Tuesday 14 August 2012

10 లక్షల ఎకరాలకు జీవన రేఖ

                
                    ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం
* తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల అద్భుత ఆలోచన
* ఈ ప్రాజెక్టు రాకుంటే రెండు జిల్లాలకు వర్షపు నీరే గతి
* మహబూబ్‌నగర్ జిల్లాకు తాగునీరు... ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు
* రంగారెడ్డిలో 2.70 లక్షల ఎకరాలకు నీరు
* నల్లగొండలో 0.30 లక్షల ఎకరాలకు సాగునీరు
* వరద నీటితో పాలమూరు,రంగారెడ్డి సస్యశ్యామలం
* భూగర్భ జలాలను అభివృద్ధి పర్చుకునే అవకాశం
* విద్యుత్ సమస్య రానేరాదంటున్న నిపుణులు
* 2009లోనే విచారణకు నాటి సీఎం వైఎస్ ఆదేశం
* రూ.5 కోట్లతో సర్వే : చీఫ్ ఇంజినీర్ నివేదిక
* నివేదికను బుట్టదాఖలు చేసిన సీమాంధ్ర సర్కార్
* ప్రాజెక్టు తీసుకొస్తా: మంత్రి ప్రసాద్‌కుమార్ హామీ

ప్రాజెక్టు వ్యయం
పంపింగ్ స్టేషన్  : రూ.4,500 కోట్లు
టన్నెల్స్   : రూ.1,000 కోట్లు
ఓపెన్ కాలువలు: రూ.500 కోట్లు
         ఏటా లక్షల క్యూసెక్కుల నీరు కృష్ణా నది నుంచి సముద్రం పాలవుతున్నది! ఆ నీటిని నిల్వ చేయగలిగితే? వరద నీటిని కాపాడి.. చెరువులకు తరలిస్తే? చెరువులను నింపి.. ఆయకట్టును ఆదుకుంటే? మూడు జిల్లాల్లో పది లక్షల ఎకరాల్లోని పొలాలు పచ్చటి పైరులతో కళకళలాడిపోతాయి! ఆ పథకమే తెలంగాణ ప్రాంత విశ్రాంత ఇంజినీర్లు రూపొందించిన పాలమూరు-రంగాడ్డి ఎత్తిపోతల! కానీ.. నికర జలాలివ్వడానికే నాన్చుతున్న సీమాంధ్ర సర్కారు.. వరద నీళ్లు సైతం తెలంగాణకు ఉపయోగపడకుండా మోకాలడ్డుతోంది! ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ఉపయోగపడిన ఈ పథకం.. సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా నాలుగేళ్లుగా మూలనపడి ఉంది! 9వేల కోట్లతో పూర్తయ్యే ఈ భారీ ప్రాజెక్టుకు కనీసం సర్వే చేయించడానికి సైతం పాలకులకు మనసొప్పడం లేదంటే.. తెలంగాణ జల వనరులపై పాలకుల శ్రద్ధ ఏపాటితో తేలిపోతున్నది!
ఐదు యూనిట్లలో విద్యుదుత్పత్తి 
 ధరూర్: జూరాల జలవిద్యుత్కేంద్రం జాతికి అంకితమైనప్పటి నుంచి ఎప్పుడూ కూడా పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి కాలేదు. ఈ ఏడాది తొలి వరదకే ఐదు యూనిట్లను జెన్‌కో అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చి ఉత్పత్తి ప్రారంభించారు. ఇప్పటి వరకు ఐదు మెగావాట్ల విద్యుదుత్పత్తి చేశారు. రెండో యూనిట్‌లో ఉత్పత్తిని ప్రారంభిస్తూనే 72 గంట ల ఏకధాటి పరీక్ష నిర్వహిస్తున్నారు. మరో రోజు అవాంతరాలు లేకుండానే ఉత్పత్తి వస్తే రెండో యూనిట్ సన్నాహక పరీక్ష విజయవంతమై అందుబాటులోకి వచ్చిన అధికారులు తెలిపారు. రెండో యూనిట్‌లో ఉత్పత్తి పర్యవేక్షిస్తూనే ఒకటో యూనిట్‌లో సాంకేతిక అంశాలను పరిశీలిస్తున్నారు. రెండురోజుల్లో సాంకేతిక పరీక్షలను పూర్తి చేసి టర్బైన్ లో నీటిని నింపి ట్రయల్న్ చేస్తామని జెన్‌కో డీఈ రఘురాం తెలిపారు. మూడు, నాలుగురోజుల్లోనే ఆరు యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో నెట్టెంపాడు ట్రయల్న్‌క్రు ఈ జలవిద్యుత్కేంద్ర విద్యుదుత్పాదనే కీలకం. ఈ ఉత్పత్తిని రేవులపల్లి 220 కేవీ ఉపకేంద్రానికి అనుసంధానించి అటు నుంచి గుడ్డెందొడ్డి లిఫ్టు-1, 220 కేవీ ఉపకేంద్రం ద్వారా నెట్టెంపాడు యూనిట్లకు సరఫరా ఇస్తున్నారు.

No comments:

Post a Comment