వరంగల్ : తెలంగాణ ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన ఘనత టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుదే అని టీడీపీని వీడిన కడియం శ్రీహరి అన్నారు. 12 ఏళ్లుగా తెలంగాణ కోసం నిర్విరామంగా పోరాడుతున్న వ్యక్తి ఒక్క కేసీఆర్ మాత్రమే అని ఆయన చెప్పారు. తెలంగాణ అంశాన్ని కేసీఆర్ ఢిల్లీ వరకు తీసుకెళ్లారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, టీడీపీ నేతలు ఎప్పటికైనా ఆంధ్రా పార్టీలను వీడి బయటకు రావాల్సిందేనని పేర్కొన్నారు. శనివారం ఉదయం టీడీపీకి కడియం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment