హైదరాబాద్: ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి గడువు ముగిసే సమయానికి అధ్యక్షుడిగా కేసీఆర్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల కమిటీ ప్రకటించింది. అయితే, ఈనెల 27న ఆర్మూరు ప్రతినిధుల సభలో అధికారికంగా ప్రకటించేందుకు పార్టీ వర్గాలు నిర్ణయించాయి.
No comments:
Post a Comment