Friday 17 August 2012

రామప్ప దేవాలయం

                             
         వరంగల్‌ జిల్లాకు ఈశాన్యంగా 64 కిలోమీటర్ల ములుగుకు 14 కిలోమీటర్ల దూరంలో ఉత్తరదిశలో రామప్ప గుళ్ల పక్కన రామప్ప చెరువు ఉంది. చారిత్రాత్మక ప్రదేశాలకు కలిగి ఉండడంచేత ఇది గొప్ప పర్యాటక , యాత్రాస్థలంగా రూపొందింది.
     దక్షిణదేశంలోని మధ్యయుగపు దేవాలయంల్లో అత్యున్నత దేవాలయంగా పేరొందిన రామప్ప దేవాలయం శిల్ప నిర్మాణహారంలో నాయకమణి వంటిది.ఇది 13వ శతాబ్ధంలో కాకతీయరాజుల హయంలో నిర్మితమైంది. ఈ ఆలయ ఆవరణలో ఉన్న శాసనాన్ని బట్టి క్రీస్తుశకం 1213లో పాలంపేటలో కాకతీయ గణపతిదేవ చక్రవర్తి సామంత రాజైన రేచర్ల రుద్రసేనానియగు సామంతునిచే నిర్మితమైనది.ఈ దేవాలయాలు కాకతీయ శిల్పాలకు తలమానికమని చెప్పవచ్చును. రామప్ప అనే శిల్పి దీనికి రూపకల్పన చేసి యున్నాడని కొందరి అభిప్రాయం. రామప్ప యనిన శివుడని మరికొందరి అభిప్రాయమే దీనికి ఆ పేరు వచ్చింది. దీనికి గుళ్లరామప్ప అని కూడా అంటారు.

           ప్రాదేశిక గాధననుసరించి హనుమంతుడు తీసుకుపోతున్న శివలింగం ఇక్కడ జారిపడడం చేత ఆ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణం జరిపారని, అందుచే దీనిని రామలింగేశ్వర దేవాలయం అని పిలువబడుచున్నది. ఈ దేవాలయానికి పెద్దపెద్ద వెడల్పు రాళ్తోకట్టిన ప్రకారం ఉన్నది. ఉత్తర, దక్షిణ దిశల్లో చిన్నచిన్న దేవాలయాలు ఉన్నాయి. దేవాలయం హన్మకొండలోని వేయిస్తంభాల దేవాలయం పద్ధతి నిర్మాణ శైలిలో నిర్మితమైంది. అయితే అలంకారాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. వివిధ అంతస్థులతో నున్న రామప్ప గుళ్లు పరిసరాల్లో లభించు ఎర్రరాయితోను, నల్లరాయితో గోపురం తేలికైన ఇటుకలతోనూ నిర్మించబడడం విశేషం . గోపుర నిర్మాణానికి ఉపయేగించిన ఇటుకలు నీటిపై తేలుతూ ఉండడం ఇక్కడి ప్రత్యేకత.
 పాకాల చెరువు  

               కాకతీయ రాజుల్లో గణపతి దేవుడు నిర్మించిన పాకాల చెరువు నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఆనాటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఎంత గొప్పగా ఉందో పాకాల చెరువు నిర్మాణాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఆ చెరువు నిర్మాణం ఎతైన కొండలు, గుట్టల పైన నిర్మితం కావడమే కాక దక్షిణం వైపు కృష్ణా నది బేసిన్‌ , ఉత్తరాన గోదావరి బేసిన్‌ ప్రవహిస్తుంటుంది. ఈ రెండు నదులకు సంబంధం లేకుండా చెరువు నిర్మాణం జరిగి ఆ చెరువులోకి సరిపడిన నీరు కూడా కొండలు , గుట్టల నుంచే వచ్చి చేరుతుంది. ఆనాటి మార్కింగ్‌ నేటికి చెక్కుచెదరకపోగా 30 వేల ఆయకట్టు సాగుకు ఎదిగి పాకాల చెరువు ధాన్యాగార క్షేత్రంగా వర్థిల్లుతుంది.

No comments:

Post a Comment