Saturday 15 December 2012

హైకమాండ్‌కు తెలంగాణ మంత్రుల డెడ్‌లైన్


   తెలంగాణ అంశంపై ఈ ప్రాంత మంత్రులు తమ వాయిస్ పెంచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరో ఆలోచన ఉండకూడదని అధినేత్రి సోనియాగాంధీకి ఘాటైన లేఖ రాశారు. ఈ నెల 28న జరిగే అఖిలపక్ష మీటింగ్‌లో తెలంగాణపై ఖచ్చిమైన, స్ఫష్టమైన నిర్ణయం తీసుకోవాలని సోనియాగాంధీని కోరారు. అఖిలపక్షంలో తెలంగాణకు అనుకూలమైన నిర్ణయం రాకపోతే ప్రభుత్వానికి, అవసరమైతే పార్టీకి సైతం దూరంగా ఉండటానికి వెనకాడమని తెలంగాణ మంత్రులు సోనియాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే హైకమాండ్‌కు డెడ్‌లైన్‌గా చెప్పవచ్చు. 
                 ఇదే విషయాన్ని పీసీసీ చీఫ్ బొత్సతో కూడా స్ఫష్టం చేశారు. అఖిలపక్షానికి పార్టీ నుంచి ఒక్కరినే పంపాలని, ఇద్దరిని పంపినా అభిప్రాయం ఒక్కటే ఉండాలని మంత్రులు డిమాండ్ చేశారు. అఖిలపక్షానికి షిండే ఇద్దరిని పిలవడంపై తెలంగాణ మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇవాళ గాంధీభవన్‌లో మంత్రులు బొత్సను కలసి తమ అభిప్రాయాన్ని, కార్యచరణను ఆయనకు వివరించారు. ఇవాళ సాయంత్రం జరిగే కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో తెలంగాణపై తీర్మానం చేయాలని టీ మంత్రులు బొత్సను కోరారు.

No comments:

Post a Comment