Wednesday 26 December 2012

కాకతీయ సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణం

* కోటను ముంచిన కులపోరు
* రెడ్డి-వెలమల ఆధిపత్యపోరు
* రెడ్డి సామంత రాజులు యుద్ధానికి దూరం

               కులాధిపత్య పోరు! నేటి రాజకీయాల్లో సర్వసాధారణమైన ఈ జాడ్యమే.. అలనాడు కాకతీయ సామ్రాజ్య పతనానికీ కారణమైందన్న సంగతి చాలా మందికి తెలియదు. స్వామిద్రోహం, నయవంచన.. కలగలిసి రెండు వందల సంవత్సరాల చరిత్ర పరిసమాప్తికి దారితీశాయన్న సంగతీ తెలియదు. గణపతి దేవుడి పాలనలో తమకు లభించిన ప్రాధాన్యం.. రుద్రమదేవి, ప్రతాపరుద్రుడి కాలంలో దక్కకపోవడంపైరెడ్డి కులానికి చెందిన సామంత రాజులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. 
                తమకు ప్రాధాన్యం లేకపోవడమే కాక.. సైన్యంలో పద్మనాయకుల (వెలమల)కే ప్రాధాన్యం ఉండడాన్ని వారు జీర్ణించుకోలేక పోయారు. 1323లో ఢిల్లీ సుల్తాన్ సేనలు ఓరుగల్లుపై దండెత్తి వచ్చినప్పుడు రెడ్డి సామంత రాజులు ఈ కారణంతోనే సహాయ నిరాకరణ చేశారు. దీనికితోడు.. కాకతీయ సేనలను న్యాయబద్ధంగా ఎదిరించడం అసాధ్యమని తెలుసుకున్న మహ్మద్ బిన్ తుగ్లక్ రెడ్లు, వెలమల నడుమ వైరాన్ని పావుగా వాడుకున్నాడు. కాకతీయ సైన్యంలోని తేరాల బుచ్చారెడ్డి అనే కమాండర్‌కు 18 లక్షల బంగారు నాణేలు ఇస్తానని ఆశ చూపాడు. అందులో సగం ముందే ఇచ్చాడు. 
                     ఆ సొమ్ము తీసుకున్న బుచ్చారెడ్డి అతని మిత్ర సామంతులు.. సుల్తాన్‌తో యుద్ధంలో తామే ముందుండి పోరాడతామని ప్రతాపరుద్రుణ్ని నమ్మించారు. వారిని నమ్మిన ప్రతాపరుద్రుడు యుద్ధరంగాన ఘోరంగా మోసపోయాడు. పోరు కీలక దశలో ఉన్నప్పుడు.. బుచ్చారెడ్డి తన సైన్యాన్ని యుద్ధరంగానికి దూరంగా తరలించాడు. మరికొందరు రెడ్డి సామంతరాజులు కూడా బుచ్చారెడ్డిని అనుసరించారు. బొబ్బారెడ్డి అనే సామంత రాజు ప్రతాపరుద్రుడి పక్షాన యుద్ధరంగానికి వచ్చినప్పటికీ తన బలగాలను దూరంగా మోహరించాడు. యుద్ధరంగంలో 'తన' అనుకున్న వాళ్ల నుంచే జరుగుతున్న వం చన గురించి ఆలస్యంగా తెలుసుకున్న ప్రతాపరుద్రుడు.. స్వయంగా గజారూఢుడై యుద్ధరంగంలోకి దిగాడు. 
                ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్న తుగ్లక్ ఆయనవైపునకు పెద్ద ఎత్తున బలగాలను నడిపించాడు. ప్రతాపరుద్రుడి బలగాలను హతమార్చి ఆయన్ను బందీగా పట్టుకున్నాడు. సమీపంలోనే తన బలగంతో మాటువేసి ఉన్న బొబ్బారెడ్డి.. ఆ సమయంలో తన బలపరాక్రమాలు ప్రదర్శించి రాజు మెప్పు పొందాలనుకున్నాడుగానీ అప్పటికే సమయం మించిపోయింది. ఇక, ప్రతాపరుద్రుడి సైన్యంలోనే అత్యంత కీలకస్థానంలో ఉన్న పద్మనాయక (వెలమ) సేనాని గన్నయ.. బందీగా ఢిల్లీ చేరాక ఇస్లాం స్వీకరించి మాలిక్ మఖ్‌బూల్‌గా పేరు మార్చుకొన్నాడు. తన కుయుక్తులతో ఏకంగా ఢిల్లీకి వజీరు కాగలిగాడు. అనంతరకాలంలో.. కాకతీయులు పాలించిన ప్రాంతానికి ఇతణ్ని రాజుగా నియమిస్తే ఈ ప్రాంత పద్మనాయకులు తరిమితరిమికొట్టారు. దీంతో మాలిక్ మఖ్‌బూల్ ఢిల్లీకి పరారయ్యాడు.

విశ్వసనీయతే కాకతీయుల విశిష్టత
అధికారం కోసం పాకులాడలేదు
శాసనాల ప్రకారం వారిది విస్తి వంశం
కులం, మతంపైనా భిన్న వాదనలు
రాయగజకేసరి శిల్పాల్లో రుద్రమదేవి రూపం
80వ ఏట వీర మరణం
                                 - చరిత్రకారుడు పి.వి. పరబ్రహ్మాశాస్త్రి

హైదరాబాద్: ప్రజా క్షేమం, సమాజాభివృద్ధే ధ్యేయంగా సాగిన కాకతీయుల పరిపాలన ఘనకీర్తి పొందింది. రెండు వందల ఏళ్ల స్వర్ణయుగానికి సాక్ష్యంగా అనేక శాసనాలు, చెరువులు, వ్యవస్థలు ఇప్పటికీ కంటిముందే నిలుస్తున్నాయి. సంగీత, సాహిత్య, శిల్పకళల్లో కాకతీయులు చేసిన కృషి ఆంధ్ర దేశానికే వన్నె తెచ్చింది. కాకతీయుల చరిత్రపై విశేష అధ్యయనం చేసిన చరిత్రకారుడు పి.వి. పరబ్రహ్మశాస్త్రి 'ఆంధ్రజ్యోతి'కి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. కళ్యాణి చాళుక్యుల నుంచి రాజ్యం పొందిన కాకతీ రాజులపై ఓ అపవాదు ప్రచారంలో ఉంది. 
        చాళుక్యులపై తిరుగుబాటు చేసి అధికారంలోకి వచ్చారని చరిత్రకారులు సమర్థిస్తూ వచ్చారు. కానీ శాసనాల ఆధారంగా చూస్తే కళ్యాణి చాళుక్యులపై కాకతీయులు తిరుగుబాటు చేసినట్లు ఎక్కడా కనబడదు. కళ్యాణి చాళుక్యులు రాజ్యం కోల్పోయిన తర్వాత కర్ణాటకలోని మైసూర్ ప్రాంతంలో తలదాచుకున్నారు. వారు తిరిగి వస్తే వారికి రాజ్యం అప్పజెప్పటానికి కూడా కాకతీయులు చాలాకాలం ఎదురుచూశారు. ఇక కళ్యాణి చాళుక్యులు తిరిగి వచ్చే అవకాశం లేదని తేలిన తర్వాతే 1158లో రుద్రుడు తన సార్వభౌమత్వాన్ని ప్రకటించుకున్నాడు. అధికారం కోసం కాకుండా విశ్వసనీయతతో మెలగడం కాకతీయుల విశిష్టత. 
            నిజానికి కాకతీయులు విస్తి వంశీయులు. వివిధ ప్రాంతాల్లో ఉన్న భూములను సాగులోనికి తీసుకువచ్చి వ్యవసాయం ద్వారా వచ్చిన మొత్తాన్ని కర్ణాటక రాజులకు అందించే వారినే 'విస్తి'లు అనేవారు. అందుకే కాకతీయుల శాసనాలలో తాము విస్తి వంశీయులమని, చతుర్థ వంశీయులమని పేర్కొన్నారు. అందుకే కాకతీయుల తొలి శాసనాలు కన్నడ భాషలో ఉన్నాయి. క్రమంగా వీరు రాష్ట్రకూట రాజుల దగ్గర సేనానులుగా మారారు. ఇక వీరి మతానికి సంబంధించి కూడా అనేక అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. కాని కొన్ని ఆధారాల ప్రకారం వీరిని జైనులుగా కూడా భావిస్తున్నారు. 
             'కాకండి' అనే జైన దేవత పేరు మీద వీరికి కాకతీయులు అనే పేరు వచ్చిందన్న వాదన ఉంది. దీనితో పాటుగా వీరు కర్ణాటకలో 'కాకతీ' అనే గ్రామానికి చెందిన వారనే ప్రతిపాదన కూడా ఉంది. ఇక కాకతీయుల కాలంలో కర్ణాటకలో రెడ్డి కాపులు ఉండేవారు. తొలి కాకతీయులు ఏ కులం వారో చెప్పడానికి ఇప్పటివరకు చరిత్రకారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇక రుద్రమదేవి తప్పితే కాకతీయరాజులెవరూ తమ విగ్రహాలను చెక్కించుకోలేదు. శాసనాల ఆధారంగానే రుద్రమ దేవి రూపాన్ని అధ్యయనకారులు తెలుసుకోగలిగారు. రుద్రమదేవికి రాయగజకేసరి అనే బిరుదు ఉంది. 

               ఏనుగుల్లాంటి శత్రువులను జయించిన సింహాల వంటి రాజు అని దాని అర్థం. వరంగల్ కోటలోని స్వయంభూ ఆలయంలో 'రాయగజకేసరి' పేరిట కొన్ని శిల్పాలు ఉన్నాయి. ఈ శిల్పాలలో ఒక ఏనుగు, దానిపై ఒక సింహం, దానిపై ఒక యువతి కూర్చుని ఉంటుంది. యాదవ రాజును జయించిన తర్వాత రుద్రమదేవి ఈ శిల్పాలను చెక్కించింది. ఈ శిల్పంపై ఉన్నది రుద్రమదేవే! అయితే ఈ విషయాన్ని ఇప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. కేంద్ర పురావస్తుశాఖ వద్ద ఈ తరహా శిల్పాలు నాలుగైదు ఉన్నాయి. వాటిపై పరిశోధన చేస్తే రుద్రమదేవి రూపాన్ని అంచనా వేసే అవకాశాలున్నాయి. త్రిపురాంతకం వద్ద అంబదేవుడితో జరిగిన యుద్ధంలో రుద్రమదేవి మరణించింది. 
               ఆ సమయానికి ఆమెకు దాదాపు 80 ఏళ్లు. ఆమెను యుద్ధానికి మల్లికార్జునుడు అనే సేనాని తీసుకువెళ్లాడు. అంబదేవుడి దాడిలో సేనాని కూడా చనిపోయాడు. ఇది 1289లో జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత 11వ రోజున మల్లికార్జునుడి కుమారుడు చెందుబట్ల శాసనం వేయించాడు. రుద్రమదేవి ఎప్పుడు చనిపోయిందో ఆ శాసనంలో స్పష్టంగా ఉంది. ఇక ప్రతాపరుద్రుడిది ఆత్మహత్య అనటానికి కూడా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మహ్మదీయ సేనల చేతిలో బందీకావటం ఇష్టం లేక ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడని అనితల్లిరెడ్డి వేయించిన శాసనం చెబుతోంది. ఈ శాసనంలో 'స్వేచ్ఛఐవ' అని ఉంటుంది. అంటే ఆత్మహుతి చేసుకున్నాడని అర్థం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన కాకతీయ రాజులకు ఆం«ద్రుల చరిత్రలో దక్కాల్సినంత స్థానం దక్కలేదన్న వాదన చరిత్రకారుల్లో వినిపిస్తోంది.                                                                                                                                                                      - ఆంధ్రజ్యోతి
  
                                                                                                                                                                              

18 comments:

  1. Gaakatiyas were Kamma Durjayas. Durjaya was one of the Kamma vamsa.jayapa senani(jayapa Naidu) and ganna senani (gannama Naidu) both are Kamma durjayas .Gannaya mantri viparla Kamma gotra. Kakatiya was Kamma empire. Gannama nayadu Muslims changed his name as malik maqbal. Don't spoil the history.

    ReplyDelete
  2. #కాకతీయకమ్మసామ్రాజ్యం
    #KakatiyaKammaEmpire #Telangana
    వీరి రాజధాని ఓరుగలు(నేటి వరంగలు) కాకతీయుల బిరుదు ఆంధ్రదేశాధీశ్వర. కాకతీయులు "కమ్మ దుర్జయ" వంశస్తులు. వీరు మొదట చాళుక్యుల సామంతులు ఆ తరువాత స్వతంత్రులుగా పాలించారు.వీరు కాకతి అనే దేవతని ఆరాధించుట వలన వీరికి కాకతీయులు అనే పేరు వచ్చింది. ఏడవ శతాబ్దం నుండే కాకతీయ కమ్మ ప్రభుల సామ్రాజ్యం మొదలైనది. కాకతీయులు నాలుగు వందల యేండ్లు పైగా పాలించారు. కాకతీయుల కాలంలో వర్ణ వ్యవస్థ లేదు వృత్తుల ఆధారంగా కుల వ్యవస్థ నిర్ణయించ బడినది. దుర్జయుడు అనే కమ్మ మహారాజు నుండి దుర్జయ వంశం ఆరంభమైనది.

    #కాకతీయ #కమ్మప్రభుల #శాసనాలు
    * శాసనాధారాలను బట్టి బయ్యారం శాసనం ప్రకారం వెన్నయ్య కాకతీయ కమ్మ దుర్జయ వంశమునకు మూలపురుషుడు.
    * గూడూరు శాసనంలో దుర్జయన్య సంభూతుడైన ఎర్రన యూ అతని భార్య అయిన కమ్మసాని యూ భేతరాజును కాకతి వల్లభు చేసారని వ్రాయబడి ఉన్నది.
    * చేబ్రోలు శాసనం ప్రకారం గణపతిదేవుడు మునురుసీమ(కృష్ణ జిల్లా) ప్రాంతంలోని చెందిన జయాప నాయుడి(జయాప సేనాని) సోదరులైన కమ్మరాణులు నారమ్మ , పేరమ్మలను వివాహ మాడాడు. వీరి కుమార్తెలే రుద్రమదేవి, జ్ఞానాంబ.
    * దౌర్వాసా దేవి పురాణంలో ప్రతాప రుద్రుడు కమ్మ మహారాజ వంశంలో జన్మించాడని రాయబడినది.

    కాకతీయ కమ్మ దుర్జయులలో గొప్పవారు #గణపతి దేవుడు, #రుద్రమదేవి, #ప్రతాపరుద్రుఁడు, #జయప్పనాయుడు, #గన్నమనాయుడు.

    #జయప్పనాయుడు(జయప్పసేనాని) గణపతిదేవ ప్రభు బావమరిది గజదళాధి పతి, దివిసీమ రాజ్య పాలక రాజు, గణపతిదేవుడి సర్వసైన్యాధ్యక్షుడు యుద్ధ వీరుడు నాట్య కళాకారుడు జయప్ప నాయుడు నృత్య రత్నావళి గీత రత్నావలి అనే గ్రంధాలు రచించాడు నేడు అవి తెలంగాణాలో పేరిణిగా రూపాంతరం చెందాయి.

    #గన్నమనాయుడు (గన్నసేనాని) ప్రతాప రుద్రుడి మంత్రి. ప్రతాపరుద్రుడి పాలన తరువాత ముస్లిం రాజులు అతడు కమ్మ ప్రభువని గన్నమ నాయుడి సాహసాలకు మెచ్చుకొని అతనికి పంజాబ్ రాజ్యాన్ని ఇచ్చి రాజుగా ప్రకటించి మాలిక్ మక్బుల్ గా మార్చారు. గన్నమ నాయుడు ఎన్నో రాజ్యాలను జయించిన మహా వీరుడుగా చరిత్రతో నిలిచిపోయాడు.

    ReplyDelete
  3. Telaganalo charitralu sarva nashanam chesaru charitralu brastu pati poyayi.chupistam maa Baari rally thoni thapudu kalpitha charitra lu srustinchi prajala meedha rudhu thunaru chatitralu motham savarichu kondi.

    ReplyDelete
  4. కాకతీయులు-దుర్జయ వంశస్థులు..........శాసనాధారాలను బట్టి "బయ్యారం శాశనం" ప్రకారం వెన్నయ కాకతీయ కమ్మ దుర్జయ వంశమునకు మూలపురుషుడు.

    "గూడూరు శాసనం"లో దూర్జయాన్వ సంభూతుడైన ఎర్రన యు అతని భార్యయైన కామసాని యు బేతరాజును కాకతి వల్లభు చేశారని వ్ర్రాయబడి ఉంది.

    "చేబ్రోలు శాశనం" ప్రకారం గణపతిదేవుడు మున్నూరు సీమ (కృష్ణా జిల్లా) ప్రాంతంలోని చెందిన జయప నాయుడి (జాయప్ప సేనాని) సోదరిలైన కమ్మ నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. వీరి కుమార్తెలు రుద్రమదేవి, జ్ఞానాంబ. గణపతిదేవుడు తన పెద్ద కుమార్తె రుద్రమదేవిని చాళుక్య వంశీయుడైన గణపతిదేవరాజు కిచ్చి వివాహం చేశాడు. రెండవ కుమార్తె జ్ఞానాంబను కోట సామ్రాజ్యమునకు చెందిన - బేతరాజు కిచ్చి వివాహం చేశాడు. వీరి కుమారుడే కాకతీయ ప్రతాపరుద్రుడు......For more information, please watch.......

    ReplyDelete
  5. "కాకతీయులు దుర్జయ వంశస్థులు - కాకతీయులు కమ్మవారు".............................

    దుర్జయ వంశస్థులు :-

    1) "బయ్యారం శాశనం" ప్రకారం ఇతను కాకతీయ దుర్జయ వంశమునకు మూలపురుషుడు. ఇతను కాకతిపురం అను ప్రాంతం నుండి పరిపాలన సాగించినాడు.

    2) "జాయప నాయుడు" - కమ్మ దుర్జయ వంశము:-జాయప నాయుడు లేక జాయప సేనాని సూర్యవంశానికి చెందిన కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని వద్ద పనిచేసిన సేనాధిపతి. 1241 లో వెలనాటి చోడులపై గణపతి విజయము సాధించిన తర్వాత వెలనాడు, కమ్మనాడు లోని వీరులందరు ఓరుగల్లు కు తరలిపోయారు. అట్టివారిలో జాయప ఒకడు. గణపతి దేవుడు ఆతనిని చక్రవర్తి గజబలగానికి అధిపతిగా చేశాడు. జాయప చెల్లెళ్ళగు నారమ్మ పేరమ్మలను క్షత్రియుడైన గణపతిదేవుడు పెండ్లి చేసుకున్నాడు. హనుమంతరావు గారి అభిప్రాయము ప్రకారము కమ్మ నాయకులకు జాయప ఆద్యుడు. జాయప దుర్జయ వంశము అయ్య పరివారమునకు చెందినవాడు. తండ్రి పిన్న చోడుడు. తాత నారప్ప. ఈతను దివిసీమను పాలించాడు. కొడుకులు చోడ, పిన్న చోడ, భీమ మరియు బ్రహ్మ వెలనాటి చోడులవద్ద సైన్యములోవున్నారు.కళింగదేశ దండయాత్ర లో పాల్గొని విజయం సాధించిన జాయపకు గణపతిదేవుడు 'వైరిగోధూమ ఘరట్ట' అను బిరుదు ఇచ్చాడు. 1231 లో మహారాజు పై గౌరవపూర్వకముగా గణపేశ్వరునిపేరుపై గుడి కట్టించి గ్రామాలను దానమిచ్చాడు. తన తండ్రి పేరుమీద చేబ్రోలు లో చోడేశ్వరాలయము కట్టించి గుడి ఖర్చులకు మోదుకూరు గ్రామమము రాసి ఇచ్చాడు. 1325 చేబ్రోలు శాసనము ప్రకారము గుడి ముందు రెండు వరుసలలో రెండంతస్థుల ఇళ్ళు కట్టించి దేవదాసీలకు ఇచ్చాడు. జాయప భారతదేశమందలి నాట్యములపై నృత్యరత్నావళి అను సంస్కృత గ్రంథము వ్రాశాడు. దీనినిబట్టి జాయప నాట్యములో, నాట్యశాస్త్రములో నిష్ణాతుడని తెలుస్తుంది.

    3) "మాలిక్ మక్బూల్ లేక సాగి గన్నమ నాయుడు / యుగంధర్" - కమ్మ దుర్జయ వంశము, కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుని సేనాని. ప్రతాపరుద్రుని ఓటమి తరువాత ఢిల్లీ సైన్యాలకు పట్టుబడి, అక్కడ మహ్మదీయ మతానికి మార్చబడి మాలిక్ మక్బూల్ గా మళ్ళీ ఓరుగల్లుకే పాలకునిగా వచ్చాడు.గన్నమ నాయుడు ఒక మహావీరుడు. బహుముఖప్రజ్ఞాశాలి. ఈతని తాత మల్ల నాయకుడు. తండ్రి నాగయ నాయుడు గణపతి దేవుని కడ మరియు రుద్రమదేవి కడ సేనాధిపతిగా ఉన్నాడు.సాగి వారిది దుర్జయ వంశము-విప్పర్ల గోత్రము. ఈ ఇంటిపేరుగల సేనానులు కాకతీయ చక్రవర్తులకడ బహు పేరుప్రఖ్యాతులు బడసిరి. కొత్త భావయ్య చౌదరి పరిశోధన ప్రకారము వీరి ఇంటిపేరు సాగి, గోత్రము విప్పర్ల.గన్నమ నాయుడు ప్రతాపరుద్రుని దుర్గపాలకునిగా, మహామంత్రిగా, కోశాధికారిగా పనిచేశాడు. స్వయముగ గొప్ప కవి మరియు పండిత పోషకుడు. కవి మారన తను విరచించిన మార్కండేయపురాణమును గన్నయకు అంకితమిచ్చాడు.గన్నమ నాయుడు ఇద్దరు కొడుకులు బైచ నాయుడు మరియు దేవరి నాయుడు కాకతీయ సేనానులుగనే ఉన్నారు. బైచ నాయునికి 'పులియమార్కోలుగండ' మరియు 'మల్లసురత్రాణ' అను బిరుదులున్నాయి. దేవరి నాయుడు పల్నాటి సీమను కాకతీయుల సామంతునిగా పాలించాడు.

    ReplyDelete
  6. "ముసునూరి నాయకులు" - కమ్మ దుర్జయ వంశము
    కాకతీయ సామ్రాజ్యం పతనానంతరం తెలుగునాట నెలకొన్న రాజకీయ అనిశ్చితి కాలంలో స్థానిక సైన్యాన్ని సంఘటితం చేసిన కొందరు నాయకులు "కమ్మ దుర్జయ వంశము" చెందిన ముసునూరు నాయకులు (Musunuri Nayakas) అని ప్రసిద్ధి చెందారు. కాకతీయుల తరువాత సాగిన 'అంధకార యుగం' అనుకొనే ఈ సమయం గురించి సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ విశేషంగా అధ్యయనం చేశాడు. క్రీ.శ. 1323-1336 కాలంలో 'ముసునూరు కాపయ నాయకుడు' 'ముసునూరు ప్రోలయ నాయకుడు' తురుష్క పాలకులతో స్వాతంత్ర్య పోరాటం సాగించడం, కాపయ నాయకుడు ఓరుగల్లును ఆక్రమించడం గురించి శర్మ తన 'Forgotten Chapter of Andhra History' లో వివరించాడు. ఈ "ముసునూరు యుగం" రాజకీయంగా సువర్ణ ఘట్టమని శర్మ నిరూపించాడు.ప్రతాపరుద్రుని పరాజయము తరువాత ఆంధ్రదేశము అల్లకల్లోలమైనది. తురుష్కుల ఆగడాలు చెప్పనలవి గానివి. ప్రోలయనాయకుని విలస తామ్ర శాసనములో ఆనాటి తెలుగు వారి దయనీయ స్థితి వర్ణించబడింది. అట్టి విషమ పరిస్థితులలో బెండపూడి అన్నయ మంత్రి మరియు కొలను రుద్రదేవుడను ఇద్దరు దేశాభిమానులు చెల్లాచెదరైన తెలుగు నాయకులను ఐక్యపరచి వారికి నాయకునిగా ముసునూరి ప్రోలానీడు అను మహాయోధుని ఎన్నుకొన్నారు. ప్రోలానీడు ఓరుగల్లు విముక్తి గావించుటకు పలు వ్యూహములల్లాడు. పెక్కు యుద్ధముల పిదప క్రీ. శ. 1326 లో తురుష్కులను దక్షిణభారతము నుండి తరిమివేయుటలో నాయకులు సఫలమయ్యారు. హిందూమతము రక్షించబడింది. దేవాలయములు పునరుద్ధరించబడ్డాయి. బ్రాహ్మణులకు అగ్రహారములీయబడెను. అనితల్లి కలువచేరు శాసనములో ప్రోలానీడి వీరత్వము, దేశాభిమానము, ప్రజారంజకమగు పరిపాలన విపులముగా కొనియాడబడ్డాయి.ఓరుగల్లు కోటపై ఆంధ్రదేశ పతాకము ఎగిరెను. కాపానీడు ""'ఆంధ్రదేశాధీశ్వర'"" మరియు '""ఆంధ్రసురత్రాణ""' అను బిరుదులు పొందెను. ప్రజారంజకముగా పరిపాలించెను. తన తోటినాయకులగు వేమారెడ్డి, పిఠాపురం కొప్పుల నాయకుడు, రేచెర్ల, భువనగిరి, దేవరకొండ పద్మనాయకుల స్వతంత్రమును గౌరవించెను. కాపానీడు సామ్రాజ్యము శ్రీకాకుళం నుండి బీదరు వరకు సిరిపూరు నుండి కంచి వరకు విస్తరించెను. అది ఆంధ్రదేశ చరిత్రలో సువర్ణాక్షరములతో లిఖించదగిన కాలము.1370 వ సంవత్సరము దక్షిణభారత చరిత్రలో పెద్దమలుపు. తెలంగాణను జయించిన బహమనీ సుల్తాను విజయనగరము పై కన్ను వేసెను. ముసునూరి వారి త్యాగములు, దేశాభిమానము విజయనగర రాజులకు మార్గదర్శకమయ్యెను. ఓరుగల్లు పతనము పిమ్మట పెక్కు నాయకులు విజయనగరమునకు తరలి పోయి రాబోవు మూడు శతాబ్దములు దక్షిణభారతమును హిందూమతమును రక్షించుటకు పలుత్యాగములు చేసిరి. ఆంధ్రచరిత్రలో ముసునూరివారి పాలనము 50 వర్షములు మాత్రమేఐనను అది వారి త్యాగనిరతికి, తెలుగువారి ఐక్యతకు కాణాచి. సమకాలీన చరిత్రకు అది ఒక గుణపాఠము కూడ.

    పాలించారు.......

    ReplyDelete
  7. క్షత్రియ సామ్రాజ్యాలు అంతమైన తర్వాత కమ్మవారు ఆంధ్ర దేశాన్ని పాలించారు.......
    ###"""""ప్రధాన కమ్మ రాజ వంశాలు - రాజ్యాలపరంపర కమ్మనాయకరాజులు"""""####.....................................

    1) "కమ్మ దుర్జయులు" - పిన్నమ నాయుడు, దుర్జయ వంశము, "వల్లుట్ల" గోత్రము
    2) "అయ్య (దివిసీమ) నాయకులు" - తెలుగు చోడ / దుర్జయ వంశము, అయ్య పరివారము, దివిసీమ - (నారప్ప నాయుడు, పిన్న చోడుడు, జాయప నాయుడు)
    3) "కాకతీయ - ముసునూరి దుర్జయ నాయకులు" వంశము (కాకతి వెన్నయ, గణపతి దేవుడు,రుద్రమ దేవి,ప్రతాపరుద్రుడు, ముసునూరి ప్రోలానీడు/ప్రోలయ నాయకుడు,ముసునూరు కాపయ నాయకుడు)
    4) "సాగి నాయకులు", దుర్జయ వంశము, విప్పర్ల గోత్రము - (సాగి మల్ల నాయకుడు, సాగి నాగయ నాయుడు, సాగి గన్నమ నాయుడు/యుగంధర్/మాలిక్ మక్బూల్, సాగి బైచ నాయుడు మరియు దేవరి నాయుడు)
    5) "పెమ్మసాని నాయకులు" - గండికోట కమ్మవారు,దుర్జయ వంశము,ముసునూర్ల గోత్రీకులు ( పెమ్మసాని తిమ్మా నాయుడు, రామలింగ నాయుడు,రెండవ తిమ్మా నాయుడు, బంగారు తిమ్మా నాయుడు, పెమ్మసాని నందస్వామిదురై కొండలరాయస్వామి నాయుడు)
    6) "రావెళ్ళ నాయకులు" - దుర్జయ వంశము, వల్లుట్ల గోత్రము (రావెళ్ళ మల్ల నాయుడు, అయ్యప్ప నాయుడు,రావెళ్ళ వేంకటరంగ అప్పస్వామి నాయుడు)
    7) "శాయపనేని నాయకులు" (శాయప్ప నాయుడు, వేంగళ నాయుడు మరియు మనుమడు వేంకటాద్రి నాయుడు, నరసింహ నాయుడు)
    8) "సూర్యదేవర నాయకులు"-తెలుగు చోడ కమ్మ క్షత్రియ వంశములవారు, విప్పర్ల గోత్రీకులు (తిమ్మనాయుడు , యెర్రనాయుడు , ముసలయ్యనాయుడు)
    9) "వాసిరెడ్డి నాయకులు"- చాళుక్య కమ్మ రాజవంశము,వల్లుట్ల గోత్రము (మల్లికార్జున నాయుడు, సదాశివ రాయలు, చినపద్మనాభ రామన్న, శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు)
    10) "యార్లగడ్డ నాయకులు" - వెలనాటి చోడవంశములవారు,రేచెర్ల గోత్రము (చల్లపల్లి రాజులు/జమిందారులు,దేవరకోట రాజ్యము -యార్లగడ్డ గురువారాయడు )..............

    ReplyDelete
  8. Mr.Parbrahma sastry don't destroy the history. Velanati chodas, kakatiyas and Musunuri Nayakas are Kamma Durjayas.

    ReplyDelete
    Replies
    1. I challenge you to prove your statement with historical evidence.

      Delete
  9. #ముసునూరి #కమ్మనాయకుల #సామ్రాజ్యం
    #Musunuri #KammaNayakas #Empire
    #Telangana
    ముసునూరి కమ్మనాయకులు రేఖపల్లి మరియు ఓరుగల్లును(వరంగల్లు) రాజదాని చేసుకొని పాలించారు. వీరిది "కమ్మ దుర్జయ" వంశం వీరి పాలన అర్ధశతాబ్దం పైగా సాగింది . వీరిలో గొప్పవారు ముసునూరి ప్రోలయ నాయడు(నాయకుడు), ముసునూరి కాపయ్య నాయుడు(నాయకుడు) వీరిని ప్రోలానీడుగా కాపనీడుగా పిలుస్తారు. వీరిలో కాపనీడు మహ యోదుడు గొప్ప వీరుఁడు ఢిల్లీ సుల్తానులను ఎదురించి కాకతీయ వారసత్వ సామ్రాజ్యాన్ని గొప్పగా పాలించిన మహరాజు.

    * ముసునూరి కమ్మనాయక రాజులకు, రేచర్ల వెల్మనాయకులు మరియు కొండవీడు రెడ్లు సామంతులుగా అర్థ శతభిడం పైగా ఉన్నారు. కాపానీడు పాలన తరువాత వీరు స్వతంత్రులుగా పాలించుకున్నారు.

    * ప్రభు కాపయ్య నాయుడికి విశ్వవీర, దక్షిణ అశోకా, మహావీర, కాకతివారసపుత్ర, ఆంధ్రాసురత్రాన అనే బిరుదులు కలవు.

    * కాపనీడు వీరత్వానికి మెచ్చి కృష్ణయ్య నాయకా, కన్నయ్య నాయకా అని అనేక పేర్లతో పిలిచే వారు.

    * కాకతీయ కమ్మ ప్రభుల తరువాత తెలుఁగు జాతి చరిత్రలో నేటి తెలంగాణలో గొప్ప పాలకులు ముసునూరి వారే వారిలో కాపయ్య నాయుడి చరిత్ర తెలుఁగు జాతికే గర్వ కారణం.

    * కొండవీడు వేమారెడ్డి, ప్రభు కాపయ్య నాయుడుకి నమిన్న బంటు. కొండవీడు రెడ్లు సైనికులుగా, సైనిక అధికారులుగా ముసునూరి కమ్మనాయకులకు పనిచేసారు.

    * విలసతామ్ర, పోలవరం, కలువచేరు, పెంటపాడు శాసనాలు ముసునూరి కమ్మనాయకుల పాలన ప్రాముఖ్యతని తెలియ చేస్తున్నాయి. వీరు హిందూ దరక్షత్రాలను రక్షించి నిర్మించి, ఎన్నో చెరువులు తవించి ప్రజారంజకంగా పాలించారు.

    ReplyDelete
  10. True Eshwar Ganesh sir.................. 'ఆంధ్రదేశాధీశ్వర' మరియు 'ఆంధ్రసురత్రాణ' ముసునూరు కాపయ నాయకుడు / కాపానీడు, కమ్మ దుర్జయ వంశము ...... "ముసునూరు యుగం" ఆంధ్రదేశ చరిత్రలో సువర్ణాక్షరములతో లిఖించదగిన కాలము....సోమశేఖర శర్మ మాటలలో: "తెలుగుదేశచరిత్రలో వారు వహించిన పాత్ర అనుపమానమైనది. వింధ్యకు దక్షిణమందుండిన గొప్ప హిందూ రాజ్యములన్నియూ ఢిల్లీ సుల్తాను మహమ్మదు బిన్ తుగ్లకు కు పాదాక్రాంతములై ఆ చక్రవర్తి మగటిమిని, సామ్రాజ్యబలమును తలయెత్తి ఎదిరింపలేని కాలమున, పూర్వపు సూర్యవంశ, చంద్రవంశజులైన క్షత్రియుల రాజ్యములన్నియు క్రుంగి కూలారిపోయిన కాలమున అంతటి మహాబలవంతుడైన ఢిల్లీ చక్రవర్తిపై కత్తికట్టి, అతని యధికారమును ధిక్కరించి, స్స్వాతంత్ర్యోద్యమమును లేవదీసి, దానిని విజయవంతముగా నడిపిన కీర్తి, ప్రతిష్ఠలు తెలుగు ప్రజానీకమువి; తెలుగు నాయకులవి; అందును ముఖ్యముగా ముసునూరి ప్రోలయ, కాపయనాయకులవి. వీరు హిందూరాజ్య పునరుద్ధరణమునకు దీక్షాకంకణములు కట్టి యవనవారధి నిమగ్నమైన తెలుగుభూమిని ఉద్ధరించిన పిదపనే దక్షిణదేశమున నుండిన ఇతర రాజ్యములకు ధైర్యము కలిగి, ఢిల్లీ సుల్తానుపై తిరుగుబాటులు కావించి విజయలక్ష్మీ సంపన్నములైనవి. హిందూదేశచరిత్రలో తెలుగు నాయకుని అధిపత్యమున తమకు తామై ప్రజలే తమ శ్రేయోభాగ్యములకొరకు అపూర్వ ధైర్యోత్సాహములతో విమత బలములను ఎదిరించి పోరాడి స్వరాజ్యమును స్థాపించుకొనిన అపూర్వ, అద్భుత ప్రకరణమిది; ప్రాచీన చరిత్రలో అశ్రుతపూర్వమైనది. ముసునూరినాయకులకు విజయమే లభించి యుండకపోయినచో మన తెలుగుదేశ చరిత్ర మరియొకతెన్నున నడచియుండెడిది. అందువలన "ముసునూరి నాయకుల" పరిపాలనాకాలము కొద్దిదైనను, అది మహాసంఘటనాకలితమైనది. ముసునూరివారి స్వాతంత్ర్యవిజయముతో తెలుగుదేశములో నూతన యుగము ఆరంభమైనది. తెలుగుదేశచరిత్ర ఉత్తరమధ్యయుగములో పడినది"..........

    ReplyDelete
    Replies
    1. ముసునూరు నాయకులు కమ్మ కులస్తులు కాదు. వారి శాసనాలు వారిని కేవలం శూద్రులు అని మాత్రమే తెలుపుతున్నాయి. కావున శూద్రకులాలలో ఏ కులమో ఎవరికి తెలియదు.ముసునూరి నాయకుల కాలానికి కమ్మ కులమే లేదు.

      Delete
  11. This comment has been removed by the author.

    ReplyDelete
  12. కమ్మ కులం వేరు కాకతియుల కులం వేరు .కాకతియులు క్షత్రియులు . జాయప సేనాని ఆయ వంశం .ఆయ వంశం తమిళనాడు నుండి వచ్చిన గొల్ల ( Yaadava) కులం కాపనీడు వేరు కృష్ణ నాయకుడు వేరు .కాపనీడు దేవి నాయకుని కుమారుడు.కృష్ణ నాయకుడు ప్రతాపరుద్రుని కుమారుడు .

    ReplyDelete
    Replies
    1. జయప నాయుడు దుర్జయ కమ్మ సంతతి

      Delete
  13. కాకతీయులు వారి శాసనాల ప్రకారం రాష్ట్రకూటులు.రాష్ట్రకూటులు వారి శాసనాల ప్రకారం యాదవులు.అదే విషయాన్ని ప్రతాపరుద్రయశోభూషణం అనె గ్రంధం రూఢీఈ చేస్తున్నది.

    ReplyDelete
  14. జాయపసేనాని తమిళ ఆయ వంశం ఆయరులు యాదవులు.అందుకు వారిశాసనాలు ఆధారం.

    ReplyDelete