Wednesday, 22 August 2012

యాదగిరిగుట్ట

 యాదగిరిగుట్ట   
                               
          తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో యాదగిరిగుట్ట ఒకటి. ఇది పురాతన విష్ణు క్షేత్రం శ్రీమహావిష్ణువు ఈ క్షేత్రంలో లక్ష్మీనర్సింహ్మాస్వామి వెలసి ఉన్నాడు. స్వామి ఆవిర్భావ కాలం పురాణల నుండి గ్రహించవచ్చు. అధునిక చర్రితకారుల వూహకు అందనిది. ఈక్షేత్రం హైదారాబాద్‌ వరంగల్‌ రోడ్డులో హైదరాబాద్‌కు 60 కిలోమీటర్లదూరంలో ఉన్నది. సికింద్రబాద్‌, వరంగల్‌ రైల్వే లైన్‌ మీద ఉన్న భువనగిరికి రాయగిరి మీదుగా 6మైళ్ల రోడ్డు మార్గం కలదు. 
                                 
      దేశంలో వందకు పైగా నర్సింహ్మా క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో సింహచలం,ఆహోబిలం,మంగళగిరి, వేదాద్రి, యాదగిరిక్షేత్రాలు ప్రసిద్దమైనవి.యాదగిరిగుట్ట క్షేత్రంలో గుహాలయం, విష్ణుతుండం,గోపురచ్రం మహామహిమానిత్వలు అవడం ఈక్షేత్రానికి అత్యంత ప్రాశస్త్యాన్ని చేకూర్చింది. క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి.
చారిత్రక ధృవీకరణ...
                                  
           యాదగిరి క్షేత్రం పురాతనమైనదే విషయాన్ని చారిత్రాక ఆధారాలు ధృవీకరిస్తున్నాయి.క్రీస్తుశకం 12వ శతాబ్దం వరకు మునులకు,యోగులకు మాత్రమే దర్శనీయమైఉన్న యాదగిరి సామాన్య మానవులకు అందుబాటులో ఉండేది కాదు. ఈక్షేత్ర మహత్యం తెలిసిన వారు కూడా తక్కువే.12వ శతాబ్ధిలో రాజమహేంద్రవరం రాజాధానిగా చేసుకొని ఆంధ్ర ప్రాంతాన్ని పశ్చిమచాళుక్యులు పరిపాలిస్తుండేవారు. 1148 సంవత్సరంలో త్రిభువనమల్లుడు అనే పశ్చిమచాళుక్యరాజు రాజ్యవిస్తరణకై తెలంగాణ ప్రాంతాలో ఉన్న రాజ్యాలను జయిస్తూ ఇక్కడి భువనగిరి ప్రాంతానికి వచ్చాడు.ఈ విశాలమైన ఏకశిలను చూసి ముగ్ధుడయ్యాడు.

                  చుట్టూ వాతావరణం కూడా అతనికి నచ్చడంతో భువనగిరి ఏకశిల మీద కోటను నిర్మించుకున్నాడు. కాని అందులో ఉంటున్న సమయంలో పృధ్వివల్లుల ఒక గుజరాతి భూవల్లభునితో వైరం ఏర్పడింది. ఇతనికి జయం సుసాధ్యమైంది. జగదేవుడు అనే మంత్రి సలహాలను పాటించి విభువనవల్లభుడు యాదగిరిక్షేత్రం దర్శించి శ్రీలక్ష్మీనర్సింహస్వామిని ఆరాధించాడు. స్వామి ప్రసన్నడై అతనికి విజయం చేకూర్చాడు. అతని పేరు మీద ఈఏకశిలకు భువనగిరి అని పేరు పెట్టారు.
               అనంతరం దాని చుట్టూ ఏర్పడిన పట్టణానికి కూడా భువనగిరి పేరు స్థిరపడింది. విభువనమల్లుడు యాదగిరి లక్ష్మీనర్సింహ్మాస్వామిని సేవించి జయం పొందడంతో యాదగిరిక్షేత్ర మహత్యం కూడా బాహ్యప్రపంచానికి తెలిసింది. యాదగిరికి భువనగిరి పది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పటికి నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రదేశాన్ని లోబర్చుకొని గోలుకొండకు వచ్చాడు. సమీపంలో ఉన్న యాదగిరి నర్సింహస్వామి మహత్యంను విని సతీసమేతంగా స్వామిని దర్శనం చేసుకున్నట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి.
ఆలయ ప్రాకారాల నిర్మాణం……
              యాదగిరి ప్రాంతమంతా సామాన్యులు చొరబడలేని ఆరణ్యప్రాంతం కావడంతో ఇటీవల వరకు అనగా 19వ శతాబ్దం వరకు స్వామికి నిత్యధూపదీప నైవేద్యాలు జరిగే అవకా శం లేకపోయింది. శ్రీకృష్ణదేవరాయలు దర్శించుకొని వెళ్లిన తర్వాత కూడా చాలా కాలం వరకు దుర్గమమై ఉన్నందున ఈక్షేత్రాన్ని ప్రజలు మరచిపోయే వరకు వచ్చింది. కాగా సుమారు రెండు వందల సంవత్సరాల క్రిందట ఈ ప్రాంతంలో ఒక గ్రామ పెద్ద స్వామి వారు లలో కనిపించి యాదగిరిలో విష్ణుకుండం సమీపంలో ఒక గృహంలో ఉంటానని చెప్పి ఆదృశ్యమయ్యాడు.
            గ్రామాధికారి ఆగమశాస్త్ర విధులను తెలిపిన వైష్ణవ పండితులను, అర్చకులను రప్పించి స్వామికి నిత్యం అభిషేకం, పూజ, దీపారాధన, నైవేద్యం తదితర ఉపచారాలు జరిపేందుకు నియమాకాలు చేశాడు. ఈ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు గుల్లపల్లి రామభట్టును నియమించాడు. వారి సంతతి వారే వంశపరపరంగా ఈక్షేత్రాన్ని అంటి పెట్టుకొని సేవలు చేస్తున్నారు.
                                     
             భక్తుల   రాక   యేటేటా    పెరగడం తో ఈక్షేత్రం తెలంగాణ తిరుపతిగా వాసికెక్కింది. ఇదిలా   ఉండగా   హైదరబాద్‌    వాస్తవ్యుడైన   రాజామోతీలాల్‌      యాదగిరి లక్ష్మీనర్సింహ్మ స్వామి వైభవం  విని  స్వామి   వారిని దర్శించాడు. స్వామి  వారికి   ఆలయ  నిర్మాణం  చేయించాడు.    ప్రాకారం,  గోపుర ద్వారం,  ముఖమండపం నిర్మించాడు.  ఆ తర్వాత భక్తులు  తమ   యాత్ర సందర్భాల్లో పలు సౌకర్యాలు ఏర్పరుచుతూ  వచ్చారు.  ప్రస్తుతం  ఈక్షేత్ర  యాజమాన్యం   దేవాదయ శాఖ ఆధ్వర్యంలో  ఉంది.    మంచినీటి  వసతితోపాటు   ఆధునిక     వసతులతో  యా దగిరిలక్ష్మీనర్సింహ  క్షేత్రం  జనాకర్షకమై భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్నది.
నైజాం ప్రభువుల కృషి
               రెండవ తిరుపతిగా రాష్ట్ర ప్రజలు ఆరాధ్యదైవంగా కొలువబడుతున్న శ్రీలక్ష్మీనర్సింహ స్వామి దేవస్థానానికి మొదటి చైర్మన్‌ను నైజాం ప్రభుత్వం నియమించింది. 1937కు పూర్వం నైజాం ప్రభువు తమ తహసీల్దార్‌ రాజారిని చైర్మన్‌గా నియమించడంతో ఆల య అభివృద్ధికి కృషి ప్రారంభమైంది. అంతకు పూర్వం నుంచే శేషచార్యులు ఈ ఆల య పూజారిగా వ్యవహరించారు. ఆయనే క్షేత్రప్రచారకుడిగా ఎంతో పాటుపడ్డాడు. రాజారి తర్వాత భువనగిరికి చెందిన రామ్‌దయాల్‌, నైజాం ప్రభుత్వం సభ సభ్యుడిగా వ్యవహరించిన యాదగిరివాస్తవ్యుడు రామారావులు చైర్మన్‌గా కొనసాగారు. రామారావు హయంలో పూజారి శేషచార్యులతో వాగ్వివాదం జరిగింది. ఇది చిలికిచిలికి గాలివానైంది. రాయగిరిలో పౌరోహిత పనిచేస్తున్న ఆనంతయ్యను ఆలయ పూజారిగా చేశా రు. ఆనంతయ్య కుమార్తె రాధాభామయ్య దేవస్థాన హక్కుదారుగా మారారు. ఆయవార్ల నుండి బ్రహ్మణులకు వశంపరపర్యహక్కు మారింది. రామారావు తర్వాత హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ హయంలో మందమాల నర్సింహ్మారావు తర్వాత పన్నాలాల్‌ కొనసాగారు. రాష్ట్ర దేవాదాయ చట్టాన్ని రూపొందించాక రాధాభామయ్యను వశంపరపర్య హక్కుదారుగా గుర్తించారు.
           నాటి నుండి నేటి వరకు ఆమె వంశీయులే వంశపరపర్య హక్కుదారుగా కొనసాగుతున్నారు. స్వాతంత్య్రం రాకపూర్వం ఆలయ ప్రాకారం నిర్మితం కాగా సుమారు 1940వ సంవత్సరంలో నిర్మితమైన ఘాట్‌రోడ్డును అప్పటి నైజాం ప్రభుత్వం వజీర్‌యాజం హైదరీ ప్రారంభించాడు. ఆయన కుటుంబ సమేతంగా వచ్చి స్వామిని దర్శించి పూజలు జరిపించారు. ప్రైవేట్‌ సంస్థగా కొనసాగిన దేవస్థానం కొండల్‌రావు, బసవయ్యల హయంలో ఎంతో అభివృద్ధి చెందింది. 1966లో దేవాదయ, ధర్మాదయ చట్టంతో ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో దేవాలయంగా కొనసాగుతుంది. ఏటేటా పెరుగుతున్న భక్తులతో గుట్ట వార్షిక ఆదాయం 4నుండి 6కోట్లకు చేరుకుంది.
 వార్షిక బ్రహ్మోత్సవాలు…
                                 
             శ్రీ యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతిఏటా ఫాల్గుణశుద్ధ విదియ నుంచి మొదలై ద్వాదశి వరకు పది రోజుల పాటు కన్నుల పండవగా కొనసాగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని విశేష అలంకారాలు, సేవలు నిర్వహిస్తారు. పది రోజుల పాటు జరిగే బ్రహ్మో త్సవాలలో ఎదుర్కోళ్ళు, కళ్యాణం, రథోత్సవం ముఖ్యమైనవి.  బ్రహ్మాత్సవాలలో భాగంగా స్వామి జగన్మో హిని రామ, కృష్ణ, నరసింహ అవతరాలలో భక్తులకు దర్శనమిస్తారు.
         ఉదయం పూట అలంకా రాలు, సాయంత్రం పూట సేవలు నిర్వహిస్తారు. బ్రహ్మాత్సవాలను పురస్కరించుకొని స్వామి వారికి కేశవాహాన సేవ, అన్నవాహాన సేవ, కల్పవృక్షం, గరుడసేవ, అశ్వవాహాన సేవలు ఘనం గా నిర్వహిస్తారు. ఈ సేవల సందర్భంగా స్వామి అమ్మవారులను పట్టుపీతాంబరాలు, వివిధ బంగారు ఆభరణాలు , పూలతో శోభాయామానంగా అలంకరించి పుర వీధులలో ఊరేగిస్తారు. ఆధ్యాత్మిక భావన వెల్లివిరిసేందుకు 75 మంది రుత్వికులతో రామాయణం, మహాభారతం, భాగ వతం, విష్ణుసహాస్రనామాలు, సుందరకాండ పారాయణాలు చేస్తారు. 

1 comment:

  1. i love yadagiri gutta it was only one big temple of laxmi narsimha swamy temple and now it is called as yadahri

    ReplyDelete