అష్టముఖి కోనేరు
నిజామాబాద్ జిల్లా జానకంపేటలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో ఈ కోనేరు ఉంది. ఎనిమిది వైపుల ప్రాకారాలతో కూడిఉన్న ఇలాంటి కోనేరు దక్షిణ భారతదేశంలోనే అరుదైంది. 1వ శతాబ్దంలో శివాజీ గురువైన సమర్థ రామదాసు ఈ దేవాలయం, కోనేరు నిర్మించినట్లు చారిత్రిక ఆధారాలున్నయి. ప్రతి సంవత్సరం జనవరి చివరి వారం నుండి ఫిబ్రవరి వరకు ఇక్కడ జాతర నిర్వహిస్తరు.
ఖమ్మం పాండవుల గుట్టలు
ఖమ్మం జిల్లా బయ్యారం అటవీ ప్రాంతంలోని పురాతన గుట్టలనే ‘పాండవుల గుట్టలు’గా పిలుస్తరు. పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో ఇక్కడ విడిది చేశారన్నది పౌరాణిక గాథ. కొండల పైనుండి జాలువారే ఏడు జలపాతాలతో ఇక్కడ ప్రకృతి సిద్ధంగా ఏడు బావులు ఏర్పడ్డాయి. వీటిలోకి నీరు ఎక్కడినుండి వస్తుందనేది అంతుపట్టని విషయం. కొండలపైనుండి పడుతున్న ఈ జలపాతాలను చూడడానికి రెండు కళ్లు చాలవు. ఈ గుట్టపైన పలు ఆయుర్వేద మూలికలు ఉన్నట్లు చెబుతారు. పర్వతారోహకులు ఇక్కడ ఎక్కువగా ట్రెక్కింగ్ చేయడానికి ఆసక్తి కనపరుస్తుంటరు.
నిజామాబాద్ రైల్వేస్టేషన్
నిజాం నవాబైన మీర్ ఉల్ ముల్క్ క్రీ.శ.199లో హైదరాబాద్ నుండి మహారాష్ట్రలోని మన్మాడ్ వరకు రైల్వేమార్గాన్ని నిర్మించాలని నిర్ణయించాడు. అయితే, నాటి సిర్నాపల్లి రాణి జానకీబాయి దీన్ని ఇందూరు మీదుగా ఏర్పాటు చేసేలా రాజును ఒప్పించిందట. అలా 1905లో నిజామాబాద్ రైల్వేస్టేషన్ ఏర్పడింది. దీనికి కృతజ్ఞతగా ఈ పట్టణానికి నిజామాబాద్ అని పేరు పెట్టారు.
దోమకొండ సంస్థానం
ప్రాచీన సంస్థానాల్లో పేరెన్నిక గన్నది దోమకొండ. పాకనాటి రెడ్లశాఖకు చెందిన కామినేని వంశస్థులు ఈ సంస్థానాధీశులు. క్రీ.శ.1636లో అబ్దుల్ హుస్సేన్ కుతుబ్‌షాహి కామాడ్డికి ఈ సంస్థానాన్ని ఇచ్చాడు. ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలు వాళ్ళ వంశీయుల పేర్లమీదనే వెలిశాయి. సంస్థానంలోని కట్టడాలు, శిల్పకళా సంపద నాటి వైభవానికి సాక్షీభూతంగా నిలుస్తాయి. కోటలోని అద్దాల బంగళా, రాజుగారి భవనాలు, ఆశ్వ, గజ శాలలు, కుఢ్యాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తయి.
నవనాథ సిద్ధుల గుట్ట
నల్లని బంతులను ఒక చోట పేర్చినట్టు ఉండే ‘సిద్దుల గుట్ట’ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో ఉంది. నవనాథ సిద్ధులు ఇక్కడే తపస్సు చేయడం వల్ల దీన్ని ‘నవనాథ సిద్ధులగుట’్టగా పిలుస్తరు. అందుకే, ఈ పట్టణానికి నవనాథ పురమని కూడా పేరుంది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ గుట్టపై అందమైన గుహలు, గుహలో వెలసిన ‘నవనాథ సిద్ధేశ్వర దేవాలయం’, ‘రామాలయం’ ముచ్చటైన దర్శనా స్థలాలు. ఇక్కడ అమ్మవారి ఆలయం, హనుమాన్ మందిరం కూడా ఉన్నయి. గుట్టపై ఉన్న చీకటి గుహలో ఒక శివలింగం, స్వామిజీలు తపస్సు చేసుకునే స్థలం కూడా ఉంది.
No comments:
Post a Comment