* బాన్సువాడ శిక్షణాశిబిరంలో కేసీఆర్
* తెలంగాణపై మహానాడులో తీర్మానం చేయండి
* చంద్రబాబుకు టీఆర్‌ఎస్ అధినేత సవాల్
* చలో అసెంబ్లీలో తాడోపేడో తేల్చుకుందాం
నిజామాబాద్, టీ మీడియా: వంద అసెంబ్లీ స్థానాలు, 15 లోక్‌సభ స్థానాల్లో పార్టీ గెలిస్తే ఎన్నికలైన తెల్లారే ఢంకా బజాయించి తెలంగాణ తెచ్చుకుంటామని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రం రాగానే అందరికంటే ఎక్కువ లాభపడేది లంబాడీలేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ జనాభా ప్రకారంవారికి ఆరు శాతం రిజర్వేషన్లే అందుతున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో 12శాతం రిజర్వేషన్లు వస్తాయని అన్నారు. ముస్లింల కోసం ఇప్పుడున్న 250 కోట్ల బడ్జెట్‌ను వెయ్యికోట్లకు పెంచుతామని చెప్పారు. సింగూరు నీళ్లను ఇందూరుకు మళ్లించి ఇక్కడి ప్రజల పాదాలకు అభిషేకం చేయిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. శుక్రవారం బాన్సువాడలో స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌డ్డి అధ్యతన జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల శిక్షణ శిబిరంలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ సాధనకు ఎదురవుతున్న అడ్డంకులను వివరించిన ఆయన.. రాష్ట్రం సాధించుకున్న తర్వాత జరిగే అభివృద్ధిని విపులీకరించారు. త్వరలో జరిగే చలో అసెంబ్లీ కార్యక్రమంతో తాడోపేడో తేల్చుకుందామని పిలుపునిచ్చారు.
నిజంగా టీడీపీకి తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే మహానాడులో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు సవాలు విసిరారు. ఎల్లాడ్డి ఎమ్మెల్యే రవీందర్‌డ్డి, పార్టీ జిల్లా ఇన్‌చార్జి కరిమెల్ల బాపురావు, జిల్లా అధ్యక్షుడు ఆలూరు గంగాడ్డి, ఐఏఎస్ అధికారి రమణాచారి, ప్రొఫెసర్ సాంబయ్య, రసమయి బాలకిషన్, పార్టీ నేతలు బిగాల గణేష్ గుప్త, జీవన్‌డ్డి, డాక్టర్ భూపతిడ్డి, నల్లమడుగు సురేంధర్, లక్ష్మినర్సయ్య తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో వివిధ అంశాలపై కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే...
ఒక్కటిగా నిలవాలె :
తెలంగాణ గడ్డపై ఆంధ్రపార్టీలకు తావేలేదని తేల్చిచెప్పాలి. ఊరికో కథానాయకుడు పుట్టాలి. ఆడబిడ్డలంతా ఎల్లమ్మ, సమ్మక్క సారలక్క, రాణి రుద్రమదేవివలే పిడికిలి బిగించాలె. కిరణ్, చంద్రబాబు, జగన్ వేలకోట్లతో వాలుతారు. చీప్ లిక్కర్ పారిస్తరు. కానీ మనకొలువులు, మన నీళ్లు, మన నిధులు మనగ్గావాలంటే తెలంగాణ రావాలె. తెలంగాణ రావాలంటే సమాజమంతా ఒక్కటిగా నిలవాలే. ఆంధ్రపార్టీలను పాతరేసి 100 అసెంబ్లీ, 15 ఎంపీ సీట్లు గెలుచుకోవాలి. అప్పుడే ఎన్నికల తెల్లారే ఢిల్లీని శాసించి ఢంకా బజాయించి తెలంగాణ తెచ్చుకోగలుగుతాం.
ఎక్కువలాభపడేది లంబాడీలే :తెలంగాణ రాగానే అందరికంటే ఎక్కువ లాభపడేది లంబాడీలే. ఆంధ్రవూపదేశ్ జనాభా లెక్కల ప్రకారం వాళ్లకు ఇప్పుడు 6శాతమే రిజర్వేషన్లున్నాయి. తెలంగాణ ఏర్పడితే 12% అమలవుతాయి. చదువుకున్న ఏ లంబాడ బిడ్డ కొలువులేకుండా ఉండరు. వాళ్లకు రాజకీయాల్లోను రిజర్వేషన్లు వర్తింపజేస్తాం. వాళ్ల భాష, వస్త్ర సంప్రదాయం కాపాడడానికి చర్యలుతీసుకుంటాం. తాండాలన్నింటినీ ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం.
ఆంధ్రపార్టీలు అవసరమా? :
తెలంగాణకు అడ్డం పడుతున్న చంద్రబాబు, కిరణ్, జగన్, వాళ్ల పార్టీలతో మనకు అవసరముందా? ఆంధ్రపార్టీల పెత్తనం ఎంతకాలం? ఆ పార్టీలో ఏ ఒక్కరోజైనా ముఖ్యమంత్రి మనోడైతడా? పార్టీ అధ్యక్షుడినైనా చేస్తారా? పెత్తనమంతా వారిదే. శాశ్వతంగా గులామ్‌గిరీ చేసుడేనా? మన జెండా మనం ఎగరేసి గల్ల ఎగరేద్దామా? ఆంధ్ర పార్టీలను ఐదు కిలోమీటర్ల లోతులో పాతిపెడితేనే తెలంగాణ వస్తది. ఈ సంగతిని ఊరూరా రచ్చబండమీద చర్చపెట్టాలి. ధర్మయుద్ధంలో మనమే గెలుస్తాం. వందమంది కౌరవులు అధర్మంతోనే పాండవుల చేతిలో ఓడిపోయారు. వచ్చే ఎన్నికల కురుక్షేవూతంలో తెలంగాణ గెలుస్తది. ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఎక్కడికెళ్లినా నా రెట్టకు ఇమామే జామీన్ కడుతుండ్రు. యుద్ధంలో గెలిచి క్షేమంగా విజయంతో తిరిగిరమ్మనే ఇది కడుతుండ్రు. ఇక చంద్రబాబు మోకాళ్లపై నడిసొచ్చినా ఆయనకు ఓట్లురావుకదా చేతిలో ఉచ్చపోసే దిక్కుండదు.
పదవి తీసుకోను... :
తెలంగాణ వచ్చినంక ఏ పదవి తీసుకోను. దళితుడినే సీఎంను చేస్తా. పక్కనుండే తెలంగాణ పునర్నిర్మాణం కోసం పనిచేస్తా. అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతా. వచ్చే తెలంగాణలో మనదే అధికారం. మన కేబినెట్‌లో పోచారం ముఖ్యమైన స్థానంలో ఉంటరు.
8 గంటల విద్యుత్ సరఫరా : తెలంగాణ రాంగనే వ్యవసాయానికి 8గంటల విద్యుత్ సరఫరా జరుగుతుంది. రెప్పపాటు కూడా కరెంటు పోనియ్యం. పక్కరాష్ట్రాల నుండి కరెంటును కొంటాం. రాష్ట్రం ఏర్పడిన మూడేళ్లకు గోదావరి నీళ్లతో, మన బొగ్గుతో 5వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటాం. ఆ రెండేళ్లకే మరో 2వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకొని ఛత్తీస్‌గఢ్, గుజరాత్ వలే తెలంగాణలో 24గంటల కరెంటు సరఫరా చేస్తాం.
ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు :
ముస్లిం సోదరులకు 12%రిజర్వేషన్లు తెలంగాణలోనే సాధ్యం. దొంగలోల్లే దోచుకున్న వక్ఫ్ భూములను వాళ్ల సంక్షేమం కోసమే వినియోగిస్తాం. 250 కోట్ల ముస్లింల బడ్జెట్‌ను వెయ్యికోట్లకు పెంచుతాం. బీసీలు, ఇతర పేదలు ఆత్మగౌరవంతో బతికేటట్లు పథకాలు అమలు చేస్తాం. 2లక్షలు ఖర్చుపెట్టి వాళ్లకు రెండు బెడ్‌రూంలతో ఇండ్లను కట్టిస్తాం. పన్నుల రూపంలో మనం 47వేల కోట్లు కడితే ఆంధ్రోళ్లు 15వేల కోట్లే కడుతున్నారు. ఇంకా పెన్షన్‌ల విషయంలో హర్రాసుపాట పాడినట్లు పాడుతున్నరు. ఎవడి సొమ్ము ఎవడికిస్తరు? తెలంగాణ వస్తే వృద్ధులు, వితంతువులకు ప్రతినెల వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తాం. వికలాంగులకు 15వందల పెన్షన్ ఇస్తాం. 21లక్షల రైతు కుటుంబాలకు పంట రుణాలను మాఫీ చేస్తాం.
సింగూర్ జలాలు తెచ్చి అభిషేకం చేయిస్తా...:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే సింగూరు నీళ్లను ఇందూరుకు మళ్లించి ఇక్కడి ప్రజల పాదాలకు అభిషేకం చేయిస్తా. నిజామాబాద్, మెదక్ రైతులకోసం నిజాం నిర్మించిన నిజాంసాగర్‌పై ఆంధ్ర పాలకులు కుట్రపూరితంగా సింగూరును కట్టిండ్రు. ఈ నీళ్లను హైదరాబాద్‌కు తరలిస్తుండ్రు. తెలంగాణ రాగానే కృష్ణా జలాలను పూర్తిస్థాయిలో హైదరాబాద్‌కు తరలిస్తాం. సింగూరు నీళ్లంటినీ నిజాంసాగర్‌కే మళ్లిస్తాం.
No comments:
Post a Comment