* సౌర విద్యుత్‌పై ... ఇదీ సర్కారీ విధానం
* కిలోవాట్ ఉత్పాదక యూనిట్‌కు లక్షన్నర పైన ఖర్చు
* త్రీఫేజ్ వినియోగదారులకు 30% సబ్సిడీ
* సింగిల్‌ఫేజ్‌కు వర్తించదు
* మిగులు విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం
* ఈఆర్సీ నిర్ణయం మేరకు చార్జీల చెల్లింపు
రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల సొంత అవసరాలకు, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం సోలార్ రూఫ్ టాప్ నెట్ మీటరింగ్ పాలసీని ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో చిన్నతరహా సోలార్ ఫోటో వోల్టాయిక్(ఎస్‌పీవీ) పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. సోలార్ గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహక చర్యల్లో భాగంగా ప్రభుత్వం ‘నెట్ మీటరింగ్ ఫర్ సోలార్ గ్రిడ్ ఇంటరాక్టివ్ రూఫ్-టాప్ అండ్ స్మాల్ ఎస్‌పీవీ పవర్ ప్లాంట్స్’ పాలసీని తీసుకువచ్చింది. విద్యుత్‌సౌధలో ఏపీ ట్రాన్స్‌కో 100 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటుచేసి విజయవంతంగా నిర్వహిస్తున్నది. దీనిని ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి స్వయంగా సందర్శించి దాని పనితీరును పరిశీలించిన విషయం తెలిసిందే.
500 కిలోవాట్ల సామర్థ్యం వరకు సోలార్ పవర్ ఉత్పత్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 30% మేరకు సబ్సిడీలను అందిస్తున్నాయి. ఇక కిలోవాట్ సామర్థ్యం గల రూప్ టాప్ సోలార్ పవర్ యూనిట్ ఏర్పాటుకు ప్రస్తుతం రూ. 1.65 లక్షల మేరకు ఖర్చు అవుతుందని అంచనా. ఈ కొత్త విధానం ప్రకారం వివిధ అపార్ట్‌మెంట్లు, భవంతులపై సోలార్ పవర్ జనరేటర్లు ఏర్పాటు చేస్తారు. అవి ఉత్పత్తి చేసే సౌర విద్యుత్‌ను అవసరాల మేరకు వినియోగించుకుని, మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి విక్రయించే అవకాశం ఉంది.
ఇందుకోసం నెట్ మీటరింగ్ పద్ధతిని ఎంచుకోవాల్సి ఉంటుంది. నెట్ మీటరింగ్ అంటే సోలార్ పవర్ యూనిట్ ఉత్పతి చేసే విద్యుత్‌ను రికార్డు చేయడంతో పాటు అందులో విద్యుత్ వినియోగం, గ్రిడ్‌కు సరఫరా చేస్తున్న విద్యుత్ వివరాలు రికార్డు అవుతాయి. అయితే నెట్ మీటరింగ్ సదుపాయాన్ని కేవలం త్రీ-ఫేజ్ వినియోగదారులు మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. వినియోగదారులు ఉత్పత్తిచేసే సోలార్ పవర్‌ను నెట్ మీటరింగ్ ద్వారా గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. వినియోగదారుడు వాడుకోగా మిగిలిన విద్యుత్ గ్రిడ్‌కు మళ్లుతుంది. దాని ధరను విద్యుత్ సంస్థల ప్రతిపాదనలకు లోబడి విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్సీ) నిర్ణయిస్తుంది. ఎస్‌పీవీ జనరేటర్లు (సోలార్ పవర్ ఉత్పత్తిదారులు) డిస్కమ్‌లు రూపొందించిన నమూనాలో నెట్ మీటరింగ్ బిల్లింగ్ వివరాలను అందించాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment