- నాలుగేళ్లలో ఖనిజం అయిపోతే ఎట్లా?
- రక్షణ స్టీల్స్‌కు బయ్యారం గనుల కేటాయింపు
- రాష్ట్ర కేబినెట్ దృష్టికి రాకుండానే జరిగింది
- జీవోను వ్యతిరేకించినవారిలో నేను
ఒకడిని:పీసీసీ చీఫ్ బొత్స
ఒకడిని:పీసీసీ చీఫ్ బొత్స
- నాలుగేళ్లలో ఖనిజం అయిపోతే.. తర్వాత
పరిస్థితేంటీ?
పరిస్థితేంటీ?
- తెలంగాణకు ఉక్కు కర్మాగారం రావాల్సిందే
- అయితే విశాఖకు ఉక్కు తరలింపును
అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నా: బొత్స
తెలంగాణలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాల్సిందేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. అందుకు కాంగ్రెస్ పార్టీ ఎంత మాత్రం వ్యతిరేకం కాదని, ఎవన్ని చెప్పుకున్నా, ఇది మా పార్టీ అభివూపాయమని స్పష్టం చేశారు. అయితే బయ్యారం ఖనిజ సంపదను తరలించవద్దనడం, అక్కడ ఖనిజ సంపద ఉంది కనుక స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనడంలో అర్థం లేదని అన్నారు. ‘‘స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి బయ్యారం ఏమైనా సెంట్రల్ ప్లేసా?. వరంగల్, కరీంనగర్‌లో.. తెలంగాణలో ఎక్కడైనా ప్రముఖ పట్టణంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసుకుని ఇనుమును అక్కడికి తరలించుకోవచ్చు కదా..’’ అని బొత్స పేర్కొన్నారు. తెలంగాణలో స్టీల్ ప్లాంట్ కావాలని ఇంత కాలం ఎందుకు అడగలేదు? అని ప్రశ్నించారు. కాగా, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదంటూ రెండు రోజుల క్రితం బొత్స చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపాయి.

టీ కాంగ్రెస్ నేతలు సహా విపక్షాలు బొత్స వ్యాఖ్యలను తప్పుబట్టాయి. దీనిపై బుధవారం గాంధీభవన్‌లో బొత్స స్పందిస్తూ.. ‘‘మన రాష్ట్ర తీరంలో లభిస్తున్న గ్యాస్‌ను గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌లకు తరలించుకుపోవడం లేదా? దానికి ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదు. అదే బయ్యారం ఉక్కును విశాఖ స్టీల్‌కు తరలించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇంత రాద్దాంతం ఎందుకు?’’ అని రాజకీయ పార్టీల నేతల తీరుపై ధ్వజమెత్తారు. విశాఖలో ఉక్కు పరిక్షిశమ ఉన్నప్పటికీ చుట్టుపక్కల రెండు వందల కిలోమీటర్ల వరకు ఎక్కడ ఒక టన్ను ఇనుప ఖనిజం లభించదని.. ఏళ్లుగా పరిక్షిశమ విజయవంతంగా నడవడం లేదా? అని ప్రశ్నించారు. బయ్యారం ఖనిజ సంపదను తరలించవద్దనడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఖనిజ సంపద ఉందని బయ్యారంలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలని డిమాండ్ చేస్తే ఏలా? అక్కడి ఖనిజ సంపద నాలుగేళ్లలో అయిపోతే, ఆ తర్వాత పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో భారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ గతంలోనే తీర్మానం చేసిందని అన్నారు. పరిక్షిశమ వేరు, ఫీజిబులిటీ వేరని, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఫీజిబులిటీ ఉందా? లేదా? అనేది సాంకేతికంగా తీసుకునే నిర్ణయమని అన్నారు. ఖనిజ సంపద ఉన్న బయ్యారంలోనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకరించని ప్రభుత్వం.. తెలంగాణలో మరో చోట ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అంగీకరిస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడటం లేదా? ఎవరు కాదన్నా తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నారా? లేదా?. తెలంగాణ సమస్యకు ఏదో ఒక రోజు పరిష్కారం వస్తుంది.. అదే తరహాలో స్టీల్ ప్లాంట్‌కు కూడా మో క్షం లభించవచ్చు’’ అని పేర్కొన్నారు.
‘రక్షణ’.. కేబినెట్ దృష్టికి రాలేదు
బయ్యారం గనులను రక్షణ స్టీల్స్ సంస్థకు కేటాయిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర మంత్రివర్గం దృష్టికి రాకుండానే జరిగిపోయాయని బొత్స అన్నారు. జీవో వచ్చి న తర్వాత నాతో సహా కొందరు వ్యతిరేకించామని తెలిపారు. ఓబుళాపురం గనుల కేటాయింపు కూడా మంత్రివర్గం దృష్టికి రాలేన్నారు. కాగా, తాము తప్పులు చేస్తే సరిదిద్దుకున్నామని బొత్స పేర్కొంటూ.. గతంలో రక్షణ స్టీల్‌కు బయ్యారం గనులను కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశామంటూ చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి తాజాగా చేసిన ప్రకటనపై స్పందిస్తూ.. ‘‘ఇప్పుడు కొందరు వచ్చి బయ్యారం గనులకు, బ్రదర్ అనిల్‌కు సంబంధం లేదని, ఒక వేళ రుజువు చేస్తే రాజకీయంగా సన్యాసం తీసుకుంటామని పేర్కొనడం.. ముఖ్యంగా ఆ అమ్మ (విజయమ్మ) చెప్పడం సరికాదు’’ అని బొత్స అన్నారు.
-టీ మీడియా
No comments:
Post a Comment