ చరిత్ర ఉర్దూ పుస్తకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘టీ కాంగ్రెస్ ఎంపీల్లారా! ఢిల్లీలో ఏం పట్టుకొని ఊగులాడుతారు? రండి బయటకు’ అని పిలుపునిచ్చారు.
                      ఎఫ్‌డీఐలపై పార్లమెంట్‌లో ఓటింగ్ సందర్భంగా టీ కాంగ్రెస్ ఎంపీల ఓట్ల కోసమే కాంగ్రెస్ అధిష్ఠానం నాటకాలాడిందని ఆరోపించారు. ఆ కుట్రలను ఇప్పటికైనా ఎంపీలు గమనించాలన్నారు. తెలంగాణ తల్లి ఒడిలోకి చేరుతరా? లేదా అధిష్ఠానానికి గులామీ చేస్తారా? తేల్చుకోవాలని టీ కాంగ్రెస్ ఎంపీలకు ఆయన సూచించారు. ఎస్‌ఐ, ఎమ్మార్వో వంటి పోస్టులను గజిటెడ్‌గా మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రపతి ఒప్పుకోవద్దని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలోనే అనేక పోస్టులను గజిటెడ్‌గా మారుస్తూ, ఇష్టమొచ్చినట్లు చేస్తూ పోతే ఎలా? అని నిలదీశారు. టీ కాంగ్రెస్ ఎంపీలు వెంటనే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని, కేంద్ర హోంమంత్రి షిండేను కలిసి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని సూచించారు. ముందు సీఎంను కలిసి హెచ్చరించాలన్నారు. వచ్చేవన్నీ సంకీర్ణ ప్రభుత్వాలేననన్న కేసీఆర్.. 100 ఎమ్మెల్యే, 17 ఎంపీ స్థానాలతో ఢిల్లీ పీఠాన్ని కమాండ్ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.
          ఎక్కడో రోడ్డు ప్రమాదం జరిగితే నివాళులర్పించే పార్లమెంట్.. తెలంగాణ కోసం వేయి మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఎందుకు పట్టదని ప్రశ్నించారు. తెలంగాణ కోసం సకల జనుల సమ్మె 42 రోజుల పాటు అపురూపంగా, బ్రహ్మాండంగా జరిగితే ప్రధాన మంత్రికి పట్టదా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పాదయాత్ర లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రతిదీ కాపీ కొడుతున్నడు. గొర్రె పిల్లను పట్టుకొని గొర్రెల బీమా ఫ్రీ అంటడు. దేన్ని పట్టుకున్నా ఫ్రీ అంటడు. సింగపూర్ వెళ్లి రాష్ట్రాన్ని అట్లనే చేస్తానన్నడు. చైనా, అమెరికా వెళితే అలాగే చేస్తానంటడు. చివరికి బాబు ఏమవుతడో’ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. 
     రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్టు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల నుంచి ఆదాయం వస్తోందన్నారు. ఈ శాఖల ద్వారా తెలంగాణ నుంచి రూ. 40వేల కోట్లు ఉంటే, సీమాంధ్ర నుంచి రూ.20వేల కోట్లు మాత్రమే వస్తోందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధం లేని సన్నాసుల విగ్రహాలు ఇక్కడెందుకని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అప్పగించే విగ్రహాలు చాలా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజలకు అన్నం పెట్టని, తెలంగాణ భాషను అవహేళన చేసే తెలుగు తల్లి తమ పాలిట దయ్యమే అవుతుందన్నారు. తెలంగాణ యాసలో తాను మాట్లాడటం మొదలు పెట్టిన తరువాత ఆంధ్ర యాసలో మాట్లాడేందుకు భయపడుతున్నారని గుర్తు చేశారు. 
            తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేవీ రంగాడ్డి పేరిట యూనివర్సిటీ నెలకొల్పుతామని, ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించేలా ఆదేశాలిస్తామని, ప్రతి జిల్లాలో ఆయన విగ్రహాలను పెడతామని కేసీఆర్ ప్రకటించారు. కేవీఆర్ మనవడు కేవీ విశ్వేశ్వర్‌డ్డిని టీఆర్‌ఎస్‌లోకి రావాలని ఆహ్వానించారు. తెలంగాణ కోసం పోరాడిన కేవీ రంగాడ్డి మనవడిగా పార్లమెంట్‌లోగాని, అసెంబ్లీలోగాని గళాన్ని విప్పాలని కేసీఆర్ సూచించారు. పెద్ద మనుషుల ఒప్పందం చారివూతక డాక్యుమెంట్ అని, ఆ ఘనత రంగాడ్డిదేనన్నారు. 
              ‘నాకు ఎమ్మెల్యేగా బీ ఫాం ఇచ్చేందుకు నాటి టీడీపీ అధ్యక్షుడు ఎన్‌టీఆర్ ఆఫీసు నుంచి ఫోన్ వస్తే నాచారం స్టూడియోకు వెళ్లినా. అక్కడికెళ్తే తెలంగాణకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా ఇసుక కుప్పల్లో, చెట్ల కింద కూర్చొని ఉన్నారు. దేవుడి గుడి దగ్గర బిచ్చగాళ్లు కూర్చున్నట్లే పరిస్థితి కనిపించింది. నాకు కళ్లు తిరిగినయ్. ఒక టెంట్, కొన్ని కుర్చీలు వేస్తే ఏమవుతది?ఇదీతెలంగాణ నాయకులకు ఆంధ్ర పార్టీలు ఇచ్చే గౌరవం’ అని తన అనుభవాన్ని చెప్పారు.
రాజ్యాంగ విలువలు పతనం : జస్టిస్ సుదర్శన్‌డ్డి
న్యాయ వ్యవస్థ రాజకీయ కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయిందని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్‌డ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ, రాజకీయ విలువలు పతనమైపోయాయని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారం ఎన్ని రాష్ట్రాలైనా చేసుకోవచ్చని, కాని రాజ్యాంగానికి గౌరవం లేకుండా చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అఖిలపక్ష సమావేశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా మళ్లీ రాక్షస క్రీడ ప్రారంభమైందని ఆయన వ్యాఖ్యానించారు. కన్సెన్సస్, పీపుల్ ఒపీనియన్ వంటి పదాలు రాజ్యాంగంలో లేవన్నారు. ఏవీ విద్యా సంస్థల చైర్మన్ కే ప్రతాప్‌డ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌డ్డి, ప్రొఫెసర్ .రజాక్ ఖురేషీ, విద్యావేత్త మహబూబ్ ఆలం ఖాన్, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, కేవీ రాంచందర్‌డ్డి, కేవీ విశ్వేశ్వర్‌డ్డి, ఎంపీ వివేక్, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహాడ్డి, మాజీ స్పీకర్ కేతిడ్డి సురేష్‌డ్డి, పీ నర్సాడ్డి, గోపాల్‌డ్డి, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణకు అనుకూలమో.. కాదో ఆ మూడు పార్టీలు అఖిలపక్ష సమావేశంలో తేల్చేయాలి. తెలంగాణలో పాదయావూతలు చేస్తున్న తెలుగుదేశం, వైఎస్సార్సీపీ నాయకులు తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని చెబుతున్నారు. ఇదే విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో స్పష్టంగా తెలియచేయాలి.
                                                - ఈటెల రాజేందర్, టీఆర్‌ఎస్ ఎల్పీ నేత

పార్టీలన్నీ తెలంగాణకు అనుకూలమో.. వ్యతిరేకమో తేల్చిచెప్పాలి. కప్పదాటు వైఖరిని కనబరుస్తున్న కాంగ్రెస్‌కు ఇకపై తెలంగాణలో మనుగడ ఉండదు. టీడీపీ, వైఎస్సార్సీపీలు తమ పాదయావూతల ద్వారా తెలంగాణకు అనుకూలమని ప్రకటనలు చేసిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని వాటికి కట్టుబడి ఉండాలి. లేనిపక్షంలో క్విట్ తెలంగాణ ఉద్యమం తప్పదు.
                                                        - హరీశ్‌రావు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

 అఖిలపక్ష సమావేశానికి వెళ్లే విషయంపై జాతీయ నాయకత్వంతో చర్చిస్తా. 19న నిర్వహించే పార్టీ కోర్‌కమిటీలో తుది నిర్ణయం తీసుకుంటాం. తెలంగాణ అంశాన్ని పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదు. గతంలో నిర్వహించిన సమావేశాలకు వెళ్లి అభివూపాయం చెప్పి నా.. ఆ పార్టీ తన నిర్ణయం చెప్పలేదు. ఎఫ్‌డీఐల అమలు విన్యాసాల్లో ఈ అఖిలపక్ష సమావేశం కూడా ఒకటి. 
                                                                 -కిషన్‌డ్డి, బీజేపీ అధ్యక్షుడు

కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు కచ్చితంగా తెలంగాణకు అనుకూలంగా ప్రజల ఆకాంక్షలను తెలియజేయాలి. తెలంగాణలోని ఆయా పార్టీల నేతలు ఒకే అభివూపాయాన్ని చెప్పాలని రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి చేయాలి. ఈ విషయంలో ప్రజలలో విశ్వాసం పెంచాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలదే.
                                               - ప్రొఫెసర్ కోదండరాం, జేఏసీ చైర్మన్

కాంగ్రెస్ మరోసారి తన కపటబుద్ధిని చాటుకుంది. ఆ పార్టీ తెలంగాణ విషయంలో దోకేబాజీ రాజకీ యం చేస్తోంది. అఖిలపక్ష సమావేశానికి ఇద్దరు చొప్పున ప్రతినిధులు వెళ్లినా.. పార్టీలన్నీ ఏదో ఒకటే అభివూపాయం చెప్పాలి. ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీలు తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించాలి.
                                        -నాగం, తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు

No comments:

Post a Comment