Thursday, 30 August 2012

నందగిరి కొండ

నందగిరి కొండకింద కొలువైన స్వామి
                                                      
          తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే మన ప్రాచీన సంస్కృతికి నిలయాలైన ఇలాంటి ఎన్నో అపురూప దేవాలయాలు జీర్ణోద్ధరణకు నోచుకుంటాయని ప్రజలంతా ఆశపడుతున్నారు.
       ఆ కొండ కింద మట్టికోటలో తూర్పునుండి పశ్చిమ దిశగా 200 గడపల గ్రామం ఉంది. అదీ గమ్మత్తుగా ఉంటుంది. మధ్యలో దారి, రెండు వైపుల ఇళ్ళు. నడుమ ఎలాంటి సందులూ లేవు. గుట్టకింది భాగంలో 50 మెట్లెక్కితే ఒక అరుదైన దేవాలయం వస్తుంది. ఇది ప్రాచీనమైంది. పెద్ద రాయిని గర్బగుడి శిఖరంగా మలిచారు. ఇక్కడే కోట్ల శ్రీలక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు!
           ఆ పర్వతం పేరు ‘నందగిరి’. కొండకు సుమారు 2 కి.మీ.దూరంలో ఆ పేరుగల గ్రామమే ఉంది. కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండల కేంద్రానికి ఉత్తర దిశన ఒక కి.మీ. దూరంలో ఇది ఉంటుంది. నందగిరి నిజానికి ప్రాచీన పర్వతం. దీనికి ఓ చరిత్ర ఉండాలి. అందుకు సాక్షీభూతంగా పర్వతం పైన అవశేషాలున్నాయి. ఓ రాతికోట ఉంది. దానిలో నేలమాళిగా ఉంది. ఈ కోటను నందరాజులు నిర్మించినట్లుగా చెప్తారు. కాబట్టే కొండకు ‘నందగిరి’ అన్న పేరు వచ్చింది. ఈ కొండకు దక్షిణ, పశ్చిమ దిశల్లో రెండు ప్రాచీనమైన మట్టి కోటలున్నాయి. అవి వరంగల్లు మట్టికోటను పోలి ఉండడం విశేషం.
      తూర్పు, పశ్చిమాది దిశలలో శ్రీ కోట్ల లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయం వ్యాపించింది. ద్వారం దక్షిణాభిముఖంగా ఉంటుంది. ఆలయంలో ఎదుదురుగా లక్ష్మీ నర్సింహస్వామి, శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడి రాముడు పూర్వాభిముఖుడు, నర్సింహస్వామి పశ్చిమాభిముఖుడు. శిల్పాలు లేని సాధారణ స్తంభాలతో ఈ ఆలయం నిర్మితమైంది. రామచంవూదస్వామి వారికైతే ప్రస్తుతం శిఖరమే లేదు.
           1900 ప్రాంతం నుండి సుమారు 40 సంవత్సరాల కాలానికి పైగా ఈ దేవాలయం భవ్యంగా, నిత్యసేవలతో, బ్రహ్మాండంగా వెలుగొందినట్లు స్థానిక పెద్దలు చెబుతారు. ఆలయానికి దక్షిణ, పశ్చిమాల్లో ఆనాటి నిర్మాణాలను అనుసరించి సున్నం మట్టి పలకలతో ఒక ‘దాబా’ కూడా నిర్మితమైంది. పశ్చిమంలో కళ్యాణ మంటపమూ ఉంది. కోట్ల శ్రీ లక్ష్మీనర్సింహస్వామికి దక్షిణ దిశలోనే ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. 
      ఇక్కడ ప్రతీ సంవత్సరం చైత్ర పూర్ణిమ సందర్భంగా స్వామివారి ఉత్సవం జరుగుతుంది. స్వామి వార్ల కళ్యాణోత్సవాలు ప్రత్యేక ఆకర్షణగానూ నిలుస్తాయి. గత 40 సంవత్సరాల్లో రామడుగు మండల కేంద్రం వాస్తవ్యులైన కిష్టయ్య పంతులే (కరణాలు) ఆలయ నిర్వహణ భారాన్ని వహించినట్లు తెలుస్తోంది. ఆలయంలో అర్చనలకు ఏ లోటూ రాకుండా నిత్య ధూపదీప నైవేద్యాదులను ఆయనే కొనసాగించారు. కిష్టయ్య పంతులు కాలం చేసిన తర్వాత ఆయన వంశీకులు కొందరు కొంత కాలం ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. 
       తర్వాత జమీందారీ వ్యవస్థ రద్దయింది. (ఈ గ్రామానికి జమీందారు వున్నట్లు అక్కడి గడీ అవశేషాలే చెప్తాయి). దీంతో చాలామంది పల్లెలు విడిచి పట్నాల బాట పట్టారు. నందగిరి ఆలయానికీ నిర్వాహకులు కరువైనారు. అక్కడి స్వామి వార్లకు సేవలు ఆగిపోయాయి. ఆలయానికి ఆదాయం లేక అర్చకుల జీవితాలు దుర్భరం కావడమే ఇక్కడ గమనార్హం. తెలంగాణలో ధూపదీపాలకు నోచుకోని వందలాది దేవాలయాలలో ఇదొకటి అంటే అతిశయోక్తి కాదు.
     ఈ పర్వతం పైనే తూర్పున స్వామివారి పుష్కరిణి ఉంది. వర్షాకాలంలో పర్వతంపై కురిసిన వర్షమే దీని నీటికి ఆధారం. ఇక్కడ ఓ శివాలయమూ ఉంది. ఈ పుష్కరిణి ప్రాకార గోడను ఆనుకునే పర్వతంపైకి రాతి కోట (నందులది) ఉంది. ఈ కోటలో ఉండటం వల్లే ఈ గ్రామానికీ మొదట్లో ‘కోట్ల’ అనే పేరు వచ్చినట్లు స్థానిక పెద్దలు చెప్తారు. తర్వాతి కాలంలో ఇది స్వామివారి పేరు పైన ‘నర్సింహులపప్లూ’గానూ కొన్నాళ్లు పిలువబడింది. 
    ఈ గ్రామం చివర పడమటి దిశలో ప్రాచీన వీరభద్రుని ఆలయం ఉంది. ఇది కాకతీయుల కాలం నాటిదై ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. ఇంకా కొంత ముందుకు వెళితే ‘నాంచారమ్మ ఆలయం’ కనిపిస్తుంది. ఇది శిథిలావస్థకు చేరింది.
- ధప్పూరి శ్రీధరాచార్యులు, 

No comments:

Post a Comment