లండన్: సాంకేతిక అద్భుతాల్లో ఒకటైన ఇంటర్నెట్‌ను తీర్చిదిద్దటంలో కీలకపాత్ర వహించిన ఐదుగురు ఇంజినీర్లకు భారీ బహుమతి దక్కనుంది. ఇంజినీరింగ్‌లో నోబెల్ బహుమతిగా భావించే క్వీన్ ఎలిజబెత్ ప్రైజ్‌కు వీరిని ఎంపిక చేసినట్లు బ్రిటన్‌కు చెందిన నిర్వాహకులు ప్రకటించారు. అమెరికాకు చెందిన రాబర్ట్ కాన్, వింటన్ సెర్ఫ్, మార్క్ ఆండ్రీసెన్‌లతో పాటు ఫ్రాన్స్‌కు చెందిన లూయీ పౌజిన్, బ్రిటన్‌కు చెందిన టిమ్ బెర్నర్‌లు రూ.8.10కోట్ల (1.5 మిలియన్ డాలర్లు) విలువైన ఈ బహుమతిని పంచుకోనున్నారు. దార్శనీకులైన ఈ ఐదుగురిని కలిపి ఇంతకుముందెన్నడూ సత్కరించలేదని నిర్వాహక కమిటీ పేర్కొంది. జూన్‌లో లండన్‌లో నిర్వహించే ఓ కార్యక్రమంలో క్వీన్ ఎలిజబెత్-2 స్వయంగా ఈ అవార్డును విజేతలకు అందజేయనున్నారు.
No comments:
Post a Comment